ఓజోన్
ఆమ్లజని (ఆక్సీజన్) మరో రూపమే ఓజోన్. ఇది విషవాయువు. ప్రతీ ఓజోన్ అణువులోను మూడు ఆమ్లజని పరమాణువులున్నాయి. దీని రసాయన సాంకేతికం O3 అతినీల లోహిత వికిరణాల కారణంగా వాతావరణం పై పొరలో ఆక్సీజన్ అణువులు (O2) విడిపోతాయి. స్వేచ్ఛగా ఉన్న ఆక్సీజన్ పరమాణువు (O), తాడితంతో ఆక్సీజన్ అణువులోకి చేరి (O3) ఆక్సీజన్ పరమాణువులుగా మారి ఓజోన్ అణువవుతుంది.
ఓజోన్ లాభ నష్టాలు[మార్చు]
వాతావరణపు గాలి పొరలో (భూ ఉపరితలానికి సుమారుగా 15 - 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది) ఓజోన్ సహజంగా ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకొని జీవరాశిని రక్షిస్తుంది. వాహనాల కాలుష్యం నైట్రోజన్ ఆక్సైడ్‌ల హైడ్రో కార్బన్‌ల స్థాయిలు పెరగడం వల్ల వాతావరణపు పైపొర భూఉపరితలానికి దగ్గర అయింది. సూర్యరశ్మిలో ఈ రసాయనాలు ఓజోన్‌గా మారతాయి. దగ్గు, గొంతు నొప్పి, ఉబ్బసవ్యాధిని పెంచడం శ్వాస కోశ వ్యాధులు మొదలగు సమస్యలను ఈ ఓజోన్ కల్గిస్తుంది. పంటలను కూడా నాశనం చేస్తుంది. వాతావరణపు గాలి పొరలో గల ఓజోన్ భూమిపై నున్న జీవరాశిని సూర్యుని నుండి వచ్చే అతినీలలో హిత కిరణాల నుండి రక్షిస్తుంది.
వాతావరణానికి దిగువున ఉన్న ఓజోన్ ఆరోగ్య సమస్యలను కల్గిస్తుంది.
- ఓజోన్ తరిగిపోవడమంటే ఏమిటి?
- క్లోరో ప్లూరో కార్బన్‌లు (CFCs) ఓజోన్ తరుగుదలకు ప్రాథమిక రసాయనాలు. రిఫ్రిజరేటర్లలో ఎయిర్ కండీషన్ మొదలగు వాటిలో రిఫ్రిజెంట్లుగా ఉంటాయి.ఇవి క్లోరీన్‌ను కల్గి ఉంటాయి.
- రెండవ దశః సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు సి.ఎఫ్.సిని విచ్చిన్నం చేసి క్లోరీన్‌ని విడుదల చేస్తాయి.
- మూడవ దశః ఈ క్లోరీన్ పరమాణువులు ఓజోన్ అణువును విచ్చిన్నం చేసి ఓజోన్ తరిగి పోయేటట్లు చేస్తాయి.
ఓజోన్ తరిగి పోవడం వల్ల మన పై ప్రభావం ఎలా ఉంటుంది ?[మార్చు]
ఓజోన్ పొర తరిగి పోవడం వల్ల అతి నీల లోహిత కిరణాలు భూమిని తాకడం అధికం అవుతుంది. దీని వల్ల జన్యువులు, కళ్ళు దెబ్బ తినడంతో పాటు సముద్ర జీవరాశి పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.
ప్రపంచ ఓజోన్ దినం[మార్చు]
1994లో జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్‌పై సంతకం చేసిన తేదీకి జ్ఞాపకార్థంగా దీనిని నిర్వహించాలని నిర్ణయించారు.[1]
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్రజ్యోతి, ప్రత్యేకం (16 September 2015). "ఓజోన్.. డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌కి వచ్చేనా?". www.andhrajyothy.com. పీవీవీ ప్రసాదరావు. Archived from the original on 18 సెప్టెంబర్ 2015. Retrieved 18 September 2019. Check date values in:
|archivedate=
(help)