Jump to content

వికీపీడియా:గూగుల్ యాంత్రికానువాద వ్యాసాల తొలగింపు-2020 జనవరి

వికీపీడియా నుండి
యాంత్రికానువాదం ద్వారా చేర్చిన వ్యాసాలపై జరిగిన చర్చలు
గూగుల్ యాంత్రికానువాదం ద్వారా వికీలో చేరిన వేలాది వ్యాసాలపై అనేక చర్చోపచర్చల తరువాత, వాటిని శుద్ధి చేసేందుకు అనేక విఫలయత్నాలు జరిగాక, చివరికి వాటిని తొలగించాలని సముదాయం నిశ్చయించింది. 2020 ఫిబ్రవరి 5 న ఆ వ్యాసాలన్నిటినీ తొలగించారు. ఆయా సందర్భాల్లో జరిగిన చర్చల వివరాలను కింది ట్యాబుల్లో చూడొచ్చు.
ప్రాజెక్టు | 2010 నవంబరు | 2016 జూలై | 2016 సెప్టెంబరు | 2016 డిసెంబరు | 2018 జూలై | 2020 జనవరి | ఇతర చర్చలు

గూగుల్ యాంత్రికానువాద వ్యాసాలపై రచ్చబండలో జరిగిన చర్చ యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాం.

తెవికీ నాణ్యత - యాంత్రికానువాద వ్యాసాల సమస్య

[మార్చు]

గూగుల్ యాంత్రికానువాదం ప్రాజెక్టు ద్వారా దోషభూయిష్టమైన భాషతో కూడిన వ్యాసాలు అనేకం తెవికీలోకి వచ్చిపడ్డాయి. ఈ పేజీలన్నీ ప్రస్తుతం వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు వర్గంలో ఉన్నాయి. అసంబద్ధమైన వాక్య నిర్మాణం, అసహజమైన భాషా ప్రయోగాలు ఈ వ్యాసాల్లోని ప్రత్యేకతలు. వీటిని తొలగించెయ్యాలని గతంలో నిర్ణయం తీసుకున్నాం. అయితే కొందరు వాడుకరులు వీటిని మెరుగు పరచే ప్రయత్నం చేద్దామని ప్రతిపాదించి, కొంత ప్రయత్నం చేసారు. ఆ ప్రయత్నం ఇలా మొదలై, ఇలా సాగి, ఇక్కడ ఆగింది. అయితే, సదాలోచనతో చేసిన ఆ ప్రయత్నాలు పెద్దగా ముందుకు పోలేదు (ఈ పనిని మొదలెట్టిన పవన్ సంతోష్ గారికీ, అందులో పాలుపంచుకున్న వారికీ ధన్యవాదాలు). ఏవో కొన్ని వ్యాసాలు మెరుగైనప్పటికీ ఇంకా 1771 పేజీలు పై వర్గంలో ఉన్నాయి. అర్జునరావు గారు {{వికీప్రాజెక్టు గూగుల్ అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} అనే మూస ద్వారాను, ఒక బాటు ద్వారానూ - మెరుగుపరచిన వ్యాసాలను (సంఖ్య: 81) "గూగుల్ అనువాద వ్యాసాలు" వర్గం లోంచి తీసేసారు. కాబట్టి ఈ వర్గంలో మెరుగు పరచిన వ్యాసాలు ఇంకా ఉండి ఉండక పోవచ్చు (మెరుగు పరచాక కూడా ఆ పేజీలోని మూసను తీసెయ్యకపోతేనో, "మెరుగుపరచిన" మూసను పెట్టకపోతేనో లేదా నేరుగా "మెరుగుపరచిన" వర్గం లోకి చేర్చకపోతేనో తప్ప). ప్రస్తుతం నా ప్రతిపాదనలు ఏంటంటే,

  1. గత నిర్ణయం ప్రకారం వీటిని తొలగించాలి.
  2. ఒక్కటొక్కటిగా కాకుండా, వీటిని మూకుమ్మడిగా తొలగించాలి.
  3. ఈ ప్రతిపాదనపై చర్చ ముగిసిన రోజు నుండి వారం రోజుల పాటు ఆగి ఎనిమిదవ రోజున ఈ తొలగింపు చెయ్యాలి.

ఈ వారంలో..

  1. తాము భాషను సరిచేసి, మెరుగు పరచిన వ్యాసాలను పొరపాటున ఇంకా "గూగుల్ అనువాద వ్యాసాలు" వర్గం లోనే ఉంచేసారేమో వాడుకరులు పరిశీలించుకోవచ్చు.
  2. తాము ప్రస్తుతం మెరుగు పరుస్తూన్న వ్యాసాలను (మెరుగుపరచడం జరుగుతూ ఉంది) తొలగించనీకుండా, వాడుకరులు కాపాడుకోవచ్చు. ఆ వ్యాసాల్లో పైన {{యాంత్రికానువాదం భాషను శుద్ధి చేస్తాను}} అనే మూసను పెడితే తొలగింపు కాకుండా నివారించవచ్చు. (ఉదా: నేను నియాండర్తల్ అనే వ్యాసంలో పని ముగించాల్సి ఉంది)
  3. భవిష్యత్తులో తాము మెరుగు పరచాలని భావించిన వ్యాసాలను (పని ఇంకా మొదలు పెట్టనివి) తొలగించనీకుండా, వాడుకరులు కాపాడుకోవచ్చు. ఆ వ్యాసాల్లో కూడా పైన {{యాంత్రికానువాదం భాషను శుద్ధి చేస్తాను}} అనే మూసను పెడితే తొలగింపు కాకుండా నివారించవచ్చు. ఈ శుద్ధి పనిని నెల రోజుల్లోపు మొదలు పెట్టాలని గమనించవలసినది.

గమనిక: ప్రస్తుతం గూగుల్ అనువాద వ్యాసాలు వర్గంలో ఉన్న వ్యాసాలు, ఉపవర్గాల జాబితా వికీపీడియా:గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల జాబితా - 2020 జనవరి 19 పేజీలో ఉంది. పేజీలను తొలగించాక, తిరిగి సృష్టించేవారికి ఈ జాబితా ఒక సూచికగా పనికొస్తుంది -స్వరలాసిక గారి సూచన మేరకు.

మద్దతు

ఈ ప్రతిపాదనపై వాడుకరుల స్పందన కోరుతున్నాను. __చదువరి (చర్చ •  రచనలు) 17:59, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

  • మద్దతు: వాడుకరి:Chaduvari గారే ఇటువంటి ప్రతిపాదనే గతంలో చేసినప్పుడు నేనే వ్యతిరేకించి వీటిని ఉంచితే మెరుగుపరచవచ్చన్నాను. ఐతే, లెక్కకు రానంత కొద్ది వ్యాసాలే మెరుగుపరచగలిగాం. కాబట్టి, ఈ ప్రతిపాదనను ఇప్పుడు బలపరుస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 01:30, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • మద్దతు: ఈ ప్ర్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నాను. అనేక సంవత్సరాలుగా ఈ వ్యాసాలు ఎవరూ శుద్ధిచేయకుండా ఉండిపోయాయి. కొన్ని వ్యాసాలను శుద్ధిచేశాము. కానీ కొన్ని వ్యాసాలను శుద్ధిచేసేకంటే కొత్తగా వ్యాసం రాయడం సులభం అని గ్రహించి వదిలేసాను. ఈ గూగుల్ వ్యాసాలలో కొన్నింటిని కొంతవరకు శుద్ధి చేసారు. కానీ అవి ఆ వర్గంలో ఉండిపోయాయి. ఉదా:అరుణ్ శౌరీ. ఇటువంటి వ్యాసాలను కూడా తొలగించాలా? కొన్ని వ్యాసాలు కృతక భాషతో మొదటి నుండి శుద్ధిచేయకుండా ఉండిపోయాయి. వాటిని తొలగించడం సరైన చర్య. 2019 డెసెంబరు 7న మరలా యాంత్రిక అనువాద వ్యాసాలు వందల సంఖ్యలో తెవికీలోకి చేరాయి. దోషభూయిష్టమైన భాషతో కూడిన ఈ వ్యాసాలను కూడా తొలగించాలి.--కె.వెంకటరమణచర్చ 02:11, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • మద్దతు: తెవికీ నాణ్యతను అనుసరించి గూగుల్ అనువాద వ్యాసాలను తొలగించడమే మంచిది. దీనికి నా మద్దతు కూడా తెలియజేస్తున్నాను. Pranayraj Vangari (Talk2Me|Contribs) 03:54, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • గూగుల్ అనువాద వ్యాసాల ఎంపిక భారతదేశంలో గూగుల్ శోధనాయంత్రంలో అధిక ఆంగ్ల పదాల శోధన అధారంగా ఎంపిక చేయబడింది. వీటిలో చాలా తెలుగు వాడుకరులకు ప్రాధాన్యమైనవి కావు. ప్రస్తుతం తెలుగు వికీలో లేని వ్యాసాలకు గూగుల్ అనువాదం వ్యాసం శోధనా పలితాలతో అప్రమేయంగా చూపుతున్నది. కావున. మెరుగుపరచని గూగుల్ అనువాద వ్యాసాలను తొలగించటం నేను సమర్ధిస్తాను.--అర్జున (చర్చ) 05:34, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • మద్దతు: తొలగించాలి. అయితే తొలగించిన వ్యాసాల జాబితా ఒకటి ఉంటే భవిష్యత్తులో వాటిని ఎవరైనా పునఃప్రారంభించే అవకాశం ఉంటుంది. స్వరలాసిక (చర్చ) 08:35, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • మద్దతు: తొలగించటానికి నా మద్దతు తెలియజేస్తున్నాను.వీటివలన ఇంకొక నష్టం కూడా ఉంది.సందిగ్దంగా ఉన్న పదం కోసం వెతికినప్పుడు ఇందులోని తప్పుడు పదాలు ఫలితాలుగా చూపించే అవకాశం ఉంది.--యర్రా రామారావు (చర్చ) 14:46, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • "మద్దతు:" అన్నింటినీ తొలగించేయండి.--Rajasekhar1961 (చర్చ) 08:39, 22 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • తొలగించడానికి నా మద్ధతు. స్వరలాసిక గారు చెప్పినట్లు తొలగించేముందు ఒక జాబితాగా వేయాలి. రవిచంద్ర (చర్చ) 12:14, 22 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • "మద్దతు" మెరుగుపరచడం కొరకు నేనూ మునుపు మొగ్గుచూపాను, కాని అది చేయలేనిపనిగానే మిగిలింది. కనుక తొలగించడమే ఉత్తమం..B.K.Viswanadh (చర్చ) 20:46, 23 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • " మద్దతు " మెరుగుపరచడం కంటే కొత్తవి సృష్టించడం సులువని భావిస్తున్నాను కనుక తొలగించడమే సరి అయినది. T.sujatha (చర్చ) 15:54, 24 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • < పై వరుసలో * తో మీ సంతకం అవసరమైతే వ్యాఖ్యతో చేర్చండి.>
తటస్థం
  • తటస్థం:యాంత్రిక అనువాదాల మెరుగు కోసం అనువాద వ్యాసాలు దోహదం చేస్తాయి , వీటిలో కొన్ని మరీ కృతంగా లేవు Kasyap (చర్చ) 11:52, 21 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • < పై వరుసలో * తో మీ సంతకం అవసరమైతే వ్యాఖ్యతో చేర్చండి.>
వ్యతిరేకం
  • < పై వరుసలో * తో మీ సంతకం అవసరమైతే వ్యాఖ్యతో చేర్చండి.>
చర్చ

Kasyap గారు ఇలా చెప్పారు: "యాంత్రిక అనువాదాల మెరుగు కోసం అనువాద వ్యాసాలు దోహదం చేస్తాయి, వీటిలో కొన్ని మరీ కృతంగా లేవు." వీటిపై నా అభిప్రాయం చెప్పదలచాను.

వ్యాసానికి ప్రాణం భాష! లింకులు, విభాగాలు, మూలాలు, మూసలు, వర్గాలు, బొమ్మలు.. ఇలాంటి హంగులన్నీ ఆ తరువాతే. అసలు భాషే సరిగ్గా లేకపోతే వ్యాసం అనేదే లేదు. ప్రాణం లేని బొమ్మకు పౌడరద్ది, బొట్టూ కాటుక పెడితే ఉపయోగమేంటి? యాంత్రికానువాద వ్యాసాల్లో ఉన్నటువంటి నాసిరకపు కృతక భాష ఉండే వార్తా పత్రికలు, వార పత్రికలూ మనం కొంటామా, చదువుతామా? పుస్తకాలు కొంటామా, కొనమని చెబుతామా? మరి మన తెవికీ విషయంలో మనకే ఎందుకంత చులకన భావం? మరీ కృతకంగా లేకపోవడం అంటే ఎంతో కొంత కృతకంగా ఉన్నాయనే అర్థం కదా! మరి ఎందుకు రాజీ పడాలి? మామూలు, వ్యాకరణ సమ్మతమైన, అక్షరదోషాల్లేని భాష అనేది కనీస మాత్రపు నాణ్యత కదా! మనం చేసేపనిలో కనీస నాణ్యత కూడా పాటించకపోతే ఎట్లా? ఐఐఐటీ వాళ్ళ ప్రాజెక్టులో చురుకైన పాత్ర పోషిస్తున్న కశ్యప్ గారు "మరీ కృతకంగా లేవు" అంటూంటే ఆందోళన కలుగుతోంది. ఓ పదిమందో ఇరవై మందో రాసిన 2000 వ్యాసాలను ఏం చేసుకోవాలో తెలీడం లేదు పదేళ్ళుగా. మరి, కొన్ని వందల వేల మందితో లక్షల కొద్దీ అనువాద వ్యాసాలు రాయించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రాజెక్టులో కొద్దిపాటి రాజీకి చోటిచ్చినా, జరిగే అనర్థం ఊహాతీతం. వెనక్కి తీసుకోలేని తప్పులు జరిగిపోయే ప్రమాదం ఉందని గ్రహించ ప్రార్థన. భాష విషయంలో ఆయన రాజీ పడరాదనీ, కచ్చితంగాను, కఠినంగానూ ఉండాలనీ నేను వేడుకుంటున్నాను. __చదువరి (చర్చరచనలు) 13:20, 21 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు చాలా వివరంగా విశదీకరించారు. తప్పు చేసాను గానీ అది తప్పేమీ కాదులే అని సమర్థించుకోవటం ఎంతవరకు సబబు అని నాఅబిప్రాయం.కని పారేస్తే దేవుడే చూసుకుంటాడు అన్నట్లుగా ఉండకూడదు.ఏదో ఒకటి రాసిపడేస్తే ఎవరో ఒకరు చూసుకుంటారలే అనే అభిప్రాయం గౌరవ వికీపీడియన్లుకు ఎవ్వరికీ ఉండకూడదు.Kasyap గారిలాంటి సుదీర్ఘ అనుభవంగల గౌరవ వికీపీడియన్లుకు అసలు ఈ అభిప్రాయం రాకూడదని కోరుకుంటున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:42, 22 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పనికిమాలిన దోషపు భాషతో కూడిన వ్యాసాలను చాలాకాలం నుండి చూస్తున్నాం. గూగుల్ శోధనలో ఈ వ్యాసాలను చూసేవారు ఈ దోషపు వాక్యాలనే ప్రామాణికంగా తీసుకొనే అవకాశం ఉంది. ఈ కృతక భాష వ్యాసాలు ఎవరికీ ఉపయోగపడవు. ఈ గూగుల్ అనువాద వరికరం చాలా కృతకంగా, దోషభూయిష్టమైన భాషతో అనువాదాలను చేస్తుంది. భాష రాని వాడుకరులు కూడా ఒక నిమిషంలో అనువాదం చేస్తున్నారు. తరువాత దానిని శుద్ధిచేయడానికి పట్టించుకోరు. ఈ మధ్య రసాయన శాస్త్ర వ్యాసం గూగుల్ అనువాదం చేసినపుడు అది అనువాదం చేసే భాష చాలా దోషాలతో అర్థం పూర్తిగా మార్చి చూపిస్తుంది. "basic solutions" అనగా "క్షార ద్రావణాలు". గూగుల్ పరికరం "ఆధారపు పరిష్కారాలు" అని అనువాదం చేస్తుంది. భాష, రాసే వ్యాసంలోని అంశాల గూర్చి అవగాహన లేకపోతే అదే సరైన అనువాదం అని వదిలేస్తారు. అందువలన భాష విషయంలో రాజీపడడం ఉండరాదు. కనుక ఇటువంటి పనికిమాలిన భాషతో కూడిన వ్యాసాలను తక్షణం తొలగించాలి. అందులో వికీలో ఉండవలసిన వ్యాసాలుండవచ్చు. వాటిని జాబితాగా తయారుచేస్తే ఎవరైనా ఎర్రలింకులనుపయోగించి మంచి వ్యాసాలు మొదలుపెడతారు.--కె.వెంకటరమణచర్చ 13:16, 22 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వేగిరపడి వాడుకరులు
తెగులును తెలుగునకు చేర్చె, తెవికీనందున్
గూగుల్ అనువాదాలను
పోగులుగా తొలగించుట పరమోత్తమమున్

—కె.వెంకటరమణ

కె.వెంకటరమణ గారూ, మీరు చెప్పిన ఈ ఉదాహరణ ఒక్కటి చాలు.. ఈ అనువాదాలు ఎంత హీనంగా ఉంటాయో తెలిసి పోడానికి.
Rajasekhar1961 గారు, రవిచంద్ర గారు తమ మద్దతు ఇవ్వడంతో చాలా సంతోషం కలిగింది. వెంకటరమణ గారు నిర్ద్వంద్వంగా తేల్చిచెప్పడంతో అది ద్విగుణీకృతమైంది. ఈ సంతోషంలో నా వంతుగా కూడా ఒక పద్యం:
ఢంకా మోగించి మరీ

వెంకట రమణయ్య గారు వివరించిరిగా

ఇంకెందుకు ఆలస్యము

పంకంబును కడిగివేసి ప్రక్షాళింపన్

—చదువరి

ఈ వ్యాఖ్యలు, ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులు గమనించాకా మరొక్క సంగతి గుర్తుచేయదలిచాను. గూగుల్‌ అనువాద సహకారంతో వికీపీడియా అనువాద ఉపకరణం వాడి నిమిషాల వ్యవధిలో ఒక్కో కృతక అనువాద వ్యాసాన్ని ప్రచురించగలిగే వీలు ఏర్పడింది. తెలుగు వికీపీడియానే కదా చకచకా అనువాదాలు చేసి పారేయవచ్చన్న ధోరణితో వచ్చే కొత్తవారు మనకు నిరుపయోగం, పైపెచ్చు ప్రమాదకరం. "కొద్ది పాటి కృతకత్వం పర్వాలేదులే" అన్న దృక్పథం మనకెలాగూ పనికిరాదన్నది సుస్పష్టమే. అంతకుమించి పరిస్థితులు మదింపు వేసుకుని, భవిష్యత్తులో అలాంటి వ్యాసాల వరద రాకుండా, ఒకవేళ ఎవరైనా వాడుకరి వరుసగా కృత్రిమ అనువాద వ్యాసాలు రూపొందిస్తూ ఉంటే ఏం చర్యలు చేపట్టాలి అన్నదానిపై ప్రత్యేకమైన పాలసీ అవసరం. అందుకు వేరే పాలసీ ఏర్పాటుచేసుకునేలా చర్చలు చేపట్టాలని ఆశిస్తున్నాను. ఇక చదువరి గారు లేవనెత్తిన ఐఐఐటీ వారి ప్రయత్నం, దాని నేపథ్యంలో ఈ వ్యాఖ్య పరిశీలిస్తే ఒక్క సంగతి మళ్ళీ నొక్కివక్కాణించదలిచాను, తెలుగు వికీపీడియాలో పనిచేసే బయటి సంస్థలు, తెలుగు వికీపీడియాతో కలిసి పనిచేసే బయటి సంస్థలు అనుసరించవలసిన పద్ధతులు ఇప్పటికే సీఐఎస్-ఎ2కె వంటి సంస్థలతో కలిసి పనిచేసినప్పుడు కొంతమేరకు ఏర్పడ్డాయి. అవేమీ స్ఫుటంగా రాసివుండకపోవడం మంచి విషయం కాదు, కాబట్టి సముదాయం ఈ అంశాన్ని పునరాలోచించి మార్గదర్శకాలు ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 09:14, 23 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, దీనిపై ఒక విధానం చేసుకోవాలని మీరు సరిగ్గా చెప్పారు. ఈ విధానానికి మీరు రూపకల్పన చెయ్యాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 06:55, 24 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ చర్చలోగాని, వోటింగులో గానీ కలగజేసుకోని వాడుకరులెవరైనా.. నిర్ణయాన్ని ప్రకటించవలసినది. __చదువరి (చర్చరచనలు) 13:15, 25 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం

తెవికీ నాణ్యత - యాంత్రికానువాద వ్యాసాల సమస్యపై జరిగిన చర్చలో పాల్గొన్న సముదాయ సభ్యులకు ధన్యవాదాలు. ఎక్కువమంది సభ్యులు యాంత్రికానువాద వ్యాసాల తొలగింపుకు మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ దీనిపై చర్చ ముగిసినట్టుగా ప్రకటించడమైనది. యాంత్రికానువాద వ్యాసాలను మరో వారం రోజుల తరువాత తొలగించబోతున్నాం. అయితే వాటిల్లో ఎక్కువ వీక్షణలు పొంది, చదువరులకు అవసరమైన వ్యాసాలు ఉన్నాయి. కాబట్టి, సముదాయ సభ్యుల్లో ఎవరైనా ఆయా వ్యాసాలను మరలా సృష్టించి, వాటిని రాయవచ్చు. ఆ వ్యాసాల జాబితాకోసం ఇప్పటికే చదువరి గారు వికీపీడియా:గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల జాబితా - 2020 జనవరి 19 పేజిని పెట్టారు. ఆయా వ్యాసాలపై పని చెయ్యదలచిన వారు 2020, ఫిబ్రవరి 4వ తేది లోపు సంబంధిత స్థానంలో తమతమ పేరును చేర్చగలరు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:13, 28 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]


పై నిర్ణయానుసారం, 2020 ఫిబ్రవరి 5 న గూగుల్ యాంత్రికానువాద వ్యాసాలన్నిటినీ తొలగించారు.