చర్చ:విశ్వామిత్రుడు
దాచిన భాగం
[మార్చు]చర్చా సౌలభ్యం కొరకు ఈ దాచి ఉంచిన భాగాన్ని ఇక్కడ అతికిస్తున్నా "విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షికి నమస్కరించి ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా, యజ్ఞ యాగాదులు సక్రమంగా జరుగుతున్నాయా అని కుశలం అడుగుతాడు. వశిష్ఠుడు బదులిచ్చి, రాజ్యంలో ప్రజలు సౌభాగ్యంగా ఉన్నారా, సామంత రాజులు సఖ్యంగా ఉంటున్నారా అని విశ్వామిత్రుడిని కుశలం అడుగుతాడు."
చదువరి గారు, ఈ భాగాన్ని ఎందుకు దాచారోనాకు అర్థం కావడం లేదు. ఒకసారి మీరు బాలకాండ లొ 52 సర్గ లొని 6-10 శ్లోకాలు పరిశీలించండి, లింకు ఇస్తున్నాను చూడండి.
- ప్రతిపదార్థం
- గద్యార్థం చూడండి.
- దయచేసి ఆ భాగాన్ని అక్కడ మళ్ళి నిక్షేపించచ్చేమో ఆలోచించండి.--మాటలబాబు 19:47, 4 ఆగష్టు 2007 (UTC)
- మాటలబాబు, మీరు రాసినదాంట్లో ఏదో తప్పుందని దాచినట్లు నాకనిపించలేదు. కథ/వృత్తాంతము యొక్క వర్ణన (Detail)కొద్దిగా ఎక్కువయ్యిందనే చదువరి దాచుంటారని నాకనిపించింది. విశ్వామిత్రుని గురించి సాంస్కృతిక, చారిత్రక, ఐతిహాసిక ధృక్కోణాలనుండి ఒక పేజీలో ఇమడగలిగే విజ్ఞాసర్వస్వపు వ్యాసం రాస్తున్నప్పుడు రామాయణంలోని ఒక సన్నివేశంలో విశ్వామిత్రుడు అన్నాడంటూ
వ్యాసుడువాల్మీకితన కల్పనతోరాసిన మాటలు అవసరమా? (కాస్త స్థూలదృష్టితో ఆలోచించండి). విజ్ఞానసర్వస్వము రాసేటప్పుడు ఒక విహంగవీక్షణా దృష్టి (bird's eye view) అవసరం --వైజాసత్య 20:13, 4 ఆగష్టు 2007 (UTC)
- మాటలబాబు, మీరు రాసినదాంట్లో ఏదో తప్పుందని దాచినట్లు నాకనిపించలేదు. కథ/వృత్తాంతము యొక్క వర్ణన (Detail)కొద్దిగా ఎక్కువయ్యిందనే చదువరి దాచుంటారని నాకనిపించింది. విశ్వామిత్రుని గురించి సాంస్కృతిక, చారిత్రక, ఐతిహాసిక ధృక్కోణాలనుండి ఒక పేజీలో ఇమడగలిగే విజ్ఞాసర్వస్వపు వ్యాసం రాస్తున్నప్పుడు రామాయణంలోని ఒక సన్నివేశంలో విశ్వామిత్రుడు అన్నాడంటూ
- వ్యాసుడు కాదు, వాల్మీకి, తప్పులు ఏరు వారు తమ తప్పులు ఎరుగరు--మాటలబాబు 20:15, 4 ఆగష్టు 2007 (UTC)
- క్షమించాలి వాల్మీకి అనబోయి వ్యాసుడు అనే రాశేశా --వైజాసత్య 20:18, 4 ఆగష్టు 2007 (UTC)
- ఆ భాగం దాచడంలో నా ఉద్దేశ్యం సరిగ్గా వైజాసత్య చెప్పిందే!మరింత వివరిస్తాను:
- విశ్వామిత్రుని గురించిన ఓ సంక్షిప్త వ్యాసం ఇది. ఏం జరిగిందో చెప్పే క్రమంలో అవసరమైన మేరకు పాత్రల మధ్య సంభాషణ వాడొచ్చు. ఉదాహరణకు - "శబలను ఇమ్మని విశ్వామిత్రుడు అడిగాడు, వశిష్టుడు కుదరదన్నాడు." విశ్వామిత్రుడి జీవితాన్ని మలుపు తిప్పిన ఈ ఘటనలోని సంభాషణకు ఉన్న ప్రాముఖ్యత, వాళ్ళిద్దరూ ఏ కుశల ప్రశ్నలు వేసుకున్నారనే దానికి లేదు. నేను దాచిన సంభాషణలు కథా వర్ణనకు - ఈ వ్యాస పరిధిలో - అవసరం లేదని నా అభిప్రాయం; అంచేతే దాచాను. __చదువరి (చర్చ • రచనలు) 06:21, 5 ఆగష్టు 2007 (UTC)
విశ్వామిత్రుడు మేనకల సంతానం
[మార్చు]విశ్వామిత్రుడు మేనకల సంతానం శకుంతల అని శకుంతల దుష్యంతునికి పుట్టినవాడు భరతుడు అని విన్నాను. ఇదేంటి ఈ వ్యాసంలోని మేనక విశ్వామిత్రుల క్రీడలు విభాగంలో ఈ విధంగా ఉంది
"వాల్మీకి రామాయణం లో మాత్రం మేనకకు విశ్వామిత్రుడికి భరతుడు జన్మించడం అనే ప్రస్తావన లేదు. ఇది వేరే ఇతిహాసం లొ ఉండి ఉండవచ్చు." --వైజాసత్య 07:12, 6 ఆగష్టు 2007 (UTC)
- విశ్వామిత్రుడు వ్యాసాన్ని నేను యధాతదంగా వాల్మీకీ రామాయణం నుండీ వ్రాశాను, హరిశ్చంద్రుడిని పరిక్ష చెయ్యడం దేవి భాగవతం(భాగవత పురాణం) 8వ లెక 9 వ స్కందములొ ఉన్నది.అదేవిధంగా మేనక,విశ్వామిత్రుల రతి క్రీడల తరువాత శకుంతల పుట్టడం దుష్య్ంతుడు శకుంతల వివాహం జరగడం , భరతుడు వారిని కలపడం రామాయణం లొ చెప్పబడలేదు, నాకు ఇప్పటికి జ్ఞప్తిక లొ లేదు ఏ పురాణం నుండో..అందుకే అలా ఆ వ్యాఖ్య వ్రాశాను.గాయత్రి మంత్రాన్ని సృష్టించిన విషయం ఏ మంత్రం లొ ఉన్నదో తెలియదు నాకు, కాని గాయమత్రి మంత్రం అనుష్ఠానం చేసుకొనే టప్పుడు విశ్వామిత్ర ఋషిః అని చెబుతారు.ప్రతి మంత్రానికి ఒక దేవతా ఒక ఋషి , ఒక చందస్సు ఉంటాయి.గాయత్రి మంత్రానికి ఋషి విశ్వామిత్రుడు--మాటలబాబు 07:53, 6 ఆగష్టు 2007 (UTC)
వాక్య వివరణ
[మార్చు]త్రిశంకు స్వర్గం విభాగంలో ఈ వాక్యం అర్థం కాలేదు:
- "వారి అభ్యర్థన మేరపు త్రిశంకు ఉండే స్వర్గాన్ని నక్షత్రమండలానికి ఆవల త్రిశంకుడు తలక్రిందులుగా త్రిశంకు స్వర్గం లో ఉందేటట్లు అంగీకరిస్తాడు."
అర్థం కానందువలన నేను సరిదిద్దలేదు. ఈ వాక్యంలోని సందిగ్ధతను తొలగించి, మరింత వివరంగా రాయాలి. __చదువరి (చర్చ • రచనలు) 14:27, 6 ఆగష్టు 2007 (UTC)
- వాక్యర్థం పూర్తిగా రాలేదనే విషయాన్ని నేను అంగీకరిస్తాను. ఇక్కడ చూడండి చివరి పేరా], నాకు అర్థం అయ్యినంత వరకు దేవతల అభ్యర్థన మేరపు త్రిశంకుడు ఉండే స్వర్గం మనకు కనిపించే నక్షత్ర మండలానికి (మన పాల పుంతకి ఆవల మరో గెలాక్సీ లొ) ఆవల ఉన్నది, అందులొ త్రిశంకుడు తల క్రిందులుగా ఉంటాడు.--మాటలబాబు 22:25, 6 ఆగష్టు 2007 (UTC)
వారసత్వము/గోత్రాలు
[మార్చు]నేను పూర్తిగా చదవక, గోత్రాలు అనే శీర్షిక కనిపించక, రాశాను. తీరా అది "వారసత్వము" అని ఉంది.
ఏది heading గా బాగుంటుందో మీరే నిర్ణయించండి. గోత్రాలని నేను తీసివేస్తున్నాను. కిరణ్మయీ 13:46, 26 జూన్ 2009 (UTC)