వాడుకరి చర్చ:Chaduvari/పాత చర్చ 3
- ఇది 2007 అక్టోబర్ 28 వ తేదీన ముగించి, దాచిన చర్చాపేజీ. ఇకపై ఇక్కడేమీ రాయకండి. నాతో ఏదైనా చర్చించదలిస్తే, నా వర్తమాన చర్చాపేజీలో రాయండి.
ఇది పరిశిలించండి
[మార్చు]నేనే నండి మాటలబాబు ని ఈ ఆదిశంకరుల గురించి వ్రాయాని పించింది. ఏదో మిడి మిడి జ్ఞానం వ్రాశాను. ఒకసారి ఈ లింకు [1] పరిశీలించండి .ప్రణిపాకం అంటే కాళ్ళకు సాక్షాంగ నమస్కారం చెయ్యడం. ఆంగ్లవికీ నుండి చూచి కాపీ రాయడం ఇష్టంలేక శృంగేరి వెబ్ సైటు నుండి చూచి కాపి వ్రాశాను. శంకరులు అని వ్రాయలేకుండా ఉండి పోయాను. శంకరుడు అని వ్రాయడం కష్టంగా తోచింది.--మాటలబాబు 19:29, 15 జూన్ 2007 (UTC)
- ఇక్కడ నా జవాబు రాసాను, చూడగలరు. __చదువరి (చర్చ • రచనలు) 20:25, 15 జూన్ 2007 (UTC)
- మీరు ఒక్కసారి ఇక్కడ ఒక కన్ను వెయ్యగలరు.--మాటలబాబు 17:54, 16 జూన్ 2007 (UTC)
- చదువరి గారు మీరు ఒకసారివిశ్వామిత్రుడు వ్యాసం మీద ఒక కన్ను వేయగలరు మరియు చర్చ:ఆది శంకరాచార్యులు మీద కూడా ఒక లుక్కు వేయగలరు--మాటలబాబు 12:30, 17 జూన్ 2007 (UTC)
కాపీ హక్కుల గురించి
[మార్చు]చదువరీ, ఇంతకు ముందు కాపీ హక్కులగురించి మనం కొంచెం చర్చించాము. ఈ మధ్య వవ్చిన వ్యాఖ్యల వలన కాపీ హక్కుల పరిధినీ, వికీ నిబంధనలనూ, ముఖ్యంగా బొమ్మల విషయంలో, పరిశీలించాల్సిన అవుసరం కనిపిస్తున్నది. ప్రత్యేకించి :
- తెలుగు వికీలో (వికీపిడియా: నేమ్ స్పేసులో ) కాపీ హక్కులపై ఏమైనా వ్యాసాలున్నాయా? ఇంగ్లీషులో ఉంటే అనువాదం నేను ప్రయత్నిస్తాను.
- కాపీ హక్కులకు సంబంధించి, "తెలుగు వికీ" పరిధిలో ఒక "సూచనా పత్రం" తయారు చేయాలనుకొంటున్నాను. (ప్రస్తుతం ఇది చర్చా పత్రంలా మొదలై, ఒకమాదిరి ఏకాభిప్రాయం వచ్చాక, నిబంధనల పేజీగా మార్చవచ్చును.
- అందులో మరీ క్లిష్టమైన లీగల్ పదజాలంలో కాకుండా, "ఇవి చేయ వచ్చును. ఇవి చేయరాదు. ఇవి అప్పుడప్పుడూ చేయవచ్చును" అన్న సూచనలను పొందు పరచాలని నా ప్రయత్నం. "Indian Copy RIght ప్రకారం చేయండి" అంటే దానిని ఎవరు చదువుతారు? --కాసుబాబు 20:10, 20 జూన్ 2007 (UTC)
- మీ ఆలోచన బాగుంది. మీరన్నట్టు తేలిగ్గా అర్థమయ్యేలాగు, సంక్షిప్తంగా ఉండే కాపీహక్కుల సమాచారం అవసరం.
- వికీపీడియా:కాపీహక్కులు, వికీపీడియా:కాపీహక్కు ప్రశ్నలు - ఈ రెండు పేజీలు చూడండి. __చదువరి (చర్చ • రచనలు) 08:53, 21 జూన్ 2007 (UTC)
ఏకవచన ప్రయోగం
[మార్చు]చదువరీ, ఈ వ్యాసాన్ని చూసి తగిన మార్పులు, చేర్పులు, విస్తరణలు చేయగలరు --వైజాసత్య 08:59, 21 జూన్ 2007 (UTC)
తరలించు
[మార్చు]నేను తరలించే కార్యక్రమం జరుపుతుంటే మీరెక్కడ నుండి వచ్చారు, సరే కాని మీరు ఒక సారి ఆ వ్యాసం లొని భాషని సరిచేయ గలరా.. --మాటలబాబు 16:37, 22 జూన్ 2007 (UTC)
- అలాగే చూస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 17:39, 22 జూన్ 2007 (UTC)
శునషేపుడు విశ్వామిత్రుడిని శరణు వేడుకోవడం
[మార్చు]ఒకసారి ఆ బొమ్మ పై కన్ను వెయ్యరా.. బొమ్మ బాగుంటే రంగులు వేస్తాను--మాటలబాబు 12:44, 25 జూన్ 2007 (UTC)
- బొమ్మ వెయ్యాలన్న మీ ఆసక్తి మెచ్చదగ్గది. వ్యాసంలోని ప్రముఖ సంఘటనను బొమ్మగా మలిస్తే ఇంకా బాగుంటుంది. ఉదాహరణకు శునశ్శేపుడి విషయంలో ఇంద్రుడు ప్రత్యక్షమై శునశ్శేపునికి విముక్తి కలిగించినపుడు, అతడు యూపస్థంభం నుండి విడివడుతున్న సంఘటనను చిత్రిస్తే వ్యాసానికి విలువ చేకూరుతుంది అని నా అభిప్రాయం. __చదువరి (చర్చ • రచనలు) 12:58, 25 జూన్ 2007 (UTC)
నమస్కారం
[మార్చు]చదువరి గారికి నమస్కారం, మీరు కూడా పని వట్టిడీ లొ ఉండి తెవికి వస్తున్నట్లు లేరు, నా మీద ప్రస్తుత్తం పని వత్తిడి చాలా ఎక్కువగా ఉన్నది , అందువలన నేను తెవికి రెండు రోజుల నుండి రాలేకపోతున్నాతును.పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లుంది--మాటలబాబు 08:39, 15 జూలై 2007 (UTC)
- నమస్కారం మాటలబాబు! అవునండి, తీరుబడి కాస్త తక్కువగానే ఉంది. ఉన్నంతలోనే ఎంతో కొంత ఇక్కడ కేటాయించాలి. ఎడబాటు ఎక్కువైతే అలవాటు తప్పే ప్రమాదం ఉంది :). మీ ఉద్యోగం నిలబడిన విషయం చదివాను, సంతోషం! __చదువరి (చర్చ • రచనలు) 08:48, 15 జూలై 2007 (UTC)
స్పాము
[మార్చు]అజ్ఞాత సభ్యుడు చేసినవి స్పాము అని ఎలా కనుగొన్నారు--మాటలబాబు 18:53, 2 ఆగష్టు 2007 (UTC)
- ఆ వ్యాసాల్లో కేవలం ఒక్ఖ బయటి లింకు తప్ప మరేమీ లేకపోవడం. (వికీలో స్పాము ఎక్కువగా జరిగే స్థలాల్లో బయటి లింకులు ఒకటి)
- అలా జరిగింది ఏదో ఒకటో రెండో వ్యాసాల్లో కాదు, ఏకంగా పదారు దాకా ఉండడం.
- చాలావరకు ఇచ్చిన లింకులు అధికారిక సైట్లకు సంబంధించినవి కాకపోవడం
- ఆ వ్యాసాలన్నీ అజ్ఞాత సభ్యుడు రాసినవే కావడం! (లాగిన్ అయిన సభ్యుడు రాసి ఉంటే, విషయం గురించి చర్చించి ఆపైనే ఏంచెయ్యాలో నిర్ణయించేవాళ్ళం)
- స్పాము అని నేను కనుగొనడం కాదు గానీ, పై కారణాల వల్ల అది స్పాము అనే నిర్ణయానికి వచ్చాను. మీరేమంటారు?__చదువరి (చర్చ • రచనలు) 04:30, 4 ఆగష్టు 2007 (UTC)
- మీరు వ్రాసిన కారణాలు అన్ని సరిగా నే ఉన్నాయి కాని
-
- కాని ఆ పేజికి సంబంధించిన లింకే అని అనిపించింది.
- nic.in or gov.in sites నేను సైట్ల లొకి వెళ్ల లేదు కాని పేర్లు చూశాను, ఆ సైట్లు అసలు లేకుండా ఉండే అవకాశం లేకపోలేదు. కాని నాకు మాత్రం nic.in or gov.in sites అని అనిపించింది.
- కొద్దిగా అవకాశం ఇవ్వవలసిందేమో, నేను కూడా అజ్ఞాత సభ్యుడుగానే ప్రారంభిచాను కదా..--మాటలబాబు 19:57, 4 ఆగష్టు 2007 (UTC)
- 3. అందుకే చాలావరకు అని అన్నాను.
- 4. చాలామంది అజ్ఞాతంగానే మొదలెడతారు. కానీ అందరూ ఒకేలా రాయరు. ఒక్కోరిదీ ఒక్కో ధోరణి. ఇక్కడ నేను వ్యాస గుణదోషాలనే ఎంచాను గానీ, రచయిత గురించి వ్యాఖ్యానించలేదు, గమనించగలరు!
- మరొక్క సంగతి.. వ్యాసశీర్షికకు సంబంధించి ఒక్క వాక్యం కూడా లేదా వ్యాసాల్లో. కనీసం మొలక స్థాయి కూడా లేదన్నమాట. __చదువరి (చర్చ • రచనలు) 06:29, 5 ఆగష్టు 2007 (UTC)
పరిశీలనలు
[మార్చు]ఒక్కసారి ఈ ఈ పేజిలని చూసి అభిప్రాయాలు తెలుపండి.
- --మాటలబాబు 19:52, 4 ఆగష్టు 2007 (UTC)
- మూస చర్చ:స్వాగతం మీద దృష్టి సారించండి--మాటలబాబు 08:15, 13 ఆగష్టు 2007 (UTC)
తాంసీ, అంతర్‌గావ్
[మార్చు]అదిలాబాద్ జిల్లాలో తాంసీ అనే మండలంలో ఉన్న 'అంతర్‌గావ్' లింకును 'అంతర్‌గావ్ (జగిత్యాల మండలం)'లో మార్చారు. జగిత్యాల కరీంనగర్ జిల్లాలోని మండలంకదా. లేదా అలా మార్చటానికి ఏదయినా కారణం ఉందా. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 03:54, 15 ఆగష్టు 2007 (UTC)
- అది నా తప్పు; సరిచేసాను. ఎత్తిచూపినందుకు థాంక్సు. __చదువరి (చర్చ • రచనలు) 04:33, 15 ఆగష్టు 2007 (UTC)
- నేను ఇంకా అలా రాయటానికి ఇంకేదయినా కారణం ఉందేమో అని అనుకున్నాను. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 06:07, 15 ఆగష్టు 2007 (UTC)
సంతకం
[మార్చు]కంపశాస్త్రి గారికి సంతకము గురించి సలహా ఇచ్చారు. నాకు కూడా సందేహం ఉన్నది. సంతకం ఎక్కడ ఎలా మర్చుకొవాలి. వికీలో చేరినప్పుడు ఏలాగో సంతకం మార్చాను. ఇప్పుడు ఆ విధానము తెలియరావడం లేదు. కంపశాస్త్రిగారి కి కూడా వివరంగా అంచెలంచెలుగా తెలుపండి. ధన్యవాదాలు--మాటలబాబు 05:45, 23 ఆగష్టు 2007 (UTC)
- వికీపీడియా:కస్టమైజేషన్ పేజీ ఒకసారి చూడండి. సంతకాన్ని ఎలా రూపొందించుకోవాలో అక్కడ ఉంది. ఏమైనా సందేహాలుంటే మనం చర్చిద్దాం. __చదువరి (చర్చ • రచనలు) 06:54, 23 ఆగష్టు 2007 (UTC)
సభ్యనామము
[మార్చు]సభ్యుడు:Abcdefg అనే సభ్యనామము అనుచితముగా ఉన్నదా అనే సందేహము కలిగినది. అందువలన స్వాగత సందేశం ఇవ్వలేదు.--మాటలబాబు 18:33, 23 ఆగష్టు 2007 (UTC)
- వికీపీడియా:సభ్యనామము పేజీని ఓసారి తిరగేసాను, పై పేరు అనుచితమైన పేర్ల కోవలోకి వస్తున్నట్టు లేదు. మీరూ చూడండోసారి.:) __చదువరి (చర్చ • రచనలు) 18:45, 23 ఆగష్టు 2007 (UTC)
బొమ్మలు
[మార్చు]కావురు బొమ్మలు బాగున్నాయి.--మాటలబాబు 07:46, 24 ఆగష్టు 2007 (UTC)
- క్షేమమే కదా. మీరు కాని హైదరాబాదు నగరవాసులు కారుకదా.. చాలా బాధ కరమైన విషయం జరిగింది. నిన్ని పడుకొని నిద్రలేచి కూడాలి లొ బ్లాగులు తెరిచి చూస్తే ఈ దిగ్భాంతి చెందించే వార్త--మాటలబాబు 09:38, 26 ఆగష్టు 2007 (UTC)
- నేను మీరు మొదలు పెట్టిన వ్యాసము కెలుకుతున్నాను. దిద్దుబాటు ఘర్షణ్ జరగకుండా మీరు భద్రపరచే ముందు విషయం అంతా కాపీ చేసి తరువాత భద్ర పరచండి అప్పుడు వ్రాసిన సమాచారము బ్రౌజర్ లొ ఉంటుంది అతికించవచ్చు--మాటలబాబు 09:43, 26 ఆగష్టు 2007 (UTC)
దేశాల జాబితాలు
[మార్చు]చదువరీ, దేశాల జాబితాలకు సంబంధించి చాలా వరకు పని నేను ఆఫ్‌లైనులో చేశాను. ఒక్కొక్కటీ సరిచూసి వికీలో చేరుస్తున్నాను. కనుక ప్రస్తుతానికి నీవు వీటిలో క్రొత్త జాబితాలు మొదలుపెట్టవద్దు. శ్రమ వృధా కాకుండా. నా పని పూర్తయ్యాక వ్రాస్తాను. --కాసుబాబు 14:42, 31 ఆగష్టు 2007 (UTC)
మంగళగిరి
[మార్చు]చదువరీ! మంగళగిరి వ్యాసంలో అనేకచోట్ల పానకాలస్వామి మరియు లక్ష్మీనరసింహస్వామి ప్రస్తావనలను అటునిటు చేసి తికమక చేశారని నా అనుమానం. కాస్త పరిశీలించగలరు. --వైజాసత్య 07:33, 2 సెప్టెంబర్ 2007 (UTC)
గ్రామాల వ్యాసాల గురించి
[మార్చు]చదువరీ!
నీ ప్రస్తుత నివాస స్థానం ఆంధ్ర ప్రదేశ్‌లోనే అనుకొంటున్నాను. అందుకనే ఈ విషయం వ్రాస్తున్నాను. చాలా రోజులనుండి నా మనసులో ఉన్నది.
గ్రామాల గురించి మన వ్యాసాలు పెద్దగా ముందుకు వెళ్ళడం లేదు. సినిమాలు కూడా అంతంత మాత్రమే. ఇది తెవికీకి పెద్ద లోటు. పెద్ద సంఖ్యలో ఉన్న ఈ పేజీలకు Minimum Mass of content లేకపోవడం వలన వాటికి 'ఊపు' రావడం లేదని నా అభిప్రాయం.
ప్రతిరోజూ దినపత్రికలలో ఎన్నో వూళ్ళగురించి ఏవేవో వార్తలు వస్తుంటాయి. ముదిగొండ లాంటి పెద్ద ఘటనలు, విగ్రహం ఆవిష్కరణ లాంటి చిన్న వార్తలూ కూడాను. వాటిని ఆయా వూరి వ్యాసాలలో "వార్తల్లో" అన్న శీర్షిక క్రింద ఎక్కించే ప్రయత్నం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకు ఒక మార్గం - ఎవరైనా టైపింగ్ నేర్చుకొనేవారు లేదా పార్ట్ టైమ్ వర్క్ కోసం చూసేవారికి "ఉచితమైన" పారితోషికం ఇచ్చి ఈ పని అప్పజెప్పడం. ఆంటే వారు "పాక్షిక వలంటీర్లు" అని మనం పరిగణించ వచ్చును. (ఇందువలన తెవికీ 'స్వచ్ఛంద కృషి' స్టేటస్ దెబ్బ తినదనుకొంటాను). అటువంటి పనిని లోకల్‌గా ఇద్దరు, ముగ్గురు కోఆర్డినేట్ చేయాలి. అందుకయ్యే ఖర్చు గురించి మనం తరువాత నేరుగా మెయిల్‌లో చర్చిద్దాము.
నా ప్రతిపాదన అత్యుత్సాహంతో కూడుకొన్నదే కావచ్చును. కాని తెవికీలోని ఒక పెద్ద లోటును పూడ్చడానికి మనం కొంత 'రాడికల్'గా ఆలోచించాలి అనిపిస్తున్నది. మీ అభిప్రాయం తెలియజేయండి.--కాసుబాబు 05:34, 9 సెప్టెంబర్ 2007 (UTC)
చేబ్రోలులో గుడి బొమ్మ
[మార్చు]చదువరీ, నేను చేబ్రోలు వ్యాసానికి ఆంగ్ల వికీ నుండి బొమ్మ:Chebrole.jpg బొమ్మ తెచ్చాను. చేబ్రోలులో ప్రసిద్ధి చెందిన చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం ఇదేనో కాదో కాస్త పరిశీలించి తెలుపగలరు --వైజాసత్య 09:59, 21 అక్టోబర్ 2007 (UTC)
- సారీ, నేనా గుడిని చూడలేదు. ఈసారి వెళ్ళినపుడు చూసి, చెబుతాను. __చదువరి (చర్చ • రచనలు) 11:54, 21 అక్టోబర్ 2007 (UTC)
విన్నపం
[మార్చు]చదువరి గారు మీరు వ్రాస్తున్న చిట్కాలను వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 25 వలె తేదీ ప్రకారం వ్రాస్తే నేను ఆంగ్ల వికీ చూసి చేసిన ఒక మూస ఈ నాటి చిట్కా లో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మూస ఇంకా పూర్తిగా తయారవ్వలేదు. దయచేసి ఆ విధంగా రాయండి.దేవా 05:43, 25 అక్టోబర్ 2007 (UTC)
- విన్నపం మన్నించినందుకు ధన్యవాదాలు. ఇంకా మూస ప్రయోగశాల దశలోనే ఉంది. మీరు చిట్కాలను వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 26, వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 27 అని వరుసగా తయారుచేస్తూ వెళ్ళండి. దేవా 05:56, 25 అక్టోబర్ 2007 (UTC)
- చదువరి గారు {{ఈ నాటి చిట్కా}} తయారయ్యింది. ఇందులో మీరేమైనా మార్పులు చేయదలిస్తే చేయండి.దేవా 06:55, 25 అక్టోబర్ 2007 (UTC)
- మీరీ మూసలను మెరుగుపరచగలరా...మూస:Day-1 మరియు మూస:Day+1... Error: invalid time అని చూపుతుంది. దాని బదులు అక్టోబర్ 24 మరియు అక్టోబర్ 26 అని చూపాలి.దేవా 07:30, 25 అక్టోబర్ 2007 (UTC)
- పైన చెప్పిన మూసలు దారిలోకి వచ్చాయి. కాని '(Chaduvari (చర్చ) చేసిన మార్పులను, Dev వరకు తీసుకువెళ్ళారు)' ఈ మెసేజ్ అర్థం ఏమిటో నాకు తెలియదు. తెలియజేయగలరా?దేవా 08:03, 25 అక్టోబర్ 2007 (UTC)
- మీరీ మూసలను మెరుగుపరచగలరా...మూస:Day-1 మరియు మూస:Day+1... Error: invalid time అని చూపుతుంది. దాని బదులు అక్టోబర్ 24 మరియు అక్టోబర్ 26 అని చూపాలి.దేవా 07:30, 25 అక్టోబర్ 2007 (UTC)
- చదువరి గారు {{ఈ నాటి చిట్కా}} తయారయ్యింది. ఇందులో మీరేమైనా మార్పులు చేయదలిస్తే చేయండి.దేవా 06:55, 25 అక్టోబర్ 2007 (UTC)
- విన్నపం మన్నించినందుకు ధన్యవాదాలు. ఇంకా మూస ప్రయోగశాల దశలోనే ఉంది. మీరు చిట్కాలను వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 26, వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 27 అని వరుసగా తయారుచేస్తూ వెళ్ళండి. దేవా 05:56, 25 అక్టోబర్ 2007 (UTC)
ఓహో! అది నేను గమనించలేదు. నేను ఆ శీర్షికను తొలగించడానికి కారణం అది మూసలో శీర్షికగా పనిచేయడంలేదు. మీరోసారి ఈ లింకును చూడండి. అందులో చూపినట్టుగా మన వికీపీడియా:వికీ చిట్కాలు పేజీని కూడా క్లుప్తంగా ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం. మీకు ఒకవేళ శీర్షిక మార్చాలనిపిస్తే మార్చండి. దేవా 08:58, 25 అక్టోబర్ 2007 (UTC)
చిట్కాలు వ్రాయడం అంత కష్టమైన పని కాదనుకుంటాను. చలాకీగా ఉన్న ప్రతీ సభ్యులు ఒకటి లేదా రెండు చిట్కాలు చేర్చితే ఒక నెల గడిచిపోతుంది. అందరూ సహకరిస్తారనే అనుకుంటున్నాను. ధన్యవాదాలు దేవా 02:36, 26 అక్టోబర్ 2007 (UTC)