Jump to content

వికీపీడియా:గూగుల్ యాంత్రికానువాదాలు - సముదాయం చర్యలు

వికీపీడియా నుండి
యాంత్రికానువాదం ద్వారా చేర్చిన వ్యాసాలపై జరిగిన చర్చలు
గూగుల్ యాంత్రికానువాదం ద్వారా వికీలో చేరిన వేలాది వ్యాసాలపై అనేక చర్చోపచర్చల తరువాత, వాటిని శుద్ధి చేసేందుకు అనేక విఫలయత్నాలు జరిగాక, చివరికి వాటిని తొలగించాలని సముదాయం నిశ్చయించింది. 2020 ఫిబ్రవరి 5 న ఆ వ్యాసాలన్నిటినీ తొలగించారు. ఆయా సందర్భాల్లో జరిగిన చర్చల వివరాలను కింది ట్యాబుల్లో చూడొచ్చు.
ప్రాజెక్టు | 2010 నవంబరు | 2016 జూలై | 2016 సెప్టెంబరు | 2016 డిసెంబరు | 2018 జూలై | 2020 జనవరి | ఇతర చర్చలు

యాంత్రికానువాదాలపై 2018 జూలైలో రచ్చబండలో చేసిన చర్చను ఉన్నదున్నట్లుగా ఇక్కడ ఇస్తున్నాం.

యాంత్రికానువాదాలు, కృతక భాష - సముదాయం చర్యలు

[మార్చు]

గూగుల్ అనువాద పరికరాన్ని ఉపయోగించి వికీపీడియాలోకి వచ్చిపడిన వేలాది వ్యాసాలు ఇంకా శుద్ధి కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిని ఏం చెయ్యాలి అనే విషయమై గతంలో చర్చలు జరిగాయి -ఇక్కడ, ఇక్కడా. పై చర్చల్లో ఎక్కువమంది ఈ వ్యాసాలను తొలగించాలని అభిప్రాయపడినప్పటికీ, కొందరు వాటిని శుద్ధి చేద్దామని భావించారు. శుద్ధి చెయ్యదగ్గ వ్యాసాలను, తొలగించాల్సిన వ్యాసాలనూ గుర్తించే పని కూడా రెండు విడతలుగా జరిగింది. ఈ రెండు విడతల్లోనూ 62 పేజీలను తొలగించాం. 66 వ్యాసాలను శుద్ధి చెయ్యదగ్గవిగా గుర్తించాం. గుర్తించామంతే! వీటిలో ఎన్ని శుద్ధికి నోచుకున్నాయో నాకు తెలీదు గానీ, బహు కొద్దిగా మాత్రమే ఉండవచ్చు. ఇవి కాక, ఇంకా పరిశీలించాల్సిన వ్యాసాలే 1825 ఉన్నాయి.

పైన ఉదహరించిన రెండో చర్చ జరిగిన రెండేళ్ళ తరువాత మన పురోగతి ఇది. ఈ ప్రగతిని, తెవికీకి ఉన్న వాడుకరుల సంఖ్యనూ గణనలోకి తీసుకుంటే ఈ కృతక అనువాద వ్యాసాలను సంస్కరించడం మన తరం కాదు, మన తరంలో కాదు అనేది నా అభిప్రాయం. పదాలను అడ్డగోలుగా కూర్చడంతో ఏర్పడిన అర్థం పర్థం లేని వాక్యాలతో కూడిన ఈ వ్యాసాలను ఎంత ఎక్కువ మంది చదివితే అంత ఎక్కువ చేటు వికీపీడియాకు. వీటిని తక్షణమే తొలగించాలి అనే నా అభిప్రాయాన్ని మరోసారి మీ ముందుకు తెస్తున్నాను. మీ అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 16:44, 19 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ అనువాదవ్యాసాలను శుద్ధి చేయడం కంటే తొలగించడం మంచిది.చదువరి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. వాటిని తొలగించి మనం వ్రాయాలనుకున్న వ్యాసాలను ప్రత్యేకంగా వ్రాయడమే మంచిది. ఇవి తెవికీ పేరుకు భగం కలిగించచ్చని నేను అభిప్రాయపడుతున్నాను.T.sujatha (చర్చ) 18:56, 19 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగించడమే ఉత్తమం.మనకు రెగ్యులరుగా రాసేవారు చాలా తక్కువ.కావున వాటిని శుద్ధిచెయ్యటం అనుకున్నంత సులభంకాదు.కావున వాటిని తొలగించడంమేలు.పాలగిరి‌Palagiri (చర్చ) 02:19, 20 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గతంలో జరిగిన చర్చల్లో ఈ వ్యాసాలను తొలగించాలని దాదాపుగా అందరూ అభిప్రాయపడ్డారు. మళ్ళీ చర్చ ఏంటి అని అనుకుంటూండవచ్చు. కానీ అప్పట్లో తొలగింపును ఇద్దరు వ్యతిరేకించారు కాబట్టి సముదాయం తొలగింపుపై ముందడుగు వెయ్యలేకపోయింది. తొలగించడాన్ని వ్యతిరేకించిన వాడుకరి:Meena gayathri.s గారు వాడుకరి:Rajasekhar1961 గారు స్పందించి తమ ప్రస్తుత అభిప్రాయం చెబితే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 01:23, 21 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పాత చర్చల్లో నేను ఏమి అభిప్రాయం చెప్పానో తెలియదు. కానీ నాకున్న సమయాభావం వల్ల శుద్ధి కార్యక్రమంలో పాల్గొనలేకపోవచ్చు. తొలగించడమే మేలు. తొలగింపు కార్యక్రమాల్లో పాల్గొనగలను. -రవిచంద్ర (చర్చ) 18:59, 21 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
యాంత్రికానువాదాలే కాదు, మక్కికి మక్కి అనువాదాలు కూడా అనవసరం. మన తెలుగు పాఠకుల దృష్టితో మనం రచించుకోవాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:51, 21 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరులు ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక, యాంత్రికానువాద వ్యాసాలను తొలగించాలని నిర్ణయించడమైనది. పవన్ సంతోష్ గారు అయా వ్యాసాలను ఎంచి పక్కన పెట్టి సరేనన్న తరువాత తొలగింపులు చెయ్యవచ్చు.__చదువరి (చర్చరచనలు) 06:53, 27 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ పైన చెప్పిన విధంగా, వాటిని ఎర్రలింకులుగా చేసి, పక్కన ఆ వ్యాసం ఆంగ్ల పేజిని లింకు ఇస్తే వాటిని తిరిగి రాయడానికి వీలుగా ఉంటుంది.--Meena gayathri.s (చర్చ) 09:05, 27 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు తోచినవి, యాంత్రికానువాదం తీసేసి మళ్ళీ మొదలు పెడుతున్నాను. రవిచంద్ర (చర్చ) 09:52, 27 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
గూగుల్ అనువాద వ్యాసాలు బాగుండటం లేదు. వాటిని శుద్ధి చేసే కంటె కొత్త వ్యాసాలు రాయడమే ఉత్తమం అని నేను లోగడ ఒక అభిప్రాయం వెలిబుచ్చేను. గూగుల్ అనువాద వ్యాసాలకి ఉంటే గింటే ఒక్క ప్రయోజనం ఉన్నట్లు కనిపిస్తున్నాది. ఫలానా వ్యాసాన్ని తెలుగులోకి గూగుల్ ద్వారా అనువాదం చెయ్యాలనే నిర్ణయం ఎలా జరుగుతోంది? ఫలానా అంశం అనువదించాలనే నిర్ణయం కేవలం యాదృచ్చికమా? లేక తార్కికమైన పద్ధతి ఉందా? ఉంటే, ఆ నిర్ణయించే పద్ధతి ప్రకారం మనమే అంశాలని ఎన్నుకొని సరి కొత్త వ్యాసాలు రాసుకుంటే సరిపోతుంది. Vemurione (చర్చ) 16:09, 10 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]