వికీపీడియా:సాంకేతిక ప్రశ్నలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు
యొక్క భాగము
ప్రశ్నల పేజీలు...
చూడండి...


వికీపీడియా సాఫ్ట్‌ వేర్‌, హార్డ్‌వేర్‌, ఇంకా ఇతర సాంకేతిక విషయాలపై సమాచారం ఇక్కడ లభిస్తుంది.

గమనిక: మీరు వెదుకుతున్న ఏదైనా ఒక ప్రత్యేక సామ్కేతిక సమస్యకు సమాధానం ఇక్కడ దొరక్క పోతే, దానిని వికీపీడియా:Troubleshooting లేదా రచ్చబండ వద్ద గానీ అడగండి.

ఒకే పేజీని ఒకేసారి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మారుస్తూంటే ఏమి జరుగుతుంది?[మార్చు]

చివరగా మార్చిన వారికి (తరువాతి వారికి) "మార్పు ఘర్షణ" సందేశం వస్తుంది. దానితో పాటు తమ మార్పులను, చిట్టచివరగా భద్రపరచిన కూర్పు తో కలిపి వేసే అవకాశం కూడా వస్తుంది. ఒక వేళ మీరు మార్పులు చేస్తూ, సరి చూస్తున్నపుడు కూడా (భద్రపరచక ముందే) మార్పు ఘర్షణల కొరకు వికీ చూస్తుంది. వరసగా వచ్చే బహుళ ఘర్షణలను కూడా గుర్తించి దానికి కొద్ది భేదం కలిగిన సందేశం పంపిస్తుంది. ఒక రకంగా ఇది సాఫ్ట్‌వేర్ కూర్పులను నిర్వహించే Concurrent Versions System (CVS) వంటిదే.
మీడియావికీ సాఫ్ట్‌వేర్ పురోభివృధ్ధి చెందేకొద్దీ, పేజీ ఘర్షణల పరిమాణం తగ్గిపోతూ ఉంది. జనవరి 2005 లో, ఇది పేజీ లోని ఒక విభాగం ([edit] లింకు కలిగినది) స్థాయికి పడిపోయింది.

మర్చిపోయిన సంకేతపదాన్ని ఎలా తిరిగి పొందాలి?[మార్చు]

అకౌంటు ప్రారంభించినపుడు, మీ ఈ-మెయిల్‌ అడ్రసు ఇచ్చిఉంటే, కొత్త సంకేత పదాన్ని పెట్టుకోవచ్చు. పైన కుడి మూలన ఉన్న "లాగిన్‌" లింకునున నొక్కండి. మె సభ్యనామం రాసి, "నా కొత్త సంకేత పదాన్ని పంపు" అనే మీట నొక్కండి. కొత్త సంకేత పదంతో మీకో ఈ-మెయిల్‌ వస్తుంది. దానితో లాగిన్‌ అయి, తరువాత సంకేత పదాన్ని మీరు మార్చుకోవచ్చు.

తప్పులు కనిపిస్తే ఎలా నివేదించాలి?[మార్చు]

తప్పులను పరిశీలించడానికి డెవెలపర్లు మీడియాజిల్లా ను వాడతారు. మరింత సమాచారం కొరకు తప్పుల నివేదికలు చూడండి.

ఒక కొత్త అంశం గురించిన సలహా ను ఎలా పంపాలి?[మార్చు]

ఏదైనా అంశంపై అభ్యర్ధనకు మీడియాజిల్లా ను వాడండి. (దీనికి బగ్జిల్లా పేజీని వాడాలి.)
మీడియాజిల్లా వాడకంపై సమాచారానికై తప్పుల నివేదికలు చూడండి.
కొత్త అంశాన్ని చర్చించడానికి, మీడియావికీ అంశాలకై వినతులు, తప్పుల నివేదికలపై చర్చ పేజీ ని చూడండి. మీడియాజిల్లా లో మీ వినతిని నివేదించక పోతే, అది ఎప్పటికీ అమలు కాకపోవచ్చని గుర్తుంచుకోండి

వికీపీడియా ను నడిపే సాఫ్ట్‌వేర్‌ ఏది?[మార్చు]

తొలుత క్లిఫోర్డ్‌ ఆడమ్స్‌ యొక్క UseModWiki పై నడిపాము. జనవరి 2002 లో, PHP లిపికి మారాము. ఆపై, తరువాతి జులై లో దానిని సమూలంగా మార్చేసి ప్రస్తుతమున్న మీడియావికీ ని రూపొందించాము.
డాటాబేసు గా MySQL ని, వెబ్‌ సర్వరు గా అపాచి ని, DNS గా PowerDNS ను వాడుతున్నాము.
వికీపీడియా సర్వర్ల operating system - Linux.

హార్డ్‌వేర్‌ సంగతేమిటి?[మార్చు]

ప్రస్తుత పరిస్థితి[మార్చు]

m:Wikimedia servers చూడండి.