Jump to content

ఆక్సిజన్

వికీపీడియా నుండి
(ఆమ్లజని నుండి దారిమార్పు చెందింది)
ఆక్సిజన్, 00O
A transparent beaker containing a light blue fluid with gas bubbles
Liquid oxygen boiling (O2)
ఆక్సిజన్
AllotropesO2, O3 (ozone) and more (see Allotropes of oxygen)
Appearanceవాయువు: రంగులేని
ద్రవం: లేత నీలం
Standard atomic weight Ar°(O)
ఆక్సిజన్ in the periodic table
Groupgroup 16 (chalcogens)
Periodperiod 2
Block 
Electrons per shell2, 6
Physical properties
Phase at STPవాయువు
Melting point54.36 K ​(−218.79 °C, ​−361.82 °F)
Boiling point90.188 K ​(−182.962 °C, ​−297.332 °F)
Density (at STP)1.429 g/L
when liquid (at b.p.)1.141 g/cm3
Triple point54.361 K, ​0.1463 kPa
Critical point154.581 K, 5.043 MPa
Heat of fusion(O2) 0.444 kJ/mol
Heat of vaporization(O2) 6.82 kJ/mol
Molar heat capacity(O2) 29.378 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K)       61 73 90
Atomic properties
Oxidation states−2, −1, 0, +1, +2
ElectronegativityPauling scale: 3.44
Ionization energies
  • 1st: 1313.9 kJ/mol
  • 2nd: 3388.3 kJ/mol
  • 3rd: 5300.5 kJ/mol
  • (more)
Covalent radius66±2 pm
Van der Waals radius152 pm
Other properties
Natural occurrenceprimordial
Crystal structurecubic
Cubic crystal structure for ఆక్సిజన్
Speed of sound330 m/s (gas, at 27 °C)
Thermal conductivity26.58×10−3  W/(m⋅K)
Magnetic orderingparamagnetic
Molar magnetic susceptibility+3449.0·10−6 cm3/mol (293 K)[3]
CAS Number7782-44-7
History
DiscoveryCarl Wilhelm Scheele (1771)
Named byఆంటోనీ లావోయిజర్ (1777)
Isotopes of ఆక్సిజన్
Template:infobox ఆక్సిజన్ isotopes does not exist
 Category: ఆక్సిజన్
| references

ఆక్సిజన్ గాలిలో ఉన్న సంఘటిత వాయువులలో ఒకటి. ఇది ప్రకృతిలో లభించే మూలకాలన్నిటి కంటే అత్యధికంగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘనపరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా ఆమ్లజని అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తారు. భూమి మీద వృక్ష జంతు సంపదకి ప్రాణ వాయువు అత్యవసరం. ఇది నీటిలో కరుగుతుంది. నీటిలో గల జీవాలు ఈ ప్రాణ వాయువును గ్రహిస్తాయి. ఇది ఇసుకలో 65%, నీటిలో 89% ఉంటుంది.

సంకేతం,ఫార్ములా

[మార్చు]

ప్రాణ వాయువు యొక్క సంకేతం "O",, అణు ఫార్ములా "O2".

చరిత్ర

[మార్చు]

స్వీడన్ దేశస్తుడైన షీలే మొదటిసారిగా 1771 లో మెర్క్యురిక్ ఆక్సైడ్ ను వియోగం చెందించి ఆక్సిజన్ తయారు చేసాడు. దీనిని జోసెఫ్ ప్రీస్ట్‌లీ, షీలే అనే శాస్త్రవేత్తలు 1774 ఆగస్టు 1 తేదీన కనుక్కొన్నారు. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్, సాధారణ పద్ధతుల్లో మెర్క్యురిక్ ఆక్సైడ్ లేదా పొటాషియం నైట్రేట్ లను వేడి చేసినపుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. తరువాత లావోయిజర్ దీని ధర్మాలను క్షుణ్ణంగా పరిశీలించి 'ఆక్సిజన్ ' అని పేరు పెట్టాడు. ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేది అని అర్థం.

ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారీ

[మార్చు]

ఆక్సిజన్ ను పొటాషియం పెర్మాంగనేట్ (KMnO4), పొటాషియం క్లోరేట్ (KClO3, హైడ్రోజన్ పెరాక్సైడ్ (H2O2, పొటాషియం నైట్రేట్ (KNO3), మెర్క్యురిక్ ఆక్సైడ్ (HgO) లను వియోగం చెందించి పొందవచ్చు.

  1. 2KClO3 → 2KCl + 3O2
  2. 2KNO3 → 2KNO2 + O2
  3. 2HgO → 2Hg + O2
  4. 2NaNO3 → 2NaNO2 + O2

పొటాషియం పెర్మాంగనేట్ నుండి తయారీ

[మార్చు]

ఒక పరీక్షనాళికలో కొంత పొటాNveen రంధ్రం గల రబ్బరు బిరడాను అమర్చి స్టాండుకు బిగించాలి. ఒక గాజు గొట్టాన్ని బిరడా గుండా అమర్చి, గొట్టం రెండవ చివరను నీటిలో ఉన్న పరీక్ష నాళిక లేదావాయు జాడీ మూతి వద్ద అమర్చాలి. పరీక్ష నాళికను నెమ్మదిగా వేడిచేయాలి. బుడగల రూపంలో ఆక్సిజన్ వాయువు నీటిని అథోః ముఖ స్థానభ్రంశమునొందించి వాయు జాడీ లోనికి వెళ్తుంది.

సమీకరణం: 2KMnO4 → K2MnO4+MnO2 +O2

ఆక్సిజన్ వాయువు పరీక్ష

[మార్చు]

ఆక్సిజన్ ఉన్న జాడీలో మండుచున్న పుల్లను పెడితే అది ప్రకాశవంతంగా మండును.

భౌతిక ధర్మాలు

[మార్చు]
  • ఈ వాయువుకు రంగు, రుచి, వాసన ఉండవు.
  • దహన శీలి కాదు. దహన దోహదకారి.
  • ఇది గాలి కంటే కొంచెం బరువైనది.
  • ఇది నీటిలో కరుగును.
  • ఇది లిట్మస్ కు తటస్థంగా ఉండును.

ఉపయోగాలు

[మార్చు]
  • జీవరాశుల మనుగడకు అత్యంతము అవసరమైన మూలకము.
  • ఆక్సి ఎసిటిలీన్,, ఆక్సీ హైడ్రోజన్ మంటలను పొందుటకు ఉపయోగిస్తారు.
  • పర్వతారోహకులకు ఆక్సిజన్ అత్యవసరము.
  • సముద్ర అంతర్భాగంలో పరిశోధనలు చేయువారికి అవసరము.
  • అంతరిక్షంలో పరిశోధనలు చేయు వైజ్ఞానికులకు ద్రవరూప ఆక్సిజన్ అవసరం.
  • ప్రమాదాలు జరిగినపుడు, రోగి శ్వాస తీసుకోలేని పరిస్థితులలో ఆక్సిజన్ అవసరం.
  • అప్పుడే పుట్టిన శిశువులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినపుడు, ఆక్సిజన్ గల ఇంక్యుబేటర్లలో ఉంచుతారు.

రసాయన ధర్మాలు

[మార్చు]
  1. "Standard Atomic Weights: Oxygen". CIAAW. 2009.
  2. Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
  3. Weast, Robert (1984). CRC, Handbook of Chemistry and Physics. Boca Raton, Florida: Chemical Rubber Company Publishing. pp. E110. ISBN 0-8493-0464-4.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆక్సిజన్&oldid=4094820" నుండి వెలికితీశారు