Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

తేజి గ్రోవర్

వికీపీడియా నుండి
తేజి గ్రోవర్

తేజి గ్రోవర్ భారత దేశానికి చెందిన హిందీ కవయిత్రి, [1] కాల్పనిక రచయిత్రి, [2] అనువాదకురాలు, చిత్రకారిణి. 1950 తరువాతి తరాల వారికి హిందీ కవయిత్రిగా ఈమె బాగా పరిచయం. ప్రముఖ హిందీ కవి, విమర్శకుడు అశోక్ వాజ్ పేయ్, తేజి కవిత్వం గురించి వివరిస్తూ "ఆమె కవిత్వంలోని భాష ప్రత్యేకంగా ఉంటుంది. సామాన్యమైన జాతీయాలకు అందకుండా ఎంతో విచిత్రమైన భాష వాడుతుంది" అని చెప్తాడు.[3] ఆమె కవితలు ఇతర భారతీయ భాషల్లోకి మాత్రమే కాక, విదేశీ భాషల్లోకి కూడా అనువాదం కావడం విశేషం.

తేజి కాల్పనిక సాహిత్యంలోని శిల్పం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె రచనల్లో భావుకత, వాస్తవికత ఒక దానిలో ఒకటి కలిసిపోయి ఉంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలోని కథలు అన్ని ఒక దానితో ఒకటి ముడి వేసుకుని ఉన్నట్టుగా ఉంటుంది. ఈమె రాసిన నీల గురించి ప్రముఖ హిందీ పండితురాలు కమిలా జునిక్ రాస్తూ "తేజి ఈ నవలలో అన్ని పాత్రల గురించి, అన్ని సందర్భాల గురించీ రాసేసింది. ఈ నవలను దాటి ఇక ప్రపంచంలో రాయడానికి వేరేది ఏదైనా ఉందని నాకు అనిపించడం లేదు" అని చెప్పడం విశేషం.[4]

తేజి వివిధ భాషల రచనలను ఎన్నింటినో హిందీలోకి అనువదించింది. తన అనువాదాల ద్వారా ఆధునిక స్కాండనవి భాషలకు చెందిన ప్రముఖ కవులను, రచయితలను హిందీ పాఠకులకు పరిచయం చేసింది. ఆమె క్నట్ హమ్సన్, టర్జేయ్ వెసాస్, జాన్ ఫాస్సీ, క్జెల్ అస్కిల్డ్సన్, గన్నర్ బ్జోర్లింగ్, హాన్స్ హెర్బ్ జొర్న్ స్రడ్, లార్స్ అమండ్ వాగ్, ఎడిత్ సోడెర్గ్రన్, హారీ మార్టిన్ సన్, తోమస్ ట్రాన్స్ట్రోమర్, లార్స్ లండ్క్విస్ట్, అన్ జాడర్లండ్ వంటి ఎందరో ప్రముఖుల రచనలు అనువదించింది. తేజి, వివాదాస్పద ఫ్రెంచి రచయిత మార్గరెట్ డారస్ రచనలు కూడా అనువాదం చేసింది.

ఆమె చిత్రకారిణిగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. తేజి ఎక్కువగా అమూర్త చిత్రాలు గీస్తుంది. ఆమె కృత్రిమ రంగులను వాడదు. తానే స్వంతంగా ప్రకృతి సహజమైన రంగులను తయారు చేసుకుని, వాటినే తన చిత్రాల్లో ఉపయోగించడం విశేషం.[5]

జీవిత చిత్రణ

[మార్చు]

తేజి, పంజాబ్లోని పఠాన్ కోట అనే పట్టణంలో 1955 మార్చి 7న జన్మించింది.[6] చండీగఢ్లోని ఎం.సి.ఎం.డి.ఎ.వి కళాశాలలో రెండు దశాబ్దాల పాటు ఆంగ్ల సాహిత్యం ప్రొఫెసర్ గా పనిచేసింది. ఆమె 2003లో పదవీ విరమణ చేసింది. ఆ తరువాత నుంచి పూర్తిస్థాయిలో రచయిత్రిగా, చిత్రకారిణిగా మారింది.

ప్రస్తుతం తేజి, మధ్యప్రదేశ్లో భోపాల్లో ఉంటోంది.

పురస్కారాలు, ఫెలోషిప్ లు

[మార్చు]

ఆమె పురస్కారాలు, ఫెలోషిప్ లు:

  • భారత్ భూషణ్ అగర్వాల్ కవిత్వ పురస్కారం (1989) ;[7]
  • రైటర్-ఇన్-రెసిడెన్స్/డైరెక్టర్, ప్రేమ్ చంద్ సృజన్ ప్రీత్, ఉజ్జయిని (1995-1997) ;[8]
  • సీనియర్ ఫెలో (సాహిత్యం), సాంస్కృతిక శాఖ, మానవ వనరుల శాఖ, భారత ప్రభుత్వం, ఢిల్లీ (1995-1997) ;[8] and
  • సయ్యద్ హైదర్ రజా కవిత్వ పురస్కారం (2003) ;[8][9]
  • ఫెలో, ఆధునిక అధ్యాయన సంస్థ, నాన్టస్, ఫ్రాన్స్ (2016-2017).[10]

రచనలు

[మార్చు]
  • యహన్ కుచ్ అంధేరీ ఔర్ టిఖీ హై నాడీ (భారతి భాషా ప్రకాశన్, ఢిల్లీ, 1983) ;
  • లో కహా సంబారీ (నేషనల్ పబ్లిషింగ్ హౌస్, ఢిల్లీ, 1994; ISBN 81-214-0537-8) ;
  • అంత్ కీ కుచ్ ఔర్ కవితాయేన్ (వాణి ప్రకాశన్, ఢిల్లీ, 2000) ;
  • మైత్రి (సూర్య ప్రకాశన్ మందిర్, బికనీర్, 2008; ISBN 81-88858-51-X).

లో కహా సంబారీ రెండవ ప్రచురణని వాణీ ప్రకాశన్, ఢిల్లీలో 2016 ప్రచురించారు. (ISBN 978-93-5229-362-9).

ఆమె రాసిన కవితా సంకలనాలు:

  • జైసే పరంపరా సజాతే హుయే (పరగ్ ప్రకాశన్, ఢిల్లీ, 1982), ఈ సంకలనంలో ముగ్గురు సహ కవుల కవితలు కూడా ప్రచురింపబడ్డాయి.;
  • తేజి ఔర్ రుస్తుం కీ కవితాయేన్ (ISBN 978-81-7223-879-7), [11] ఈ కవితా సంకలనాన్ని హార్పర్ కోలిన్స్ ఇండియా వారు 2009లో ప్రచురించారు.

ఆమె ఇటీవల రాసిన కొన్ని కవితలను సమాలోచన్ అనే అంతర్జాల సాహిత్య పత్రికలో ప్రచురించారు.[12]

1999లో ఆమె నీలా అనే నవల రాసింది.ISBN 81-7055-668-6) ; 2009లో ఆమె రాసిన చిన్న కథలన్నింటినీ సప్నే మే ప్రేమ్ కీ సాత్ కహానియా అనే పుస్తకంగా సంకలనం చేసి, ఢిల్లీలోని వాణీ ప్రకాశన్ ద్వారా ప్రచురించింది. ISBN 9350001136). 2016లో నీలా నవల రెండో ముద్రణ వచ్చింది. ISBN 978-81-7055-668-8).

ఆమె ఎన్నో వ్యాసాలను, యాత్రా విశేషాలను, జానపద కథలను రాసింది. వీటిలో కొన్నిటిని 2016లో నీలా ఘర్ ఔర్ దూసరీ యాత్రాయే పేరుతో ప్రచురించింది. ISBN 978-93-5229-365-0) ; అలాగే మరికొన్ని వ్యాసాలను 2017లో భోపాల్ లో ఏకలవ్య ప్రచురణల ద్వారా అకమ్ సే పురం తక్: లోక్ కథాయో కా ఘర్ ఔర్ బాహర్ పేరుతో పుస్తక రూపంలోకి తీసుకు వచ్చింది. ISBN 978-93-85236-21-1).[13]

మూలాలు

[మార్చు]
  1. See http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/17742/27/Teji-Grover Archived 2018-09-30 at the Wayback Machine. Accessed on 3 April 2015. Also see, Anirudh Umat, "Some Reflections on Teji Grover's Recent Poetry", The Book Review, Vol. XXXV, No. 2 - February 2011 (http://www.thebookreviewindia.org/articles/archives-510/2011/febuary/2/some-reflections-on-teji-grovers-recent-poetry.html Archived 2016-08-10 at the Wayback Machine), accessed on 23 April 2015; Birgitta Wallin, "Portatt av en poet i gult", Karavan, Stockholm, June 2010, pp. 118-20 (Special issue on Indian Literature); Lars Hermansson, "Nagot om hindipoesi, kari boli och Teji Grover", Lyrikvannen, Stockholm, No. 4, 2001, pp. 40-41; and Birgitta Wallin, "Bilder ur ett pagaende", Lyrikvannen, Stockholm, No. 4, 2001, pp. 52-54.
  2. See, Kamila Junik, "Teji Grover's Blue", Cracow Indological Studies, Vol. 12 (ed. Halina Marlewicz), Ksiegarnia Akademicka, Krakow, 2010, and Manoj Pandey, "Seven Stories of Love in Dream", The Book Review, VOL. XXXV, No. 1 January 2011 (http://www.thebookreviewindia.org/articles/archives-486/2011/january/1/seven-stories-of-love-in-dream.html Archived 2016-08-10 at the Wayback Machine), accessed on 23 April 2015
  3. See, Ashok Vajpeyi's preface to Teji Grover and Rustam Singh, Teji aur Rustam Ki Kavitaen, selected poems of both poets, New Delhi: HarperCollins, ISBN 978-81-7223-879-7, Hindi-language. Accessed on 17 April 2015.
  4. Kamila Junik, "Teji Grover's Blue", Cracow Indological Studies, Vol. 12 (ed. Halina Marlewicz), Ksiegarnia Akademicka, Krakow, 2010.
  5. See, Pen to Brush, Review of Jo Nahi Hai, solo show in Delhi http://indianexpress.com/article/cities/delhi/pen-to-brush/Accessed[permanent dead link] on 17 April 2015.
  6. See http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/17742/27/Teji-Grover Archived 2018-09-30 at the Wayback Machine. Accessed on 3 April 2015.
  7. See, Bharat Bhushan Agrawal Award http://www.geocities.ws/indian_poets/hindi.html. See also, Poetry International, http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/17742/27/Teji-Grover Archived 2018-09-30 at the Wayback Machine. Accessed on 17 April 2015.
  8. ఇక్కడికి దుముకు: 8.0 8.1 8.2 http://pratilipi.in/teji-grover/ Archived 2015-04-07 at the Wayback Machine. Accessed on 17 April 2015.
  9. See also, The Raza Foundation: Awards, http://www.therazafoundation.org/awards.php Archived 2016-09-19 at the Wayback Machine, accessed on 26 April 2015, and Poetry International http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/17742/27/Teji-Grover Archived 2018-09-30 at the Wayback Machine, accessed on 17 April 2015.
  10. See, https://www.iea-nantes.fr/en/chercheurs/?residents_recherche=&residents_annee%5B%5D=23&residents_submit=Ok&simpleform_submitted=form_residents&fromSimpleForm=1. Accessed on 15 November 2017.
  11. See, Teji Grover and Rustam Singh, Teji aur Rustam Ki Kavitaen, selected poems of both poets, New Delhi: HarperCollins, ISBN 978-81-7223-879-7, Hindi-language. Accessed on 17 April 2015.
  12. See, https://samalochan.blogspot.in/2017/10/blog-post_5.html Archived 2017-11-15 at the Wayback Machine Accessed on 15 November 2017.
  13. See, https://www.iea-nantes.fr/en/news/new-publication-by-teji-grover-fellow-2016-2017-at-ias-nantes_738 Archived 2022-07-17 at the Wayback Machine. Accessed on 15 November 2017.

బయటి లంకెలు

[మార్చు]