వికీపీడియా:వికీప్రాజెక్టు/గ్రోత్ ప్రాజెక్టు/కొత్త వాడుకరి నమోదు కాగానే
స్వరూపం
గ్రోత్ ప్రాజెక్టులో భాగంగా కొత్తగా ఒక వాడుకరి నమోదు కాగానే ఏం జరుగుతుందో ఈ పేజీ వివరిస్తుంది. ఇది 2021 మార్చి 26 నాటి పద్ధతి. ఈ ప్రాజెక్టు మెరుగుదలలో భాగంగా నిరంతరం మార్పులకు లోనౌతూ ఉంటుంది కాబట్టి, దీనికి త్వరలోనే కాలదోషం పట్టే అవకాశం ఉంది.
కొత్త వాడుకరి నమోదు పూర్తి కాగానే వారికి ఒక సర్వే పేజీ కనిపిస్తుంది. ఈ పేజీలో నాలుగు ప్రశ్నలుంటాయి: | |
కొత్త వాడుకరి నమోదు కాగానే గ్రోత్ ప్రాజెక్టు చూపించే సర్వే పేజీ. | |
వాటిలో మొదటి ప్రశ్నకు ఉన్న సమాధానాల డ్రాప్‌డౌను పెట్టె ఇది. ఇందులోంచి సమాధానాలు ఎంచుకోవాలి | |
గ్రోత్ ప్రాజెక్టు చూపించే సర్వే పేజీలోని మొదటి ప్రశ్న. | |
ఇది రెండవ ప్రశ్నకు ఉన్న సమాధానాల డ్రాప్‌డౌను పెట్టె. ఇందులోంచి సమాధానాలు ఎంచుకోవాలి: | |
గ్రోత్ ప్రాజెక్టు చూపించే సర్వే పేజీలోని రెండవ ప్రశ్న. | |
మూడవ ప్రశ్న మీ ఈమెయిలు ఇవ్వండి. ఇది ఐచ్ఛికం. నమోదు చేసుకునేటపుడు ఈమెయిలు ఇవ్వకపోతేనే ఇక్కడ అడుగుతుంది. అక్కడ ఇచ్చి ఉంటే ఇక్కడ అడగదు.
నాలుగవ ప్రశ్న, మీకు ఇతర భాషలు ఏమైనా వచ్చా అని. | |
ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, "ముగించు" బొత్తాన్ని నొక్కినపుడు సర్వేలో ఇచ్చిన సమాధానాలను సేకరించి, తరువాతి పేజీకి తీసుకుపోతుంది. "సర్వేను వదిలెయ్యండి" బొత్తాన్ని నొక్కినపుడు సర్వేను వదిలేసి తరువాతి పేజీకి తీసుకుపోతుంది. | |
తరువాతి పేజీ ఎంపిక: తరువాత ఏ పేజీకి వెళ్ళాలనే విషయమై వాడుకరికి రెండు ఆప్షన్లుంటాయి | |
మొదటిది, ఏ పేజీ నుండి ఖాతా తెరిచే పేజీకి వెళ్ళారో ఆ పేజీకి వెళ్ళడం. రెండవది, వాడుకరి హోంపేజీకి వెళ్ళడం. | |
వాడుకరి హోంపేజీ ఇలా ఉంటుంది. | |
అప్పటికే వాడుకరికి ఒక వికీపీడియాకు స్వాగతం అంటూ ఒక గమనింపు వచ్చి ఉంటుంది ఇలా | |
ఒక అలర్టు కూడా చూపిస్తుంది ఇలా | |