Jump to content

వాడుకరి:Chaduvari/వ్యాసం చెక్‌లిస్టు

వికీపీడియా నుండి

This template is being used in the wrong namespace. To nominate this talk page for deletion, go to Miscellany for deletion.

వికీపీడియా:మెరుగైన వ్యాసాలు పేజీలను తయారుచేసే ముందు చేసిన నేపథ్యంలో చేసిన పని ఇది. దీన్నుండి ఆ పేజీలు తయారయ్యాయి. చారిత్రికావసరం తప్పించి ఇక దీంతో వేరే పనేమీ లేదు.

వికీపీడియాలోని వ్యాసాల్లో చెయ్యడానికి చాలా పనులున్నాయి. ఒక్కో పనికి ఒక్కో స్థాయి కార్య కుశలత అవసరం. ఏయే పనులు చెయ్యాలి, రోజుకు/నెలకు/సంవత్సరానికి ఎన్ని పనులు చెయ్యాలి అనే లక్ష్యాలను స్పష్టంగా తమకు తామే నిర్దేశించుకుని పని చేసే వాడుకరులు కొందరున్నప్పటికీ, ఎక్కువమంది అలాంటి లక్ష్యాలు పెట్టుకోరు. ఏ పనులు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేదానిపై స్పష్టత లేకపోవడం దీనికొక ప్రధాన కారణం. ఆ గజిబిజిని తొలగించి, వాడుకరులు తమతమ సామర్థ్యాలకు అనుగుణమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ఒక క్రమ పద్ధతిలో, సమయబద్ధంగా పని చేసుకుంటూ పోయేందుకు అవసరమైన ముడిసరుకును అందించడం ఈ పేజీ లక్ష్యాల్లో ఒకటి. ఈ క్రమంలో వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచడాన్ని ఒక ఉద్యమంగా చెయ్యడం రెండో లక్ష్యం. వికీపీడియా సముదాయాన్ని ఒక్కటి చేసి, ప్రభావవంతమైన నిర్మాణాత్మకమైన సమష్టి కృషిని సమర్థవంతంగా చెయ్యడం మూడో లక్ష్యం.

ఈ మూడు లక్ష్యాలతో ఒక ఉద్యమాన్ని నడపాలి. ఈ ఉద్యమం మూడు స్థాయిల్లో ఉంటుంది. అన్ని స్థాయిల్లోనూ వాడుకరులు వ్యాసాన్ని మెరుగు పరుస్తారు. ఈ మూడు స్థాయిల్లో కూడా కొత్త పాఠ్యాన్ని చేర్చే అవసరం లేదు; కేవలం ఉన్న కంటెంటును మెరుగు పరచడమే! వాడుకరులు తమతమ ఆసక్తులను బట్టి ఏ స్థాయి ఉద్యమంలోనైనా, ఎన్ని స్థాయిల్లోనైనా పాల్గొనవచ్చు.

యాంత్రికానువాదం చేసి సృష్టించిన వ్యాసాలను ఈ ఉద్యమంలో చేర్చడం లేదు.

మొదటి స్థాయి ఉద్యమం

[మార్చు]

వ్యాసంలోని భాషలో ఉన్న దోషాలను సవరించడం. అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు, మరియు వంటి పడికట్టు పదాల తొలగింపు మొదలైనవి. ఈ పని చేస్తే వికీపీడియా వ్యాసాలు బాగా తేటపడతాయి. ఒక్కొక్క వాడుకరి రోజుకొక్క వ్యాసం చెయ్యవచ్చు ననేది ఒక అంచనా. యాంత్రికానువాదం చేసి సృష్టించిన వ్యాసాలను వదిలెయ్యాలి. ఆ వ్యాసాలను ఈ ఉద్యమంలో చేర్చడం లేదు.

వాడుకరులకు ఈ పని చెయ్యడానికి ఉన్న సౌలభ్యాలు.

  • ఈ పని చేసేందుకు భాషపై ప్రాథమిక స్థాయి పట్టు ఉంటే చాలు.
  • ఎక్కువ సమయం పెట్టాల్సిన పనిలేదు.
  • కొత్తగా పాఠ్యం చేర్చల్సిన పని లేదు కాబట్టి, దాని కోసం పరిశోధన చెయ్యనక్కర్లేదు.

రెండవ స్థాయి ఉద్యమం

[మార్చు]

వికీపీడియా విజ్ఞాన సర్వస్వ వ్యాసం పేజీకి ఉండాల్సిన కనీసం మాత్రపు హంగులను సమకూర్చడం.

వాడుకరులకు ఈ పని చెయ్యడానికి అవసరమైనవి.

  • ఈ పని చేసేందుకు భాషపై ప్రాథమిక స్థాయి పట్టు ఉంటే చాలు.
  • వికీపీడియా కుశలత: ప్రాథమిక స్థాయి కుశలత ఉంటే చాలు.
  • కొత్తగా పాఠ్యం చేర్చల్సిన పని లేదు కాబట్టి, దాని కోసం పరిశోధన చెయ్యనక్కర్లేదు.

ఈ స్థాయిలో వ్యాసానికి సమకూర్చాల్సిన హంగులను కింది పట్టికలో చూడవచ్చు.

క్రమ సంఖ్య అంశం వ్యక్తి సంస్థ గ్రామం/పట్టణం/

నగరం/మండలం/

జిల్లా

సినిమా ఇతర పేజీలు
1 సమాచారపెట్టె: సమాచారపెట్టె ఉంటే అందులో ఉండాల్సిన కనీస సమాచారం రాయాలి. అసలు పెట్టే లేకపోతే, సంబంధిత సమాచారపెట్టెను చేర్చి సమాచారం చేర్చాలి. (ఏ వ్యాసానికి ఏ మూస చేర్చాలో కింద రాయండి.)
  • వ్యక్తుల పేజీ:
  • సినిమా పేజీ:
  • గ్రామం పేజీ:
  • ఆంధ్ర ప్రదేశ్ మండలం పేజీ:
  • తెలంగాణ మండలం పేజీ:
  • దేశం పేజీ:
  • సంస్థ పేజీ:


••• ••• ••• •••
2 వ్యాసంలో జనన వివరం రాయాలి ••• ••• ••• •••
3 వ్యాసంలో మరణ వివరం రాయాలి (జీవించి ఉన్న వ్యక్తులకు కాకుండా) ••• •••
4 సమాచారపెట్టెలో జనన వివరం రాయాలి ••• •••
5 సమాచారపెట్టెలో మరణ వివరం రాయాలి ••• •••
6 తేదీ పేజీలో జనన వివరం నమోదు చెయ్యాలి ••• •••
9 తేదీ పేజీలో మరణ వివరం నమోదు చెయ్యాలి •••
10 సంవత్సరం పేజీలో జనన వివరం నమోదు చెయ్యాలి •••
11 సంవత్సరం పేజీలో మరణ వివరం నమోదు చెయ్యాలి •••
12 ఫలానా సంవత్సరంలోని జననాలు అనే వర్గాన్ని చేర్చాలి •••
13 ఫలానా సంవత్సరంలోని మరణాలు అనే వర్గాన్ని చేర్చాలి •••
14 అంతర్వికీ లింకులను చేర్చాలి ••• ••• ••• ••• •••
15 పేజీకి ఎడమ వైపున ఉన్న నేవిగేషను లింకుల్లో "వికీడేటా అంశం" లింకు లేకపోతే, సంబంధిత అంశానికి ఈ పేజీని జతపర్చాలి. అంశం అసలు ఉనికిలోనే లేకపోతే, ఆ అంశాన్ని సృష్టించాలి. ••• ••• ••• ••• •••
16 {{Authority control}} మూస: పేజీని ఎడిట్ మోడులో తెరిచి, అడుగున, మిగతా మూసలకు పైన ఈ మూసను ఉంచి పేజీని భద్రపరచండి. అయినా ఈ మూస పేజీలో కనిపించకపోతే, ఆందోళన పడవద్దు. ఈ పేజీకి సంబంధించిన వికీడేటా అంశంలో ఐడెంటిఫయర్లేమీ లేకపోతే, ఈ మూస కనిపించదు. కాబట్టి, పేజీని సేవు చేసాక, మూస కనబడ్డం లేదే అని ఆందోళన పడనక్కర్లేదు. మూసను పెట్టి మర్చిపోవాలి, అంతే) •••
17 ఐ.ఎమ్.డి.బి ఐడీ (సమాచారపెట్టెలో ఈ ఐడీని చేర్చాలి.) ••• •••
18 పేజీలో బొమ్మ లేకపోతే, కామన్స్‌లో వ్యాస విషయానికి సంబంధించిన సముచితమైన బొమ్మ ఉంటే దాన్ని చేర్చాలి ••• ••• ••• ••• •••

మూడవ స్థాయి ఉద్యమం

[మార్చు]

ఈ స్థాయిలో వ్యాసానికి ఉండాల్సిన ఇతర హంగులను సమకూర్చాలి. ఆ హంగులు కింది పట్టికలో చూడవచ్చు.

వాడుకరులకు ఈ పని చెయ్యడానికి అవసరమైనవి.

  • భాషపై ప్రాథమిక స్థాయి పట్టు ఉంటే చాలు.
  • వికీపీడియా కుశలత: మధ్య స్థాయి కుశలత ఉంటే చాలు.
  • కొత్తగా పాఠ్యం చేర్చల్సిన పని లేదు కాబట్టి, దాని కోసం పరిశోధన చెయ్యనక్కర్లేదు.

ఈ స్థాయిలో వ్యాసానికి సమకూర్చాల్సిన హంగులను కింది పట్టికలో చూడవచ్చు.

క్రమ సంఖ్య అంశం వ్యక్తి సంస్థ గ్రామం/పట్టణం/

నగరం/మండలం/

జిల్లా

సినిమా ఇతర పేజీలు
1 ప్రవేశిక (వ్యాసంలో విషయ సూచికకు ముందు వచ్చే ఉపోద్ఘాతం లాంటి భాగమే ప్రవేశిక. వ్యాసానికి ఉపోద్ఘాతాన్ని, వ్యాసం లోని ముఖ్యాంశాల సారాంశాన్నీ ప్రవేశికలో రాయాలి.) ••• ••• ••• ••• •••
2 మూలాలను చేర్చాలి: వ్యాసంలో అవసరమైన చోట్ల సముచితమైన మూలాలను చేర్చాలి. {{ఆధారం}} అనే మూసలు ఉంటే, మూలాలను చేర్చి వాటిని తొలగించాలి. ••• ••• ••• ••• •••
3 వ్యాసం వికీకరణ (విభాగాలుగా విభజన, వ్యాసపు ఆకృతి సవరణ, అనుచితమైన బయటి లింకుల తొలగింపు, ••• ••• ••• ••• •••
4 మెయింటెనెన్సు మూసల తొలగింపు: వ్యాసంలో తగు మార్పు చేర్పులు చేసి, తొలగించదగ్గ మూసలను తొలగించాలి.

ఉదా: మొలక, శుద్ధి, మూలాలకు సంబంధించి,

వికీపీడియా:Template messages/Maintenance

••• ••• ••• ••• •••
5 {{Authority control}}: పేజీలో అడుగున ఈ మూస కనబడుతూ ఉంటే సరే! ఎడిట్ మోడ్‌లో మూస కనబడినప్పటికీ, సేవు చేసాక కనబడకపోతే, దాని వికీడేటా అంశంలో ఐడెంటిఫయర్లు ఏమీ లేనట్లే. వికీడేటా అంశం పేజీకి వెళ్ళి అక్కడ ఐడెంటిఫయర్లను చేర్చండి. వెంటనే ఇక్కడ వికీపీడియా పేజీలో మూస ప్రత్యక్షమౌతుంది. ••• ••• •••
6 మెయింటెనెన్సు మూసల తొలగింపు: వ్యాసంలో తగు మార్పు చేర్పులు చేసి, తొలగించదగ్గ మూసలను తొలగించాలి.

ఉదా: మొలక, శుద్ధి, మూలాలకు సంబంధించి,

వికీపీడియా:Template messages/Maintenance

••• ••• ••• ••• •••

ఉద్యమాన్ని నడపడం

[మార్చు]

ఒక్కొక్క స్థాయిలో ఏయే వ్యాసాల్లో పని చెయ్యవచ్చో ఆ వ్యాసాల జాబితా తయారు చెయ్యాలి. వాడుకరులు తమకు కావలసిన వ్యాసాలను ఎంచుకుని వాటిపై పనిచేస్తారు. ఒక వారంలో లేదా ఒక నెలలో పూర్తి చెయ్యగల పనిని మాత్రమే ఎంచుకుంటారు. ముందుగా విశేష వ్యాసాలు, ఈ వారం వ్యాసాలు, మీకు తెలుసా వ్యాసాలు.. వంటి "మొదటిపేజీలో ప్రదర్శించిన వ్యాసాల"తో ఒక జాబితాను తయారు చేసి, ఆ జాబితాపై పని చెయ్యాలి.

స్వయంసమీక్ష

[మార్చు]

వాడుకరులు తాము చేసిన పనిని తామే సమీక్షించుకుంటారు. సమీక్షకులు వేరే ఎవరూ ఉండరు.