Jump to content

వికీపీడియా:నాణ్యతా మూల్యాంకనం

వికీపీడియా నుండి

JVRKPRASAD గారి ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తూ ఈ ఆలోచనలు.

మూల్యాంకన ప్రాతిపదిక

[మార్చు]

వ్యాసాల విలువను కింది విధంగా లెక్కించాలి.

ప్రధాన పేరుబరిలోని వ్యాసాలకు

[మార్చు]

వ్యాసం కొత్తదైనా, పాత వ్యాసాన్ని కింది ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసినా ఈ మార్కులు వస్తాయి.

  1. భాషాదోషాలు (అక్షర/వ్యాకరణ దోషాలు) లేకుండా ఉంటే: దీనికి గరిష్ఠంగా 10 మార్కులు. అక్షరదోషం గానీ వ్యాకరణ దోషం గానీ ఒక్కటి కూడా ఉండకూడదు. అలాంటి వ్యాసాలకు కిందివిధంగా మార్కులు వస్తాయి. ఒకటి నుండి ఐదు వరకు దోషాలుంటే ఈ మార్కుల్లో సగం వస్తాయి. ఆపైన తప్పులుంటే, సున్నా మార్కులు.
    • వ్యాస పరిమాణం 2 కెబి - 4 కెబి: 4 మార్కులు
    • వ్యాస పరిమాణం 4 కెబి - 6 కెబి: 6 మార్కులు
    • వ్యాస పరిమాణం 6 కెబి - 8 కెబి: 8 మార్కులు
    • వ్యాస పరిమాణం 8 కెబి పైన: 10 మార్కులు
  2. అనాథ, అగాధ వ్యాసాల సంస్కరణ (కనీసం 3 ఔట్‌గోయింగు లింకులు, కనీసం 1 ఇన్‌కమింగు లింకు): 5 మార్కులు.
  3. మూలాల జోడింపు: దీనికి 10 మార్కులు
  4. పరిమాణం: కనీసం 2 కెబి ఉండాలి - ఫైళ్ళు, సమాచారపెట్టెలు కాకుండా. ఒక్కో వ్యాసానికీ గరిష్ఠంగా 10 మార్కులు, కింది విధంగా ఇవ్వవచ్చు.
    • 2 కెబి - 4 కెబి: 2 మార్కులు
    • 4 కెబి - 5 కెబి: 4 మార్కులు
    • 5 కెబి - 6 కెబి: 6 మార్కులు
    • 6 కెబి - 8 కెబి: 8 మార్కులు
    • 8 కెబి పైన: 10 మార్కులు
    • వాడుకరి చేర్చిన మొత్తం పాఠ్యం పరిమాణాన్ని పరిగణిస్తారు.
  5. వర్గాలు: సంబంధించిన వర్గాలన్నిటిలోకీ చేరిస్తే 5 మార్కులు.
  6. ఇతర భాషల లింకులు: 5 మార్కులు
  7. వికీడేటాలో లేబులు, వివరణ చేర్చితే: 5 మార్కులు
  8. ఫోటోల చేర్పు: వ్యాసానికి సంబంధించిన ఫోటోలను చేర్చితే 5 మార్కులు. వ్యాసంలో ఎన్ని ఫోటోలను చేర్చినా ఇవే మార్కులు

ఇతర పేరుబరులలోని మార్పుచేర్పులు

[మార్చు]
  1. కొత్తగా ఎక్కించిన ఒక్కో ఫొటోకు: 5 మార్కులు.
  2. కొత్త మూసకు (దిగుమతి చేసుకున్న మూసలకు ఉండదు): 10 మార్కులు
  3. విలీనం చేసినందుకు: 15 మార్కులు
  4. తొలగింపు మూస పెట్టి, ఆ ప్రతిపాదన నెగ్గితే: 15 మార్కులు
  5. తరలింపులు: 3 మార్కులు

నిబంధనలు

[మార్చు]
  1. ఏ వ్యాసానికైనా ఒక్క ఇన్‌కమింగు లింకూ లేకపోతే, ఆ వ్యాసాన్ని అసలు పరిగణన లోకి తీసుకోరు.
  2. వ్యాసం నుండి బయటికి పోయే లింకులు ఒక్కటీ లేకపోయినా ఆ వ్యాసాన్ని అసలు పరిగణన లోకి తీసుకోరు.
  3. 2 కెబి లోపు వ్యాసాన్ని పరిగణన లోకి తీసుకోరు.
  4. వ్యాస విషయం ఏది ఉండాలనే విషయమై నిబంధనేమీ లేదు. వ్యాసం అనువాదమైనా కావచ్చు, స్వంతంగా తయారు చేసినదైనా కావచ్చు.
  5. వాడుకరులు తాము చేసిన మార్పులను మూల్యాంకన పేజీలో సమర్పించాలి. నిర్ణేతల బృందం వాటిని పరిశీలించి మూల్యాంకన చేస్తుంది.
  6. వాడుకరి తాను సృష్టించిన వ్యాసాల్లో మాత్రమే కాక, తాను పనిచేసిన ప్రతీ వ్యాసంలోనూ మార్కులు పొందవచ్చు.

నిర్ణేతలు

[మార్చు]

వ్యాసాలను నాణ్యత పరంగా మూల్యాంకన చేసేందుకు ముగ్గురు సభ్యుల నిర్ణేతల బృందం ఉంటుంది. కిందివారు ఈ బృందంలో సభ్యులు కావచ్చు:

  1. కనీసం ఒకరు నిర్వాహకులు, ఒకరు మామూలు వాడుకరీ అయి ఉండాలి.
  2. కనీసం పది కొత్త వ్యాసాలు (మొలకలు కానివి) రాసి ఉండాలి.
  3. తన మొత్తం దిద్దుబాట్లలో, కనీసం 15% ప్రధానేతర పేరుబరుల్లో చేసి ఉండాలి.
  4. నిర్ణేతలు కూడా పోటీలో పాల్గొనవచ్చు.

పురస్కారాలు

[మార్చు]
మార్కులు పురస్కారం
0 - 500
500 - 750
750 - 1000
1000 కి పైన

సమర్పణలు

[మార్చు]

ప్రధాన పేరుబరిలోని వ్యాసాల సమర్పణ పట్టిక నమూనా

క్ర.సం. వాడుకరి (సంతకం), తేది వ్యాసం పేరు పాత/కొత్త పరిమాణం మూలాలు ఔట్‌గోయింగ్

లింకులు

ఇన్‌కమింగ్

లింకులు

వ్యాకరణ

దోషాలు

అక్షర

దోషాలు

వర్గాలు భాష లింకులు మొత్తం మార్కులు

ఇలాగే ఇతర పేరుబరులలోని సమర్పణ కోసం తయారు చేసుకోవచ్చు.

లెక్కింపు చెయ్యడం ఎలా

[మార్చు]

లెకింపు పూర్తిగా బాటు ద్వారానే చెయ్యాలి. బాటుకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్లు: లెక్కింపు కాలం (ఎప్పటి నుండి ఎప్పటి వరకు) బాటు చెయ్యాల్సిన పనులు:

  1. ఇచ్చిన కాలంలో జరిగిన మొత్తం దిద్దుబాట్లను, పేరుబరి వారీగా సేకరించాలి. ప్రధాన పేరుబరి లోని మార్పులలో కింది పనులు చెయ్యాఅలి.



అభిప్రాయాలు

[మార్చు]
  • చదువరి గారి ప్రతిపాదన బాగా ఉంది. ప్రస్తుతం తెలుగులో క్రియాశీల వాడుకరులు 368 మంది ఉన్నారు. వీరిలో నెలలో 10 క్రొత్త వ్యాసాలను వ్రాసే వారిని వడపోస్తే వారి సంఖ్య గణనీయంగా తక్కువగానే కనిపిస్తుంది. ఆ నెలలో చేసిన దిద్దుబాట్లలో 15% ప్రధానేతర పేరుబరుల్లో చేసి ఉండాలి అనే నిబంధనను పరిగణిస్తే ఆ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సభ్యులు ఎవరికి వారు స్వీయప్రతిపాదన చేసుకోవడం కాకుండా నిర్ణేతల బృందమే అర్హులైన సభ్యుల పేర్లను పురస్కారానికి పరిశీలించి పైన పేర్కొన్న విధంగా మూల్యాంకనం చేసి నెలనెలా పురస్కారాలను ప్రకటిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.--స్వరలాసిక (చర్చ) 14:57, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  • చదువరి గారూ, మీ ప్రతిపాదన బావుందండీ. ఐతే అవార్డు అన్న పదం కన్నా, ఈ నెల తెలుగు వికీపీడియన్ లాంటిదైతే బావుంటుంది. ఇప్పటికే మన సామాజిక మాధ్యమాల వ్యూహంలో దీన్ని భాగంగా తీసుకున్నాం. కాబట్టి ఈ నెల వికీపీడియన్ ఎవరు అన్నదానికి ఈ కార్యప్రణాళిక దన్నుగా ఉంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 16:01, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో పాలసీ చర్చల అనంతరం పాలసీలు చెదురుమదురుగా ఎక్కడెక్కడో ఉన్నాయి. పాలసీ పేజీల్లో అందుబాటులో ఉంటే బావుంటుంది. దీన్ని సాధించేందుకు గాను పాత పాలసీని వెతికి పట్టుకుని పాలసీ పేజీలో క్రోడీకరించి రాస్తే దానికి కొన్ని మార్కులు ఇవ్వగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 16:20, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]