Jump to content

వాడుకరి చర్చ:Chaduvari/పాత చర్చ 6

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ నాటి చిట్కా...
"ఉపవర్గాలు ఎలా మొదలుపెట్టాలి?"

ఉపవర్గాలను తయారుచేయడానికి, ఇప్పుడున్న వర్గంలో వర్గాన్ని తయారుచేయండి. ఉదాహరణకు [[Category:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు ]] అని [[Category:వరంగల్ జిల్లా]]లో వ్రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ వర్గం లేకపోతే ఎరుపు వర్ణంలో వర్గాల స్థానంలో ప్రదర్శింపబడుతుంది. కొత్త వర్గాన్ని తయారుచేయడానికి ఈ చిట్కాను చూడండి-వర్గాలు తయారు చెయ్యటం.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

స్వాగతం! నా చర్చాపేజీలో రాసే వ్యాఖ్యలకు సమాధానాలు ఇక్కడే ఇవ్వడానికి ఇష్టపడతాను.
ఒకవేళ సమాధానం మీ పేజీలో ఇవ్వాలని మీరు భావిస్తే ఆ విషయం రాయండి, అలాగే రాస్తాను.

గ్రామ వ్యాసాలు కావాలి

[మార్చు]

మరిన్ని గ్రామ వ్యాసాలను పంపగలరు. Bhaskaranaidu (చర్చ) 11:12, 18 నవంబర్ 2017 (UTC)

@Bhaskaranaidu:, విశాఖ జిల్లా ఫైళ్ళు మరికొన్ని పంపించాను చూడండి.__చదువరి (చర్చరచనలు) 14:47, 18 నవంబర్ 2017 (UTC)
మరి కొన్ని గ్రామ వ్యాసాలను పంపించండి సార్. Bhaskaranaidu (చర్చ) 12:35, 23 నవంబర్ 2017 (UTC)
Bhaskaranaidu గారూ, పంపించాను. __చదువరి (చర్చరచనలు) 15:01, 23 నవంబర్ 2017 (UTC)
చదువరి గారూ ...... మరి కొన్ని గ్రామ వ్యాసాలను పంపించండి. Bhaskaranaidu (చర్చ) 05:03, 29 నవంబర్ 2017 (UTC)
Bhaskaranaidu (చర్చ) 16:15, 30 నవంబర్ 2017 (UTC)
భాస్కరనాయుడు గారూ, రెండు రోజులుగా పంపడానికి వీలు చిక్కలేదు. ఇప్పుడే విశాఖపట్నం 800 ఫైళ్ళు పంపాను.__చదువరి (చర్చరచనలు) 15:08, 1 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు. మరి కొన్ని గ్రామాల వ్యాసాలను పంపండి. Bhaskaranaidu (చర్చ) 16:23, 9 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు మీరు పంపిన విశాఖ పట్నం జిల్లా గ్రామల పాట్యం అన్ని ఎక్కించాను. ఆ జిల్లాలో ఇంకా మూడు మండలాల గ్రామాల పాఠ్యాంశాలు మిగిలి వున్నాయి. అవి 39. విశాఖపట్నం మండలం |40.విశాఖపట్నం (పట్టణ)41.పెదగంట్యాడ | వాటితో బాటు మరి కొన్ని గ్రామాల పాఠ్యాంశాలను పంపండి. అనంతపురం జిల్లా గ్రామ పాఠ్యాంశాలను నాకు పంపినట్లుగా వ్రాసుకున్నారు. నిజానికి అవి నాకు అందలేదు. వాటిని పంపగలరు.Bhaskaranaidu (చర్చ) 15:36, 26 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
Bhaskaranaidu గారూ, మీరడిగిన ఆ మూడు మండలాలు ఫైలులో కనబడలేదండి. బహుశా అవి పట్టణ మండలా లయ్యుండొచ్చు. అనంతపురం జిల్లా గ్రామాల ఫైళ్ళను మీకు పంపించినట్లు ఊరికే రాసుకోలేదండి. అక్టోబరు 27 వ తేదీన - చిత్తూరు రెండో విడత, అనంతపురం జిల్లా - ఈ రెండు ఫైళ్ళనూ జోడించి, మీకు ఈమెయిలు పంపించాను. ఆ ఈమెయిలు ఓసారి మళ్ళీ చూసుకోండి (పవన్ సంతోష్ గారికి కూడా కాపీ ఉంది ఆ మెయిలు).__చదువరి (చర్చరచనలు) 17:09, 26 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు....

మరి కొన్ని గ్రామవ్యాసాలను పంపించడి. కర్నూలు జిల్లా ను ఎవరికి కేటాయించలేదనిపిస్తుంది. ఆ జిల్లావ్యాసాలను పంపించండి. ఇంతవరకు ఎవరికి కేటాయించని జిల్లా గ్రామ వ్యాసాలను మాత్రమే పంపగలరు. ఎందు చేతనంటే..... ఒక జిల్లా వ్యాసాలు ఒక్కరే చేస్తే ఉత్తరోత్తరా అందులో దొర్లిన తప్పొప్పులను సరిదిద్దే అవకాశము వారే తీసుకుంటారని నా నమ్మకము. Bhaskaranaidu (చర్చ) 16:22, 4 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Bhaskaranaidu గారూ, రాత్రి, కడప జిల్లా గ్రామాల ఫైళ్ళను పంపించాను సార్.__చదువరి (చర్చరచనలు) 04:32, 5 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ....

మీరు పంపిన కడప జిల్లా గ్రామ వ్యాసాలు పూర్తయినవి. కర్నూలు జిల్లాగ్రామ వ్యాసాలు పంపగలరా...... Bhaskaranaidu (చర్చ) 05:25, 13 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు......

ఇంతవరకు ఎవ్వరికి కేటాయించని జిల్లా గ్రామ వ్యాసాలను పంపమని మనవి. Bhaskaranaidu (చర్చ) 17:03, 24 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Bhaskaranaidu గారూ, కర్నూలు జిల్లా గ్రామాల ఫైళ్ళను పంపి వారమైంది సార్.__చదువరి (చర్చరచనలు) 17:52, 24 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు......
చదువరి గారు పైన చెప్పినట్లు కర్నూలు జిల్లా గ్రామ వ్యాసాలు నాకు పంపి ఒక్క వారము మాత్రమే అయినది. అవి పూర్తి అయినందున మరొక్క జిల్లా గ్రామ వ్యాసాలను పంపమని అభ్యర్దించాను. పై సమాదానములో "ఒక జిల్లా గ్రామ వ్యాసాలన్నిటిని సుమారు వెయ్యి వ్యాసాలను పంపి ఒక్క వారం కూడ కాలేదు.... ఇంతలో మల్లీ మరొక్క జిల్లా వ్యాసలను కావాలని అడగటమా??????" అనే అర్థం ద్వనిస్తున్నది. అడిగినన్ని వ్యాసాలను పంపితే దుర్వినియేగము చేస్తారనే భయమే మరేదైనా కారణమో ???? దీనిని బట్టి నాకు అర్థమైనదేమంటే.... "ఒక్కొక్క వాడుకరికి ఒక్క వారానికో లేదా ఒక్క నెలకో ఇన్ని వ్యాసాలు మాత్రమే పంపబడును" అని కోటా కేటాయించు కున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని నాకు ముందుగా తెలియ జేసి వుంటే నా కోటా ప్రకారమే పని పూర్తి చేసి నాకు కేటాయించిన సమయము తర్వాత మాత్రమే వ్యాసాలకొరకు అభ్యర్దన పెట్టే వాడిని. కోటా పద్దతి వున్నట్లు నాకు తెలియక పోవడమే ఈ గందరగోళానికి కారణము.

పైగా ఒక వాడుకరికి కేటాయించిన వ్యాసాలన్నీ పూర్తి చేసారా లేదా అన్న విషయము చదువరి గారు పరిశీలించిన తర్వాత మాత్రమే వ్యాసాలను పంపుతారని అనుకున్నాను. అదియును గాక వాడుకరి ఇచ్చిన వ్యాసాలను పూర్తిచేశాడా లేదా? అన్న విషయములో గోప్యత లేదు. అంతా బహిరంగమే. పైగా చదువరి గారు వికిపీడియాలో అధికారి కూడాను. కొత్తగా వ్యాసాలను కేటాయించు నప్పుడు ఇదివరకు ఇచ్చిన వ్యాసాలను పూర్తి చేశాడా? లేదా? అన్న విషయాన్ని పరి శీలించిన తర్వాత నే కొత్త వ్యాసాలను కేటాయిస్తారు.

చదువరి గారూ......... ఇప్పుడు మించి పోయినది ఏమి లేదు... మీరు నిర్ణయించు కున్న కోటా ప్రకారమే ఆ సమయానికే నాకు మరి కొన్ని గ్రామ వ్యాసాలను పంపగలరు. తొందర లేదు. ఒక వేళ మీరు పంపక పోయినా పర్వాలేదు. నాకు ఇబ్బంది ఏమి లేదు. Bhaskaranaidu (చర్చ) 06:55, 25 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Bhaskaranaidu గారూ, మీరు బాగా గందరగోళంలో ఉన్నారు.
"అవి పూర్తి అయినందున మరొక్క జిల్లా గ్రామ వ్యాసాలను పంపమని అభ్యర్దించాను.": అవి పూర్తైనట్లు మీరు చెప్పలేదు. చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? కర్నూలు జిల్లా గ్రామాల ఫైళ్ళు మీకు ఈమెయిల్లో పంపించాను. అవి మీరు చూసుకోలేదేమోనని నేను అనుకున్నాను. గతంలో అనంతపురం జిల్లా ఫైళ్ళ విషయంలో ఇలాగే జరిగింది (ఈ చర్చ పేజీలోనే పైన ఉంది చూడండి); నేను మెయిలు పంపించిన సంగతి చెప్పాక గానీ మీరు చూసుకోలేదు. ఇప్పుడూ అలాగే జరిగిందేమోనని, "పంపి వారమైంద"ని రాసాను.
దీన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ఏదో ధ్వనిస్తోందని భావించారు. ఇక ఆ తరువాత మీరు రాసినవి - కోటాలు, పరిశీలనలూ వగైరా -సదరు అపార్థపు పర్యవసానమైన మీ అనుకోళ్ళే; నిజాల్లేవు. __చదువరి (చర్చరచనలు) 05:10, 28 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Bhaskaranaidu గారూ, పాత మహబూబ్ నగర్ జిల్లా గ్రామాల ఫైళ్ళు పంపించాను. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత, చాలా గ్రామాల మండలం, జిల్లాలు మారిపోయాయి. ఆయా మార్పులను ఈ ఫైళ్ళలో చేర్చాను. అయితే ఆ గ్రామాల పేజీల్లో "జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం ఫలానా మండలంలో, ఫలానా జిల్లాలో ఉండేది" అనే వాక్యం చేర్చండి. "ఫలానా" స్థానంలో సంబంధిత మండలం/జిల్లా పేరును రాయండి. @Pavan santhosh.s: __చదువరి (చర్చరచనలు) 06:03, 28 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పతకం

[మార్చు]
అసాధారణమైన సమన్వయ పురస్కారం
తెలుగు వికీపీడియాలో గ్రామ వ్యాసాల అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టును చేపట్టి అసాధారణమైన కృషితోనూ, నైపుణ్యంతోనూ సమన్వయం చేస్తున్నందుకు మీకు ఈ పతకం. సమిష్టిగా చేస్తున్న కృషిలో మీ సమన్వయంలో మనం ఉట్టి కొట్టే రోజు అతి త్వరలోనే వస్తుందని నమ్ముతూ --పవన్ సంతోష్ (చర్చ) 07:55, 3 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, ముందు ఉట్టి కెగురుదామంటారు, అంతేగా! :)
నిజానికి మీరు తలపెట్టి నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు స్వర్గమంత ఎత్తున్నదే! ఎందరో వికీపీడియనుల కృషి ఉంది కాబట్టే ఇది జరుగుతోంది. ముఖ్యంగా యర్రా రామారావు గారు, Bhaskaranaidu‎గార్ల కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక సమన్వయమంటారా.. అది మీరు చేస్తున్నారు. నేను చేసేది మీకు తోడ్పాటు మాత్రమే.
రాత్రి పగలు లేక శ్రమియించు వారిలో
చిట్టచివరివాడ చిన్నవాడ
పర్వతసమమైన ప్రాజెక్టు పనిలోన
ఉడతసాయమైన ఉచితమనుచు
మీ అభినందనలకు నెనరులు__చదువరి (చర్చరచనలు) 16:40, 3 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త సభ్యులకు సాయం చేసేందుకు

[మార్చు]

నిన్న మన ఇద్దరం చేసిన సంభాషణలో వచ్చిన ఆలోచనకు ఇదిగో ఇక్కడ రూపం ఇవ్వడం మొదలుపెట్టాను. ఓసారి చూడమని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:39, 2 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్ట్ టైగర్ లో నా వ్యాసాల విషయం

[మార్చు]

నిర్వాహకులైన వాడుకరి:Chaduvariవాడుకరి:Pavan santhosh.s గార్లకు, మీరు సూచించిన విధంగా కళింగ యుద్ధం, కనిష్కుడు వ్యాసాలలో బైట్లు పెంచాను దయచేసి గమనించగలరు. సంతకం చేయకుండా ఈ వ్యాఖ్య రాసిన వారు: Meena gayathri.s (చర్చమార్పులు)

@Meena gayathri.s:కళింగయుద్ధం సరే.. కానీ కనిష్కుడు పేజీలో కొత్తగా సమాచారమేమీ చేరినట్టు లేదండీ. ఓసారి పరిశీలించండి.__చదువరి (చర్చరచనలు) 10:31, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాల కోసం

[మార్చు]

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాలు ఉంటే రాయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని సభ్యులు భావించినందున వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు_టైగర్_రచనా_పోటీ/అంశాలు పేజీలోని "ప్రాజెక్టు టైగర్ రచనా పోటీకి కొత్త అంశాలకై ప్రతిపాదన" అన్న దగ్గర వ్యక్తిగతంగా అభిరుచి ఉన్న అంశాలు, సముదాయ కృషికి సంబంధించిన అంశాలు అన్న రెండు ఉప విభాగాల కింద ప్రతిపాదనలు చేస్తే చర్చించేందుకు వీలుగా ఉంటుందనుకుంటున్నాం. దయచేసి మీకు పేజీలోని సంబంధిత విభాగం పరిశీలించి మీ ప్రతిపాదనలు అక్కడ చర్చకుపెట్టండి. సమిష్టిగా కొన్ని అంశాలు కోరుతూ ప్రతిపాదనలు చేస్తే జాతీయ స్థాయిలో సమన్వయం చేస్తున్నవారికి మన ఉద్దేశాలు, అభిప్రాయాలు ఈ అంశాల విషయంలో బలంగా తెలియజేయవచ్చన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:16, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పేరు మార్పు

[మార్చు]

చదువరి గారు. నా పేరును తెలుగు నుండి ఆంగ్లంలోకి మార్చుకోవాలనుకొంటున్నాను. ప్రస్తుతం ఉన్న పేరు విశ్వనాధ్.బి.కె. నుండి B.K.Viswanadh గా మార్చగలిగే అవకాసం ఉంటే మార్చగలరు..విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)

విశ్వనాధ్ గారూ, ప్రత్యేక:GlobalRenameRequest పేజీలో మీ విజ్ఞప్తిని చేర్చండి. స్టీవార్డులు పేరు మారుస్తారు. అధికారులకు ఆ హక్కు లేదనుకుంటాను. __చదువరి (చర్చరచనలు) 12:49, 5 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఇచ్చాను చదువరి గారు. లింక్ ఇచ్చినందుకు కృతజ్ఙతలు..విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)
చదువరి గారు ఒకసారి ఇక్కడ AWB గురించి చర్చ చూడండి..మీరేదైనా అడుగుతారా? విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)
విశ్వనాధ్ గారూ, గతంలో మన వికీలో ఒక వడపోతను సృష్టించాను, అక్కడ చెప్పినట్టు. అదే AWB ట్యాగు. అదే నేను రచ్చబండలో రాసాను. అయితే, ఆ ట్యాగు ద్వారా AWB దిద్దుబాట్లను కనబడకుండా చెయ్యలేం. ఆ సంగతి కూడా మీరిచ్చిన లింకులో రాసారు. __చదువరి (చర్చరచనలు) 02:07, 12 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ అనువాద వ్యాసాలు - ప్రాజెక్టు టైగర్ అంశాల కోసం పరిగణన

[మార్చు]

గూగుల్ అనువాద వ్యాసాలను ప్రాధాన్యతా క్రమంలో ముందు అభివృద్ధి చేయాల్సినవిగా ఈ 60 పైచిలుకు వ్యాసాలు మనం గతంలో ఎంచుకున్నాం. వీటిలో ఏవేవి ఇప్పటికే ప్రాజెక్టు టైగర్ కోసం ఇచ్చిన ఈ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన జాబితాలోనూ, ఆంగ్ల వికీపీడియా పాఠకాదరణ ఆధారంగా అంశాల జాబితాలోనూ ఉన్నాయో చూస్తే ఆ రెంటిలోనూ లేనివాటిని మనం స్థానిక ప్రాధాన్యత కలిగిన అంశాల్లోకి ఎంచుకోవచ్చు. మీ వీలు చూసుకుని ఈ పనిచేసిపెట్టమని కోరుతున్నాను సర్--పవన్ సంతోష్ (చర్చ) 06:00, 28 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ, చేసాను చూడండి.__చదువరి (చర్చరచనలు) 05:23, 29 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చూశాను సర్. బావుంది. మిగిలిన జాబితాల్లో లేని 42 వ్యాసాలను స్థానిక ప్రాధాన్యత కల అంశాల జాబితాలో చేర్చేశాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:41, 29 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రోజక్టు టైగర్ వ్యాసాల గురించి

[మార్చు]

మీరు అనాధ పేజీలుగా గుర్తించి, రిజెక్ట్ చేసిన వ్యాసాలు(అనుజ చౌహాన్, తేజి గ్రోవర్, మీనా కందసామి, అన్విత అబ్బి, నికోలా స్టర్గియాన్) సరిచేసాను. మీరు అవి డిలీట్ చేసి నాకు తెలియజేస్తే, తిరిగి సమర్పిస్తాను. ధన్యవాదాలతో--Meena gayathri.s (చర్చ) 11:06, 31 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మీనాగాయత్రి గారూ, చూసానండి. కొన్ని సూచనలు:
  • మీనా కందసామి పేజీకి లింకు కమల సురయ్య నుంచి ఇచ్చారు. ఆ పేజీకి ఉన్న ఒకే ఒక్క లింకు మీనా కందసామి పేజీ నుంచి! ఇతర పేజీల నుండి ఈ రెండు పేజీలకు చేరుకునే వీలు లేదు. ఈ రెండు కలిసి వాల్‌డ్ గార్డెన్ అవుతుందండి. ఏదైనా వ్యాసాల గుచ్ఛం లోని వ్యాసాలు ఒకదాని నుండి మరొకదానికి లింకులు ఉండి, వేరే ఏ ఇతర పేజీల నుండి వీటికి లింకులు లేకపోతే ఆ వ్యాసావళిని వాల్‌డ్ గార్డెన్ అంటారు. (దీన్ని గమనించడం కష్టం లెండి) ప్రస్తుతానికి మీనా కందసామికి మరొక లింకు ఇచ్చాను. పోటీకి స్వీకరించాను. మరిన్ని లింకులు ఇవ్వగలరేమో చూడండి.
  • నికోలా స్టర్గియాన్ కు మీరిచ్చిన లింకు సరిపోతుందనుకుంటాను. మరొక సూచన:నికోలా స్టర్గియాన్ అనే పేరును నికోలా స్టర్జన్ అని ఉచ్చరించాలేమో చూడండి. నేనొక యూట్యూబ్ వీడియోలో ఇది గమనించాను.
  • తేజి గ్రోవర్ కు లింకులు ఇచ్చినట్లు లేరు, చూడండి. లింకు ప్రధాన పేరుబరి లోని పేజీల నుండే ఉండాలి.
__చదువరి (చర్చరచనలు) 15:27, 31 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మంచుమనిషి మంచి వ్యాసం ప్రతిపాదన సమీక్ష ప్రారంభమైంది

[మార్చు]

మంచుమనిషి వ్యాసాన్ని మంచి వ్యాసంగా ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు. ఈ వ్యాసాన్ని వాడుకరి:Pavan santhosh.s సమీక్షించడం ప్రారంభించారు, సమీక్ష పేజీని సృష్టించారు. ఈ పేజీని సందర్శించి, సమీక్ష పద్ధతిలో ప్రతిపాదించినవారి హోదాలో పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాం. --పవన్ సంతోష్ (చర్చ) 15:08, 15 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మంచుమనిషి గురించి మీరు చేసిన మంచి వ్యాసం ప్రతిపాదన

[మార్చు]

మీరు GA- కోసం ప్రతిపాదించిన మంచుమనిషి వ్యాసాన్ని మంచివ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా సమీక్షించడం మొదలుపెట్టాను. ఈ సమీక్షకు 3 రోజుల దాకా పట్టవచ్చు. ఈ సమయంలో మీకేమైనా ప్రశ్నలు, వ్యాఖ్యలూ ఉంటే నన్ను సంప్రదించండి. పవన్ సంతోష్ (చర్చ) 15:48, 15 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మూసీ పబ్లికేషన్స్ గురించి

[మార్చు]

ఏదో పుస్తకాలనుకుంటాను అది మీ అభిప్రాయమా?? బి.ఎన్. శాస్త్రి, మూసీ పబ్లికేషన్స్ పుస్తక వివరాలు ఉదయం నుంచి సేకరించి పొందుపరుస్తుంటే కారణం లేకుండా తొలగించడం మీరు చేసే పని కాదు. సందర్భము లేదు, ఎటువంటి ఉపోద్ఘాతమూ లేదు, విషయం గురించి సమాచారమేమీ లేదు అన్నారు కదా చర్చ లేకుండా తొలగించడం మంచిది కాదు. చరిత్రకారుడు, నిత్య పరిశోధకుడు - బి ఎన్ శాస్త్రి మీకు ఎం తెలుసు .. దయచేసి ఆ వ్యాసాన్ని మల్లి చేర్చండి సందర్భము ఉపోద్ఘాతమూ విషయ సమాచారము అన్ని రాస్తాను.— Preceding unsigned comment added by an unspecified IP address

ఆ వ్యాస విషయం ఒక పబ్లికేషన్స్ సంస్థ గురించి అని నేను భావించాను. అయితే దాని గురించి ఏమీ రాయలేదు. వారి పుస్తకాల జాబితా రాసారంతే. ఆ వ్యాసాన్ని తొలగించడానికి కింది కారణాలున్నాయి:
  1. ఏమాత్రం సందర్భం/ఉపోద్ఘాతం లేకుండా కేవలం కొన్ని వస్తువుల/అంశాల జాబితాలు ఇచ్చే వ్యాసాలు వికీపీడియాకు పనికిరావని వికీ నియమాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన పాఠ్యాన్ని కింద ఇచ్చాను, చూడండి.

    Simple listings without context information. Examples include, but are not limited to: listings of business alliances, clients, competitors, employees (except CEOs, supervisory directors and similar top functionaries), equipment, estates, offices, store locations, products and services, sponsors, subdivisions and tourist attractions. Information about relevant single entries with encyclopedic information should be added as sourced prose. Lists of creative works in a wider context are permitted.

  2. ఉపోద్ఘాతం/ప్రవేశిక/సందర్భం లేని వ్యాసాలు వేగవంతమైన తొలగింపుకు (CSD) గురౌతాయని వికీపీడియా చెబుతోంది.
  3. పైగా రాస్తున్నది ఒక ఐపీ అడ్రసు నుండి. దాని వలన రెండు ఇబ్బందులున్నాయి.
    1. వికీ అనుభవాల రీత్యా ఐపీఅడ్రసుల నుండి రాసే పాఠ్యం, నమోదైన వాడుకరుల కంటే ఎక్కువ సందేహాస్పదంగా ఉంటాయి (గుడ్ ఫెయిత్ ఎడీటింగు పట్ల) -చాలా పకడ్బందీగా ఉంటే తప్ప.
    2. ఐపీ అడ్రసులతో చర్చించేందుకు వీలుండదు. మీరు లాగినై ఉంటే మీతో సంప్రదించకుండా ఆ పేజీని నేను కచ్చితంగా తొలగించేవాడిని కాను.
మీరు అడిగినట్లు పేజీని తిరిగి స్థాపిస్తాను. పై అంశాలను దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని రాయగలరు.
__చదువరి (చర్చరచనలు) 15:22, 23 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పై సమాధానాన్ని రాసేలోపు మీరు శ్రీవైష్ణవ వేణుగోపాల్ అనే పేజీని సృష్టించారు. గతంలో ఈ పేజీని ఏడు సార్లు తొలగించారు. అయినా ఎనిమిదో సారి వ్యక్తిగత వివరాలతో తిరిగి సృష్టించారు. మీరు గుడ్‌ఫెయిత్‌తో ఈ దిద్దుబాట్లు చెయ్యడం లేదని తెలుస్తోంది. కాబట్టి మూసీ పబ్లికేషన్స్ ను పునస్థాపించడం లేదు.__చదువరి (చర్చరచనలు) 15:58, 23 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పబ్లికేషన్స్ సంస్థ గురించి అని నేను భావించాను. అయితే దాని గురించి ఏమీ రాయలేదు. వారి పుస్తకాల జాబితా రాసారంతే. అన్నారు కదా.. మూసీ పబ్లికేషన్స్ పునస్థాపించడి? అది చాలా పరిశోధించి రాసింది.. తెలంగాణ సాహిత్యం శాసనాలు వివరాలు మూసీ పబ్లికేషన్స్ గోప్పదనం గురించి రాస్తాను.. సాహిత్య విషయాలు వెలగులోకి రాకుండా చేయకండి..

ఏడుసార్లు తొలగించిన పేజీని 220.227.97.99‎ ఐపీ అడ్రసు నుండి మీరు ఎనిమిదో సారి సృష్టించారు. గుడ్‌ఫెయిత్‌తో దిద్దుబాట్లు చేస్తున్నట్లు లేదు మీరు.__చదువరి (చర్చరచనలు) 17:03, 23 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు ప్రాంతాల్లో స్వాతంత్ర్యోద్యమం - కరువుల గురించిన సమాచారం

[మార్చు]

చదువరి గారూ! నమస్తే. మీరు తెలుగు ప్రాంతాల్లో స్వాతంత్ర్యోద్యమం, కరువుల గురించి రాయాలని ఆశించారు కదా. మీకు నా వంత సాయంగా ఈ వనరులు అందిస్తున్నాను. ఉపకరిస్తాయని ఆశిస్తున్నాను:

తెలుగునాట జాతీయోద్యమం
తెలుగునాట కరువులు

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 04:36, 13 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వికీడేటా లేబులథాన్

[మార్చు]

చదువరి గారూ! భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు సహా వివిధ భారతీయ భాషల వికీమీడియా సముదాయాల్లో ఎడిటథాన్ నిర్వహిస్తున్నట్టే వికీడేటాలో వికీప్రాజెక్టు ఇండియా వారు భారతదేశానికి సంబంధించిన లేబులథాన్ నిర్వహిస్తున్నారు. ఆ పేజీ ఇదిగో ఇక్కడ చూడవచ్చు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, భారత స్వాతంత్ర్యోద్యమం, భారత స్వాతంత్ర్య సమరయోధులు, వగైరా కేటగిరీలకు చెందిన లేబుళ్ళు, డిస్క్రిప్షన్లు వివిధ భారతీయ భాషల్లో చేరుస్తున్నారు. ఒక సారి సదరు పేజీ సందర్శించి, ఆసక్తి మేరకు పాల్గొంటారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:56, 15 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఆటోవికీ బ్రౌజర్ సహాయం:నిర్జన గ్రామాల గుర్తింపు

[మార్చు]

చదువరి గారూ! ఆటోవికీ బ్రౌజర్ సహాయంతో నిర్జన గ్రామాలు గుర్తించాలని చూస్తున్నాను. దయచేసి ఈ కింది పద్ధతి పరిశీలించండి. ఇప్పటికే నేను మానవీయంగా ఈ కింది పదబంధంతో వెతికి చూసి కొన్నిటిని గుర్తించాను.

  • "0 జనాభాతో" అన్న పదం ఉన్న గ్రామాలను గుర్తించి {{నిర్జన గ్రామాలు}} అన్న మూస చేరిస్తే యాంత్రికంగా నిర్జన గ్రామాలను గుర్తించినవారం అవుతాం. తర్వాత క్రమేపీ చరిత్ర ఉందో లేదో తొలగించే వ్యక్తి చూసుకోవచ్చు.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 07:49, 23 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

@Pavan santhosh.s: బాగుందండి. పై పద్ధతిలో కొన్ని గ్రామాలు దొరుకుతాయి. గ్రామ సమాచారంతో టెక్స్టు ఫైళ్ళు తయారుచేసేటపుడు మొదట్లో 0 జనాభాతో అని రాసినట్టున్నాము గానీ, తరువాతి కాలంలో దాన్ని మార్చాం. సమాచారం ఏ విభాగాలకైతే దొరుకుతుందో ఆ విభాగాలనే చేర్చి మిగతా విభాగాలను అసలు చూపించనే లేదు. వికీలో వెతికి పట్టుకోవడం కష్టమనిపిస్తోంది. "నిర్జన" అని వెతికితే కొన్ని గ్రామాలకు సంబంధిత మండలంలో లింకు దొరుకుతోంది (అలా 239 దొరికాయి). సమస్య ఏంటంటే..
  1. ఆయా మండలాల పేజీలకు వెళ్ళి నిర్జన గ్రామపు పేజీ తెరిచి అక్కడ మూస పెట్టాలి. దానికి సమయం పడుతుంది.
  2. ఈ 239 పూర్తి జాబితా కాదు, అనేక గ్రామాలకు ఎదురుగా నిర్జన గ్రామం అని రాసి ఉండఅకపోవచ్చు.
మనం ఎక్సెల్ ఫైల్లో వెతికి తెచ్చుకోవడం తేలిగ్గా పని జరుగుతుందనుకుంటాను. అయితే ఇక్కడ కూడా ఒక సమస్య ఉంటుంది.. ఎక్సెల్ షీట్లో ఉన్న పేరు, వికీలో ఉన్న పేరూ భిన్నంగా ఉండే అవకాశముంది. అయినా సరే.. ఇదే సరైన పద్ధతి అనుకుంటాను. నేను చూస్తాను. __చదువరి (చర్చరచనలు) 08:21, 23 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan santhosh.s: విజయనగరం జిల్లా ఫైలు చూసాను, 68 నిర్జన గ్రామాలు దొరికాయి. ఆ జాబితా కింద ఇచ్చాను. ఈ పేర్లన్నిటినీ AWBలో వేసి ఆటోమాటిగ్గా వర్గానికి చేర్చవచ్చు లేదా మూసను తగిలించవచ్చు. అయితే కచ్చితంగా ఇవే పేర్లతో గ్రామాల పేజీలున్నాయో లేక కొద్ది మార్పులతో ఉన్నయో చూడాలి.
చదువరి గారూ! నిర్జన సెర్చ్ ద్వారా కొన్ని గ్రామాలు తెలుసుకోవచ్చు అనుకుంటాను.నేను డేటాలో నిర్జన అని పదం కొన్ని గ్రామాలకు తగిలించాను .--యర్రా రామారావు (చర్చ) 10:01, 23 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, తెలుసుకోవచ్చండి. కానీ రెండు ఇబ్బందులున్నాయి: 1. వెతుకులాట ఫలితాల్లో సదరు పేజీల లింకులు కనబడటం లేదు. ఎందుకంటే నిర్జ్జన గ్రామం పేజీలో "నిర్జన" అని రాసినవి బహు తక్కువ/అసల్లేవు. మనకు కనబడే ఫలితాలన్నీ సంబంధిత మండలం పేజీలు. అలా ప్రతీ మండలం పేజీని తెరిచి సంబంధిత గ్రామం పేజీని తెరిచి చూసి, అప్పుడు ఆ మూసను తగిలించాల్సి ఉంటుంది. 2. అన్ని మండల పేజీలలో నిర్జన గ్రామాలకు/గ్రామాలన్నిటికీ "నిర్జన" అని రాసి ఉండక పోవచ్చు. అంచేత ఈ పద్ధతిలో కొన్ని మాత్రమే చెయ్యగలము అని అనుకుంటున్నాను.
పవన్ సంతోష్ గారూ, నేనూ గమనించాను. పేజీల పేర్లు సరిపోలకపోవడం పేజీ కనబడకపోవడానికి కారణం. కనబడిన వాటిలో కొన్ని అయోమయ నివృత్తి పేజీలు. మరి కొన్ని గ్రామాలకు ఎక్సెల్ షీట్లో డేటా లేదు కానీ పేజీలో డేటా ఉంది. ఆ డేటా ఎక్కడి నుండి వచ్చిందో చూడాలి. నేను ఇక్కడ పెట్టిన గ్రామాలన్నిటికీ ఎక్సెల్ షీట్లో జనాభా 0 (సున్నా) ఉంది.__చదువరి (చర్చరచనలు) 04:39, 24 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
మండలం గ్రామం పవన్ పరిశీలన
కొమరాడ చినమంటికోన గ్రామం లేదు
కొమరాడ పెదమంటికోన గ్రామం లేదు
కొమరాడ శివరాంపురం గ్రామం లేదు
కొమరాడ చినపనుకువలస గ్రామం లేదు
కొమరాడ శివరాంపురం గ్రామం లేదు
కొమరాడ పెదనిశ్శంకపురం గ్రామం లేదు
కొమరాడ సోమలింగపురం గ్రామం లేదు
గుమ్మలక్ష్మీపురం కలిగొట్టు గ్రామంలో 2011 ప్రకారం 196 మంది ఉన్నట్టు ఉంది
గుమ్మలక్ష్మీపురం జమితిపాడు గ్రామవ్యాసం దొరకలేదు
గుమ్మలక్ష్మీపురం రాయగండ గ్రామవ్యాసం దొరకలేదు
గుమ్మలక్ష్మీపురం సిరసరం గ్రామంవ్యాసం దొరకలేదు
గుమ్మలక్ష్మీపురం కొండగుదబ గ్రామంవ్యాసం దొరకలేదు
గుమ్మలక్ష్మీపురం కుద్దపాలవలస గ్రామంవ్యాసం దొరకలేదు
కురుపాం చందనకోట గ్రామంవ్యాసం దొరకలేదు
కురుపాం చినవానిజ గ్రామంవ్యాసం దొరకలేదు
కురుపాం సోమిదవలస సోమిదవలస బూర్జ, తెర్లాం మండలాల్లోనే తప్ప కురుపాంలో గ్రామం దొరకలేదు.
జియ్యమ్మవలస సురపుదొరవలస సూరపుదొర వలస దొరికింది, ఏకవాక్య వ్యాసం
జియ్యమ్మవలస గంగమ్మవలస గ్రామంవ్యాసం దొరకలేదు
జియ్యమ్మవలస శివరామరాజపురం గ్రామంవ్యాసం దొరకలేదు
గరుగుబిల్లి గదబవలస గంగరాజపురం గ్రామంవ్యాసం దొరకలేదు
గరుగుబిల్లి సీతారాంపురం (శివ్వం దగ్గర) సీతారాంపురం (గరుగుబిల్లి) వ్యాసం ఉంది, అయితే 2011 జనగణన ప్రకారం జనాభా ఉన్నట్టు చూపుతోంది.
పార్వతీపురం ధనుంజయపురం గ్రామంవ్యాసం దొరకలేదు
పార్వతీపురం వెంకటనిస్సంకపురం గ్రామంవ్యాసం దొరకలేదు
పార్వతీపురం గంగరాజపురం గ్రామంవ్యాసం దొరకలేదు
మక్కువ పీతలవలస గ్రామంవ్యాసం దొరకలేదు
మక్కువ సింగందొరవలస గ్రామంవ్యాసం దొరకలేదు
మక్కువ కొండపల్లివలస గ్రామంవ్యాసం దొరకలేదు
మక్కువ చినంరాజువలస గ్రామంవ్యాసం దొరకలేదు
మక్కువ చంద్రాయ్యపేట గ్రామంవ్యాసం దొరకలేదు
సీతానగరం గంగరాజపురం గ్రామంవ్యాసం దొరకలేదు
బలిజిపేట కుర్మనాధపురం గ్రామంవ్యాసం దొరకలేదు
బలిజిపేట నరంపేట గ్రామంవ్యాసం దొరకలేదు
బలిజిపేట రంగసాయిపురం గ్రామంవ్యాసం దొరకలేదు
బొబ్బిలి జగన్నాధపురం (బొబ్బిలి దగ్గర) జగన్నాధపురం (దరి) బొబ్బిలి అనే పేజీ ఉన్నా వ్యాసంలో 2011 జనగణన ప్రకారం జనాభా ఉందని ఉంది
బొబ్బిలి పాతబొబ్బిలి (గ్రామీణ) పాత బొబ్బిలి (గ్రామీణ) అనే పేజీ ఉన్నా 2011 జనగణన ప్రకారం జనాభా ఉందని ఉంది
బొబ్బిలి కసిదొరవలస కసిదొరవలస ఉన్నా 2011 జనగణన ప్రకారం జనాభా ఉందని ఉంది
బొబ్బిలి మెట్టవలస
సాలూరు తొనం
సాలూరు కరసువలస
సాలూరు నర్లవలస
పాచిపెంట కునంబండవలస
పాచిపెంట మిర్తివలస
పాచిపెంట గూరువినాయుడుపేట
రామభద్రాపురం నాయుడువలస
బాడంగి రొంపల్లివలస
బాడంగి రామచంద్ర పురం
తెర్లాం కొరటాం
తెర్లాం కగం
తెర్లాం టెక్కలివలస
మెరకముడిదాం ఉత్తరవిల్లి
మెరకముడిదాం సతంవలస
దత్తిరాజేరు గోభ్యం
దత్తిరాజేరు చినకడ
గజపతినగరం నారాయణగజపతిరాజపురం
గజపతినగరం లింగాలవలస
చీపురుపల్లి అర్తమూరు
చీపురుపల్లి కర్లాం
బొండపల్లి దామరసింగి
బొండపల్లి గిత్తుపల్లి
గంట్యాడ మొసలికంది
శృంగవరపుకోట మరుపల్లి
వేపాడ జమ్మదేవిపేట
వేపాడ పెదగుదిపల
జామి గొడికొమ్ము
విజయనగరం సరిక
పూసపాటిరేగ కందివలస
భోగాపురం బంటుపల్లి
భోగాపురం అక్కివరం

తెలంగాణ రాష్ట్రంలోని నిర్జన గ్రామాలు పూర్తిగా తొలగించటమైనది

[మార్చు]

చదువరి గారూ వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం ప్రాజెక్టు పనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 589 మండలాలలోని 10841 రెవెన్యూ గ్రామాలలోని 509 అన్ని నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు తొలగించబడినవి.--యర్రా రామారావు (చర్చ) 14:47, 18 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు|సరేనండి. __చదువరి (చర్చరచనలు) 04:54, 19 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

జుత్తాడ (చోడవరం) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఇదే సమాచారంతో జూత్తాడ అనే పేజీ ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 15:32, 27 అక్టోబరు 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 15:32, 27 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి ఆన్ లైన్ తరగతి: శుద్ధి చేయాల్సిన వ్యాసం

[మార్చు]

మొదటి ఆన్ లైన్ తరగతిలో 2019 ఫిబ్రవరి 10 తేదీన జరిగింది. అయితే ముందుగా మీరు చెప్పినట్టు మీరు చేరలేకపోయారని గుర్తించాను. వచ్చే తరగతిలో చేరడానికి వీలుగా మీరు అప్పటి టాస్కులను పూర్తిచేస్తారని ఆశిస్తున్నాను. అందుకు వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం చదివి, ఎం. హరికిషన్ వ్యాసాన్ని ప్రధానంగా వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అన్న రెండు సూత్రాలను ఈ వ్యాసంలోని ప్రతీ వాక్యంలోనూ ఎలా ప్రతిఫలిస్తున్నాయో పరిశీలించండి. సరిగా లేనిచోట్ల మీరే సరిదిద్దండి. ఆపైన పూర్తయ్యాకా నన్ను పింగ్ చేస్తూ చర్చ:ఎం. హరికిషన్ పేజీలో కానీ, ఇక్కడే కానీ రాస్తే నేను పున:పరిశీలన చేసి మీకు సహాయం అందిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:26, 12 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ, ఆ వ్యాసంలో మార్పులు చేసాను, పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 05:55, 20 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, బావున్నాయండీ మీరు చేసిన మార్పుచేర్పులు. మూలాలు కావాలి వంటి టాగ్స్ పెట్టడం కూడా బావుంది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 07:55, 20 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తర్వాతి టాస్కు

[మార్చు]

నమస్తే, ఆన్ లైన్ తరగతుల్లో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఇటీవలి తరగతిలో మనం చర్చించుకున్న వ్యాస పరిచయం ఎలావుండాలి, బహువచనం (చేశారు అన్నది చేశాడు, ఆయన అన్నది అతను, వగైరా) అన్న రెండు శైలీ పరమైన అంశాలు ఎలా ఉన్నాయన్నది మీకు ఇంతకుముందు ఇచ్చిన వ్యాసాల్లోనే పరిశీలించి, సరిగా లేకపోతే మార్చి 24 నాటికి దిద్దగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 12:53, 6 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు తయారు చేస్తున్న చెక్ లిస్టు

[మార్చు]

చదువరి గారూ,

మీ వాడుకరి ఉపపేజీల్లో చెక్ లిస్టు చూశాను. బావుంది. ఆ చెక్ లిస్టు విషయంలో చూస్తే: ఒక సెంట్రల్ చెక్ లిస్టు లాంటిది పనికిరాదు. కాబట్టి జీవిత చరిత్రలు & పాత్రలు, సంస్థలు, భౌగోళిక ప్రదేశాలు, సంఘటనలు, సినిమాలు & పుస్తకాలు, మూలకాలు, జాతులు - ఇలా వేర్వేరు అంశాలను ఓ ముఖ్యమైనవి పది పదిహేనిటిని గుర్తించి, అన్నిటికీ చెరోటి రాద్దాం. ఏమంటారు? --పవన్ సంతోష్ (చర్చ) 03:28, 1 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ, దానిపై నా ఆలోచనలు ఇంకా ఉన్నాయండి. ఇప్పుడూ రాసినది కొంత మాత్రమే. విస్తరించాల్సింది ఇంకా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ పని చేస్తాను. ఇద్దరం విడివిడిగా రాసే బదులు కలిసి రాస్తే బాగుంటుంది. ఒక స్థాయికి వచ్చాక, వాటిని వికీపీడియా పేజీలో పెడతాను. అప్పుడు విస్తరించుదాం, ఏమంటారు?__చదువరి (చర్చరచనలు) 04:24, 1 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మెరుగైన వ్యాసాలు చట్రం రూపకల్పనలో సహాయం కోరుతూ

[మార్చు]

చదువరి గారూ, మెరుగైన వ్యాసాలు చట్రం స్కెలిటన్ తయారుచేశాను. దయచేసి దీనికి రూపం కల్పించగలరు. వికీపీడియా:మెరుగైన వ్యాసాలు వ్యాసం వద్ద చూడండి. మరో చిన్న ఆలోచన: కనీస స్థాయి, మధ్యమ స్థాయి, తృతీయ స్థాయిలు తయారుచేసేప్పుడు వాటిని వీలైనంత క్లుప్తంగా ఉంటే మేలనుకుంటున్నాను. ఎందుకంటే వీటిని మనం మూసల్లో పెట్టి ఎక్కడెక్కడ అవసరం అంటే అక్కడ విభాగాలుగా పెట్టి ఇస్తాం. ఇవి కాక డీవైకే చెక్ లిస్టు అని ఆంగ్లంలో ఉంది. డూ యూ నో అని వారి మొదటి పేజీ కోసం దీన్ని సమీక్షకు వాడతారు. మనం దీన్ని తగ్గట్టుగా మార్చుకోవచ్చు (అందులో ఉన్న అంశాలేవీ మనకు అక్కరలేదు, కేవలం ఫ్రేం చాలు) అనుకుంటున్నాను. ముందస్తు ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:32, 7 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ, మూడు స్థాయిల్లో చెయ్యాల్సిన పనుల జాబితాలను సంబంధిత పేజీల్లో చేర్చాను చూడండి. ఇక పని మొదలు పెట్టవచ్చు__చదువరి (చర్చరచనలు) 18:07, 10 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

దక్షిణ తీర రైల్వే

[మార్చు]

చదువరి గారు, దక్షిణ తీర రైల్వే వ్యాసంలో వాడుకరి:Hydkarthik గారు, కొత్త సమాచారం కొంత సమాచారం చేర్చారు. అందులో చరిత్ర విభాగంలో ఊహాతీతమైనది కూడా ఉన్నది. సరైన మూలాలు వాటికి లేవు. వీరు నాతో నేను నిర్వాహకునిగా ఉన్నకాలంలో రైల్వే వ్యాసాల విషయములో అనేక ఘర్షణలు పడి ఉన్నారు. అందువలన నా నిర్వాహకత్వం తొలగింపబడటానికి కారణంలో వీరిది ముఖ్య కారణంపాత్రగా కూడా ఉంది. కాబట్టి నేను వీరికి నేను ఏమి చెప్పినా అర్థం చేసుకోరు, పాత రైల్వే వ్యాసాలకు సరియైన లింకులు కూడా ఇవ్వరు, తిరిగి నాతో ఘర్షణకు దిగుతారు. దయచేసి వారు వ్రాసిన ప్రతి రైల్వే వ్యాస సమాచారాలను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి సరైన రీతిలో సలహాలు సూచనలు మీరు ఇవ్వవలసినదిగా కోరుతున్నాను. నాకు, తెవికీకి సంబంధించిన చర్చా, సలహాలు, సూచనలు, విషయాలు ఏవైనా, ఎప్పుడైనా ఉంటే మాత్రం, తప్పకుండా నా చర్చా పేజీలో ఒక కాపీ కూడా అవకాశం ఉంటే పెట్టండి.JVRKPRASAD (చర్చ) 02:46, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD అయ్యా JVRKPRASAD గారూ, దయచేసి ఊహాతీతమైన విషయమేమిటో తెలుపగలరు. తొలగించెదను లేక మార్చెదను. Hydkarthik (చర్చ)
చదువరి గారు, మీరు దక్షిణ తీర రైల్వే వ్యాసంలో చరిత్ర, పరిధి విభాగాలలో Hydkarthik వ్రాసిన వాక్యాలు సూక్ష్మంగా పరిశీలించండి. ప్రతి వాక్యానికి మూలం తప్పనిసరి. అలాగే మీకు అనిపించిన ఊహాతీతమైన వాక్యాలు ఉంటే మీరే వారికి తెలియజేయండి. నన్ను అయ్య, గారు అని సంభోదనలతో నేనంటే పెద్దల వంటి వారి మనసులో నా స్థానం చాలా చిన్నదిగా ఇంకా ప్రస్తుతం ఉన్నది కావున, నేను వివరించి చెప్పినా వాదనలు జరగవచ్చును అన్న అభిప్రాయముతో మధ్యవర్తిగా మిమ్మల్ని కలగజేసుకోమని విన్నవించుకుంటున్నాను.JVRKPRASAD (చర్చ) 06:30, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మొదట చరిత్ర విభాగములో ఊహాతీతమైన అని అన్నారు. ఇప్పుడేమో చరిత్ర మరియు పరిధి రెంటిలోనూ ఊహాతీతములనుచున్నారు. సరిగా చెబితే సరిచేయుదును. మరొక్క మాట. ఆయన ఉద్దేశ్యము ఊహాతీతము కాదు. ఊహాజనితము.Hydkarthik (చర్చ) 06:54, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, నేను మిమ్మల్ని మొదట చరిత్ర విభాగం చూడమని అందులో విశాఖపట్టణం వరకు ఉన్న రైళ్ళన్నిటినీ భువనేశ్వర్ వరకూ తరలించడం వంటి చర్యలతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పక్షపాతంతో పనిచేస్తున్నదన్న అభిప్రాయం కలిగింది.' అనే ఊహాతీత వాక్యం గురించి చూడమని చెప్పాను. ఆ తదుపరి అన్ని విభాగాలు చూడమని చెప్పాను. అంటే పరిధి అనే విభాగంలో కూడా ఈ రైల్వే మండల ఏర్పాటునకు పూర్వము తూర్పు కోస్తా రైల్వే పరిధిలోనున్న వాల్తేరు రైల్వే విభాగము రెండుగా విభజింపబడి ఒక భాగము విజయవాడ విభాగములో విలీనము చేయబడును. మిగిలిన మార్గముతో రాయగడ కేంద్రముగా క్రొత్త విభాగము ఏర్పరచబడును. రాయగడ విభాగము తూర్పు కోస్తా రైల్వే మండలములో భాగముగానుండును. అనే వాక్యం కూడా ఊహాజనితం కాదా ? ఎందుకండి ఈ అనవసర చర్చలు ? నేను మీకు వ్రాస్తే దానికి నాకు జవాబు చెబుతున్నట్లు ఆయన వ్రాయడంలా ఉంది. మీరే వెంటనే కల్పించుకొని తగు సమాధానముతో చర్య తీసుకొనగలరు, లేదా ఎవరికయినా సరైన సమాధానం సూచించేలా చర్యలు తీసుకునేందుకు అయినా అవకాశం కల్పించ గలరు. ఈ పని వెంటనే చేయకపోతే అనవసర చర్చలకు దారి తీయవచ్చును, అందరి సమయం, శ్రమ వృధా అయ్యే అవకాశం ఉండవచ్చును. ఆయన కెవికీలో కన్నడ తెలుగు వర్గ విభాగం పెట్టి వ్రాయవచ్చునేమో ? JVRKPRASAD (చర్చ) 07:31, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ, మీ అభ్యంతరాలను వివరంగా అ వ్యాసపు చర్చా పేజీలో రాయండి. అక్కడే చర్చ చేద్దాం.__చదువరి (చర్చరచనలు) 07:36, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, ఈ చర్చా విభాగం మొత్తం ఆ వ్యాసంలో ఒక విభాగంగా పోస్ట్ చేస్తాను. నేను అవసరమయితేనే తప్పకుండా అక్కడే మీతో స్పందిస్తాను.JVRKPRASAD (చర్చ) 07:42, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]


IP 185.86.150.101 .ఈ IP వెనుక కద ఏమిటి ?

[మార్చు]

ఎవరో ఎడిటర్ స్వీడన్ నుండి ఈ IP 185.I86.150.101 నుండి ఎడిటింగ్ చేశారు . బోనాడీ మీద వున్న ఫిర్యాదు పేజీ ని డిలేట్ చేశారు .బోనాడీ కూడా స్వీడన్ కు చెందిన వారు . సో ఎదో డౌట్ వచ్చి మీకు చెప్పాను

    .ఇది నా అనుమానం మాత్రమే 


IP location is Sweden: (The editor edit from the country Sweden with this IP)


https://www.ip-tracker.org/locator/ip-lookup.php?ip=185.86.150.101 .ఈ IP స్వీడన్ కి చందినది .కంఫర్మ్


Disruption On : వికీపీడియా:Miscellany for deletion/వాడుకరి:Bonadea (2nd nomination) ( The complaint againest Bonadea from Sweden). బోనాడీ మీద వున్న ఫిర్యాదు పేజీ ని డిలేట్ చేశారు.


https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:Miscellany_for_deletion/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:Bonadea_(2nd_nomination)&diff=2653266&oldid=2652706

Bonadea Belongs to Sweden: బోనాడీ కూడా స్వీడన్ కు చెందిన వారు


  https://en.wikipedia.org/wiki/User:Bonadea


Administrators please investigate the case


Bonadea doing this disruption? OR Any other disrupt from Sweden.


There is confirmed link between this disruption and Sweden.


 బోనాడీ ఏ IP  నుండి ఎడిటింగ్ చేస్తున్నారో తెలుసుకుని , ఈ IP ని బోనాడీ IP తో సరి పోల్చండి .  

.

స్వీడన్ ఐపి నుండి మన తెలుగు వికీపీడియా ఎలా సవరించాru? ఎందుకు? బోనాడె స్వీడన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మరియు తెలుగు ఎడిటర్ మధ్య యుద్ధం. నేను కమ్యూనికేషన్ శాఖలో ఒక ఇంజనీర్ని, మరింత వివరాలకు నా సెల్ నంబర్ను అందించగలను. sack pupet అంటే Ip లేదా సింగిల్ టౌన్ లేదా సింగిల్ ఏరియా నుండి పలు ఖాతాలను create cheyadam . ఫిర్యాదులను తెలుగువారికి ఇవ్వడం, ఇవన్నీ ఐడియా, జియోతో సంకలనం చేస్తాయి, తద్వారా అందరూ users ni బ్లాక్ చేయగలరు

(Rajasekhar Hyd (చర్చ) 16:41, 6 మే 2019 (UTC))[ప్రత్యుత్తరం]


(Rajasekhar Hyd (చర్చ) 15:14, 6 మే 2019 (UTC))[ప్రత్యుత్తరం]

యంత్రం అనువాదం

[మార్చు]

చదువరి గారూ నేను కొత్త సభ్యుడిని తెలిపినందుకు ధన్యవాదములు. యంత్ర అనువాదలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాను చదువరి గారూ. నేను అనువాదం చేసిన పేజీలు మార్పు చేస్తాను. కోతుంసర్ గుహలు మార్పు చేయండి కొతుమ్సర్ గుహలు సరైన పేరు. భజ గుహలు సరైన పేరు భాజ గుహలు తప్పుగా వ్రాస్తాను నేను మార్పు చేస్తాను. అలాగే గడియర స్తంభం సెంటర్ పేరు అమలాపురం గడియార స్థంభం అని మార్పు చేయగలరు ధన్యవాదములు. సంతకం చేయకుండా ఈ వ్యాఖ్య రాసిన వారు: Ch Maheswara Raju (చర్చమార్పులు)

@Ch Maheswara Raju: అలాగేనండి. __చదువరి (చర్చరచనలు) 05:01, 27 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గం గురించి

[మార్చు]

చదువరి గారూ తప్పకుండా చస్తాను అండి. కొత్త సభ్యుడిని కదా అందుకే వాటి జోలికి పోలేదు.మీరు చెప్పినట్టే చేస్తాను. అలాగే నేను రాసిన వ్యాసాలులో కూడా మార్పులు చేయాలని గతంలో మీరు చెప్పారు. తప్పకుండా చేస్తాను. ఇక నుంచి నేను వ్రాసిన వ్యాసము విస్తరణ చేయడం మరియు సరైన మూలాలు ఇవ్వడంలో సృష్టింపెడతాను. ఏమైనా సహయం కావలి అంటే మిమ్మల్ని సంప్రదిస్తాను ధన్యవాదాలు. Ch Maheswara Raju (చర్చ) 08:17, 31 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల పేర్లను సరిచెయ్యడం ప్రాజెక్టు పేజీ గురించి

[మార్చు]

చదువరిగారూ గ్రామాలు పేర్లను సరిచేసేందుకు మీరు ఇప్పటికే పేజీకి ఇక్కడ ఒక రూపం తయారుచేసారు.దానికి మీరు పూర్తిరూపంతో ఒక ప్రాజెక్టు పేజీ తయారుచేసినచో అదికూడా అవకాశాన్నిబట్టి పూర్తి చేద్దాం.--యర్రా రామారావు (చర్చ) 14:37, 18 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సరే సార్. __చదువరి (చర్చరచనలు) 00:15, 19 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ మీ నెంబరు మారింది అనుకుంటాను.వేరెే వారికి వెలుతుంది.నాకు నెంబరు మెసేజ్ పెట్టగలరా?మాట్లాడవలసిన పని ఉంది.

నిర్వాహకత్వానికి గుర్తింపు

[మార్చు]
చురుకైన నిర్వాహకులు
వికీపీడియా నిర్వహణకు విధి, విధానాలను నిర్వహించడం, అమలు చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నందులకు అభివందనాలు.-- అర్జున (చర్చ) 04:46, 3 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]


ధన్యవాదాలు, అర్జున గారూ. __చదువరి (చర్చరచనలు) 02:22, 4 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]