వికీపీడియా:గూగుల్ మెషీన్‌తో అనువదించిన వ్యాసాలు
Jump to navigation
Jump to search
యాంత్రికానువాదం ద్వారా చేర్చిన వ్యాసాలపై జరిగిన చర్చలు | |
---|---|
గూగుల్ యాంత్రికానువాదం ద్వారా వికీలో చేరిన వేలాది వ్యాసాలపై అనేక చర్చోపచర్చల తరువాత, వాటిని శుద్ధి చేసేందుకు అనేక విఫలయత్నాలు జరిగాక, చివరికి వాటిని తొలగించాలని సముదాయం నిశ్చయించింది. 2020 ఫిబ్రవరి 5 న ఆ వ్యాసాలన్నిటినీ తొలగించారు. ఆయా సందర్భాల్లో జరిగిన చర్చల వివరాలను కింది ట్యాబుల్లో చూడొచ్చు.
| |
ప్రాజెక్టు | 2010 నవంబరు | 2016 జూలై | 2016 సెప్టెంబరు | 2016 డిసెంబరు | 2018 జూలై | 2020 జనవరి | ఇతర చర్చలు |
యాంత్రికానువాదాలపై 2016 సెప్టెంబరులో రచ్చబండలో జరిగున చర్చను ఉన్నదున్నట్లుగా ఇక్కడ ఇస్తున్నాం.
గూగుల్ మెషీన్ తో అనువదించిన వ్యాసాలు
[మార్చు]యంత్రంతో అనువాదం చేసిన వ్యాసాలని మరమ్మత్తు చేసి మెరుగుపరచడం చాల కష్టంగా ఉంది. బోలెడంత లకాలం వెచ్చించినా వాటిని ఒక దారికి తీసుకురావడం కూదరడం లేదు. అగ్నిపర్వతాలు ప్రయత్నించి చూసేను. హిట్లర్ ప్రయత్నించి చూసేను. చేతులెత్తేసేను. ఇంతకంటె నా అంతట నేను రాసిన వ్యాసాలు స్వయంబోధకంగా ఉంటున్నాయి. కనుక నిర్వాహకులకి ఒక మనవి. యంత్రంతో అనువాదం చేసిన వ్యాసాలని మరమ్మత్తు చెయ్యడమనే కార్యక్తరమానికి స్వస్థి చెప్పేసి మనమే రాసుకుంటే బాగుంటుందని అనిపిస్తున్నాది. ఇలా సలహా ఇచ్చి మరొకరిని నొప్పించాలని నా ఉద్దేశం కాదు. Vemurione (చర్చ) 23:57, 6 సెప్టెంబరు 2016 (UTC)
- నా అభిప్రాయమూ ఇదే. ఈ విషయమై ఓ నెల కిందట చర్చ జరిగినపుడు, కొన్ని వ్యాసాలను సంస్కరించే వీలుందని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నెల రోజుల్లోనూ సంస్కరణ విషయంలో జరిగిన ప్రగతిని నేను గమనించలేకపోయాను. రవిచంద్ర గారు ఒకటీ రెండు వ్యాసాలను తొలగించినట్లు మాత్రం చూసాను. __చదువరి (చర్చ • రచనలు) 01:13, 7 సెప్టెంబరు 2016 (UTC)
- మరమత్తులకు వీలుకాని వ్యాసాలస్థానంలో ఆసక్తిగల సభ్యులు కొత్త వ్యాసము చేర్చడమే సముచితం.అలాగే మూలకాలకు సంబంధిన చాలా వ్యాసాలు కనిష్టస్థాయి మొలకలుగా వున్నాయి.ఎటూవంటి చేర్పులు లేవు గత కొన్నిఏళ్ళుగా.అటువంటివాటిని తొలగిస్తే వాటిస్థానంలో కొత్త వ్యాసాలు వ్రాస్తాను.Palagiri (చర్చ) 08:35, 9 సెప్టెంబరు 2016 (UTC)
- వ్యాసాలను డిలీట్ చేయడమనేది ఈ సమస్యకు పరిష్కారంగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఆ గూగుల్ అనువాద వ్యాసాల్లో అతి ముఖ్యమైన వ్యాసాలు చాలా ఉన్నాయి. వాటిని తీసేయడం వల్ల జరిగే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. ముఖ్యంగా ఆ వ్యాసాల గురించి మనం పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంది. Palagiriగారూ,Vemurioneగారూ ప్రస్తుతం నేను కంటెంట్ ట్రాన్స్ లేషన్ టూల్ ఉపయోగించి అనువాదం చేస్తున్నాను. ఈ టూల్ వల్ల చరిత్ర మిగిలి ఉంటుంది, మనం రాసే వ్యాసం పాత వ్యాసంపై అచ్చు వేయబడుతుంది. దీన్లో మూలాలు ఇవ్వడం, లింకులు చేర్చడం అనువాదం చేయడం, ఫోటోలు చేర్చడం చాలా సులభం. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకూ వీలుగా అనిపించవచ్చు. ఆగస్టు 11 నుంచి సెప్టెంబరు 4 వరకు నేను దాదాపు 17 గూగుల్ అనువాద వ్యాసాలను అనువదించాను. నా వరకూ అయితే నేను ఈ పనిపై దృష్టి పెట్టి చేసుకుంటూ వస్తున్నాను. అవి పూర్తి అవుతాయనే నమ్మకం కూడా నాకు ఉంది.--Meena gayathri.s (చర్చ) 11:33, 10 సెప్టెంబరు 2016 (UTC)
- మీరు శుద్ధి చేసిన గూగుల్ అనువాద వ్యాసాలకు వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గం చేర్చండి.--కె.వెంకటరమణ⇒చర్చ 11:45, 10 సెప్టెంబరు 2016 (UTC)
- వెంకటరమణగారూ అలాగేనండీ--Meena gayathri.s (చర్చ) 02:55, 11 సెప్టెంబరు 2016 (UTC)
- మీరు శుద్ధి చేసిన గూగుల్ అనువాద వ్యాసాలకు వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గం చేర్చండి.--కె.వెంకటరమణ⇒చర్చ 11:45, 10 సెప్టెంబరు 2016 (UTC)
- Meena gayathri.s ఈ పని చెయ్యడానికి కావల్సిన పనిముట్లు, ఉత్సాహం ఉంటే తప్పకుండా చెయ్యండి. నాకు చేతకాలేదు కనుక నేను చెయ్యలేను అంటున్నాను. Vemurione (చర్చ) 15:09, 10 సెప్టెంబరు 2016 (UTC)
- Vemurioneగారూ నాకు అర్ధం అయిందండీ. మీకు ఆసక్తి ఉండి, అనువాదం చేయడం ప్రాసెస్ వల్ల ఇబ్బంది అయితే ఆ టూల్ బాగా పనికివస్తుంది అని చెప్తున్నా. దీనికనే కాదు అసలు అనువాదాలకు అది మంచి టూల్. లైన్ టు లైన్ అనువదించుకుని, డిలీట్ చేసుకుని ఇంత శ్రమ అక్కర్లేదు పక్కన ఇంగ్లీష్ పేరా కనపడుతుంది మనం తెలుగులో లింకులు, ఫోటోలు, మూలాలతో సహా అనువదించేసుకోవచ్చు.--Meena gayathri.s (చర్చ) 02:56, 11 సెప్టెంబరు 2016 (UTC)
- నేను వేమూరి గారితో ఏకీభవిస్తున్నాను. వేమూరి గారు మీకు వ్యాసం మొదటి నుంచి బాగా రాయగలనని అనిపిస్తే అలానే రాయండి. నేను మరీ చెత్తగా కనిపించిన, విషయ ప్రాముఖ్యత లేని రెండు మూడు వ్యాసాలను తొలగించాను. అలాగే ప్రాముఖ్యత ఉన్న వాటిని తొలగించకుండా ఆ అనువాదం మొత్తం తీసేసి కేవలం వ్యాసం మొదట్లో పరిచయ వాక్యాలు రాసి మొలక స్థాయి దాటించి వదిలేశాను. అడపాదడపా అలాంటి వ్యాసాల మీద ఇప్పటికీ పని చేస్తూ ఉన్నాను. కానీ అది కొండంతలా ఉంది. కాబట్టి దాన్ని గురించి వర్రీ అవకుండా మీ పద్ధతిలో మీరు సాగిపోండి. అన్నట్టు నేను ఇటీవలే విజ్ఞాన శాస్త్ర వ్యాసాలు ఆది నుంచి రాద్దామని మొదలు పెట్టి విజ్ఞానశాస్త్రం, ప్రకృతి శాస్త్రం అని రెండు వ్యాసాలు రాశాను. ఈ విషయంలో మీ సలహాలు, సూచనలు సహకారం ఆశిస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 16:03, 12 సెప్టెంబరు 2016 (UTC)
- రవిచంద్ర (చర్చ) నా సలహా అడిగేరు కనుక చెబుతున్నాను. విజ్ఞానశాస్త్రం, ప్రకృతి శాస్త్రం వంటి అంశాల పరిధి, విస్తృతి బాగా ఎక్కువ. వీటిని వర్గీకరించి మొదటి నుండీ నరుక్కురావడమంటే చాల శ్రమతో కూడిన పని అవడమే కాకుండా వాటిని ఎలా వర్గీకరించాలో అన్న విషయంలో ఏకీభావం ఉండదు. ఇటువంటి పెద్ద పెద్ద అంశాలని గురించి top-down పద్ధతిలో రాయాలంటే పదార్థం మీద గట్టి పట్టు ఉండాలి, రాతలో మంచి అనుభవం ఉండాలి. నా ఉద్దేశంలో చిన్న చిన్న అంశాలని తీసుకుని, చిన్న చిన్న వ్యాసాలు bottom-up పద్ధతిలో రాయడం తేలిక. సైంసు విషయాల గురించి తెలుగులో రాసే ఒరవడి, సంప్రదాయం ఇంకా స్థిరపడలేదు. కనుక ఫలానా విధంగా రాస్తే బాగుంటుందని నేనూ ఘంటాపథంగా చెప్పలేను. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. సైంసు రాసేటప్పుడు తెలుగులో సాంకేతిక పదాలు వాడి, పక్కనే కుండలీకరణాలలో ఇంగ్లీషు మాట కూడ చూపిస్తూ ఉంటే వ్రతమూ చెడదు, ఫలమూ దక్కుతుంది. నా అభిప్రాయం అడిగినందుకు ధన్యవాదాలు. Vemurione (చర్చ) 04:01, 13 సెప్టెంబరు 2016 (UTC)
- Vemurione గారూ, Top Down పద్ధతిలో రాయడం కష్టమని నాక్కూడా అనిపించింది. ఎందుకంటే చాలా ఆంగ్ల పదాలకు తెలుగు పదాలు ఏవి వాడాలో తెలియలేదు. అందుకే ఆంగ్ల వికీలో ఉన్న వర్గీకరణ యధాతథంగా అనుసరిద్దామనుకున్నా. నాకు భాషమీద కొద్దో గొప్పో పట్టు ఉంది కానీ పదార్థం మీద పట్టు లేదు. నేను నేర్చుకుంటూ రాద్దామని నా ఆలోచన. విజ్ఞానశాస్త్ర విషయాలను తెలుగులో రాసే సాంప్రదాయం ఇంకా స్థిరపడలేదంటున్నారు కాబట్టి మనమే ఓ ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఆలోచన. మనం ఇక్కడ ప్రయత్నం చేస్తే తరువాత మీలాంటి అనుభవం ఉన్న వారి సాయంతో మెరుగు పరచవచ్చని అనుకుంటున్నాను. మీ సూచనలు తప్పకుండా పాటిస్తాను. ధన్యవాదాలు. --రవిచంద్ర (చర్చ) 05:26, 13 సెప్టెంబరు 2016 (UTC)