క్యోటో ఒప్పందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్యోటో ఒప్పందంలో భాగస్వామ్యం, ఒప్పందంపై సంతకాలు చేసి, ఆమోదించిన దేశాలను ముదురు పచ్చ రంగు, సంతకాలు చేసి, ఆమోదించని వాటిని పసుపు రంగు, ఇంకా నిర్ణయం తీసుకోని వాటిని బూడిద రంగు మరియు ఆమోద ఉద్దేశం లేని వాటిని ఎరుపు రంగు సూచిస్తుంది. క్యోటో ఒప్పందమును ఆమోదించడానికి ఉద్దేశం లేని ఏకైక దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు.

క్యోటో ఒప్పందం అనేది భూతాపంపై పోరాటానికి పర్యావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సదస్సు (UNFCCC లేదా FCCC)కు సంబంధించిన ఒక ఒడంబడిక. UNFCCC అనేది పర్యావరణ వ్యవస్థపై ప్రమాదకర మానవజన్య జోక్యమును నిరోధించే స్థాయికి వాతావరణంలోని గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల స్థిరీకరణ లక్ష్యంగా కుదుర్చుకున్న ఒక అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం.[1]

11 డిసెంబరు 1997న జపాన్‌లోని క్యోటోలో ప్రాథమికంగా ఆమోదించిన ఈ ఒప్పందం 16 ఫిబ్రవరి 2005న అమల్లోకి వచ్చింది. అక్టోబరు, 2009 నాటికి 184 దేశాలు సంతకాలు చేయడం ద్వారా ఈ ఒప్పందానికి అంగీకరించాయి.[2] UNFCCC సంతకదారు మరియు 1990 ఉద్గార స్థాయిల్లో 36.1%కి కారణమైన అమెరికా సంయుక్త రాష్ట్రాలు మాత్రం పాల్గొనలేదు.

ఈ ఒప్పందం కింద, 37 పారిశ్రామిక దేశాలు ("Annex I దేశాలు" అని పిలుస్తారు) నాలుగు గ్రీన్‌హౌస్ వాయువుల (GHG) (కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్) మరియు అవి విడుదల చేస్తున్న రెండు రకాల వాయువులు (హైడ్రోఫ్లోరోకార్బన్స్ మరియు పెర్‌ఫ్లోరోకార్బన్స్)ను తగ్గించడానికి అంగీకరించాయి. ఇతర సభ్యదేశాలన్ని సాధారణ కట్టుబాట్లకు అంగీకరించాయి. 1990 స్థాయికి సంబంధించిన తమ సమష్టి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 5.2%కి తగ్గించుకునేందుకు Annex I దేశాలు అంగీకరించాయి. ఉద్గార పరిమితుల్లో అంతర్జాతీయ వైమానిక మరియు నావికాదళ ఉద్గారాలను చేర్చలేదు. అయితే వాటిని ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్న పదార్థాలపై 1987లో కుదిరిన మాంట్రియల్ ఒప్పందం కింద పారిశ్రామిక వాయువులు, క్లోరోఫ్లోరోకార్బన్స్ లేదా CFCsకు అదనంగా చేర్చారు.

1990 ఉద్గార స్థాయిల ప్రమాణాన్ని UNFCCC (నిర్ణయం 2/CP.3) దేశాల సమావేశం అంగీకరించింది. [2] "భూతాప సంభావ్యత" యొక్క విలువలను IPCC ద్వితీయ నిర్ధారణ నివేదిక కోసం గణించారు. మొత్తం వనరులు మరియు (కార్బన్) జలాశయాలను గణించేటప్పుడు పలు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను పోల్చతగ్గ CO2 తుల్యాంశాలుగా మార్చడానికి ఈ గణాంకాలను ఉపయోగిస్తారు.

ఉద్గారాల వ్యాపారం, స్వచ్ఛమైన అభివృద్ధి యంత్రాంగం (CDM) మరియు ఉమ్మడి అమలు వంటి పలు "సరళమైన యంత్రాంగముల"కు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుంది. ఆర్థిక ఎక్సేంజీలు, Annex I దేశాల్లో ఉద్గారాలను తగ్గించే ప్రాజెక్టులు, ఇతర Annex I దేశాలు లేదా అదనపు అనుమతులు కలిగిన annex I దేశాల నుంచి GHG ఉద్గార తగ్గింపు క్రెడిట్లను కొనుగోలు చేయడం ద్వారా Annex I దేశాలు తమ GHG ఉద్గార లక్ష్యాలను చేరుకునే అవకాశాన్ని ఈ యంత్రాంగాలు కల్పిస్తాయి.

UNFCCC మరియు క్యోటో ఒప్పందం కింద సింక్ (సాధారణంగా కార్బన్ జలాశయం)లలోని వనరులు మరియు తొలగింపుల నుంచి అన్ని మానవజన్య గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు సంబంధించిన జాబితాల వార్షిక నివేదికను ప్రతి Annex I దేశం సమర్పించాల్సి ఉంటుంది. ఈ దేశాలు తమ గ్రీన్‌హౌస్ వాయు జాబితా రూపకల్పన మరియు నిర్వహణకు ("అభిదాయక జాతీయ సంస్థ" అని పిలిచే) ఒక వ్యక్తిని నియమించుకుంటాయి. జపాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ సహా ఇతర దేశాలు ప్రభుత్వ కార్బన్ నిధులను క్రియాశీలకంగా వృద్ధి చేస్తున్నాయి. అంతేకాక Annex Iయేతర దేశాల[3] నుంచి కార్బన్ క్రెడిట్‌ల కొనుగోలుకు ఉద్దేశించిన బహుళపాక్షిక కార్బన్ నిధులకు సాయం అందించడం మరియు గ్రీన్‌హౌస్ వాయు ధ్రువపత్రాలను సాధ్యమైనంత చౌకగా పొందడానికి భారీ వినియోగం, ఇంధనం, చమురు, వాయు మరియు రసాయనాలు సమ్మేళనం దిశగా పనిచేస్తున్నాయి.[ఉల్లేఖన అవసరం] వాస్తవానికి Annex Iయేతర దేశాలన్నీ కూడా తమ క్యోటో లక్ష్యాల నిర్వహణకు ప్రత్యేకించి, ఏయే GHG ప్రాజెక్టులు CDM కార్యవర్గ బోర్డు గుర్తింపుకు ప్రతిపాదిస్తున్నాయనే దానిని తీర్మానించే "CDM ప్రక్రియ" కోసం ఒక అభిదాయక జాతీయ సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి.

విషయ సూచిక

నేపథ్యం[మార్చు]

20వ శతాబ్దం మధ్యకాలం నుంచి మానవ కార్యకలాపాల వల్ల భూతాపం విపరీతంగా పెరుగుతోందని పర్యావరణ మార్పుపై అంతర్జాతీయ శాస్త్రీయ దృక్పథం. అలాగే మానవ కార్యకలాపాల వల్ల నిరంతరం పెరుగుతున్న గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు కూడా అత్యంత ప్రమాదకరమైన పర్యావరణ మార్పులు సంభవించవచ్చు.

1990-2100 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రత సగటున 1.4°C (2.5°F) నుంచి 5.8 °C (10.4°F) వరకు పెరగవచ్చని పర్యావరణ మార్పులపై అంతర్‌ ప్రభుత్వ ప్యానెల్ (IPCC) అంచనా వేసింది.[4]

ఆమోద ప్రక్రియ[మార్చు]

11డిసెంబరు 1997న జపాన్‌లోని క్యోటోలో COP 3చే ఈ ఒప్పందం ఆమోదించబడింది. UNFCCC సభ్యదేశాల ఆమోదం కోసం దీనిని 16 మార్చి 1998న ప్రవేశపెట్టారు.

Countries which are parties to UNFCCC

"మొత్తం మీద 1990 స్థాయికి సంబంధించి మొత్తం కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో కనీసం 55% ఆక్రమించిన Annex Iలోని దేశాల సమూహం సహా సదస్సుకు సంబంధించిన 55 సభ్యదేశాలకు తక్కువ కాకుండా ఆమోదం, సమ్మతి, అంగీకారం లేదా స్వీకారంకు సంబంధించి తమ నివేదికలను సమర్పించిన తేదీ మొదలుకుని తొంబైవ రోజు"న ఒప్పందం అమల్లోకి వస్తుందని ఒప్పందంలోని 25వ కథనం వివరించింది.

మే, 2002లో EU మరియు సభ్యదేశాలు ఒప్పందాన్ని ఆమోదించాయి.[5] రెండు నిబంధనల్లో, ఐస్‌లాండ్ ఒప్పందమును ఆమోదించినప్పుడు "55 దేశాల" నిబంధనపై 23మే 2002న అవగాహన కుదిరింది. 18 నవంబరు 2004న ఒప్పందాన్ని రష్యా ఆమోదించడం ద్వారా "55%" నిబంధన సంతృప్తి పరచబడింది. 90 రోజుల కాలయాపన తర్వాత 16 ఫిబ్రవరి 2005న ఒప్పందం అమల్లోకి వచ్చింది.

అక్టోబరు, 2009 నాటికి 183 దేశాలు మరియు ఒక ప్రాంతీయ ఆర్థిక సంస్థ (EC) ఒప్పందాన్ని ఆమోదించాయి. Annex I దేశాలకు సంబంధించిన 1990 ఉద్గారాల్లో 63.9%కి పైగా ఇవి కారణమవుతున్నాయి.[2] క్యోటో ఒప్పందాన్ని 3 డిసెంబరు 2008న ఆస్ట్రేలియా ఆమోదించగా, అది మార్చి, 2008 ఆఖర్లో అమల్లోకి వచ్చింది.

UNFCCC దేశం మరియు Annex I దేశాలకు సంబంధించిన 1990 ఉద్గార స్థాయిల్లో 36.1%కి కారణమైన అమెరికా సంయుక్త రాష్ట్రాలు మాత్రం ఒప్పందం యొక్క సభ్యేతర దేశంగా నిలిచింది.

UNFCCC (వ్యాసం 24) సభ్యదేశాలు మాత్రమే ఒప్పందంపై సంతకాలు చేయడం మరియు ఆమోదించగలవు. 12 నెలల నోటీసు ఇవ్వడం ద్వారా ఒప్పందం నుంచి ఏదైనా ఒక దేశం తప్పుకోవచ్చు. (వ్యాసం 27)

లక్ష్యాలు[మార్చు]

ప్రపంచ గ్రీన్‌హౌస్ వాయువులు ఉద్గారాల తగ్గింపుకు క్యోటో ఉద్దేశించబడింది.

"పర్యావరణ వ్యవస్థతో ప్రమాదకర మానవజన్య జోక్యమును నిరోధించే స్థాయికి వాతావరణంలోని గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల స్థిరీకరణ మరియు పునరుద్ధరణ" అనేది ప్రధాన లక్ష్యం.[1]

భూతాపం మరియు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గార సమస్యలను సంబాళించడానికి అన్ని భాగస్వామ్య దేశాలు కట్టుబడి ఉండేలా చట్టబద్ధమైన ఒక అంతర్జాతీయ ఒడంబడికను కుదుర్చుకోవడమే పర్యావరణ మార్పుపై క్యోటో సమావేశం యొక్క ఉద్దేశం. 1990 స్థాయిల ప్రామాణికంగా 2012 కల్లా ఉద్గారాలను సగటున 5.2%కి తగ్గించుకునే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

UNFCCC వ్యాసం 4.2 (d) పేర్కొన్న విధంగా లక్ష్యం నెరవేరేంత వరకు UNFCCCని చేరుకునేలా అవసరాలను సవరించనున్న నేపథ్యంలో క్యోటో తొలి అడుగు[6][7] అని ప్రతిపాదకులు కూడా గుర్తించారు.[8]

క్యోటో ఒప్పందం యొక్క ఐదు ప్రధాన ఉద్దేశాలు :[ఉల్లేఖన అవసరం]

 • గ్రీన్‌హౌస్ వాయువుల తగ్గింపుకు annex I దేశాలు చట్టబద్ధంగా కట్టుబడి ఉండేలా చేయడం మరియు అన్ని సభ్యదేశాలకు సాధారణ కట్టుబాట్లు విధించడం;
 • ఒప్పందం యొక్క లక్ష్యాల సాధన దిశగా అమలు, గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గించే విధానాలు మరియు చర్యల రూపకల్పన, ఈ వాయువుల శోషణాన్ని (ఉదాహరణకు బయోసీక్వెస్ట్రేషన్ మరియు జియోసీక్వెస్ట్రేషన్ ద్వారా) పెంచడం, మరియు ఉమ్మడి అమలు, స్వచ్ఛమైన అభివృద్ధి యంత్రాంగం, ఉద్గారాల వ్యాపారం వంటి అందుబాటులో ఉన్న అన్ని యంత్రాంగాలను ఉపయోగించడం; ఇంటి వద్ద గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను అధికంగా అనుమతించే క్రెడిట్ల (కార్బన్ అదుపు/నిల్వ సామర్థ్యం)ను అందించడం;
 • పర్యావరణ మార్పుకు ఉపయోజన నిధిని ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒత్తిళ్లను తగ్గించడం;
 • ఒప్పందం యొక్క సమగ్రతను నిశ్చయపరిచే విధంగా గణన, నివేదన మరియు సమీక్షను చేపట్టడం;
 • ఒప్పంద కట్టుబాటు అమలుకు ఒక అంగీకార కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఆమోదం తెలపడం.

ఉద్గార లక్ష్యాలు[మార్చు]

40 Annex I దేశాలకు గాను 39 ఒప్పందాన్ని ఆమోదించాయి. వాటిలో 34 దేశాలు ఒప్పందం యొక్క Annex Bకి అనుగుణంగా తమ 1990 ఉద్గార స్థాయిలకు సంబంధించిన లక్ష్యాలను చేరుకునే విధంగా నాలుగు గ్రీన్‌హౌస్ వాయువుల (GHG) (కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్) మరియు అవి విడుదల చేసే రెండు వాయువుల సమ్మేళనాల (హైడ్రోఫ్లోరోకార్బన్స్ మరియు పెర్‌ఫ్లోరోకార్బన్స్) తగ్గింపుకు కట్టుబడ్డాయి. ఉద్గారాల తగ్గింపును తీర్మానించడంలో ఆరు GHG వాయువులను CO2 తుల్యాంశాలుగా అనువదిస్తారు. ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్న పదార్థాలపై 1987లో కుదుర్చుకున్న మాంట్రియల్ ఒప్పందానికి సంబంధించిన పారిశ్రామిక వాయువులు, క్లోరోఫ్లోరోకార్బన్స్ లేదా CFCsకు ఈ తగ్గింపు లక్ష్యాలు అదనం.

ఈ ఒప్పందం కింద, యురోపియన్ యూనియన్‌ మరియు ఇతర దేశాలకు నిర్దేశించిన 8% నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల (US సంతకదారు కానందున కట్టుబాటు లేదు)కు 7%, జపాన్‌కు 6% మరియు రష్యాకు 0% వంటి స్థాయిలకు జాతీయ తగ్గింపు లక్ష్యాలుగా Annex I దేశాలు కట్టుబడ్డాయి. ఈ ఒప్పందం ఆస్ట్రేలియాకు 8% మరియు ఐస్‌లాండ్‌కు 10% ఉద్గారాల పెంపును అనుమతిస్తుంది.[9] ఉద్గార పరిమితుల్లో అంతర్జాతీయ వైమానిక మరియు నావికాదళ ఉద్గారాలను చేర్చలేదు.

Annex I countries under the Kyoto Protocol, their 2012 commitments and emission levels
style="width:25%; vertical-align:top;" ఆస్ట్రేలియా - 108% (1990 ఉద్గారాల్లో 2.1%)
ఆస్ట్రేలియా - 92% (0.4%)
బెలారస్ - 95% (ఇతర దేశాల సమ్మతిని అనుసరించి)
బెల్జియం - 92% (0.8%)
బల్గేరియా - 92% (0.6%)
కెనడా - 94% (3.33%)
క్రొయేషియా - 95% ()
చెక్ రిపబ్లిక్ - 92% (1.24%)
డెన్మార్క్ - 92% (0.4%)
ఎస్తోనియా - 92% (0.28%)
style="width:25%; vertical-align:top;" ఫిన్‌లాండ్ -92% (0.4%)
ఫ్రాన్స్ - 92% (2.7%)
జర్మనీ - 92% (7.4%)
గ్రీస్ - 92% (0.6%)
హంగేరి - 94% (0.52%)
ఐస్‌లాండ్ - 110% (0.02%)
ఐర్లాండ్ - 92% (0.2%)
ఇటలీ - 92% (3.1%)
జపాన్ - 94% (8.55%)
లాట్వియా - 92% (0.17%)
style="width:25%; vertical-align:top;" లీచ్‌టెన్‌స్టీన్ - (0.0015%) 92%
లిథుయానియా - () 92%
లగ్జంబర్గ్ - (0.1%) 92%
మొనాకో - 92% (0.0015%)
నెదర్లాండ్స్ - 92% (1.2%)
న్యూజిలాండ్ - 100% (0.19%)
నార్వే - 99% (0.26%)
పోలాండ్ - 94% (3.02%)
పోర్చుగల్ - 92% (0.3%)
రొమేనియా - 92% (1.24%)
style="width:25%; vertical-align:top;" రష్యన్ ఫెడరేషన్ - 100% (17.4%)
స్లొవేకియా - 92% (0.42%)
స్లొవేనియా - 92% ()
స్పెయిన్ - 92% (1.9%)
స్వీడెన్ - 92% (0.4%)
స్విట్జర్లాండ్ - 92% (0.32%)
టర్కీ ()
ఉక్రెయిన్ - 100% ()
యునైటెడ్ కింగ్‌డమ్ - 92% (4.3%)
అమెరికా సంయుక్త రాష్ట్రాలు - 93% (36.1%) (సభ్యదేశం కాదు)

అయితే, తమ సరిహద్దుల్లోని అతిపెద్ద ఆపరేటర్లకు తగ్గిన వార్షిక అనుమతులను కేటాయించడం లేదా ఉద్గార అనుమతులను కొనుగోలు చేయడం ద్వారా తమ కేటాయింపులను పెంచుకునేలా ఈ ఆపరేటర్లకు అవకాశం కల్పించడం లేదా UNFCCC సభ్యదేశాలన్నీ ఆమోదించిన ఒక యంత్రాగం ద్వారా తమ అదనపు అనుమతులను బదులుగా ఇవ్వడం ద్వారా ఈ దేశాలు దీనిని సాధించగలవు.

39 Annex I దేశాలకు గాను 38 ఈ విధంగా తమ ఉద్గారాల పరిమితులకు అంగీకరించగా, మరో రెండు దేశాలు EUలో తమ ప్రవేశ పరిస్థితులను బట్టి చేయాల్సి రాగా, మరొక దేశం (బెలారస్) Annex I దేశంగా మారడానికి సుముఖత వ్యక్తం చేసింది.

GHG ఉద్గార తగ్గింపుల క్రెడిట్లను పొందడం ద్వారా Annex I దేశాలు తమ GHG ఉద్గార లక్ష్యాలను చేరుకునే విధంగా ఈ ఒప్పందం పలు "సరళమైన యంత్రాంగాల"కు అవకాశం కల్పిస్తుంది. Annex Iయేతర దేశాలు లేదా ఇతర Annex I దేశాల్లో ఉద్గారాలను తగ్గించే Annex I దేశాలు ఆర్థిక సాయం అందిస్తున్న ప్రాజెక్టుల నుంచి లేదా అదనపు క్రెడిట్లు కలిగి ఉన్న Annex I దేశాల నుంచి క్రెడిట్లను కొనుగోలు చేయడం ద్వారా వీటిని పొందవచ్చు. ఉద్గారాల వ్యాపారం, స్వచ్ఛమైన అభివృద్ధి యంత్రాంగం (CDM) మరియు ఉమ్మడి అమలును సరళమైన యంత్రాంగాలుగా పేర్కొంటారు.

ఆచరణ పరంగా చెప్పాలంటే, Annex I దేశాలకు ఎలాంటి GHG ఉద్గార పరిమితులు ఉండవు. అయితే "కార్బన్ క్రెడిట్ల"ను పొందేలా GHG ఉద్గార తగ్గింపు ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వాటికి ఆర్థిక ప్రోత్సాహకాలు ఉంటాయి. అలా సమకూరిన కార్బన్ క్రెడిట్లను తర్వాత Annex I దేశాలకు విక్రయించడం ద్వారా స్థిరమైన అభివృద్ధికి అవి తోడ్పాటును అందించవచ్చు.[10] అదనంగా, సమర్థవంతమైన, తక్కువ GHG ఉద్గార పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా మరియు దేశీయంగా తమ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించుకోవడానికి బదులు ప్రపంచ విఫణిలో కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేయడానికి అత్యంత ప్రబలమైన పర్యావరణ ప్రమాణములను అనుసరించే విధంగా Annex I దేశాలకు ఈ యంత్రాంగాలు వెసులుబాటు కల్పిస్తాయి. సాధారణంగా, Annex I దేశాలు కార్బన్ క్రెడిట్లను సాధ్యమైనంత చౌకగా పొందాలనుకుంటాయి. అదే Annex Iయేతర దేశాలు దేశీయ గ్రీన్‌హౌస్ వాయు ప్రాజెక్టుల ద్వారా లభించిన కార్బన్ క్రెడిట్ల విలువను పెంచుకోవాలని చూస్తాయి.

ఒప్పంద వివరాలు[మార్చు]

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం :

"10 రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం, పారిశ్రామిక దేశాలు తమ గ్రీన్‌హౌస్ వాయువుల సమిష్టి ఉద్గారాలను 5.2%కి తగ్గించుకునేలా చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందంపై 160 దేశాలకు చెందిన మంత్రులు మరియు ఇతర ఉన్నతస్థాయి అధికారులు ఈ ఉదయం ఒక అంగీకారానికి వచ్చారు.

2008-12 కల్లా ఈ ఐదేళ్లలో గణించిన ఆరు గ్రీన్‌హౌస్ వాయువుల సమూహం నుంచి విడుదలయ్యే మొత్తం ఉద్గారాల సగటును తగ్గించడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. మూడు అత్యంత ప్రధానమైన వాయువులు కార్బన్ డయాక్సైడ్ (CO2), మీథేన్ (CH4) మరియు నైట్రస్ ఆక్సైడ్(N20) తగ్గుదలను 1990 ఏడాదిని ప్రామాణికంగా లెక్కిస్తారు. అదే విధంగా మూడు శాశ్వత పారిశ్రామిక వాయువులు హైడ్రోఫ్లోరోకార్బన్స్ (HFCs), పెర్‌ఫ్లోరోకార్బన్స్ (PFCs) మరియు సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ (SF6) తగ్గుదలను 1990 లేదా 1995 ఏడాదిని ప్రామాణికంగా చేసుకుని లెక్కిస్తారు."

జాతీయ పరిమితుల స్థాయి యూరోపియన్ యూనియన్ మరియు ఇతర దేశాలకు 8% తగ్గింపుల నుంచి USకు 7%, జపాన్‌కు 6%, రష్యాకు 0% వరకు. అలాగే ఆస్ట్రేలియాకు 8%, ఐస్‌లాండ్‌కు 10% పెంపునకు అనుమతించారు.[9]

1992లో రియో డి జనీరోలో జరిగిన ధరిత్రీ సదస్సులో పర్యావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సదస్సు (UNFCCC) అనుబంధ ఒప్పందాన్ని ఆమోదించారు. అయితే ఇది ఎలాంటి పరిమితులు గానీ లేదా ఆచరణ యంత్రాంగాలను గానీ ఏర్పాటు చేయలేదు. UNFCCC సభ్యదేశాలన్నీ క్యోటో ఒప్పందంపై సంతకాలు చేయడం లేదా ఆమోదించగలవు. అయితే UNFCCC సభ్యేతర దేశాలకు అలాంటి అవకాశముండదు. జపాన్‌లోని క్యోటోలో 1997లో జరిగిన UNFCCC (COP 3) సభ్యదేశాల సమావేశం మూడో సెషన్‌లో క్యోటో ఒప్పందమును ఆమోదించారు. క్యోటో ఒప్పందంలోని పలు నిబంధనలు UNFCCCకి సంబంధించిన Annex I జాబితాలోని అభివృద్ధి చెందిన దేశాలకు వర్తిస్తాయి.

జాతీయ ఉద్గార లక్ష్యాల నుంచి అంతర్జాతీయ వైమానిక మరియు నావికాదళాలను మినహాయించారు.

సాధారణమే కానీ అవకలించిన బాధ్యత[మార్చు]

"సాధారణమే కానీ అవకలించిన బాధ్యత" సూత్రాన్ని UNFCCC ఆమోదించింది. సభ్యదేశాలు అంగీకరించినవి :

 1. చారిత్రక మరియు ప్రస్తుత ప్రపంచవ్యాప్త గ్రీన్‌హౌస్ వాయువుల్లో అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే విడుదలవుతున్నాయి;
 2. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సగటు ఉద్గారాలు ఇప్పటికీ తక్కువే;
 3. సామాజిక మరియు అభివృద్ధి అవసరాలను చేరుకునే దిశగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విడుదలవుతున్న ప్రపంచవ్యాప్త ఉద్గారాల వాటా మరింత పెరగనుంది.[11]

చైనా, భారతదేశం మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్యోటో ఒప్పందానికి సంబంధించి ఎలాంటి సంఖ్యాపరమైన పరిమితిని విధించలేదు. ఎందుకంటే పారిశ్రామికీకరణ సమయానికి ముందస్తు ఒప్పందంలోని గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు అవి ప్రధాన కారకాలు కావు. అప్పటి నుంచి చైనా అతిపెద్ద గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారకంగా అవతరించింది.[12] ఏదేమైనప్పటికీ, క్యోటో లక్ష్యం కింద బాధ్యత లేకుండా, ఉద్గారాల తగ్గింపుకు అన్ని దేశాల ఉమ్మడి బాధ్యతను పంచుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం నడుం బిగించాయి.

అసమ్మతికి సంబంధించిన కట్టుబాట్లు మరియు జరిమానాల పర్యవేక్షక సమ్మతిగా ఒక "అంగీకార" యంత్రాగాన్ని ఈ ఒప్పందం నిర్వచించింది."[13]

ఆర్థిక కట్టుబాట్లు[మార్చు]

ఇతర దేశాల పర్యావరణ సంబంధిత అధ్యయనాలు మరియు ప్రాజెక్టులకు అభివృద్ధి చెందిన దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్న నిబంధనను ఈ ఒప్పందం పునరుద్ఘాటించింది. ఈ నిబంధనను వాస్తవానికి UNFCCCలో అంగీకరించారు.

ఉద్గారాల వ్యాపారం[మార్చు]

annex I దేశాల ఉద్గారాలపై జాతీయ పరిమితులను విధించే క్యోటో ఒప్పందం 'పరిమితి మరియు వ్యాపారం (లేదా ఉద్గారాల ట్రేడింగ్)'కు అవకాశం కల్పిస్తుంది. ఈ పరిమితి ప్రకారం, 2008-2012 మధ్య కాలంలో దేశాలు తమ ఉద్గారాలను 1990 స్థాయిల కన్నా తక్కువగా సగటున 5.2% తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ పరిమితులు జాతీయస్థాయి కట్టుబాట్లు అయినప్పటికీ, ఆచరణ పరంగా, పలు దేశాలు తమ ఉద్గార లక్ష్యాలను విద్యుత్ కేంద్రం లేదా కాగితపు పరిశ్రమ వంటి వ్యక్తిగత పారిశ్రామిక సంస్థలకు బదిలీ చేస్తాయి. 'పరిమితి మరియు వ్యాపారం'కు ఒక ఉదాహరణ 'EU ETS'. ఇతర పథకాలు కూడా సకాలంలో అనుకరిస్తాయి.

క్రెడిట్ల (టన్ను కార్బన్ ఉద్గారాల తగ్గింపుపై లభించే పాయింట్లు) అంతిమ కొనుగోలుదార్లు వ్యక్తిగత సంస్థలే. అంచనా ఉద్గారాలు తమ కోటాను అధిగమించడం, కేటాయింపు యూనిట్లు, AAUs లేదా 'అనుమతులు' తక్కువగా ఉండటం వల్ల అవి ఇలా చేస్తాయి. ఆనవాలుగా, అదనపు అనుమతులు కలిగిన వేరొక దేశం, మధ్యవర్తి, JI/CDM డెవలపర్ లేదా ఏదైనా ఒక ఎక్సేంజి నుంచి అవి క్రెడిట్లను నేరుగా కొనుగోలు చేస్తాయి.

తమ పరిశ్రమలకు క్యోటో లక్ష్యాలను చేరుకోవాలన్న మెరుగైన బాధ్యత లేని మరియు అనుమతుల నికర కొరత ఉండే కొన్ని జాతీయ ప్రభుత్వాలు తమ సొంత ఖాతా కోసం ప్రధానంగా JI/CDM డెవలపర్ల నుంచి క్రెడిట్లను కొనుగోలు చేస్తాయి. డచ్ ప్రభుత్వ ERUPT కార్యక్రమం విషయంలో ఈ లావాదేవీలు సందర్భానుసారంగా జాతీయ నిధి లేదా ఏజెన్సీ ద్వారా నేరుగా లేదా వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రోటోటైప్ కార్బన్ ఫండ్ (PCF) వంటి సమష్టి నిధుల ద్వారా జరుగుతాయి. ఉదాహరణకు, ఆరు ప్రభుత్వాల సహవ్యవస్థ, 17 భారీ వినియోగం మరియు ఇంధన సంస్థలకు ప్రాతినిధ్యం వహించే PCF వాటి తరపున క్రెడిట్లను కొనుగోలు చేస్తుంది.

అనుమతులు మరియు కార్బన్ క్రెడిట్లు పారదర్శక ధర కలిగిన వ్యాపారసహిత సాధనాలు కావడంతో ఆర్థిక పెట్టుబడిదారులు ఊహాజనిత అవసరాలకు లేదా భవిష్యత్తు ఒప్పందాలకు ముడిపెట్టడానికి వాటిని తక్షణ విఫణిలో కొనుగోలు చేయొచ్చు. అప్రధాన విఫణిలోని భారీస్థాయిలో జరిగే ఈ వ్యాపారం ధర ఆవిష్కరణ మరియు ద్రవ్యత్వానికి దోహదపడుతుంది. ఇది ధరలను తగ్గించడం మరియు పెట్టుబడుల వ్యూహరచనలకు అనుగుణంగా వ్యాపారాలకు సాయపడేలా విధంగా స్పష్టమైన CO2 ధర సంకేతాన్ని ఏర్పాటు చేయడానికి సాయపడుతుంది. ఈ విఫణి క్రమంగా అభివృద్ధి చెందుతోంది. బ్యాంకులు, మధ్యవర్తులు, నిధులు, మధ్యవర్తి బేరగాళ్లు, ప్రైవేటు వ్యాపారుల భాగస్వామ్యంతో ఈ విఫణి విలువ 2007లో దాదాపు $60 బిలియన్లకు పెరిగింది.[14] ఉదాహరణకు, ఉద్గార సాధనాల్లో ప్రత్యేక వాయిదా పెట్టుబడి సదుపాయంతో ఉద్గారాల ట్రేడింగ్ PLCని 2005లో లండన్ స్టాక్ ఎక్సేంజి యొక్క AIM విఫణిలో ఆవిష్కరించారు.

ప్రపంచవ్యాప్త కార్బన్ వ్యాపారానికి ఒక ముసాయిదా మరియు కొన్ని నిబంధనలను క్యోటో రూపొందించినప్పటికీ, ఆచరణ పరంగా వివిధ విస్పష్ట పథకాలు లేదా వ్యాపారాలు నేడు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే వాటి మధ్య మారే సహలగ్నతా అంశాలు ఉన్నాయి.

విఫణి పరిధిలో ఒకటిగా వ్యాపారం చేసుకోవడానికి వివిధ annex I దేశాల సమూహానికి క్యోటో అవకాశం కల్పించింది. ఎన్నికైన EU ఒక సమూహం మాదిరిగా గుర్తింపు పొందింది. తద్వారా EU ఉద్గారాల వ్యాపార పథకం (ETS) ఏర్పాటైంది. EU ETS ఉపయోగించే EAUలు (EU అనుమతి యూనిట్లు) ఒక్కోక్కటి క్యోటో AAUకి సమానం. 2003 నుంచి పురోగామి విఫణి ఒకటి ఉన్నప్పటికీ, ఈ పథకం 1 జనవరి 2005న అమల్లోకి వచ్చింది.

UK ETS పేరుతో UK సొంతంగా చేస్తూ నేర్చుకో అనే ఒక స్వచ్ఛంద పథకాన్ని ఆవిష్కరించింది. అది 2002 నుంచి 2006 వరకు కార్యకలాపాలు నిర్వహించింది. EU పథకంతో పాటే ఈ విఫణి కార్యకలాపాలు సాగించింది. అలాగే 2007లో ముగిసిన EU ETS మొదటి దశ నుంచి తప్పుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం UK భాగస్వాములకు లభించింది.[ఉల్లేఖన అవసరం]

స్వచ్ఛమైన అభివృద్ధి యంత్రాగం (CDM) మరియు ఉమ్మడి అమలు (JI) ప్రాజెక్టులు క్యోటో క్రెడిట్ల వనరులు. annex Iయేతర దేశాల్లో ఉద్గార తగ్గింపు ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త కార్బన్ క్రెడిట్ల ఏర్పాటుకు CDM మరియు annex I దేశాల క్రెడిట్లను ప్రాజెక్టు విశిష్ట క్రెడిట్లుగా మార్చే ప్రక్రియకు JI అవకాశం కల్పిస్తాయి. CDM ప్రాజెక్టులు ధ్రువీకరించిన ఉద్గార తగ్గింపులు (CERలు) మరియు JI ప్రాజెక్టులు ఒక AAUకి సమానమైన ఉద్గార తగ్గింపు యూనిట్ల (ERUలు)ను ఉత్పత్తి చేస్తాయి. క్యోటో CERలను EU ETS లక్ష్యాలను చేరుకునేందుకు కూడా వాడుకోవచ్చు. అదే విధంగా ERUల కూడా ETS లక్ష్యాలను చేరుకునేందుకు 2008 నుంచి ప్రబలమై ఉంటాయి (వ్యక్తిగత దేశాలు సంఖ్య మరియు CER/JIs వనరు పరిమితిని ఎంచుకున్నప్పటికీ, 2008 నుంచి ప్రారంభమయ్యే అంగీకార కార్యకలాపాలకు వాటిని కూడా అనుమతిస్తారు). CERs/ERUs అనుమతులు వంటి ఎక్సేంజి సంబంధిత వ్యాపార కార్యకలాపాల నుంచి కాకుండా నిధులు లేదా వ్యక్తిగత వాటాల ద్వారా ప్రాజెక్టు డెవలపర్ల నుంచి అధిక మొత్తంలో కొనుగోలు చేస్తారు.

క్యోటో ఏర్పాటుకు నమోదు, UNFCCC చేత ధ్రువీకరణ ప్రక్రియ సుదీర్ఘమైనది కావడం మరియు ప్రాజెక్టుల అభివృద్ధికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఈ కారణాల వల్ల ఈ విఫణి ప్రస్తుతం కొనుగోళ్లు తమ మారకానికి సమానంగా రాయితీతో జరిగే పురోగామి విఫణి. అలాగే EUA మరియు సాధ్యమైనంత వరకు నమోదు మరియు విడుదలకు సంబంధించి ఉంటాయి (కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష చెల్లింపులు జరిపినప్పటికీ). IETA ప్రకారం, 2004లో లావాదేవీలు జరిపిన CDM/JI క్రెడిట్ల విఫణి విలువ EUR 245 m. 2005లో లావాదేవీలు జరిపిన EUR 620 m క్రెడిట్ల కంటే ఇది ఎక్కువని అంచనా.

వివిధ క్యోటోయేతర కార్బన్ విఫణులు ప్రస్తుతం ఉన్నాయి లేదా ఏర్పాటుకు యోచిస్తున్నారు. భవిష్యత్‌లో వీటి ప్రాముఖ్యత మరియు సంఖ్య మరింత పెరగవచ్చు. న్యూ సౌత్‌ వేల్స్ గ్రీన్‌హౌస్ గ్యాస్ అబేట్‌మెంట్ స్కీమ్, రీజనల్ గ్రీన్‌హౌస్ గ్యాస్ ఇన్షియేటివ్, అమెరికా, కెనడాల్లోని వెస్టర్న్ క్లయిమేట్ ఇన్షియేటివ్, చికాగో క్లయిమేట్ ఎక్సేంజ్ మరియు ఉద్గారాల తగ్గింపుకు కాలిఫోర్నియా రాష్ట్రం యొక్క తాజా ప్రతిపాదన సహా పలు కార్బన్ విఫణులు వస్తున్నాయి.

ఈ ప్రతిపాదనలు ఒక కార్బన్ విఫణి కంటే పాక్షికంగా సంబంధమున్న వరుస విఫణుల ఏర్పాటుకు అవకాశం కల్పించవచ్చు. CO2 ఉద్గారాల తగ్గింపును తెలిపే కార్బన్ క్రెడిట్లపై దృష్టి సారించిన విఫణి ఆధారిత యంత్రాంగాల స్వీకరణ అనేది సాధారణ అంశం. ఒక విఫణిలోని కార్బన్ క్రెడిట్లను దీర్ఘకాలంలో ఇతర పథకాల్లో వ్యాపారం చేసే విధంగా ఈ ప్రతిపాదనలు కొన్ని తమ క్రెడిట్లను ధ్రువీకరించడానికి ఒకే విధమైన అందుబాటును కలిగి ఉంటాయనేది వాస్తవం. ఈ పథకం CDM/JI మరియు EU ETS విభాగాలపై ప్రస్తుతం దృష్టి సారించడం కంటే ప్రస్తుత కార్బన్ విఫణిని మరింత విస్తరించగలదు. అయితే అపరాధ రుసుములు మరియు జరిమానాల యొక్క పునర్వర్గీకరణ విస్పష్టమైన ముందుషరతు, ఎందుకంటే ప్రతి విఫణికి ఇవి సమర్థవంతమైన పరిమితిని సృష్టిస్తున్నాయి.

సవరణలు[మార్చు]

సభ్యదేశాల ఆరో సమావేశం (COP) ద్వారా నిర్ణయించే విధంగా ఈ ఒప్పందం పలు అంశాలను అపరిష్కృతంగా విడిచిపెట్టింది. 2000లో హాగ్‌లో జరిగిన సమావేశంలో వాటి పరిష్కారానికి COP6 ప్రయత్నం చేసింది. అయితే ఒకవైపు యురోపియన్ యూనియన్ (కఠినమైన ఒప్పందానికి మొగ్గుచూపింది) మరోవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, జపాన్ మరియు ఆస్ట్రేలియా (తక్కువ డిమాండ్ మరియు ఎక్కువ సరళత కలిగిన ఒప్పందాన్ని కోరుకున్నాయి)ల మధ్య విభేదాల కారణంగా ఒక అవగాహనకు చేరుకోలేకపోయింది.

2001లో బోన్‌లో జరిగిన గత సమావేశం (COP6bis) కొనసాగింపు సందర్భంగా అవసరమైన నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని అనుకూలతల అనంతరం, ఒప్పంద మద్దతుదారులు (యురోపియన్ యూనియన్ నేతృత్వంలోనివి) జపాన్ మరియు రష్యాలను తమతో కలుపుకుని పోవడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ జలాశయాల మరింత వినియోగానికి అనుమతించేలా చేయగలిగారు.

ఒప్పందం యొక్క తుది వివరాలను సిద్ధం చేసే దిశగా 29 అక్టోబరు 2001-9 నవంబరు 2001 మధ్య మర్రాకెచ్‌లో COP7ను నిర్వహించారు.

UNFCCC సభ్య దేశాల 11వ సమావేశం (COP11)తో పాటు క్యోటో ఒప్పంద దేశాల తొలి సమావేశం (MOP1)ను 28 నవంబరు-9 డిసెంబరు, 2005 మధ్య మాంట్రియల్‌లో నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ మార్పు సదస్సును చూడండి.

బాలీలో జరిగిన COP13 తొలి రోజు అంటే 3 డిసెంబరు 2007న ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ఆమోదించింది.

సంతకదారుల్లో 36 అభివృద్ధి చెందిన C.G. దేశాలు (మరియు యురోపియన్ యూనియన్‌ దేశంగా EU) ఐస్‌లాండ్‌కు 10% ఉద్గారాల పెంపుకు అంగీకరించాయి. అయితే EU సభ్యదేశాలకు వ్యక్తిగత లక్ష్యాలు[15] ఉండటం వల్ల తక్కువగా అభివృద్ధి చెందిన కొన్ని EU దేశాల (1990 నుంచి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గార#పెరుగుదలను దిగువ చూడండి)కు అధిక పెంపు (27% వరకు)లను అనుమతించారు.[16] తగ్గింపు పరిమితులు 2013లో కాలం చెల్లుతాయి.

అమలు[మార్చు]

ఒకవేళ annex I దేశం తన ఉద్గారాల పరిమితులను సమ్మతించలేదని అమలు విభాగం తీర్మానిస్తే, సదరు దేశం ఆ వ్యత్యాసంతో పాటు అదనంగా మరో 30% పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాక, ఉద్గారాల వ్యాపార కార్యక్రమం కింద ఎలాంటి బదిలీలు నిర్వహించకుండా ఆ దేశాన్ని నిషేధిస్తారు.[17]

ప్రభుత్వాల ప్రస్తుత పరిస్థితులు[మార్చు]

1800-2000 AD మధ్య కాలంలో ప్రపంచంలోని పలు ప్రాంతాలు విడుదల చేసిన కార్బన్ ఉద్గారాలు.

ఆస్ట్రేలియా[మార్చు]

నవంబరు, 2007లో ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మారనుండటంతో ప్రధాన మంత్రి కెవిన్ రుద్ 3 డిసెంబరు 2007న కార్యాలయంలో అడుగుపెట్టిన వెంటనే ఒప్పందంపై సంతకం చేశాడు. పర్యావరణ మార్పుపై UN ముసాయిదా సమ్మేళనం[18][19] సమావేశానికి ముందుగా ఆమోదించిన ఈ ఒప్పందం మార్చి, 2008లో అమల్లోకి వచ్చింది.[20] ఆయన విపక్షంలో ఉన్నప్పుడు, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు వల్ల కలిగే ఆర్థిక ప్రభావాలపై నివేదిక రూపొందించడానికి రాస్ గర్‌నౌత్‌ను రుద్ నియమించారు. 2008 సెప్టెంబరు 30న ఈ నివేదికను ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సమర్పించారు. ఒప్పందం అమలుకు అధిక వ్యయం[21] అవుతుందని, ఆర్థికంగా శరవేగంగా విస్తరిస్తున్న మరియు అధిక జనాభా కలిగిన భారతదేశం మరియు చైనా వంటి దేశాలకు ఎలాంటి లక్ష్యాలు లేకపోవచ్చనే కారణాల చేత ఆమోదానికి తిరస్కరించిన గత ఆస్ట్రేలియా ప్రభుత్వంతో రుద్ ప్రభుత్వ విధానం విభేదించింది. అంతేకాక, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపుకు మూడేళ్లలో $300 మిలియన్లు వెచ్చిస్తామన్న హామీ నేపథ్యంలో ఉద్గారాల తగ్గింపుకు ఆస్ట్రేలియా ఇప్పటికే చాలా కృషి చేస్తోందని చెప్పుకొచ్చింది.[ఉల్లేఖన అవసరం]

ఆస్ట్రేలియా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు 2008-2012 మధ్య కాలంలో 1990 స్థాయిల కంటే ఎక్కువగా భూ వినియోగం, భూ వినియోగ మార్పు మరియు అటవీశాస్త్రం (LULUCF) సహా 9% ఉంటుందని అంచనా వేశారు. ఈ అంచనా క్యోటో ఒప్పంద పరిమితి 8% కంటే కొద్దిగా ఎక్కువ. 2004లో ఆస్ట్రేలియాలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు 1990 స్థాయిల కంటే ఎక్కువగా LULUCF సవరణ లేకుండా 25.6% అని UNFCCC 2007లో వెల్లడించింది.[22]

స్వచ్ఛమైన అభివృద్ధి మరియు పర్యావరణంపై ఆసియా పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందంపై అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కలిసి సంతకం చేయడానికి గత ఆస్ట్రేలియా ప్రభుత్వం 28 జూలై 2005న ASEAN ప్రాంతీయ సమావేశంలో అంగీకరించింది. అంతేకాక, న్యూ సౌత్ వేల్స్ (NSW) రాష్ట్రం NSW గ్రీన్‌హౌస్ వాయు తగ్గింపు పథకాన్ని ప్రారంభించింది.[23] గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల వ్యాపారానికి సంబంధించిన ఈ తప్పనిసరి పథకం 1 జనవరి 2003న ప్రారంభించబడింది. ఈ పథకం ప్రస్తుతం ఒక్క NSWలో మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపడుతోంది. రాష్ట్రంలోని గృహాల నుంచి ఉద్గారాల వ్యాపారం చేసుకునే విధంగా ఈ పథకం అధీకృత సర్టిఫికేట్ ప్రొవైడర్లకు అవకాశం కల్పిస్తుంది. ఉద్గారాల వ్యాపారం పర్యావరణ మార్పుకు విశ్వసనీయ పరిష్కారం అని చెప్పడాన్ని పదవీవిరమణ చేస్తున్న ప్రధాన మంత్రి స్పష్టంగా తోసివేసినప్పటికీ, 2006 నాటికి ఈ పథకం అమల్లో ఉంది. NSWని ఉదాహరణగా తీసుకుని, వెస్ట్రన్ ఆస్ట్రేలియా మినహా లేబర్ పార్టీ అధికారంలో ఉన్న ఆస్ట్రేలియా రాష్ట్ర మరియు ప్రాంతీయ ప్రభుత్వాల ప్రథమప్రయత్నంగా జాతీయ ఉద్గారాల వ్యాపార పథకం (NETS)ను ప్రారంభించారు.[24] ఇతర ప్రాంతాల మధ్య విధాన సమన్వయం దిశగా ఆస్ట్రేలియాలోని కార్బన్ వ్యాపార పథకమును ప్రారంభించడం NETS పని. ఆస్ట్రేలియా రాజ్యాంగం ప్రత్యేకించి పర్యావరణ సంబంధిత అంశాల (నీరు కాక)ను సూచించని నేపథ్యంలో బాధ్యత కేటాయింపు రాజకీయ స్థాయిలో పరిష్కరించబడుతుంది.[25] హోవార్డ్ పరిపాలన (1996-2007) తర్వాతి ఏళ్లలో (a) కొన్ని తప్పనిసరి ఫెడరల్ నిర్ణయాలు ఉండే రంగంలో చర్య తీసుకోవడం మరియు (b) అధికారం చేపట్టనున్న లేబర్ ప్రభుత్వం చేత క్యోటో ఒప్పంద ఆమోద ప్రక్రియను సులభతరం చేయడం కోసం NETSను ఏర్పాటు చేయడానికి లేబర్ పార్టీ పాలిత రాష్ట్రాలు ఉపక్రమించాయి.

ఆస్ట్రేలియాను చట్టవిరుద్ధంగా అతిపెద్ద లబ్ధిదారుగా చేసిందంటూ క్యోటో ఒప్పందంలోని నిబంధన 3.7ను "ఆస్ట్రేలియా షరతు"గా గ్రీన్‌పీస్ అభివర్ణించింది. 1990లో అత్యధిక భూమి వినియోగానికి అదే సంవత్సరంలో ఒక ప్రామాణిక స్థాయిని ఏర్పాటు చేయడానికి annex 1 దేశాలకు ఈ నిబంధన అవకాశం కల్పిస్తుంది. 1990లో ఆస్ట్రేలియాకు భూమి వినియోగం అత్యధికంగా ఉన్నందు వల్ల ఆస్ట్రేలియా యొక్క "ప్రామాణికం" ఇతర దేశాలతో పోల్చితే అసాధారణంగా ఎక్కువని గ్రీన్‌పీస్ వాదించింది.[26]

మే, 2009లో కెవిన్ రుద్ కార్బన్ కాలుష్య తగ్గింపు పథకాన్ని జాప్యం చేయడంతో పాటు మార్పు చేశాడు.[27]

 • ఈ పథకం ముందు నిర్ణయించిన దానికి (1 జూలై 2010న ప్రారంభించాలని నిర్ణయించారు) ఏడాది తర్వాత 2011/2012లో ప్రారంభం కాగలదు;
 • 2011/2012లో అనుమతికి ఏడాది నిర్దిష్ట ధర AU$10 ఉండొచ్చు (అంతకుముందు ధర పరిమితి $40 కంటే తక్కువగా ఉండేది);
 • తొలి ఏడాది ప్రభుత్వం వద్ద అపరిమిత అనుమతులు ఉండొచ్చు (అంతకుముందు 300 మిలియన్ టన్నుల Co2ను వేలం ద్వారా విక్రయించినట్లు అంచనా);
 • ఎక్కువ శాతం అనుమతులను వేలం వేయడం కంటే పలువురికి జారీ చేయొచ్చు (అంతకుముందు 60% లేదా 90% అనుమతులను జారీ చేశారు);
 • నష్టపరిహారాన్ని 2010/2011లో రద్దు చేయవచ్చు మరియు 2011/2012లో తగ్గించవచ్చు;
 • ఆస్ట్రేలియా కార్బన్ సంస్థ (అంతకుముందు అలాంటి పథకం అందుబాటులో లేదు)లో అనుమతుల కొనుగోలు మరియు విరమణ ద్వారా గృహాలు తమ కార్బన్ వినియోగాన్ని తగ్గించుకోగలవు;
 • అంతర్జాతీయ ఒప్పందానికి సంబంధించి, 2000 స్థాయిల నుంచి ఆస్ట్రేలియా 2020 కల్లా 25% తగ్గించుకునేందుకు కట్టుబడగలదు (అంతకుముందు 15% తగ్గింపు ఉండేది);
 • అంతర్జాతీయ ఆఫ్‌సెట్స్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా 25% తగ్గింపు లక్ష్యాల్లో 5% సాధించవచ్చు (అంతకుముందు అలాంటి పథకం అందుబాటులో లేదు).

కెనడా[మార్చు]

17 డిసెంబరు 2002న కెనడా ఆమోదించిన ఒప్పందం ఫిబ్రవరి 2005లో అమల్లోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం, 2008-2012 మధ్య కాలంలో 1990 స్థాయిల కంటే తక్కువగా తన ఉద్గారాలను 6%కి తగ్గించుకోవాలి. ఆ సమయంలో సుమారు 70% అసంఖ్యాక అధ్యయనాలు క్యోటో ఒప్పందానికి మద్దతు తెలిపాయి.[28][29] ప్రజల మద్దతు బలంగా ఉన్నప్పటికీ, ప్రత్యేకించి అధికార కన్సర్వేటివ్ పార్టీకి పూర్వగామియైన కెనడా కూటమి, కొన్ని వ్యాపార వర్గాలు[30] మరియు ఇంధన సంస్థల నుంచి U.S.లో మాదిరిగా వ్యతిరేక వాదనలు వినిపించాయి. ప్రత్యేకించి, క్యోటో ఒప్పందం వల్ల U.S. కంపెనీలు దెబ్బతినే అవకాశం లేనందున కెనడా కంపెనీలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవచ్చనే భయం నెలకొంది. 2005లో ప్రధానంగా కెనడా యొక్క ప్రధాన చమురు, వాయు ఉత్పత్తిదారు అల్బెర్టా మరియు ఫెడరల్ ప్రభుత్వం మధ్య "మాటల యుద్ధం" కొనసాగింది. పర్యావరణ మార్పు కార్యక్రమాలపై తాను $3.7 బిలియన్లు ఖర్చు చేశానని లేదా వెచ్చించడానికి కట్టుబడ్డానని ఫెడరల్ ప్రభుత్వం 2003లో స్పష్టం చేసింది.[31] 1990 స్థాయి కంటే ఎక్కువగా 2004 నాటికి CO2 ఉద్గారాలు 27%కి పెరిగాయి. అదే సమయంలో U.S.లో పెరిగిన 16% ఉద్గారాల పెరుగుదలతో ఇది అననుకూలంగా ఉంది.[32] అయితే 2006 నాటికి అవి 1990 స్థాయిల కంటే అధికంగా 21.7%కి తగ్గించబడ్డాయి.[33]

క్యోటో ఒప్పందాన్ని మరియు ప్రత్యేకించి, అంతర్జాతీయ ఉద్గార వ్యాపారానికి అంతకుముందు వ్యతిరేకతను తెలిపిన స్టీఫెన్ హార్పర్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ మైనార్టీ ప్రభుత్వం జనవరి, 2006లో ఎన్నికయింది. స్టీఫానీ డియాన్ స్థానంలో పర్యావరణ శాఖ మంత్రిగా పగ్గాలు చేపట్టిన రోనా ఆంబ్రోస్ అప్పటి నుంచి కొన్ని రకాలైన ఉద్గార వ్యాపారాలను సమర్థించడం మరియు వాటిపై ఆసక్తి కనబరిచాడు.[34] 25 ఏప్రిల్ 2006న క్యోటో ఒప్పందం కింద కెనడా తన లక్ష్యాలను చేరుకోలేకపోవచ్చని ఆంబ్రోస్ వెల్లడించాడు. అయితే స్వచ్ఛమైన అభివృద్ధి మరియు పర్యావరణంపై ఆసియా-పరిఫిక్ భాగస్వామ్యంలో మాత్రం పాలుపంచుకోవచ్చని అన్నాడు. "ఇప్పటికి పలు మాసాల నుంచి ఆసియా-పసిఫిక్ భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే అందులోని ప్రధాన సూత్రాలను మా ప్రభుత్వం అనుసరించడానికి సుముఖంగా ఉంది" అని ఆంబ్రోస్ విలేకరులకు తెలిపాడు.[35] 2 మే 2006న క్యోటో ప్రమాణాలను చేరుకునేందుకు అయ్యే వ్యయాన్ని తగ్గించినట్లు తెలిసింది. మరోవైపు దాని స్థానంలో కొత్త ప్రణాళికను హార్పర్ ప్రభుత్వం రూపొందించింది.[36] నవంబరు, 2006లో నైరోబీలో జరిగిన UN పర్యావరణ మార్పు సమావేశంలో సభ్యదేశంగా పాల్గొన్న కెనడా ప్రభుత్వం తన వైఖరికి గాను పర్యావరణ బృందాలు మరియు ఇతర ప్రభుత్వాల నుంచి తీవ్రంగా విమర్శలను ఎదుర్కొంది.[37] పర్యావరణ మంత్రిగా ఉన్న రోనా ఆంబ్రోస్ 4 జనవరి 2007న అంతర్ ప్రభుత్వ వ్యవహారాల మంత్రి అయ్యాడు. కోశాగార విభాగం మాజీ అధ్యక్షుడు జాన్ బైర్డ్ పర్యావరణ శాఖ విధులు చేపట్టాడు.

పరిశ్రమకు తప్పనిసరి ఉద్గార లక్ష్యాలను క్యోటో ఒప్పందం యొక్క 1990ని విభేదించే 2006 ప్రామాణిక తేదీతో నిర్దేశించడానికి ఫెడరల్ ప్రభుత్వం ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. అయితే అవి 2012 వరకు అమల్లోకి రావు. ఈ నేపథ్యంలో చట్టాన్ని సవరించడానికి విపక్ష పార్టీలతో కలిసి పనిచేయడం ప్రభుత్వం మొదలుపెట్టింది.

"క్యోటో ఒప్పందం కింద ప్రపంచవ్యాప్త పర్యావరణ మార్పు లక్ష్యాలను కెనడా చేరుకునే విధంగా చేయడం" కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పబ్లో రోడ్రిగ్వెజ్, స్వతంత్రుడు ఒక ప్రైవేటు సభ్యుల బిల్లు[38]ను ప్రవేశపెట్టాడు." స్వతంత్రులు, న్యూ డెమొక్రాటిక్ పార్టీ, బ్లోక్ క్వీబెకాయిస్ మద్దతు మరియు ప్రస్తుత మైనార్టీ పరిస్థితి ద్వారా ఈ బిల్లు 14 ఫిబ్రవరి 2007న 161-113 ఓట్ల తేడాతో దిగువసభలో ఆమోదించబడింది.[39] ఈ బిల్లును సెనేట్ ఆమోదించింది. 22 జూన్ 2007న అది రాజముద్ర పొందింది.[40] అయితే, ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోకుండా ఆర్థిక కారణాలను జూపి బిల్లును విస్మరించింది. ఆ బిల్లు నిజానికి 60 రోజుల్లోగా సమగ్ర ప్రణాళిక రూపొందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది.[41][42]

గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే విధంగా క్యోటో ఒప్పంద లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనందుకు ధరిత్రీ మిత్రులు మే, 2007లో ఫెడరల్ ప్రభుత్వంపై చట్టపరమైన చర్యకు పూనుకున్నారు. ఈ లక్ష్యాలు కెనడా పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఒక ఉపనిబంధనపై ఆధారపడ్డాయి. ఒట్టావా "కెనడా చట్టబద్ధమై ఉన్న అంతర్జాతీయ ఒప్పందమును ఉల్లంఘిస్తూ విడుదలవుతున్న వాయు కాలుష్యాన్ని నిరోధించాలి" అని అది తెలుపుతుంది.[43] ఒప్పందానికి సంబంధించి కెనడా లక్ష్యం 2008లో మొదలయింది.

ఫెడరల్ విధానంతో సంబంధం లేకుండా ఉద్గారాల తగ్గింపుకు క్యూబెక్,[44] ఒంటారియో, బ్రిటీష్ కొలంబియా మరియు మణిటోబా సహా కొన్ని ప్రావిన్స్‌లు పశ్చిమ పర్యావరణ ప్రతిపాదనలో భాగంగా పలు విధానాలను అనుసరించాయి.

పర్యావరణ మార్పు ప్రమాదాన్ని కెనడా రాజకీయవేత్తలు తీవ్రంగా పరిగణించి, భవిష్యతు తరాల భద్రత మరియు ఆరోగ్యాన్ని కాపాడే దిశగా అవసరమైన మార్పులు చేపట్టాలన్న డిమాండ్‌తో అక్కడి పర్యావరణ బృందాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. KYOTOప్లస్ పేరుతో భాగస్వామ్య బృందాలు ఒక పిటిషన్‌ను రూపొందించాయి. దానిపై సంతకదారులు కింద ఇవ్వబడిన చర్యలకు కట్టుబడ్డాయి :
• 1990 స్థాయిల ఆధారంగా 2020 కల్లా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను కనీసం 25 శాతం తగ్గించే విధంగా జాతీయ లక్ష్యాన్ని నిర్దేశించడం;
• ఈ లక్ష్యాన్ని చేరుకునే విధంగా మరియు తక్కువ కార్బన్ ఆర్థిక విధానాలను అవలంభించే విధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయం చేయడానికి ఒక సమర్థవంతమైన జాతీయ ప్రణాళికను అమలు చేయడం; మరియు
• డిసెంబరు, 2009లో డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి పర్యావరణ మార్పు సమావేశంలో క్యోటో ఒప్పందం యొక్క బలీయమైన రెండో దశను స్వీకరించడం.

పర్యావరణ మార్పుపై ఫెడరల్ ప్రభుత్వం యొక్క సత్వర చర్యకు KYOTOప్లస్ అనేది జాతీయ, నిష్పక్షపాత, అభ్యర్థన ప్రధాన ప్రచారం. క్లయిమేట్ యాక్షన్ నెట్‌వర్క్ కెనడా, సియర్రా క్లబ్ కెనడా, సియర్రా యూత్ కొయిలేషన్, ఆక్స్‌ఫామ్ కెనడా, ది కెనడియన్ యూత్ క్లయిమేట్ కొయిలేషన్, గ్రీన్‌పీస్ కెనడా, KAIROS: కెనడియన్ ఎక్యుమెన్సియల్ జస్టిస్ ఇన్షియేటివ్స్ మరియు డేవిడ్ సుజుకి ఫౌండేషన్ సహా యాభైకి పైగా భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి.

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా[మార్చు]

27 ఆగస్టు 2008 నాటికి విద్యుత్ ఉత్పత్తి ద్వారా చైనా ప్రపంచంలోనే అత్యధిక CO2 ఉద్గారకంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలను మించిపోయిందని ఖగోళ అభివృద్ధి కేంద్రం తెలిపింది.[45] అయితే సరాసరి ప్రామాణికంగా చూస్తే, U.S.లో విద్యుత్ రంగం యొక్క ఉద్గారం చైనాలో కంటే ఇప్పటికీ సుమారు నాలుగు రెట్లు అధికం. చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం, రష్యా, జర్మనీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మరియు దక్షిణ కొరియాలు ప్రపంచంలో విద్యుత్ రంగం ద్వారా అత్యధిక ఉద్గారాలను విడుదల చేస్తున్న పది దేశాలు. యురోపియన్ యూనియన్‌ యొక్క 27 సభ్య రాష్ట్రాలను ఒక దేశంగా పరిగణిస్తే, చైనా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల తర్వాత E.U. మూడో అతిపెద్ద CO2 కాలుష్యకారిగా అవతరిస్తుంది. సరాసరి లెక్కన చూస్తే, ప్రపంచంలోనే రెండో అత్యధిక ఉద్గారాలు U.S. విద్యుత్ రంగం నుంచి విడుదలవుతున్నాయి. U.S.లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఏటా ఒక మనిషి దాదాపు 9.5 టన్నుల CO2 విడుదల చేస్తున్నాడు. అదే చైనాలో ఒక మనిషి ఏడాదికి 2.4 టన్నులు, భారత్‌లో 0.6 మరియు బ్రెజిల్‌లో 0.1. E.U.లో విద్యుత్ మరియు ఉష్ణ ఉత్పత్తి ద్వారా విడుదలవుతున్న ఉద్గారం యొక్క సరాసరి మొత్తం ఏడాదికి 3.3 టన్నులు. ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే అత్యధికంగా ఏటా 10 టన్నులకు పైగా ఉద్గారాలను విడుదల చేస్తోంది. అక్కడ U.S కంటే ఎక్కువగా విద్యుత్ సంబంధిత ఉద్గారాలను ఒక మనిషి విడుదల చేస్తున్నాడు.

సంబంధిత నివేదికలో, కెనడా ఆర్థికవేత్తలు జెఫ్ రూబిన్ మరియు బెంజమిన్ తాల్ 27 మార్చి 2008న ఒక నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక U.S. ఇంధన సమాచార విభాగం సహా వివిధ మూలాల నుంచి సేకరించిన సమాచారంపై ఆధారపడిన కార్బన్ ధర[46]కు సంబంధించింది. దిగువ పేర్కొన్నవి సహా ఆశ్చర్యకరమైన వాస్తవాలకు సంబంధించిన కార్బన్ ధర కోసం రూబిన్ మరియు తాల్ తమ ప్రతిపాదనకు అంకురార్పణ చేశారు.

 • చైనా యొక్క GHG ఉద్గారాలు దశాబ్ది ప్రారంభం మొదలుకుని 120% పెరిగాయి. అదే సమయంలో U.S. ఉద్గారాలు 16% పెరిగాయి;
 • చైనా ఏకైక అతిపెద్ద GHG ఉద్గారకంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలను ప్రస్తుతం పక్కకు నెట్టింది. అలాగే ప్రపంచవ్యాప్త GHG ఉద్గారాల్లో ఐదో వంతుకు పైగా కారణభూతమైంది;
 • పలు OECD దేశాల కంటే అత్యధిక GHG-సాంద్ర ఇంధన వనరుయైన బొగ్గు వినియోగిత విద్యుత్ కేంద్రాలపై చైనా ఎక్కువగా ఆధారపడుతోంది. చైనా బొగ్గు ఆధారిత ఉద్గారాలు ఇప్పుడు మరియు 2012కు మధ్యకాలంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల బొగ్గు ఆధారిత ఉద్గారాల మొత్తాన్ని మించిపోనుంది.

జూన్, 2007లో 62 పేజీల పర్యావరణ మార్పు ప్రణాళికను చైనా ఆవిష్కరించింది. అలాగే పర్యావరణ మార్పు అంశాన్ని తన ఇంధన విధానంలో ప్రధానంగా చేర్చుతామని హామీ ఇచ్చింది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే దిశగా ముందడుగు వేయడంలో అభివృద్ధి చెందిన దేశాలు "మొక్కవోని బాధ్యత"ను కలిగి ఉంటాయని మరియు UNFCCCలో అంగీకరించిన విధంగా "సాధారణమే కానీ అవకలించిన బాధ్యత" సూత్రాన్ని తప్పనిసరిగా అనుసరించాలని స్పష్టం చేసింది.[47][48]

తన ఇంధన విధానంపై వస్తున్న విమర్శలు న్యాయవిరుద్ధమని చైనా పేర్కొంది.[49] వివిధ దేశాలతో చైనాను పోల్చడం సమంజసం కాదు. ఎందుకంటే ప్రపంచ మొత్తం జనాభాలో ఐదో వంతు చైనా ఒక్కటే కలిగి ఉంది. అంతేకాక చైనాలోని సగటు ఉద్గారం పారిశ్రామికీకరణ ప్రపంచ దేశాలతో పోల్చితే తక్కువ. E.U., U.S., కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ మరియు దక్షిణకొరియాల జనాభాను కలుపుకున్నా, వాటి మొత్తాన్ని చైనా కొన్ని వందల లక్షల తేడాతో పక్కకు నెడుతుంది. ఉద్గారాల ఏటా అంచనా కూడా అభివృద్ధి చెందిన దేశాలు విడుదల చేస్తున్న పెరుగుదల మొత్తాన్ని ఉపేక్షిస్తోంది. చైనా ఉద్గారాలలో నాలుగో వంతు అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేస్తున్న వస్తువుల ఉత్పత్తి వల్ల ఏర్పడినవే అని కార్బన్ ఉద్గారాలపై నిర్వహించిన అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.[50]

యురోపియన్ యూనియన్[మార్చు]

31 మే 2002న యురోపియన్ యూనియన్‌కు చెందిన అప్పటి పదిహేను సభ్యదేశాలన్నీ ఆమోదానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని UNకు నివేదించాయి. ప్రపంచవ్యాప్త గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో EU సుమారు 22% విడుదల చేస్తోంది. అందువల్ల 1990 ఉద్గార స్థాయిల నుంచి సగటున 8%కి తగ్గించుకోవడానికి అంగీకరించింది. డెన్మార్క్ తన ఉద్గారాలను 21%కి తగ్గించుకోవడానికి కట్టుబడింది. 2020 కల్లా GHG ఉద్గారాల్లో 20% ఏకపాక్షిక తగ్గింపు అంశాన్ని పొందుపరిచిన యురోపియన్ యూనియన్ ఇంధన విధానానికి సంబంధించిన ప్రణాళికలను యురోపియన్ కమిషన్ 10 జనవరి 2007న ప్రకటించింది.

క్యోటో ఒప్పందం యొక్క అతిపెద్ద నామమాత్ర మద్దతుదారుల్లో ఒకటైన EU ఇతర దేశాలు కూడా కలిసి వచ్చేలా తీవ్రంగా చర్చలు జరిపింది.

క్లిష్టమైన లక్ష్యాలను చేరుకునే దిశగా డిసెంబరు, 2002లో ఒక ఉద్గారాల వ్యాపార వ్యవస్థను EU ఏర్పాటు చేసింది. ఆరు ప్రధాన పరిశ్రమలైన ఇంధనం, ఉక్కు, సిమెంట్, గ్లాస్, ఇటుకుల తయారీ మరియు పేపర్/కార్డ్‌బోర్డ్‌లలో కోటాలను ప్రవేశపెట్టారు. తమ లక్ష్యాలను చేరుకోలేని సభ్యదేశాలకు జరిమానాలు 2005లో €40/టన్ను కార్బన్ డయాక్సైడ్ ఉండగా, అది 2008లో €100/ టన్నుకు పెరిగింది. 2008 నాటికి EU 1990 స్థాయిల కన్నా తక్కువగా 4.7%కి ఉంటుందని ప్రస్తుత EU అంచనాలు పేర్కొన్నాయి.

1990-2004 మధ్య కాలంలో EUలో CO2 ఉద్గారాల రవాణా 32%కి పెరిగింది. CO2 ఉద్గారాల్లో రవాణా వాటా 1990లో 21% ఉండగా, 2004 నాటికి అది 28%కి పెరిగింది.

ఏదేమైనప్పటికీ, ఒప్పంద చర్చల్లో వివాదం లేకుండా EUకి స్థితి ఉండేది కాదు. EU మొత్తానికి 15% లక్ష్యాన్ని చేరుకునే విధంగా పూర్వపు ఈస్ట్ జర్మనీలో తాను కూడా భారీ తగ్గింపును కట్టుబడతానని మరియు ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు 15% ఏకరీతి లక్ష్యానికి చర్చల సందర్భంగా EU పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో EU 8% తగ్గించుకోవడం కంటే దాని సభ్యదేశాలన్నీ తప్పనిసరిగా 15% తగ్గించాలనే ఒక విమర్శ ఉంది. అంతేకాక, ప్రస్తుతం EU సభ్యదేశాలైన పూర్వపు వార్సా ఒప్పంద దేశాల ఉద్గార స్థాయిలు వాటి ఆర్థిక పునర్నిర్మాణాల ఫలితంగా ఇప్పటికే తగ్గాయి. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ప్రాంతం యొక్క 1990 ప్రామాణిక స్థాయి పెరిగిందని దీని అర్థంగా తెలుస్తోంది. దీని ఫలితంగా యురోపియన్ ఆర్థిక వ్యవస్థలకు U.S. కన్నా ఎక్కువగా పోటీయుత ఆధిక్యత పెరిగింది.

EU (ఐరోపా సమాజం) మరియు తన సభ్యదేశాలు రెండూ కూడా క్యోటో ఒప్పంద సంతకదారులు.
ఉద్గారాల పర్యవేక్షణ మరియు నివేదనకు సంబంధించి కనీస బాధ్యతగా తగిన యంత్రాంగాలను ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకు మరియు ఇతర నివేదికలు తన వద్ద లేవంటూ తప్పుడు నివేదికలను సమర్పించినందుకు గాను ధరిత్రీ దినం (22 ఏప్రిల్ 2008) నాడు క్యోటో ఒప్పందం నుంచి గ్రీస్‌ను తొలగించారు. అయితే ఏడు నెలల నిషేధం (నవంబరు 15న) అనంతరం క్యోటో ఒప్పందం యొక్క ఉద్గారాల వ్యాపార వ్యవస్థలో గ్రీస్‌కు తిరిగి అవకాశం కల్పించడానికి ఐక్యరాజ్యసమితి కమిటీ ఒకటి నిర్ణయించుకుంది.

జర్మనీ[మార్చు]

1990-2008 మధ్యకాలంలో జర్మనీ తన వాయు ఉద్గారాలను 22.4%కి తగ్గించుకుంది.[51] E.U. అంతర్గత ఉద్గార వ్యాపార వ్యవస్థ కింద తమ అవసరాల నుంచి బొగ్గు పరిశ్రమను మినహాయిస్తున్నట్లు జర్మనీ ప్రభుత్వం 28 జూన్ 2006న ప్రకటించింది. అని బెర్లిన్‌లోని జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ రీసెర్చ్‌కు చెందిన ఇంధన ప్రొఫెసర్ క్లాడియా కెమ్‌ఫెర్ట్ మాట్లాడుతూ, "స్వచ్ఛమైన పర్యావరణం మరియు క్యోటో ఒప్పందానికి మద్దతు విషయంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం చాలా నిరాశపరిచింది. ఈ నిర్ణయం వెనుక ఇంధన వర్గాలు భారీ పాత్రను పోషించాయి." [52] ఏదేమైనప్పటికీ, CO2 ఉద్గారాలను 1990 స్థాయిల నుంచి 21%కి తగ్గించాలని జర్మనీ యొక్క స్వచ్ఛంద సంకల్పం ఉద్గార స్థాయి అప్పటికే 19%కి తగ్గడం వల్ల అది ఆచరణ సాధ్యమయింది. తద్వారా 8% తగ్గింపుకు E.U. చేసిన హామీలో జర్మనీ 75% సాధించింది.[53]

యునైటెడ్ కింగ్‌డమ్[మార్చు]

యునైటెడ్ కింగ్‌డమ్ ఇంధన విధానం సంపూర్ణంగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యాలను బలపరిచింది. అలాగే దశల వారీగా జాతీయ ఉద్గారాల తగ్గింపుకు కూడా కట్టుబడింది. క్యోటో ఒప్పందానికి U.K. ఒక సంతకదారు.

పర్యావరణ సంబంధిత బృందాల నాయకత్వంలో పలు రాజకీయ పార్టీల నుంచి ఏళ్లుగా వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో 13మార్చి 2007న పర్యావరణ మార్పు బిల్లు ముసాయిదాను రూపొందించారు. ఎనర్జీ వైట్ పేపర్ 2003[54] తెలిపినట్లుగా, కార్బన్ ఉద్గారాలను 1990 స్థాయిల నుంచి 2050 కల్లా తప్పనిసరిగా 60% తగ్గించడం ఈ బిల్లు యొక్క ప్రధానోద్దేశ్యం. అలాగే 2020 నాటి కల్లా 26%-32% మధ్య సాధించడం మధ్యంతర లక్ష్యం.[55] 1990 ప్రామాణికంగా 80% ఉద్గారాల తగ్గింపు లక్ష్యంగా పర్యావరణ మార్పు చట్టం 26 నవంబరు 2008న శాసనరూపు దాల్చుకుంది.[56] సుదీర్ఘ మరియు విశిష్ట కార్బన్ తగ్గింపు లక్ష్యంతో ఈ చట్టాన్ని ఆమోదించిన తొలి దేశం U.K.

2007-2008 మధ్య నుంచి 2012 వరకు CO2 ఉద్గారాలను తమ ప్రభుత్వం తగ్గించగలదనే తలంపుతో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలపై క్యోటో పరిమితిని చేరుకునే దిశగా U.K. ముందుకు సాగుతోంది.[57] U.K.లో మొత్తం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, 1997లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్బన్ డయాక్సైడ్ వార్షిక నికర ఉద్గారం సుమారు 2% మేర పెరిగింది.[57] ఫలితంగా, పర్యావరణ మార్పు బిల్లు ఆమోదం తర్వాత తక్షణ మరియు ప్రబల చర్య తీసుకోని పక్షంలో కార్బన్ ఉద్గారాలను 1990 స్థాయిల నుంచి 2010[57] కల్లా 20%కి తగ్గిస్తామన్న తన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోవచ్చు.

ఫ్రాన్స్[మార్చు]

2004లో ఫ్రాన్స్ తన చివరి బొగ్గు గనిని మూసివేసింది. ప్రస్తుతం 80%పైగా తన విద్యుత్ అవసరాలను అణు విద్యుత్‌[58] ద్వారా తీర్చుకుంటోంది. అందువల్ల CO2 ఉద్గారాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.[59]

నార్వే[మార్చు]

1990-2007 మధ్యకాలంలో నార్వే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు 12%పైగా పెరిగాయి.[60] తమ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను ప్రత్యక్షంగా తగ్గించుకోవడంతో పాటు కార్బన్ తటస్థీకరణకు నార్వే ఆలోచన క్యోటో ఒప్పందం యొక్క చట్టపరమైన నిబంధన కింద చైనాలో అడవుల పెంపకానికి అవసరమైన ఆర్థిక సాయం అందిచడం కోసం ఉద్దేశించబడింది.

భారతదేశం[మార్చు]

ఆగస్టు, 2002లో సంతకాలు చేయడం ద్వారా భారతదేశం ఒప్పందానికి అంగీకరించింది. ఒప్పంద ముసాయిదా నుంచి భారతదేశాన్ని మినహాయించడంతో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ మరియు విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం ద్వారా లబ్ధి పొందగలమని భావించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు ఉద్గార స్థాయిలు చాలా తక్కువని జూన్ 2005లో జరిగిన G8 సమావేశంలో భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గుర్తు చేశాడు. సాధారణమే కానీ అవకలించిన బాధ్యత సూత్రాన్ని అనుసరించి సుదీర్ఘకాలంగా పేరుకుపోయిన ఉద్గార వ్యర్థాలను అడ్డుకునే ప్రధాన బాధ్యతను అభివృద్ధి చెందిన దేశాలే భారత్ చేయగలిగింది. అయితే భారత్, చైనాల శరవేగమైన పారిశ్రామికీకరణ మరియు ఆర్థిక అభివృద్ధి వల్ల రానున్న దశాబ్దాల్లో అత్యధిక ఉద్గారాలకు అవి రెండూ కారణమవుతాయని U.S. మరియు ఇతర పాశ్చాత్య దేశాలు ఉద్ఘాటిస్తున్నాయి.

పాకిస్తాన్[మార్చు]

పర్యావరణ శాఖ సహాయమంత్రి మాలిక్ మిన్ అస్లాం తొలుత పెద్దగా పట్టించుకోలేదు. అయితే తర్వాత ఒప్పందానికి అంగీకరించే విధంగా షౌకత్ అజీజ్ మంత్రివర్గాన్ని ఆయన ఒప్పించగలిగాడు. ఈ నిర్ణయాన్ని 2001లోనే తీసుకున్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల 2004లో అర్జెంటీనాలో ప్రకటించిన అనంతరం విధాన ముసాయిదా రూపకల్పనకు మార్గాన్ని సుగమం చేసే విధంగా 2005లో ఆమోదించారు. క్యోటో ఒప్పందానికి అంగీకరిస్తూ 11 జనవరి 2005న పాకిస్తాన్ తన నివేదికలను సమర్పించింది. అభిదాయక జాతీయ సంస్థ (DNA) మాదిరిగా పని చేసే బాధ్యత పర్యావరణ మంత్రిత్వ శాఖకు అప్పగించబడింది. ఫిబ్రవరి, 2006లో జాతీయ CDM నిర్వాహక విధానాన్ని ఆమోదించారు, 27ఏప్రిల్ 2006న తొలి CDM ప్రాజెక్టుకు DNA ఆమోదం లభించింది. నైట్రిక్ ఆమ్లం ఉత్పత్తి (పెట్టుబడి సంస్థ : మిత్సుబిషి, జపాన్), ద్వారా N2O ఏటా 1 మిలియన్ CERలు తగ్గవచ్చని అంచనా వేశారు. చివరగా, నవంబరు 2006లో, మొదటి CDM ప్రాజెక్టును పర్యావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సదస్సు (UNFCCC)లో నమోదు చేశారు.


పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ద్వారా శిలాజ ఇంధనాలపై తక్కువగా ఆధారపడేలా పాకిస్తాన్‌కు ఒప్పందం సాయపడగలదని భావించారు. పాకిస్తాన్ అతిపెద్ద కాలుష్యకారి కాకపోయినా, అది బాధిత దేశమైంది. భూతాపం వల్ల దేశంలో అత్యంత గరిష్ఠ స్థాయిలో చలి, వేడి మరియు కరువులు, వరదలు వంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.[61]

రష్యా[మార్చు]

వ్లాడిమిర్ పుతిన్ 4 నవంబరు 2004న ఒప్పందాన్ని ఆమోదించాడు. రష్యా తన ఆమోదాన్ని 18 నవంబరు 2004న ఐక్యరాజ్యసమితికి అధికారికంగా తెలిపింది. రష్యా ఆమోదం తర్వాత 90 రోజులకు (16 ఫిబ్రవరి 2005) ఒప్పందం అమల్లోకి రావడంతో సంబంధిత ఆమోద అంశం ప్రత్యేకించి అంతర్జాతీయ సమాజంలో క్షుణ్ణంగా పరిశీలించబడింది.

రష్యన్ అకడెమీ ఆఫ్ సైన్సెస్, పారిశ్రామిక మరియు ఇంధన మంత్రిత్వ శాఖ, అప్పటి అధ్యక్షుడి యొక్క ఆర్థిక సలహాదారు ఆండ్రూ ఇల్లారియోనోవ్ అభిప్రాయాలకు వ్యతిరేకంగా మరియు WTO[62][63]లో రష్యా ప్రవేశానికి EU మద్దతుకు ప్రతిగా రష్యా మంత్రివర్గం[64]తో కలిసి ఒప్పందానికి సానుకూలంగా స్పందించాలని సెప్టెంబరు, 2004లో అధ్యక్షుడు పుతిన్ తొలుత నిర్ణయించుకున్నాడు. ముందుగా తలచినట్లుగానే, దీని తర్వాత, పార్లమెంటులోని దిగువ (22 అక్టోబరు 2004) మరియు ఎగువ సభలు ఎలాంటి అభ్యంతరాలను వెలిబుచ్చలేదు.

ఉద్గారాల పరిమితులను వాటి 1990 స్థాయిలను ప్రామాణికంగా కొంత శాతానికి పెంచడం లేదా తగ్గించడం క్యోటో ఒప్పందం చేస్తుంది. 1990 తర్వాత గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల కారణంగా సోవియట్ యూనియన్‌లోని పలు దేశాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. ఈ కారణం వల్ల తన ప్రస్తుత ఉద్గార స్థాయిలు పరిమితుల కన్నా తక్కువగా ఉండటంతో క్యోటో ఒప్పందం కింద తన కట్టుబాట్లను చేరుకునేందుకు రష్యాకు ఎలాంటి ఇబ్బంది లేదు.

అవినియోగిత AAUsకు క్రెడిట్లను విక్రయించడం ద్వారా రష్యా నిజంగా లాభం పొందుతుందా అనే అంశంపై శాస్త్రీయ చర్చ జరుగుతోంది.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు[మార్చు]

అమెరికా సంయుక్త రాష్ట్రాలు (U.S.) క్యోటో ఒప్పందం యొక్క సంతకదారుయైనప్పటికీ, ఒప్పందానికి ఆమోదించడం గానీ లేదా ఉపసంహరించుకోవడం గానీ చేయలేదు. ఆమోదముద్ర పడనంత వరకు క్యోటో ఒప్పందం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చట్టబద్ధమైనది కానందున సంతకం అనేది లాంఛనం మాత్రమే. కనీసం 2005 నాటికి శిలాజ ఇంధనాల దహనం ద్వారా అత్యధిక కార్బన్ డయాక్సైడ్ సగటు ఉద్గారకంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు నిలిచింది.[65] క్యోటో ప్రమాణాలు మరియు లక్ష్యాలతో అత్యధిక U.S. సమలేఖనానికి "పరిమితి మరియు వ్యాపారం బిల్లు"ను ప్రతిపాదించిన నేపథ్యంలో అమెరికా పర్యావరణ భద్రతా చట్టం 2007 కూడా సర్వసాధారణంగా దానికి వర్తిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలోనే భారీగా పన్ను పెరగడానికి దారితీస్తుందని కొన్ని సంస్థలు అభిప్రాయపడుతున్నట్లుగా దాదాపు 500 పేజీలున్న ఆ బిల్లు తగిన ఆధికారాలతో కార్బన్ వ్యాపారం, నియంత్రణ మరియు అమలుకు ఒక ఫెడరల్ బ్యూరో ఏర్పాటుకు అవకాశం కల్పించి ఉండేది.[66]

25 జులై 1997న క్యోటో ఒప్పందంపై తుది నిర్ణయానికి ముందు (దానిపై సమగ్ర చర్చ మరియు ఉపాంత్య ముసాయిదా పూర్తయినప్పటికీ) బ్రిడ్-హాగెల్ తీర్మానం (S. Res. 98)[67][68] ను U.S. సెనేట్ 95-0 ఓట్ల తేడాతో ఏకగ్రీవంగా ఆమోదించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు పారిశ్రామిక దేశాలకు చట్టబద్ధమైన లక్ష్యాలు మరియు కాలదర్శినులను నిర్దేశించని లేదా "అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టాన్ని కలిగించే" ఒప్పందానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు సంతకదారు కాకూడదనేది సెనేట్ ఉద్దేశంగా తీర్మానం పేర్కొంది. 12 నవంబరు 1998న ఉపాధ్యక్షుడు అల్ గోరె ఒప్పందంపై లాంఛనప్రాయంగా సంతకం చేశాడు. అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యం లేనిదే సెనేట్‌లో ఒప్పందంపై చర్చ జరగదని గోరె మరియ సెనేటర్ జోసెఫ్ లీబర్‌మన్ ఇరువురూ తెలిపారు.[69] ఆమోదముద్ర కోసం ఈ ఒప్పందాన్ని క్లింటన్ ప్రభుత్వం అసలు సెనేట్‌కు నివేదించనేలేదు.

ఆర్థిక సలహాదారుల మండలి రూపొందించిన ఒక ఆర్థిక విశ్లేషణను క్లింటన్ ప్రభుత్వం జూలై, 1998లో విడుదల చేసింది. annex B/annex I దేశాల మధ్య ఉద్గారాల వ్యాపారం మరియు 2012 ద్వారా వ్యాపారం కోసం ఉద్గారాల రేట్లను అందించే "స్వచ్ఛమైన అభివృద్ధి యంత్రాంగం"లో కీలకమైన అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యం వల్ల క్యోటో ఒప్పందం అమలు వ్యయాలను పలు అంచనాల ద్వారా సాధ్యమైనంత వరకు 60% మేరకు తగ్గించవచ్చని సదరు విశ్లేషణ వివరించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో క్యోటో ఒప్పందం యొక్క కార్బన్ తగ్గింపు లక్ష్యాల సాధనకయ్యే వ్యయ అంచనాలను ఇంధన సమాచార విభాగం (EIA) పోల్చింది. దాని అంచనా ప్రకారం, GDP నష్టాలు 2010 నాటికి 1.0%-4.2% మధ్య మరియు 2020 నాటికి 0.5%-2.0% మధ్య ఉండొచ్చు. 1998 కల్లా చర్య తీసుకోబడుతుందని మరియు కార్యాచరణ ప్రారంభంలో జాప్యాల వల్ల అది పెరుగుతుందని ఈ అంచనాలు కొన్ని భావించాయి.[70]

చైనా (సగటు ఉద్గారం తక్కువే అయినప్పటికీ, ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్ డయాక్సైడ్ స్థూల ఉద్గారకం)కు మినహాయింపు ఇవ్వడాన్ని సాకుగా చూపి, అధ్యక్షుడు జార్జ్ W. బుష్ ఈ ఒప్పంద ప్రతిపాదనను ఆమోదం కోసం సెనేట్‌కు సమర్పించలేదు.[71] ఒప్పందం వల్ల వ్యయప్రయాసలు పెరుగుతాయని భావించినందు వల్ల దీనిని బుష్ వ్యతిరేకించాడు. అలాగే శాస్త్రీయపరమైన రుజువులో అనిశ్చితులు ఉంటాయని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశాడు. అంతేకాక, ఒప్పందంలోని విస్తృత మినహాయింపుల పట్ల కూడా U.S. ఆందోళన చెందుతోంది. ఉదాహరణకు, annex I దేశాలు మరియు ఇతరుల మధ్య చీలికను U.S. సమర్థించదు. ఒప్పందం గురించి బుష్ ఇలా అన్నాడు :

ఈ ఒప్పందానికి 100% శ్రమ అవసరం. మేము మరియు ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ప్రయత్నించాలి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారకం. క్యోటో ఒప్పందం యొక్క అవసరాల నుంచి చైనాను పూర్తిగా మినహాయించారు. అతిపెద్ద ఉద్గారకాల్లో భారతదేశం మరియు జర్మనీ ఉన్నాయి. క్యోటో నుంచి భారత్‌ కూడా మినహాయించబడుతోంది... ఏదో బాధ్యతారాహిత్యం చేత లోపభూయిష్ట ఒప్పందాన్ని అమెరికా అంగీకరించలేదని మా మిత్రులు మరియు భాగస్వాములు భావించరాదు. ఈ ప్రతికూలతకు, పర్యావరణ మార్పుపై నాయకత్వ పాత్రకు నా పాలనా యంత్రాగం కట్టుబడుతుంది... వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల స్థిరీకరణకు మా వైఖరి దీర్ఘకాల లక్ష్యం దిశగా స్థిరంగా ఉంటుంది."[72]

జూన్, 2002లో "పర్యావరణ కార్యాచరణ నివేదిక 2002"ను పర్యావరణ పరిరక్షణ సంస్థ విడుదల చేసింది. ఈ నివేదిక ఒప్పందాన్ని స్పష్టంగా బలపరచకపోయినప్పటికీ, కొందరు పరిశీలకులు అది ఒప్పందాన్ని సమర్థించే విధంగా ఉందని వ్యాఖ్యానించారు.[ఉల్లేఖన అవసరం] జూన్, 2005లో జరిగిన G8 సమావేశంలో పరిపాలనా అధికారులు "ఆచరణాత్మక కట్టుబాట్లున్న పారిశ్రామిక దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలకు దెబ్బలేకుండా కలుసుకోగలవు" అని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు కార్బన్ తీవ్రతను 2012 కల్లా 18% తగ్గించుకుంటామన్న తన హామీని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగుతోందని వారు తెలిపారు.[73] స్వచ్ఛమైన అభివృద్ధి మరియు పర్యావరణంపై రూపొందించిన ఆసియా పసిఫిక్ భాగస్వామ్యంను అమెరికా సంయుక్త రాష్ట్రాలు కుదుర్చుకుంది. వ్యక్తిగతంగా పలు దేశాలు తమ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను ఎలాంటి అమలు యంత్రాంగం అవసరం లేకుండా నిర్దేశించుకునేలా ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుంది. క్యోటో ఒప్పందం మరింత సరళమయ్యేలా దానికి పరిపూర్ణత తీసుకురావడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని మద్దతుదారులు భావించారు.

పరిపాలన పరిస్థితిని U.S.లో ఒకే మాదిరిగా అంగీకరించలేదు. ఉదాహరణకు, 18% కార్బన్ తీవ్రత తగ్గింపు లక్ష్యం అనేది వాస్తవంగా ఇప్పటికీ మొత్తం ఉద్గారాల పెరుగుదలేనని పాల్ క్రగ్‌మన్ గుర్తు చేశాడు.[74] పర్యావరణ మార్పుకు మానవ కార్యకలాపాలు మరియు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు సంబంధించిన నివేదికలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదంటూ శ్వేతసౌధం కూడా విమర్శలను ఎదుర్కొంది. శ్వేతసౌధ అధికారి, ఇంధన పరిశ్రమ మాజీ అడ్వొకేట్ మరియు ప్రస్తుత ఎక్సాన్ మోబిల్ అధికారి ఫిలిప్ కూనీ ప్రభుత్వ శాస్త్రవేత్తల చేత అప్పటికే ఆమోదించబడిన పర్యావరణ పరిశోధన వివరాలను బలహీనపరిచాడు. ఈ దిశగా వచ్చిన అభియోగాలను శ్వేతసౌధం తోసిపుచ్చింది.[75] చమురు మరియు గ్యాస్ పరిశ్రమలతో బుష్ యంత్రాగానికి దగ్గర సంబంధాలున్నాయని విమర్శకులు ఆరోపించారు. జూన్, 2005లో క్యోటోపై U.S. వైఖరి సహా పర్యావరణ మార్పు విధానమును తీర్మానించడంలో సాయపడేలా సంస్థ యొక్క "క్రియాశీలక చొరవ"కు ఎక్సాన్ ప్రతినిధులకు యంత్రాంగం ధన్యవాదాలు తెలుపడాన్ని ప్రభుత్వ విభాగ పత్రికలు ప్రచురించాయి. వ్యాపార లాబీ గ్రూపు గ్లోబల్ క్లయిమేట్ కొయిలేషన్ పెట్టుబడి కూడా ఒక అంశం.[76]

2002లో, ఒప్పందం యొక్క చట్టపరమైన హోదాను పరిశీలించిన కాంగ్రెస్ పరిశోధకులు UNFCCC సంతకదారు అవడం వల్ల ఒప్పందం యొక్క లక్ష్యం మరియు అవసరం తక్కువ కాకుండా అడ్డుకునే బాధ్యత విధించబడుతుందని సూచించారు. ఒకవేళ ఒప్పందాన్ని అధ్యక్షుడు ఒక్కడే అమలు చేయలేకపోతే కాంగ్రెస్ సొంతంగా చొరవ తీసుకుని అనుకూల చట్టాలను రూపొందించుకోగలదు.[77]

అధ్యక్షుడు బరాక్ ఒబామా సెనేట్‌లో ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల ఒప్పందంపై అమెరికా సంయుక్త రాష్ట్రాల వైఖరి మారవచ్చు. ఏప్రిల్, 2009లో ఒబామా టర్కీలో ఉన్నప్పుడు, "అమెరికా సంయుక్త రాష్ట్రాలు [క్యోటో ఒప్పందం]పై సంతకం చేసే విధంగా అది ప్రేరేపించదు. ఎందుకంటే [అది] దాదాపు ముగింపుకు చేరుకుంది" అని అన్నాడు.[78] ప్రస్తుతానికి, నాలుగేళ్ల కట్టుబాటు వ్యవధిలో రెండేళ్ల పదకొండు నెలలు మిగిలి ఉన్నాయి.

రాష్ట్రాలు మరియు స్థానిక ప్రభుత్వాలు[మార్చు]

పర్యావరణ మార్పుపై ముసాయిదా సదస్సు అనేది UNలో దేశాల మధ్య చర్చల సందర్భంగా కుదిరిన ఒక ఒడంబడిక. అందువల్ల వ్యక్తిగత రాష్ట్రాలకు ఇందులో స్వతంత్రంగా పాల్గొనే స్వేచ్ఛ ఉండదు. అయినప్పటికీ, రాష్ట్ర లేదా నగర స్థాయిలో వివిధ ప్రత్యేక ప్రతిపాదనలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది ఈశాన్య U.S. రాష్ట్రాలు కలిసి రీజనల్ గ్రీన్‌హౌస్ గ్యాస్ ఇన్షియేటివ్ (RGGI)[79]ను ఏర్పాటు చేశాయి. స్వతంత్రంగా రూపొందించిన యంత్రాంగాలను ఉపయోగించి రాష్ట్రాలు జరిపే రాష్ట్ర స్థాయి ఉద్గారాల పరిమితి మరియు వ్యాపార కార్యక్రమం ఇది. వాటి తొలి అనుమతులను నవంబరు, 2008లో వేలం ద్వారా విక్రయించారు.

27 సెప్టెంబరు 2006న కాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ ష్వర్జెనెగ్గర్ భూతాప పరిష్కారాల చట్టం అని కూడా పిలిచే AB 32 బిల్లు శాసనరూపు దాల్చే విధంగా సంతకం చేశాడు. ప్రపంచ అతిపెద్ద ఉద్గారకాల్లో 12వ స్థానంలో ఉన్న ఆ రాష్ట్రం యొక్క గ్రీన్‌‌హౌస్ వాయు ఉద్గారాలను 2020 కల్లా 25%కి తగ్గించే విధంగా ఈ చట్టం ఒక కాలదర్శినిని రూపొందిస్తుంది. క్యోటో పరిమితులను కాలిఫోర్నియా సమర్థవంతంగా అనుసరించే విధంగా ఈ చట్టం చేస్తుంది. అయితే అది క్యోటో కట్టుబాటు నియమిత కాలమైన 2008-2012 తర్వాతే. పరిమితి మరియు లక్ష్యాలు భిన్నంగా ఉన్నప్పటికీ, కాలిఫోర్నియా వ్యవస్థ యొక్క పలు విశిష్టాంశాలు క్యోటో యంత్రాంగాలతో సారూప్యత కలిగి ఉంటాయి. వెస్టర్న్ క్లయిమేట్ ఇన్షియేటివ్ భాగస్వాములు కాలిఫోర్నియా నమూనా యొక్క కొన్ని లేదా అన్నింటికి అనుగుణంగా ఉండొచ్చు.

ఒప్పందానికి నగరాలు అంగీకరించేలా సీటిల్ నగరాధ్యక్షుడు గ్రెగ్ నికెల్స్ జాతీయ స్థాయి ప్రచారం మొదలుపెట్టిన తర్వాత 14 జూన్ 2009 నాటికి 50 రాష్ట్రాల్లోని 80 మిలియన్ అమెరికన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 944 U.S. నగరాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా మరియు ప్యూర్టో రికో క్యోటోకు మద్దతు తెలిపాయి.[80] 1990 నుంచి తన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 8 శాతానికి తగ్గించుకోవడం ద్వారా సీటిల్ 2005లో తన లక్ష్యాన్ని చేరుకుందని 29 అక్టోబరు 2007న ప్రకటించబడింది.[81]

మద్దతు[మార్చు]

కార్బన్ డయాక్సైడ్ భూతాపాన్ని పెంచుతున్న కారణంగా సంబంధిత ఉద్గారాలను తగ్గించడం ఎంతో ప్రధానమని క్యోటో ఒప్పందం యొక్క మద్దతు దేశాలు పేర్కొన్నాయి. స్తుతి విశ్లేషణ ద్వారా ఇది సమర్థించబడింది.

క్యోటో మద్దతుదారుల్లో యురోపియన్ యూనియన్ మరియు పలు పర్యావరణవేత్తల సంస్థలు ప్రముఖమైనవి. ఐక్యరాజ్యసమితి మరియు కొన్ని వ్యక్తిగత దేశాల శాస్త్రీయ సలహా విభాగాలు (G8 నేషనల్ సైన్స్ అకడెమీస్ సహా) క్యోటో ఒప్పందానికి మద్దతుగా పలు నివేదికలు వెల్లడించాయి.

మాంట్రియల్‌లో సభ్యదేశాల సమావేశం రోజునే అంటే 3 డిసెంబరు 2005న అంతర్జాతీయ కార్యాచరణ దినమును నిర్వహించాలని యోచించారు. వ్యూహరచన చేసుకున్న ప్రదర్శనలను వరల్డ్ సోషియల్ ఫోరంకు చెందిన ఉద్యమాల సమాఖ్య చేపట్టింది.

పర్యావరణ మార్పుకు సంబంధించి సత్వర చర్య తీసుకోవాలని పిలుపునిచ్చిన పలు అతిపెద్ద కెనడా నగరపాలక సంస్థలు క్యోటో అనేది ఆ దిశగా తొలి అడుగు అవుతుందని తెలిపాయి.[82]

Kyoto Now! పేరుతో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కనీసం ఒక్క విద్యార్థి సంఘమైనా ఉంది. క్యోటో ఒప్పందం యొక్క లక్ష్యం నెరవేరేలా ఉద్గారాల తగ్గింపు దిశగా తగు ఒత్తిడికి ఇది విద్యార్థుల మద్దతును కూడగట్టుతుంది.

విమర్శలు[మార్చు]

గ్రీన్‌హౌస్ ఉద్గారాల తగ్గింపుకు ఈ ఒప్పందం పెద్దగా దోహదపడదని కొన్ని[83] రాష్ట్రాలు (నియూ, కుక్ ఐలాండ్స్ మరియు నౌరు ఒప్పందంపై సంతకాలు చేసేటప్పుడు ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి) వాదించాయి.[84]

కొందరు పర్యావరణ ఆర్థికవేత్తలు క్యోటో ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించారు.[85][86][87] క్యోటో ఒప్పందం అమలు వల్ల వ్యయం అధికమే గానీ ప్రయోజనాలు స్వల్పమని కొందరు అభిప్రాయపడుతుంటే మరికొందరు క్యోటో ప్రమాణాలు ఆశావహంగా ఉంటాయంటున్నారు. ఇంకొందరైతే అధికంగా అసంబద్ధమైనదని మరియు అసమర్థమైన ఒప్పందమని, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను కొద్దిగా మాత్రమే తగ్గించగలదని పేర్కొన్నారు.[88] చివరగా, జిన్ ప్రిన్స్ మరియు స్టీవ్ రేనర్ వంటి కొందరు ఆర్థికవేత్తలు క్యోటో ఒప్పందం సూచించిన విధానానికి పూర్తి భిన్నమైన విధానమును అనుసరించాల్సిన అవసరముందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.[89]

అంతేకాక, ఉద్గారాలను సరాసరి లెక్కన గణించకుండా 1990ను ప్రామాణిక సంవత్సరం[ఉల్లేఖన అవసరం]గా తీసుకోవడంపై కూడా వివాదం అలుముకుంది. ఇంధన సమర్థత పరంగా 1990లో దేశాలు పలు విభిన్నమైన విజయాలు సాధించాయి. ఉదాహరణకు, పూర్వపు సోవియట్ యూనియన్ మరియు తూర్పు యురోపియన్ దేశాలు ఈ సమస్య పరిష్కారానికి కొద్దిగానే పాటుపడ్డాయి. అలాగే వాటి ఇంధన సామర్థ్యం 1990లో అంటే వాటి సామ్యవాద రాజ్యాలు దెబ్బతినడానికి ముందు చాలా దారుణమైన స్థాయిని నమోదు చేసుకుంది. మరో విధంగా, సహజ వనరుల అతిపెద్ద దిగుమతిదారుయైన జపాన్ 1973 చమురు సంక్షోభం తలెత్తినప్పుడు తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సి వచ్చింది. అలాగే 1990లో తన ఉద్గార స్థాయి ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గానే ఉంది. ఏదేమైనప్పటికీ, అలాంటి ప్రయత్నాలను పక్కనపెట్టారు. పూర్వపు సోవియట్ యూనియన్ యొక్క జడత్వాన్ని గుర్తించలేకపోవడమే కాక ఉద్గారాల వ్యాపారం ద్వారా భారీ రాబడిని సాధించి ఉండొచ్చు. క్యోటో తరహా ఒప్పందాల్లో సగటు ఉద్గారాలను ప్రామాణికంగా ఉపయోగించడం ద్వారా అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాల మధ్య అసమానత్వ భావాన్ని తగ్గించవచ్చనే ఓ వాదన ఉంది. ఎందుకంటే అది దేశాల యొక్క జడత్వాలు మరియు బాధ్యతలను బహిర్గతం చేస్తుంది కాబట్టి.

లాభసాటి విశ్లేషణ[మార్చు]

లాభసాటి విశ్లేషణ ద్వారా క్యోటో ఒప్పందం యొక్క నికర ప్రయోజనాన్ని వివరించడానికి ఆర్థికవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక రాశుల మధ్య విస్తృత అనిశ్చితుల కారణంగా భేదాభిప్రాయం నెలకొంది.[90] క్యోటో ఒప్పందాన్ని పాటించకపోవడం కంటే పాటించడం వల్లే ఖర్చెక్కువ అవుతుందని మరియు భూతాపం తగ్గింపుకయ్యే వ్యయం కంటే క్యోటో ఒప్పందం యొక్క పరిమిత నికర ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.[ఉల్లేఖన అవసరం] అయితే, డీ లియో మరియు ఇతరుల బృందం జరిపిన అధ్యయనంలో, "ఇంధన విధానాలను గుర్తించడం మరియు క్యోటో ఒప్పందం పట్ల సమ్మతి కోసం ఉత్పత్తి వ్యయాలతో స్థానిక బాహ్య వ్యయాలను మాత్రమే గణించడం ద్వారా మొత్తం వ్యయాలు ఎక్కువ కావు తక్కువని అర్థం ."[91]

భూతాప ప్రక్రియను క్యోటో ఒప్పందం తగ్గించగలదని గుర్తించిన ఇటీవలి కోహెన్‌హాగెన్ ఏకాభిప్రాయ ప్రాజెక్టు మొత్తం ప్రయోజనం మాత్రం నిస్సారంగానే ఉంటుందని పేర్కొంది. ప్రాథమిక గ్రీన్‌హౌస్ వాయువుల తగ్గింపు వల్ల ప్రయోజనం స్వల్పంగానే ఉండొచ్చని పేర్కొన్న క్యోటో ఒప్పందం యొక్క మద్దతుదారులు అవి భవిష్యత్‌లో భారీ (మరియు అత్యంత సమర్థవంతమైన) తగ్గింపులకు రాజకీయ పూర్వ ప్రమాణాన్ని నిర్దేశించగలవని అభిప్రాయపడ్డారు.[92] పూర్వోపాయ సూత్రమునకు కట్టుబడి ఉండటాన్ని కూడా వారు సమర్థించారు. కార్బన్ ఉద్గారంపై అదనపు భారీ ఆంక్షలు విధించడం ప్రముఖంగా వ్యయం పెరుగుదలకు దారితీయొచ్చని విమర్శకులు హెచ్చరించారు. అంతేకాక, పూర్వోపాయ సూత్రం అనేది ఎలాంటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక లేదా పర్యావరణ పర్యవసానాలకైనా వర్తిస్తుంది. అంటే పేదరికం మరియు పర్యావరణం పరంగా సమానమైన వినాశక ప్రభావం కలిగి ఉండవచ్చు. దీని వల్ల పూర్వోపాయ వాదన అప్రస్తుతంగా మారుతుంది. ప్రపంచవ్యాప్త GDPలో పర్యావరణ మార్పు ప్రభావాలను తగ్గించడానికి ఒక్క శాతం పెట్టుబడి చేయాలి. ఒకవేళ అలా చేయకుంటే ప్రపంచవ్యాప్త GDP సుమారు ఇరవై శాతం మేర తగ్గే ప్రమాదముంటుందని స్టెర్న్ సమీక్ష (పర్యావరణ మార్పుతో సంభవించే ఆర్థిక ప్రభావాలపై UK ప్రభుత్వం సమర్పించిన నివేదిక) పేర్కొంది.[93]

రాయితీ రేట్లు[మార్చు]

కచ్చితమైన రాయితీ ధర ఎంపిక అనేది భూతాపానికి సంబంధించిన వివిధ విధానాల యొక్క "సంపూర్ణ" వ్యయాలు మరియు లాభాలను గణించాలనుకున్నప్పుడు సంభవించే ఒక సమస్య. సుదీర్ఘకాలంలో క్యోటో ఒప్పందం కింద ఏ ప్రయోజనాలు సమకూరుతాయి, రాయితీ ధరల్లో చిన్నపాటి తేడాలు పలు అధ్యయనాల్లో నికర ప్రయోజనాల మధ్య భారీ వ్యత్యాసాలను సృష్టిస్తాయి. అయితే, ఈ సంక్లిష్టత సుదీర్ఘకాలంలో ప్రత్యామ్నాయ విధానాల "సాపేక్ష" పొంతనకు సాధారణంగా సంబంధముండదు. సుదీర్ఘకాలంలో వ్యయం మరియు లాభముల మధ్య విశిష్ట వ్యత్యాసాలు లేని పక్షంలో వివిధ విధానాల నికర వ్యయం/లాభమును సమానంగా చేయడానికి ఉద్దేశించిన రాయితీ ధరల్లో మార్పుల వల్ల ఇది కలుగుతుంది.

షాడో ప్రైస్ ఆఫ్ కేపిటల్ అప్రోచ్ వంటి సంప్రదాయ రాయితీ పద్ధతులను ఉపయోగించడం ద్వారా క్యోటో నికర లాభాలు సానుకూలమైనవిగా ఉంటాయనేది దృష్టాంతమునకు రావడం కష్టతరమవుతుంది.[94]

1990 నుంచి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారం పెరుగుదల[మార్చు]

1990-2004 మధ్యకాలంలో ఐక్యరాజ్యసమితి నివేదించిన విధంగా పర్యావరణ మార్పు సదస్సులో భాగమైన కొన్ని దేశాలకు సంబంధించిన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల మార్పుల జాబితా దిగువ ఇవ్వబడింది.[95]

దేశం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల
మార్పు (1990-2004)
LULUCF మినహా
గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల
మార్పు (1990-2004)
LULUCFసహా
ఒప్పంద లక్ష్యం 2008-2012
డెన్మార్క్ -19% -22.2% -20% -11%
జర్మనీ -17% -18.2% -21% -8%
కెనడా +27% +26.6% n/a -6%
ఆస్ట్రేలియా +25% +5.2% n/a +8%
స్పెయిన్ +49% +50.4% +15% -8%
నార్వే +10% -18.7% n/a +1%
న్యూజిలాండ్ +21% +17.9% n/a 0%
ఫ్రాన్స్ -0.8% -6.1% 0% -8%
గ్రీస్ +27% +25.3% +25% -8%
ఐర్లాండ్ +23% +22.7% +13% -8%
జపాన్ +6.5% +5.2% n/a -6%
యునైటెడ్ కింగ్‌డమ్ -14% -58.8% -12.5% -8%
పోర్చుగల్ +41% +28.9% +27% -8%
EU-15 -0.8% -2.6% n/a -8%

మరికొన్ని దేశాల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో మార్పుకు సంబంధించిన పట్టిక దిగువ ఇవ్వబడింది.[96]

దేశం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల
మార్పు (1992-2007)
భారతదేశం +103%
చైనా +150%
అమెరికా సంయుక్త రాష్ట్రాలు +20%
రష్యన్ ఫెడరేషన్ -20%
జపాన్ +11%
ప్రపంచవ్యాప్త మొత్తం +38%

2004లోని మొత్తం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 1990 స్థాయిలతో పోల్చగా, U.S. ఉద్గారాలు ఒక ఏడాది నుంచి మరో ఏడాదికి క్రమరహిత హెచ్చుతగ్గులతో సాధారణంగా అభివృద్ధి ఒరవడిలోనే 15.8%[97] మేర పెరిగాయి.[98] అదే సమయంలో, 23 (EU-23) దేశాలతో కూడిన EU సమూహం తన ఉద్గారాలను 5%[99] మేర తగ్గించుకుంది. అదనంగా, EU-15 దేశాల సమూహం (EU-23 యొక్క అతిపెద్ద ఉపసముదాయం) 1990-2004 మధ్య తన ఉద్గారాలను 0.8% మేర తగ్గించుకుంది. అయితే 1999-2004 మధ్యకాలంలో 2.5% ఉద్గార పెరుగుదల నమోదైంది. కొన్ని యురోపియన్ యూనియన్ దేశాల పెరుగుదలలో కొంతభాగం ఇప్పటికీ ఒప్పందానికి అనుగుణంగానే, దేశాల సమూహ అమలులో భాగంగానే ఉంది (పైన జాబితాలోని లక్ష్యాలను చూడిండి).

2006 ఏడాది ముగింపుకు, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు స్వీడెన్ మాత్రమే 2010 నాటికి తమ క్యోటో ఉద్గార లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతున్న EU దేశాలు. 36 క్యోటో సంతకదారులు ఒక సమూహంగా 2012 నాటికి 5% తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోగలవని UN గణాంకాలు పేర్కొన్నాయి. 1990లలో సామ్యవాదం పతనమైన నేపథ్యంలో తూర్పు యురోపియన్ దేశాల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో చెప్పుకోదగ్గ తగ్గుదల నమోదైంది.[100]

వారసు[మార్చు]

కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రెజిల్, చైనా, భారత్, మెక్సికో మరియు దక్షిణాఫ్రికా ప్రభుత్వాల అధినేతలు 16 ఫిబ్రవరి 2007న క్యోటో ఒప్పందం యొక్క వారసు సందర్భంగా చట్టబద్ధం కాని 'వాషింగ్టన్ వాంగ్మూలం'ను సూత్రప్రాయంగా అంగీకరించారు. పారిశ్రామిక మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు రెండింటికి వర్తించే విధంగా ఒక అంతర్జాతీయ పరిమితి మరియు వ్యాపార వ్యవస్థను అవి ప్రతిపాదించాయి. 2009 కల్లా అది కార్యరూపం దాల్పుతుందని భావించాయి.[101][102]

ప్రపంచవ్యాప్త CO2 ఉద్గారాలను 2050 కల్లా కనీసం సగానికి తగ్గించే విధంగా G8 దేశాలు లక్ష్యంగా పెట్టుకునేందుకు 7 జూన్ 2007న జరిగిన 33వ G8 సదస్సులో నాయకులు అంగీకరించారు. ఇది సాధ్యమయ్యేలా చేసే అంశాలను పర్యావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సదస్సు పరిధిలోని పర్యావరణ మంత్రులు చర్చిస్తారు. ఈ ప్రక్రియలో శరవేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థలు కూడా పాలుపంచుకుంటాయి.[103]

పర్యావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సదస్సు (UNFCCC) ఆధ్వర్యంలో పర్యావరణ మార్పుపై జరిగిన తొలి రౌండ్ చర్చలు (వియన్నా పర్యావరణ మార్పు చర్చలు 2007) పర్యావరణ మార్పుపై సమర్థవంతమైన అంతర్జాతీయ స్పందన దిశగా కీలక అంశాలపై అవగాహన ద్వారా 31 ఆగస్టు 2007న ముగిశాయి.[104]

తక్కువ ఖర్చుతో ఉద్గారాల విశిష్ట తగ్గింపును ఇంధన సామర్థ్యం ఏ విధంగా దోహదపడుతుందో తెలియజేసే ఐక్యరాజ్యసమితి నివేదిక ఈ చర్చల్లో ఒక కీలకమైన అంశం.

3 డిసెంబరు 2007న నుసా దువా, బాలీలో నిర్వహించ తలపెట్టిన భారీ అంతర్జాతీయ సమావేశమునకు ఒక వేదికను ఏర్పాటు చేయడమే ఈ చర్చల ఉద్దేశం.[105]

2008 సదస్సు డిసెంబరు, 2008లో పోజ్నాన్‌, పోలాండ్‌లో జరిగింది. భవిష్యత్ క్యోటో ఒప్పందంలో అడవుల నిర్మూలన మరియు అటవీ అధోకరణం (REDD) ద్వారా తగ్గుతున్న ఉద్గారాలు అని కూడా పిలిచే విస్మరించిన అడవుల నిర్మూలన యొక్క సాధ్యపర అమలుపై జరిగిన చర్చ ఈ సమావేశపు ప్రధాన అంశాల్లో ఒకటి.[106]

డిసెంబరు, 2009లో జరగే కోపెన్‌హాగెన్‌ కీలక సదస్సుకు ముందుగా UN చర్చలు ప్రస్తుతం ఊపందుకుంటున్నాయి.[107]

స్వచ్ఛమైన అభివృద్ధి మరియు పర్యావరణంపై ఆసియా పసిఫిక్ భాగస్వామ్యం[మార్చు]

స్వచ్ఛమైన అభివృద్ధి మరియు పర్యావరణంపై ఆసియా పసిఫిక్ భాగస్వామ్యం అనేది ఏడు ఆసియా-పసిఫిక్ దేశాలైన ఆస్ట్రేలియా, కెనడా, చైనా, భారత్, జపాన్, దక్షిణకొరియా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం. వాటి మధ్య, సగానికి పైగా ప్రపంచవ్యాప్త కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు ఈ ఏడు దేశాలు కారణమవుతున్నాయి.

జనవరి, 2006లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఈ భాగస్వామ్యం అధికారికంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఇంధన సామర్థ్య పెంపు మరియు విఫణి ఏర్పాటు లక్ష్యంతో సభ్య దేశాలు సుమారు 100 ప్రాజెక్టులను ప్రతిపాదించాయి.[ఉల్లేఖన అవసరం] స్వచ్ఛమైన ఇంధన మరియు పర్యావరణ సాంకేతికతలు, సేవలను ఉపయోగించుకునే విధంగా ఈ కార్యకలాపాల పురోభివృద్ధికి దీర్ఘకాల ప్రాజెక్టులను సిద్ధం చేశారు. ఈ ఒప్పందం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను వ్యక్తిగతంగా తగ్గించుకునే విధంగా భాగస్వామ్య దేశాలకు అనియత లక్ష్యాలను నిర్దేశించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఇది "క్యోటో ఒప్పంద పరిపూరకం"గా మరియు మరింత సరళమైనదిగా ఒప్పందం మద్దతుదారులు పేర్కొన్నారు. తగిన అమలు చర్యలు లేకపోతే ఈ ఒప్పందం అసమర్థంగా ఉంటుందని విమర్శకులు పేర్కొన్నారు. తద్వారా చర్చల ప్రాధాన్యత తగ్గడం ఫలితంగా ప్రస్తుత క్యోటో ఒప్పందమును మరో ఒప్పందంతో మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది (డిసెంబరు, 2005లో మాంట్రియల్‌లో చర్చలు మొదలయ్యాయి). ఈ భాగస్వామ్యం కొద్దిపాటి ప్రజా సంబంధాల ఆలోచన[108] కంటే పెద్దగా ఉపయోగపడదని U.S. సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ పేర్కొన్నాడు. మరోవైపు క్యోటో ఒప్పందాన్ని ఆమోదించే విషయంలో అమెరికా మరియు ఆస్ట్రేలియా తిరస్కృతికి ఈ భాగస్వామ్యం "పేటెంట్ ఆవరణ"గా ఉంటుందని ఆర్థికవేత్తయైన ఆయన అభివర్ణించాడు.[109]

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 "Article 2". The United Nations Framework Convention on Climate Change. Retrieved 15 November 2005. Unknown parameter |dateformat= ignored (help)
 2. 2.0 2.1 "Kyoto Protocol: Status of Ratification" (PDF). United Nations Framework Convention on Climate Change. 2009-01-14. Retrieved 2009-05-06. Cite web requires |website= (help)
 3. గ్లోబల్ వార్మింగ్ గ్లోసరీ, ఇంటర్నేషనల్ రివర్స్, నవంబరు, 2008న ముద్రించారు, 9 జులై 2009న అందుబాటులోకి వచ్చింది.
 4. "Executive Summary. Chapter 9: Projections of Future Climate Change". Climate Change 2001: The Scientific Basis. మూలం నుండి 13 మార్చి 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 15 November 2005. Unknown parameter |dateformat= ignored (help)
 5. క్యోటో ఒప్పందమును యురోపియన్ యూనియన్ ఆమోదించింది
 6. Wigley, Tom (Spring 2006). "The effect of the Kyoto Protocol on global warming". మూలం నుండి 2006-09-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-10-30. Cite web requires |website= (help)
 7. Wigley, Tom (1998). "The Kyoto Protocol: CO2, CH4, and climate implications". Geophys. Res. Lett. 25 (13): 2285. doi:10.1029/98GL01855. Retrieved 4 March 2006.
 8. "Article 4". The United Nations Framework Convention on Climate Change. Retrieved 15 November 2005. Unknown parameter |dateformat= ignored (help)
 9. 9.0 9.1 "Industrialized countries to cut greenhouse gas emissions by 5.2%" (Press release). United Nations Environment Programme. 1997-12-11. Retrieved 2007-08-06.
 10. CDM కార్యవర్గ బోర్డు గుర్తింపు పొందిన ధ్రువీకరించబడ్డ ఉద్గార తగ్గింపులు (CER) మాత్రమే ఈ పద్ధతిలో కొనుగోలు మరియు విక్రయం చేయవచ్చు. UN ఆధ్వర్యంలో CERs మంజూరు చేయడానికి ముందుగా Annex Iయేతర దేశాల్లో ప్రాజెక్టుల ("CDM ప్రాజెక్టులు") అంచనా మరియు ఆమోదానికి బాన్-ఆధారిత స్వచ్ఛమైన అభివృద్ధి యంత్రాంగ కార్యవర్గ బోర్డును క్యోటో ఏర్పాటు చేసింది. "ఉమ్మడి అమలు" లేదా "JI" అని పిలిచే అదే విధమైన పథకం తాత్కాలిక ఆర్థిక వ్యవస్థలకు ప్రధానంగా పూర్వపు సోవియట్ యూనియన్ మరియు తూర్పు ఐరోపాలకు వర్తిస్తుంది.
 11. "The full text of the convention". The United Nations Framework Convention on Climate Change. Retrieved 5 November 2006. Unknown parameter |dateformat= ignored (help)
 12. "China overtakes U.S. in greenhouse gas emissions". New York Times 2007-06-20. Retrieved 18 June 2009. Unknown parameter |dateformat= ignored (help)
 13. కాంప్లియన్స్ విత్ ది క్యోటో ప్రొటోకాల్ ఆన్ క్లయిమేట్ ఛేంజ్ , S. మాల్‌జీన్-దుబోయిస్, సింథసీ, n° 01, 2007, ఇన్‌స్టిట్యూట్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. [1]
 14. పాయింట్ కార్బన్ Archived 2007-02-28 at the Wayback Machine. మార్కెట్ న్యూస్
 15. "The Kyoto protocol - A brief summary". European Commission. Retrieved 2007-04-19.
 16. "Kyoto Protocol". Unfccc.int. 2008-05-14. Retrieved 2009-05-21. Cite web requires |website= (help)
 17. "An Introduction to the Kyoto Protocol Compliance Mechanism". UNFCC. Retrieved 2006-10-30. Cite web requires |website= (help)
 18. "Govt still not serious about climate change: Labor". ABC News Online. 2006-10-26. మూలం నుండి 2007-10-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-10-30.
 19. రుద్ టేక్స్ ఆస్ట్రేలియా ఇన్‌సైడ్ క్యోటో, BBC వార్తలు, 3 డిసెంబరు 2007న, 5 డిసెంబరు 2007న తిరిగి పొందబడింది.
 20. "Australia's Rudd sworn in as PM". BBC News. BBC. 2007-12-03. Retrieved 2007-12-03.
 21. "Howard rejects emissions targets". BBC News Website. 2006-08-16. Retrieved 2006-10-30.
 22. http://unfccc.int/files/inc/graphics/image/gif/graph3_2007_ori.gif
 23. "Greenhouse Gas Abatement Scheme". NSW Greenhouse Gas Abatement Scheme. Retrieved 2006-10-31. Cite web requires |website= (help)
 24. "National Emissions Trading Taskforce". మూలం నుండి 2006-09-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-10-31. Cite web requires |website= (help)
 25. "COMMONWEALTH OF AUSTRALIA CONSTITUTION ACT". The Attorney-General's Department. మూలం నుండి 2006-10-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-10-31. Cite web requires |website= (help)
 26. "ఆస్ట్రేలియా అండ్ ది క్యోటో ప్రొటోకాల్", గ్రీన్‌పీస్ ఆసియా పసిఫిక్, 18 మే 2007న అందుబాటులోకి వచ్చింది.
 27. "Carbon Pollution Reduction Scheme - New measures". Climatechange.gov.au. 2009-05-06. Retrieved 2009-05-21. Cite web requires |website= (help)
 28. "Support (74%) Remains High for Kyoto Protocol" (Press release). IPSOS News Center. మూలం నుండి 2005-11-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2005-11-15.
 29. Graves, Frank. "Public Attitudes Towards the Kyoto Protocol" (PDF). Ekos Research Associates. మూలం (PDF) నుండి 30 అక్టోబర్ 2005 న ఆర్కైవు చేసారు. Retrieved 15 November 2005. Unknown parameter |dateformat= ignored (help); Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); Cite web requires |website= (help)
 30. "Business leaders call for climate change action". CBC. 17 November 2005. మూలం నుండి 12 మార్చి 2007 న ఆర్కైవు చేసారు. Retrieved 4 జనవరి 2010. Cite news requires |newspaper= (help)
 31. "Canada-Kyoto timeline". CBC News. 2006-10-11. మూలం నుండి 2005-02-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-11-01. Cite news requires |newspaper= (help)
 32. 2006 Report of the Commissioner of the Environment and Sustainable Development. Office of the Auditor General of Canada. 2006-09-28.
 33. National Inventory Report, 1990-2006 - Greenhouse Gas Sources and Sinks in Canada, Report Summary (PDF). Environment Canada. 2008-05-16. మూలం నుండి 2008-10-01 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2010-01-04.
 34. "Ambrose drops hints that Canada's position on Kyoto may be changing". Canadian Press. 2006-11-19. Retrieved 2006-11-01.
 35. "CBC News: "Canada supports six-nation climate change pact: Ambrose"". మూలం నుండి 2007-02-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-05-28. Cite news requires |newspaper= (help)
 36. "Canada Alters Course on Kyoto". Washington Post. 2006-05-03. Retrieved 2006-11-01.
 37. "Rona Ambrose goes from Ottawa to Nairobi, but can't shake her critics". Maclean's. 2006-11-16.[permanent dead link]
 38. "Canadian Parliament Bill C-288 "An Act to ensure Canada meets its global climate change obligations under the Kyoto Protocol"". House of Commons of Canada. Retrieved 2006-11-01. Cite web requires |website= (help)
 39. "Opposition MPs pass Kyoto bill despite Tory resistance". Canadian Broadcast Corporation. మూలం నుండి 2007-02-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-02-15. Cite news requires |newspaper= (help)
 40. "LEGISINFO - The Library of Parliament's research tool for finding information on legislation". Parl.gc.ca. మూలం నుండి 2008-03-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-05-21. Cite web requires |website= (help)
 41. "CNW: According to some analysis, implementing Bill C-288 would push Canada into a recession". Newswire.ca. Retrieved 2009-05-21. Cite web requires |website= (help)
 42. "Online magazine: Tandem". Corrieretandem.com. 2008-08-10. Retrieved 2009-05-21. Cite web requires |website= (help)
 43. "Friends Of The Earth sue Canada for breaching Kyoto Protocol". Seed Magazine. మూలం నుండి 2007-06-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-06-01. Cite web requires |website= (help)
 44. "Québec, leader en changements climatiques". Mddep.gouv.qc.ca. Retrieved 2009-05-21. Cite web requires |website= (help)
 45. "China Passes U.S., Leads World in Power Sector Carbon Emissions - CGD". Cite web requires |website= (help)
 46. http://research.cibcwm.com/economic_public/download/smar08.pdf
 47. BBC (4 June 2007). "China unveils climate change plan". BBC. Retrieved 2007-06-04. Cite news requires |newspaper= (help)
 48. Richard McGregor (4 June 2007). "China urges rich nations to lead on climate". Financial Times. Retrieved 2007-06-04. Cite news requires |newspaper= (help)
 49. Keith Bradsher (7 November 2006). "China to Pass U.S. in 2009 In Emissions". New York Times. Retrieved 2007-05-20. Cite news requires |newspaper= (help)
 50. టాయో వాంగ్ & జిమ్ వాట్సన్: హూ ఓన్స్ చైనాస్ కార్బన్ ఎమిషన్స్? Archived 2009-12-04 at the Wayback Machine.టిండాల్ సెంటర్ సంక్షిప్త నోట్ నెం. 23 అక్టోబరు 2007 Archived 2009-12-04 at the Wayback Machine.
 51. "GHG DATA 2006 – Highlights from Greenhouse Gas (GHG) Emissions Data for 1990-2004 for annex I parties". Sueddeutsche Zeitung. 2008-11-27. Retrieved 2008-11-27. Cite web requires |website= (help)
 52. "New German Rule Could Increase Greenhouse Gas Emissions". New York Times. 2006-06-29. Retrieved 2006-11-01.
 53. Presse- und Informationsamt der Bundesregierung (2005-02-16). "REGIERUNGonline - Germany's contribution to international energy and climate policy". Bundesregierung.de. మూలం నుండి 2009-07-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-05-21. Cite web requires |website= (help)
 54. ఎనర్జీ వైట్ పేపర్ 2003 Archived 2008-12-21 at the Wayback Machine., వాణిజ్య మరియు పారిశ్రామిక శాఖ, ఫిబ్రవరి 2002లో ముద్రించబడింది, 19 మే 2007న అందుబాటులోకి వచ్చింది.
 55. న్యూ బిల్ అండ్ స్ట్రాటెజీ లే ఫౌండేషన్స్ ఫర్ టేకలింగ్ క్లయిమేటే ఛేంజ్ Archived 2007-09-27 at the Wayback Machine., పర్యావరణ, ఆహార మరియు గ్రామీణ వ్యవహారాల శాఖ, 13 మార్చి 2007న ముద్రించబడింది. 13 మార్చి 2007న తిరిగి పొందబడింది.
 56. క్లయిమేట్ ఛేంజ్ యాక్ట్ 2008 Archived 2010-09-19 at the Wayback Machine., ఇంధన మరియు పర్యావరణ మార్పు శాఖ వెబ్‌పేజీ, 2009-10-11న తిరిగి పొందబడింది.
 57. 57.0 57.1 57.2 "2005 UK climate change sustainable development indicator and greenhouse gas emissions final figures". DEFRA. మూలం నుండి 2007-05-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-06-22. Cite web requires |website= (help)
 58. "Europe | France closes its last coal mine". BBC News. 2004-04-23. Retrieved 2009-05-21. Cite news requires |newspaper= (help)
 59. "Institute for Energy and Environmental Research (2006-5-4). Press Release. Retrieved on November 3, 2008". Ieer.org. Retrieved 2009-05-21. Cite web requires |website= (help)
 60. "Statistics Norway, ''Strong increase in greenhouse gas emissions''". Ssb.no. Retrieved 2009-05-21. Cite web requires |website= (help)
 61. ఇండస్ట్రీస్ ఆస్క్‌డ్ టు అడాప్ట్ CDM, ది న్యూస్ ఇంటర్నేషనల్ , మే 5, 2009
 62. "Russia forced to ratify Kyoto Protocol to become WTO member". Pravda. 2004-10-26. మూలం నుండి 2007-01-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-11-03.
 63. "INTERNATIONAL BUSINESS; Europe Backs Russian Entry Into W.T.O." New York Times. 2004-05-22. Retrieved 2009-05-17.
 64. "Russian Government Approves Kyoto Protocol Ratification". mosnews.com. 2004-09-30. మూలం నుండి 2006-03-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-11-02.
 65. "United States Country Analysis Brief". US Energy Information Administration. 2005. మూలం నుండి 12 అక్టోబర్ 2006 న ఆర్కైవు చేసారు. Retrieved 5 December 2006. Unknown parameter |dateformat= ignored (help); Cite web requires |website= (help)
 66. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2009-08-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-04. Cite web requires |website= (help)
 67. "Text of the Byrd-Hagel Resolution". 1997-07-25. మూలం నుండి 2010-06-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-11-05. Cite web requires |website= (help)
 68. "U.S. Senate Roll Call Votes 105th Congress - 1st Session:S.Res. 98". 1997-07-25. Retrieved 2007-01-31. Cite web requires |website= (help)
 69. "Clinton Hails Global Warming Pact". All Politics. CNN. 1997-12-11. Retrieved 2006-11-05.
 70. "Comparing Cost Estimates for the Kyoto Protocol". Cite web requires |website= (help)
 71. రోజర్ హర్రాబిన్, చైనా 'నౌ టాప్ కార్బన్ పొల్యూటర్' BBC న్యూస్, 2008-04-14, 2009-10-01న తిరిగి పొందబడింది. WebCite లో అభిలేఖలు
 72. "President Bush Discusses Global Climate Change" (Press release). The Whitehouse. 2001-06-11. Retrieved 2006-11-05.
 73. Eilperin, Juliet (2005-07-02). "Climate Plan Splits U.S. and Europe". Washington Post. Retrieved 2006-11-05.
 74. Krugman, Paul. "Ersatz Climate Policy (requires login)". New York Times. Retrieved 2005-11-15.
 75. "Bush aide 'edited climate papers'". BBC. 2005-06-09. Retrieved 2006-11-07. Cite news requires |newspaper= (help)
 76. Vidal, John (2005-06-08). "Revealed - how oil giant influenced Bush". Guardian. Retrieved 2006-11-07.
 77. Ackerman, David M. (2002-10-01). "Global Climate Change - Selected Legal Questions About the Kyoto Protocol" (PDF). Congressional Research Service. Retrieved 2006-11-07. Cite web requires |website= (help)
 78. Jennifer Hattam (8 April 2009). "Obama Challenged on Climate During Turkey Trip". Retrieved 20 April 2009. Unknown parameter |dateformat= ignored (help); Cite web requires |website= (help)
 79. "Regional Greenhouse Gas Initiative". Retrieved 2006-11-07. Cite web requires |website= (help)
 80. 80.0 80.1 "List of Participating Mayors". Mayor's Climate Protection Center. Retrieved 2008-07-27. Cite web requires |website= (help)
 81. "The Seattle Times: Seattle meets Kyoto global-warming targets". Retrieved 2007-10-29. Cite web requires |website= (help)
 82. "Business leaders call for climate change action". CBC. మూలం నుండి 2007-03-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-04. Cite news requires |newspaper= (help)
 83. ఎకార్డ్/వన్ హోవెల్, కార్బన్ & క్లయిమేట్ లా రివ్యూ 2009, p. 102-114
 84. "Kyoto protocol status(pdf)" (PDF). UNFCCC. Retrieved 2006-11-07. Cite web requires |website= (help)
 85. Mendelsohn, Robert O. (2005-02-18). "An Economist's View of the Kyoto Climate Treaty". NPR. Retrieved 2006-11-07. Cite web requires |website= (help)
 86. Hilsenrath, Jon E. (2001-08-07). "Environmental Economists Debate Merit of U.S.'s Kyoto Withdrawal". Wall Street Journal. మూలం నుండి 2006-04-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-11-07.
 87. Nature. "Gwyn Prins and Steve Rayner calling for radical rethink of Kyoto-protocol approach". Nature.com. Retrieved 2009-05-21. Cite web requires |website= (help)
 88. "The Impact of the Kyoto Protocol on U.S. Economic Growth and Projected Budget Surpluses". మూలం నుండి 2004-12-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2005-11-15. Cite web requires |website= (help)
 89. "Radical rethinking of approach needed says Steve Rayner and Gwyn Prins". Lse.ac.uk. Retrieved 2009-05-21. Cite web requires |website= (help)
 90. ""Economic Effects of a Complex Agreement Depend on Many Assumptions"". US Department of Energy. Retrieved 15 November 2005. Unknown parameter |dateformat= ignored (help); Cite web requires |website= (help)
 91. De Leo, Giulio A. (2001). "Carbon emissions: The economic benefits of the Kyoto Protocol". Nature. 413: 478–479. doi:10.1038/35097156. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 92. McKitrick, Ross (2000-09-26). "Submission to the Joint Standing Committee on Treaties Inquiry into the Kyoto Protocol (pdf)" (PDF). మూలం (PDF) నుండి 2008-09-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-11-07. Cite web requires |website= (help)
 93. Stern, Nicholas (2006-10-30). "Stern Review: The Economics of Climate Change, Summary of Conclusions" (PDF). మూలం నుండి 2006-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2006-11-11. Cite web requires |website= (help)
 94. Farber, Daniel A. (1993). "The Shadow of the Future: Discount Rates, Later Generations, and the Environment". Vanderbilt Law Review. 46: 267–304. Retrieved 2006-11-07. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 95. "United Nations Framework Convention on Climate Change: Changes in GHG emissions from 1990 to 2004 for annex I Parties" (PDF). Cite web requires |website= (help)
 96. "Global Carbon Project". Cite web requires |website= (help)
 97. "U.S. Greenhouse Gas Emissions 1990 - 2004". Pew Center for Global Climate Change. మూలం నుండి 2006-12-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-01-19. Cite web requires |website= (help)
 98. "U.S. Environmental Protection Agency: U.S. Greenhouse Gas Inventory Reports" (PDF). మూలం నుండి 2007-04-03 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2010-01-04. Cite web requires |website= (help)
 99. "Greenhouse gas emission trends and projections in Europe 2006" (PDF). European Environment Agency. మూలం (PDF) నుండి 2006-11-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-01-19. Cite web requires |website= (help)
 100. "Industrial world losing sight of Kyoto target". మూలం నుండి 2007-08-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-05-28. Cite web requires |website= (help)
 101. "Politicians sign new climate pact". BBC. 2007-02-16. Retrieved 2007-05-28. Cite news requires |newspaper= (help)
 102. "Global leaders reach climate change agreement". Guardian Unlimited. 2007-02-16. Retrieved 2007-05-28. Cite web requires |website= (help)
 103. "Breakthrough on climate protection". G8 Summit 2007 Heiligendamm. 2007-06-07. Retrieved 2007-06-07. Cite web requires |website= (help)
 104. "Vienna UN conference shows consensus on key building blocks for effective international response to climate change" (PDF) (Press release). United Nations. 2007-08-31. Retrieved 2007-10-12.
 105. "UN climate change conference hails Australia Kyoto signing" (Press release). CBC News. 2007-12-03.
 106. By BRYAN WALSH Thursday, Dec. 04, 2008 (2008-12-04). "Time Avoided deforestation". Timeinc8-sd11.websys.aol.com. మూలం నుండి 2009-08-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-05-21. Cite web requires |website= (help)CS1 maint: multiple names: authors list (link)
 107. Adam, David (14 April 2009). "World will not meet 2C warming target, climate change experts agree". Guardian News and Media Limited. Retrieved 2009-04-14. The poll comes as UN negotiations to agree a new global treaty to regulate carbon pollution gather pace in advance of a key meeting in Copenhagen in December. Officials will try to agree a successor to the Kyoto protocol, the first phase of which expires in 2012. Cite web requires |website= (help)
 108. అమందా గ్రిస్‌కామ్ లిటిల్, "ప్యాక్ట్ ఆర్ ఫిక్షన్? న్యూ ఆసియా-పసిఫిక్ క్లయిమేట్ ప్యాక్ట్ ఈజ్ లాంగ్ ఆన్ PR, షార్ట్ ఆన్ సబ్‌స్టేన్స్ ", Grist.org కథనం, 4 ఆగస్టు 2005]
 109. "బెటర్ లేట్ దేన్ నెవర్ : ఇండియా టాక్స్ అబౌట్ టేకలింగ్ క్లయిమేట్ ఛేంజ్", ది ఎకనామిస్ట్ , 30 జులై 2007

మరింత చదవడానికి[మార్చు]

బాహ్య వలయాలు[మార్చు]

మూస:Supranationalism/World government topics