Jump to content

వికీపీడియా:కాపీహక్కు ప్రశ్నలు

వికీపీడియా నుండి
ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు
యొక్క భాగము
ప్రశ్నల పేజీలు...
చూడండి...

కట్టె కొట్టె తెచ్చె

[మార్చు]
కాపీహక్కుల గురించి వికీపీడియాలో తరచూ అడిగే మూడు ముఖ్యమైన ప్రశ్నలకు సంక్షిప్త సమాధానాలు ఈ విభాగంలో ఇచ్చాము. సంబంధిత పేజీలకు లింకులూ ఇచ్చాము. మిగతా విభాగాల్లో కాపీహక్కుల చట్టానికి సంబంధించి స్థూల వివరణ నిచ్చాము.

వేరే ఎక్కడి నుండో తెచ్చిన దాన్ని నేను వికీపీడియాలో పెట్టవచ్చా?

[మార్చు]
సాధారణంగా కుదరదు. సభ్యులు పెట్టదలచిన విషయం మామూలుగా కాపీహక్కులు కలిగినదై ఉంటుంది. కొన్నిసార్లు ఏదో ఒక లైసెన్సు కింద రచయితే విడుదల చేసి ఉండవచ్చు. (కింద చూడండి). కొన్ని సందర్భాల్లో అది సార్వజనికం అయి ఉండవచ్చు (కింద చూడండి). కాపీహక్కుల నోటీసు లేనంత మాత్రాన, ఆ రచనను స్వేచ్ఛగా వాడుకోవచ్చని అనుకోరాదు.
కేవలం వికీపీడియాకు మాత్రమే అనుమతించినవి, వ్యాపార ఉపయోగాలను నిషేధించిన లైసెన్సులను కలిగిన రచనలకు కూడా వికీపీడియాలో అనుమతి లేదు. చాలా తక్కువ సందర్భాల్లో అమెరికా కాపీహక్కుల చట్టం లోని సద్వినియోగం(Fairuse) అంశం కింద కాపీహక్కులున్న బొమ్మలను కూడా వాడుకోవచ్చు. (వికీపీడియా:సద్వినియోగం, కింద చూడండి). కాపీహక్కుల విషయంలో మీకేదైనా సందేహం ఉంటే, ఆ రచనను వాడకపోవడమే మంచిది.

వేరే వికీపీడియా వ్యాసంలోని బొమ్మను నావ్యాసంలో వాడుకోవచ్చా?

[మార్చు]
ఆ బొమ్మ GFDL లైసెన్సుకు లోబడి విడుదల చేసి ఉంటేనే! లేదా అది పూర్తి స్వేచ్ఛా లైసెన్సు కలిగి ఉంటేనే! ఆ బొమ్మకు సద్వినియోగం అని ట్యాగు తగిలించి ఉంటే, బహుశా అలా వాడుకోవడం కుదరదు. మరిన్ని వివరాలకు సద్వినియోగం విభాగం చూడండి.

వికీపీడియాలోని రచనలను వేరే ఎక్కడైనా వాడుకోవచ్చా?

[మార్చు]
వికీపీడియాలోని రచనలు కాపీహక్కులకు లోబడి ఉన్నాయి. కింద చెప్పిన విధంగా మా లైసెన్సు నిబంధనలకు లోబడి వాటిని వాడుకోవచ్చు.
వికీపీడియా లోని రచనలు (కొటేషన్లలోనిది కాకుండా) GNU Free Documentation License కు లోబడి విడుదల చెయ్యడమైనది. (లేదా అది సార్వజనికమైనది. అంచేత ఈ రచనలను వాడుకుని చేసిన రచన దేన్నైనా తిరిగి GFDL లో విడుదల చేసి తీరాలి. అంటే, రచన శ్రేయస్సును మూల రచయితలకు ఆపాదిస్తూ, మీ రచనను స్వేచ్ఛగా వాడుకునేలా ఇతరులను అనుమతించాలన్నమాట. (ఇది కేవలం సారాంశం మాత్రమే, పూర్తి పాఠం కోసం లైసెన్సు పాఠం చూడండి.)
మీ రచనలను GFDL కు లోబడి విడుదల చెయ్యలేకున్నా, అలా చెయ్యడం మీకిష్టం లేకున్నా, మీరు వికీపీడియా వ్యాసాలను వాడుకోరాదు. వికీపీడియా లోని చిన్న చిన్న కొటేషన్లను, వాటి మూలాన్ని ఉటంకిస్తూ - అమెరికా కాపీహక్కుల చట్టం లోని సద్వినియోగం అంశానికి లోబడి - వాడుకోవచ్చు. వికీపీడియా వ్యాసాలను ఉదహరించే విధి విధానాల కోసం వికీపీడియా:వికీపీడియాను ఉదహరించడం ను చూడండి. వికీపీడియాకు, దానిలోని వ్యాసాలకు హైపరులింకులిచ్చందుకు ఏ అనుమతులూ అవసరం లేదు.
వికీపీడియాలో వాడే బొమ్మలకు ప్రత్యేకంగా ఓ లైసెన్సు పద్ధతి ఉండొచ్చు. బొమ్మ యొక్క వివరణ పేజీ చూస్తే దాని కాపీహక్కుల గురించి తెలిసిపోతుంది. చాలా బొమ్మలు సార్వజనిక మైనవి, లేదా కాపీలెఫ్టు లైసెన్సులు కలిగినవి అయి ఉంటాయి. మరి కొన్ని సద్వినియోగం కోవ లోకి వచ్చేవి కూడా ఉంటాయి.

వికీపీడియాలో కాపీహక్కుల ఉల్లంఘన జరిగిందని గమనిస్తే ఏంచెయ్యాలి?

[మార్చు]
మేం దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాం. కాపీహక్కుల ఉల్లంఘనలకు వికీపీడియాలో చోటు లేకుండా చెయ్యడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం గానీ, అలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీ కాపీహక్కులపై ఉల్లంఘన జరిగినట్లు మీరు గమనిస్తే వికీపీడియా:కాపీహక్కుల ఉల్లంఘన సత్వర తొలగింపు లేదా వికీపీడియా:కాపీహక్కుల సమస్యలు పేజీల్లో ఫిర్యాదు చెయ్యండి.

కాపీహక్కు అంటే ఏమిటి?

[మార్చు]
కాపీహక్కు (Copyright) అంటే ఒక సృజనాత్మక వస్తువు లేదా పనిని ఇతరులు వాడుకోకుండా, కాపీ చెయ్యకుండా దాని స్వంతదారుకు లభించిన హక్కు. పేటెంటు లాగా కాపీహక్కు కోసం ప్రత్యేకించి దరఖాస్తు చేసుకునే అవసరం లేదు - ప్రతీ సృజనాత్మక పనికీ ఆటోమాటిగ్గా కాపీహక్కు ఒనగూడుతుంది.
పుస్తకం, పాట, బొమ్మ, ఫోటో, పద్యం, గేయం, గద్యం, కల్పిత పాత్ర - ఇలా ఏదైనా సృజనాత్మక పనే అవుతుంది. అమెరికాలో అయితే 1990 డిసెంబర్ 1 తరువాత కట్టిన భవనాలకు కూడా కాపీహక్కు ఉంది.[1]
లైసెన్సులు: కొన్ని నిబంధనలకు లోబడి తమ పనిని కాపీ చేసుకునేందుకు ఇతరులకు లైసెన్సులు ఇవ్వవచ్చు. లైసెన్సు ఓ కాంట్రక్టు లాంటిది - కాపీహక్కుల స్వంతదారు విధించిన నిబంధనలకు లోబడి లేదా సదరు కాపీహక్కు ఇచ్చిన మినహాయింపులకు లోబడి గానీ కాపీ చేసుకోవచ్చు.
కాపీహక్కు చట్టాలు వివిధ దేశాలను బట్టి మారుతాయి; అమెరికాలో అయితే Title 17. అనేక దేశాలు పాలుపంచుకున్న కాపీహక్కు చట్టంలో భాగమైన బెర్న్ కన్వెన్షను, కాపీహక్కులకు సంబంధించి ఒక విస్తృత అంతర్జాతీయ ఒప్పందం.
అన్ని రకాల కాపీలను కాపీహక్కు పరిరక్షించదు: కాపీహక్కు స్వంతదారు అభ్యంతర పెట్టినా కొంతవరకు కాపీ చేసుకునేలా బెర్న్ కన్వెన్షను, అమెరికా చట్టం రెండూ కూడా వీలు కల్పించాయి.

సార్వజనికం

[మార్చు]
కాపీహక్కులు లేని పని ఏదైనా సార్వజనికమైనట్లే. దాన్ని ఎవరైనా కాపీ చేసుకోవచ్చు. కాపీహక్కులు లేకపోవడానికి కారణాలు: దాని కర్త స్వయంగా దాన్ని సార్వజనికం చేసి ఉండవచ్చు, అసలది కాపీహక్కులకు అర్హమైనది కాకపోవచ్చు, లేదా కాపీహక్కులకు కాలం చెల్లిపోయి ఉండవచ్చు. కాపీహక్కులు చెల్లిపోవడానికి వివిధ దేశాల్లో వివిధ నియమాలు ఉన్నాయి. అమెరికాలో 1923కు ముందు ప్రచురితమైన వాటికి కాపీహక్కులు ఉండవు, ఇంగ్లండులో సంగీతపు రికార్డులు విడుదలైన 50 ఏళ్ళ తరువాత సార్వజనికమౌతాయి.
అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగ పరంగా చేసే పని సార్వజనికమే. అంచేత అమెరికా కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్లలో ఉండే సమాచారం చాలావరకు సార్వజనికమే. కాకపోతే ఆ వెబ్ సైట్లలో కొంత భాగం బయటివారు చేసిన పని ఉండొచ్చు. ఆ పనులకు కాపీహక్కులు ఉంటాయి. కాబట్టి ఆ సైట్లలోని విషయాన్ని గ్రహించేటపుడు కాపీహక్కుల గురించి చూడాలి. అయితే అమెరికా రాష్ట్రాల ప్రభుత్వాల పనులకు కాపీహక్కులు ఉంటాయి.
ఇంగ్లండు ప్రభుత్వం చేసే పనులకు కాపీహక్కులుంటాయి, అవి సార్వజనికం కావు.
ఇంటర్నెట్లో కాపీహక్కుల నోటీసు లేని సమాచారాన్ని గమనిస్తే దాన్ని సార్వజనికమని అనుకోరాదు. ప్రపంచం మొత్తం మీద ఉరుగ్వే, పరాగ్వే - రెండు దేశాల్లోనే అలా నోటీసులుంటేనే కాపీహక్కులున్నట్లుగా పరిగణిస్తారు.
కాపీహక్కులున్న ఒక విషయంలో సార్వజనికమైన విషయమేదైనా భాగంగా ఉన్నంత మాత్రాన, ఆ విషయం మొత్తం సార్వజనికమైపోదు. ఆ విషయంలోని సార్వజనిక భాగాన్ని మాత్రం యథేచ్ఛగా వాడుకోవచ్చు.

తద్భవాలు (Derivative works)

[మార్చు]
ఒక ఉత్పత్తిపై ఆధారపడి తయారు చేసిన, బాగా పోలికలున్న ఉత్పత్తిని మొదటి దానికి తద్భవం (derivative) గా పేర్కొంటారు. చలం రచించిన దోషగుణం కథపై ఆధారపడి నిర్మించిన గ్రహణం సినిమా దోషగుణం యొక్క తద్భవం అవుతుంది. అంచేత గ్రహణంకు దోషగుణం కాపీహక్కుదారుల అనుమతి అవసరం.
తద్భవ ఉత్పత్తిని పంపిణీ చేసేందుకు అసలు రచయిత అనుమతి అవసరం. సద్వినియోగం వంటి హక్కులను వాడినపుడు ఈ అనుమతులు అవసరం ఉండకపోవచ్చు. సాధారణంగా అసలు ఉత్పత్తి యొక్క సారాంశం గానీ, విశ్లేషణ గానీ తద్భవం కోవలోకి రావు. అయితే అసలు ఉత్పత్తిలోని అధిక భాగాన్ని వాడుకుంటే మాత్రం అది సారాంశం కాక, సంగ్రహంగా భావించబడుతుంది.
సార్వజనికమైన ఒక ఉత్పత్తిని తీసుకుని, దానికి విస్తృతమైన మార్పులు చేసి విడుదల చేస్తే, కొత్త ఉత్పత్తికి కాపీహక్కులు లభిస్తాయి.
సార్వజనికమైన ఒక ఉత్పత్తిని తీసుకుని, దానికి విస్తృతమైన మార్పులు చేసి విడుదల చేస్తే, కొత్త ఉత్పత్తికి కాపీహక్కులు లభిస్తాయి.
అయితే, ఈ కొత్త ఉత్పత్తి అసలు దాని కంటే విభిన్నంగా ఉండాలి.
సార్వజనికమైన టు-డైమెన్షను వస్తువులను (తద్భవాలు) ఫోటో తీసారనుకోండి. ఆ ఫోటోలకు కాపీహక్కులుండవు. అదే థ్రీ-డైమెన్షను వస్తువుల ఫోటోలకైతే కాపీహక్కులు లభిస్తాయి. ఈ రెండు కేసుల్లోనూ అసలు వస్తువులు సార్వజనికమైనవే. అయితే థ్రీ-డైమెన్షను వస్తువుల ఫోటోలను తీసందుకు ఫోటోగ్రాఫరుకు సృజనాత్మకత ఉండాలి. అది టు-డైమెన్షను వస్తువుల విషయంలో అంతగా అవసరం లేదు. అంచేత సార్వజనికమైన థ్రీ-డైమెన్ష వస్తువుల ఫోటోలకు కాపీహక్కులు ఉండవని భావించరాదు.
కాపీహక్కులున్న భవనాల ఫోటోలు తద్భవాలుగా భావించబడవు. [2]

సదుపయోగం (fair use) అంటే ఏమిటి?

[మార్చు]
కొన్ని నిబంధనలకు లోబడి, కాపీహక్కుదారుని అనుమతి లేకుండానే ఒక పనిని కాపీ చెయ్యవచ్చు. అలాంటి నిబంధనల్లో ఒకటి సద్వినియోగం (en:fair use).
ఈ సదుపయోగం నిబంధనలు ఖచ్చితంగా నిర్వచించి లేవు; వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉంటాయి.
అమెరికాలో సదుపయోగం కోవలోకి వచ్చే విషయాలు ఇవి:
  1. వాడే విధానం - వ్యాపార అవసరాలా లేక లాభాపేక్షల లేని విద్యావసరాలా;
    అది లాభాపేక్ష కోసమా కాదా? అది విమర్శ, వ్యాఖ్యానం, వార్తా నివేదిక, బోధన, స్కాలరుషిప్పు, పరిశోధన వంటివా? అసలు ప్రచురణను మార్చివేసే వంటిదా?
  2. కాపీహక్కులున్న పని ఎటువంటిది;
    అది ఎన్నో సృజనాత్మక విశేషాలున్న స్వతంత్ర ఉత్పత్తియా లేక ఓ మాదిరి సృజనాత్మకమైనదఅ లేక వాస్తవాలను పేర్చిన జాబితా వంటిదా? ఆ రచన ప్రజలందరు చదివందుకు గాను ప్రచురితమైందా? లేదంటే అది సదుపయోగం కాకపోవచ్చు.
  3. కాపీహక్కులున్న అసలు పనిలోని ఎంత భాగాన్ని కాపీ చేసారు;
    అసలు పనిలోని ఎంత భాగాన్ని కాపీ చేస్తున్నారు? మీకు కనిష్టంగా అవసరమైనంత మేరకే చేస్తున్నారా? ఈ కనిష్ట స్థాయిని ఎంత ఎక్కువ మించితే, సదుపయోగం కాకపోయే అవకాశం అంత ఎక్కువ. అసలు పనిని తక్కువగా వాడడం వలన అసలు పని లోని నాణ్యతను తగ్గిస్తున్నారా?
  4. అలా వాడడం వలన మూలం యొక్క మార్కెట్ పైన, దాని విలువ పైనా ఉండే ప్రభావం.
    అలా వాడడం వలన, మూల కృతిని అమ్మడంలో కర్తకు ఇబ్బందులు ఎదురౌతాయా? వాళ్ళు దాని ప్రచారం కోసం, పునఃప్రచురణ కోసం ప్రయత్నిస్తున్నారా? మూలాన్ని కొనదలచిన వారికి వీలుగా, అది ఎక్కడ దొరుకుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నారా?
ఒక కృతిని వాడుకోవడం సదుపయోగమా కాదా అనే దాన్ని కేవలం పై అంశాలే నిర్ధారించవు - అన్నిటినీ పరిశీలించాలి.
వ్యాఖ్యలు, సూక్తులు సదుపయోగానికి ప్రముఖ ఉదాహరణలు.
అసలు కృతిని సదుపయోగ పద్ధతిలో వాడి తద్భవ కృతిని తయారు చేసినపుడు మీ కృతి కూడా సదుపయోగం కిందకే వస్తుంది. మీ కృతిని సార్వజనికంగా విడుదల చేసినా, మూల కృతి సదుపయోగం కింద ఉంటుంది కాబట్టి, తుది ఫలితం సదుపయోగమే అవుతుంది. దీన్ని నివారించడానికి మూల కృతి వినియోగాన్ని కాపీహక్కులకు లోబడనంత తక్కువ స్థాయికి కుదించాలి.
ఓ కృతి లైసెన్సు, సదుపయోగమూ రెండింటి కిందా ఉండటమూ సాధ్యమే. ఓ దేశంలో లైసెన్సుకు లోబడి ఉంటూ, లేదా ఒక ప్రత్యేక వాడుక కోసం లైసెన్సుకు లోబడి ఉంటూ, ఇతర వాడుకల కోసం సదుపయోగం కింద ఉండవచ్చు. లైసెన్సులు, అవి ఏ వినియోగాలను కవరు చేస్తాయో వాటి విషయంలో ఎటువంటి న్యాయపరమైన చర్యలు ఉండవనే ధీమాను కల్పించడంతో న్యాయపరమైన రిస్కు తగ్గుతుంది. మీరు సదుపయోగం మాత్రమే చేస్తున్నప్పటికీ, దాని లైసెన్సు గురించి వాకబు చెయ్యడం మంచిది.

వికీపీడియా, సదుపయోగమూ (fair use)

[మార్చు]
వికీపీడియా డేటాబేసు సర్వర్లు అమెరికాలో ఉండటం చేత వికీపీడియా అమెరికా కాపీహక్కు చట్టాలకు లోబడి ఉంటుంది. ఆ చట్టాన్ని అతిక్రమించే కంటెంటును హోస్టు చెయ్యదు. వికీపీడియా:Fair use is an evolving page offering more specific guidance about what is likely to be fair use in the Wikipedia articles, with examples. In general, the educational and transformative nature of Wikipedia articles provides an excellent fair use case for anyone reproducing an article.

ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక సూచనలు

[మార్చు]
Particularly in relation to photographers a number of other considerations may also restrict your right to take or publish photographs. For example a photograph of a person may infringe their right to privacy. Similarly you may not have the right to take photographs in non-public locations. These restrictions are often mistakenly referred to as copyright infringements when in fact other laws apply.
Useful short-hand guides may be found concerning certain rights and restrictions affecting photographs taken

లైసెన్సులు

[మార్చు]
ఏదైనా కృతిని తగు విధమైన పద్ధతిలో వినియోగించాలనే నిబంధనలను సూచించేదే లైసెన్సు. ఒక కృతికి ఎన్ని లైసెన్సులైనా ఉండవచ్చు.
ఉదాహరణ - చాలా విస్తృతంగా వాడే MySQL డేటాబేసు కనీసం రెండు లైసెన్సులతో లభిస్తుంది.., ఒకటి GPL లైసెన్సు కాగా, రెండోది సోర్సు కోడును వెల్లడి చెయ్యకుండానే మార్పుచేర్పులను పంపిణీ చేసుకునే వీలు కలిగించేది.
పెద్ద వ్యాపార సంస్థల అవసరాలకు అనుగుణంగా ఉండేలా కాపీహక్కులను రూపొందించడం హక్కులు కలిగిన వారు సామాన్యంగా చేసే పని; చిన్న వ్యాపార సంస్థలలు, వ్యక్తిగత వినియోగదారుల విషయంలో ఇది అంత ఎక్కువగా ఉండదు. వ్యక్తులు సాధారణంగా కింది లైసెన్సులు వాడతారు:

వ్యాపారేతర లైసెన్సులు

[మార్చు]
అనేక రకాల వ్యాపారేతర లైసెన్సులు ఉన్నాయి. సామాన్యంగా అవి ఇలా చెబుతాయి: ఈ కృతిని మీరు వ్యాపారేతర అవ్సరాల కోసం వాడుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చెయ్యవచ్చు..
జింబో వేల్స్ ఈ లైసెన్సు గల కృతుల వాడకాన్ని నిషేధించాడు.. అయితే, సదుపయోగం కింద వాటిని వాడుకోవచ్చు.

విద్యా విషయిక లైసెన్సులు

[మార్చు]
వైజ్ఞానిక కృతులను విద్యా సంబంధిత వినియోగాలకు అనుమతించడం మామూలే. ఏది విద్యా సంబంధితమనేది ప్రచురణకర్త నుండి ప్రచురణకర్తకు మారుతుంది. పాఠశాలలు, కళాశాలలే విద్యా సంబంధితంగా కొందరు భావిస్తే, కొందరు విజ్ఞాన సర్వస్వాల వంటి వాటిని కూడా విద్యా సంబంధితంగానే భావిస్తారు.
జింబో వేల్స్ ఈ లైసెన్సు గల కృతుల వాడకాన్ని నిషేధించాడు.. అయితే, సదుపయోగం కింద వాటిని వాడుకోవచ్చు.

యథేచ్ఛ లైసెన్సులు

[మార్చు]
ఈ లైసెన్సులు అనియంత్రిత వినియోగం, మార్పు చేర్పులు, పంపిణీలను అనుమతిస్తాయి. ఇవి కృతిని వినియోగించుకోవడాన్ని వీలయినంత సులభం చేస్తాయి. సార్వజనికం చెయ్యకుండానే కృతిని వీలైనంత విస్తృతంగా లభింప జేయడమే ఈ లైసెన్సు ఉద్దేశ్యం. తద్భవాలను మరింత నియంత్రిత లైసెన్సు ద్వారా విడుదల చెయ్యవచ్చు.
లైసెన్సు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడమనేది ఈ లైసెన్సు విషయంలో చాలా అరుదు. అంచేత ఈ కృతులను తిరిగి వాడుకోవడం చాలా సులభం.

శ్రేయోపూర్వక లైసెన్సులు

[మార్చు]
తద్భవ కృతుల విషయంలో, మూల కర్తకు శ్రేయస్సును ఆపాదించడం అనే నిబంధన కలిగిన లైసెన్సు ఇది. శ్రేయోపూర్వక లైసెన్సు ఇలా చెబుతుంది: "మూల కర్తకు శ్రేయస్సును ఆపాదిస్తూ ఉన్నంత కాలమూ, ఈ కృతిని మీరు వాడుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, పంపిణీ కూడా చేసుకోవచ్చు."

కాపీలెఫ్టు లైసెన్సులు

[మార్చు]
Some licenses are called "copyleft" licenses. Essentially, they have three key properties:
  • A work licensed with a copyleft license can be copied at will.
  • All published derivative works must use exactly the same license as the original: if you use the work, you're forced to use the same license for your own original work as well.
  • If your work is using a different license, you can't use the copyleft license, even if your work is also using a (different) copyleft licence.
You aren't forced to use the copyleft work as part of your own work if you don't want to accept the license.
There is increasing awareness of the license incompatibility problem of copyleft licenses, since many people are simply trying to force reusers to publish the source of their work. Licenses which allow the use of other copyleft licenses seem likely to evolve to overcome the fragmentation of the copyleft world. Today, multiple licensing (licensing under all desired copyleft licenses) is the best workaround available. Sometimes people don't want to solve this problem: they may believe that the Free Software Foundation or Creative Commons is best and may want to hurt the one they dislike or promote only the one they like.
Example: Alice writes a thesis on St. Peter and releases it under a copyleft license. Bob wants to use part of her thesis in his book about the Bible, but if he does, he would have to release his book under the same license. This would let others copy Bob's book whenever they want without paying him for it.
Example: Alice writes a programming language example at WikiBooks. Bob can't use it in his GPL computer program because the GFDL and GPL are different and incompatible copyleft licenses. Alice would need to offer both a GFDL and GPL license to allow this use.
Example: Alice writes a thesis. Bob wants to use part of the thesis in a description of a trade secret. He can't do this, because the license requires him to make the trade secret public, not restrict distribution to only those who agree not to publish the trade secret. Bob would need to ask Alice for a different license.
On Wikipedia, images licensed under incompatible but similar copyleft licenses (like {{cc-by-sa}}) are allowed, as they can be incorporated into articles at will (as the actual GFDLed text just has a pointer to the image) and the only thing that can't be done is using parts of both images to create a new image (as derivatives must be under the same license).
The GNU Free Documentation License (GFDL) is a copyleft license produced by the Free Software Foundation.
Example: Permission is granted to copy, distribute and/or modify this document under the terms of the GNU Free Documentation License, Version 1.2 or later
Some people have complained that the GFDL is too hard to interpret and too hard for reusers of small works to comply with because the license can be longer than the work covered by the license. This reflects its origins as a license intended for manuals, not small works. There is some hope that the FSF will help to remove these problems in a future version.
All text on Wikipedia is licensed under the GFDL.

క్రియేటివ్ కామన్స్ లైసెన్సులు

[మార్చు]
"క్రియేటివ్ కామన్స్ లైసెన్సు" (CCL) అనేది క్రియేటివ్ కామన్స్ సంస్థ తయారు చేసిన అనేక లైసెన్సుల్లో ఒకటి. ఈ లైసెన్సులన్నీ కృతులను స్వేచ్ఛగా పంపిణీ చేసుకునే వీలు కల్పిస్తాయి. అయితే, వివిధ లైసెన్సులు కింది అంశాల్లో ఏవో కొన్నిటి కలగలుపుతో ఉంటాయి:
  • శ్రేయస్సును ఉదహరించడం.
  • వ్యాపారేతర (వ్యాపారాత్మక వినియోగాన్ని అనుమతించక పోవడం).
  • తద్భవాలు కూడదు (తద్భవ కృతులను పంపిణీ చేయకుండా నిషేధించడం).
  • (కాపీలెఫ్ట్) (తద్భవ కృతులను తిరిగి అదే లైసెన్సు ద్వారా మాత్రమే పంపిణీ చెయ్యాలనే నిబంధన విధించడం).

సాధారణ వ్యాపారాత్మక లైసెన్సులు

[మార్చు]
పునః పంపిణీని నిషేధించేందుకు, వాడుకరికి ఉత్పత్తిని వాడుకునే సౌకర్యం కలిగిస్తూనే వారి హక్కులను వీలైనంతవరకు పరిమితిలో ఉంచేందుకు ఉద్దేశించినదే వ్యాపారాత్మక లైసెన్సు. ఈ లైసెన్సులు చాలా నిర్బంధాలతో కూడుకుని ఉంటాయి. అయితే లైసెన్సు అసలు లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉండడం నయం.
వ్యాపారేతర లైసెన్సులు, విద్యా విషయక లైసెన్సుల లాగా ఈ లైసెన్సుకు లోబడి ఉన్న కృతులను వికీపీడియాలో వాడరాదు. అయితే, సదుపయోగం కింద అలాంటి రచనలను వాడే అవకాశం ఉంది.