అన్విత అబ్బి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్విత అబ్బి
జననం (1949-01-09) 1949 జనవరి 9 (వయస్సు: 70  సంవత్సరాలు)
ఆగ్రా, భారతదేశం
వృత్తిభాషావేత్త, పండితురాలు
పురస్కారాలుపద్మశ్రీ
రాష్ట్రీయ లోక్ భాషా సమ్మాన్
అఖిల భారత ఆధునిక అధ్యాయనం ఫెలోషిప్
గోల్డ్ మెడల్ - ఢిల్లీ విశ్వవిద్యాలయం
ఎస్.ఒ.ఎ.ఎస్ లండన్ విశ్వవిద్యాలయం లెవెర్ హం ప్రొఫెసర్
మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ కు ప్రత్యేక ప్రొఫెసర్/> కెన్నెత్ హేల్ పురస్కారం - లింగ్విస్ట్ సొసైటీ ఆఫ్ అమెరికా (2015)
వెబ్ సైటుwww.andamanese.net

ప్రొఫెసర్ అన్విత అబ్బి (జననం 1949 జనవరి 9) భారతీయ భాషావేత్త. ఆమె మైనారిటీ భాషలలో పండితురాలు. ముఖ్యంగా దక్షిణాసియాకు చెందిన గిరిజన భాషల పునరుర్ధరణకు ఆమె ఎంతో కృషి చేసింది.[1] భాషా శాస్త్రంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా 2013లో భారత ప్రభుత్వం అన్వితను పర్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.[2]

జీవిత చిత్రణ[మార్చు]

అన్విత 1949 జనవరి 9న, ఆగ్రాలో జన్మించింది.[3][4] ఆమె కుటుంబంలో ఎంతో మంది హిందీ భాషా రచయితలు, కవులు పుట్టారు.[5] ప్రాథమిక విద్యను స్థానిక పాఠశాలలో పూర్తి చేసిన ఆమె, 1968లో, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బి.ఎ ఆనర్స్ చదివింది.[3][4] వెనువెంటనే, 1970లో, అదే విశ్వవిద్యాలయం నుంచీ భాషా శాస్త్రంలో ఎం.ఎ పూర్తి చేసింది. ఆమె ఎం.ఎ మొదటి ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించింది.[3][4] 1975లో, అమెరికాలోని ఇతకాలో కార్నెల్ విశ్వావిద్యాలయంలో పి.హెచ్.డి చేసింది.[6] ఆమె దక్షిణ ఆసియా భాషలపై పరిశోధన చేసింది.[3][4] సెంటర్ ఫర్ లింగ్విస్టిక్స్, స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్ లో సహాయ ఆచార్యులుగా పనిచేసింది.[7] ప్రస్తుతం అన్విత, ఢిల్లీ జవహర్ లాల్ విశ్వవిద్యాలయం (జె.ఎన్.యు) లోని దక్షిణాపురం కాంపస్ లో ఉంటోంది.[3][4]

పరిశోధన వివరాలు[మార్చు]

గ్రేట్ అండమాన్ కు చెందిన దంపతుల చిత్రం-1876

అన్విత, భారతదేశానికి చెందిన ఆరు భాషా కుటుంబాలపై చేసిన పరిశోధన గణనీయమైనది.[7][8] లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎస్.ఒ.ఎ.ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఆమె అంతరించిపోతున్న భాషల డాక్యుమెంటేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా వానిషింగ్ వాయిసెస్ ఆఫ్ గ్రేట్ అండమనీస్ అని ఒక పరిశోధన చేసింది. అండమాన్ ద్వీపంలో అంతరించిపోతున్న స్థానిక భాషల గురించిన పరిశోధన ఇది. గ్రేట్ అండమాన్ కు చెందిన భాషలు, సంస్కృతి గురించి కూడా ఈ పరిశోధనలో ఆమె పొందుపరిచింది.[9][10][11] 2003-2004 మధ్యలో గ్రేట్ అండమాన్ గురించి ఆమె చేసిన పరిశోధనలో జారవా, ఒంగే అనే రెండు అండమనీస్ స్థానిక భాషల విభిన్న లక్షణాల గురించి ప్రపంచానికి తెలిసింది. ఈ పరిశోధనతో గ్రేట్ అండమనీస్ భాషలు భారతదేశ ఆరవ భాషా కుటుంబంగా మారాయి.[8][12] తరువాత అండమాన్ ప్రజలపై ఇతర పండితులు చేసిన పరిశోధనల ద్వారా, అన్విత, ఆ ప్రాంతంలో ఒకే జాతికి చెందిన రెండు వేర్వేరు సమూహాలైన ఎమ్31, ఎమ్32 లను ఆమె కనుగొందని తెలిసింది.[7]

అన్విత 2006లో తిరిగి అండమాన్ భాషలపై పరిశోధన ప్రారంభించింది. అంతరించిపోతున్న మూడు అండమనీస్ భాషలలోని పదాలను, అర్ధ కోశాన్నీ పరిశీలించింది. ఈ పరిశోధనల ఆధారంగా, అండమనీస్ భాష భాషాపరంగా వైవిధ్యమైన భాషా కుటుంబానికి చెందినది అని ఆధారాలతో సహా రుజువు చేసింది. అన్విత ఇంగ్లీష్-గ్రేట్ అండమనీస్-హిందీ డిక్షనరీని కూడా తయారు చేయడం విశేషం. ప్రస్తుతం ఆమె, గ్రేట్ అండమనీస్ భాషల ఆవిర్భావం, వ్యాకరణం, అక్కడి ప్రజల గురించి పరిశోధన చేస్తోంది.[3][4][7]

జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసిన అన్విత తన కెరీర్ లో 20 మంది పి.హెచ్.డి విద్యార్థులు, 29 మంది ఎం.ఫిల్ విద్యార్థులు ఆమె వద్ద చదువుకున్నారు.[3][4][7]

పురస్కారాలు, గుర్తింపులు[మార్చు]

అన్విత వివిధ సంస్థల నుంచి ఎన్నో పురస్కారాలు, గౌరవాలు పొందింది.[7][13] 2000, 2003, 2010లలో జర్మనీలోని లైప్జిగ్ లో ఉన్న మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ లో విజిటింగ్ శాస్త్రవేత్తగా పనిచేసింది.[6][7] 2011లోని లండన్ విశ్వవిద్యాలయంలో ఎస్.ఒ.ఎ.ఎస్ విభాగానికి లెవెర్ హ్యూం ప్రొఫెసర్ గా కూడా చేసింది ఆమె.[6] 1990లో న్యూయార్క్ లోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో హ్యుమానిటీస్, సాంఘిక శాస్త్రాలలో ఫెలోషిప్ చేసింది. 2003లో మెల్బోర్న్ లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలో కూడా విజిటింగ్ ఫెలోగా చేసింది.[3][4][6][7][13] 2010-2011లో ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయంలో ఉన్న కైర్న్స్ ఇన్స్టిట్యూట్ లో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసింది అన్విత.[6][7] ఆమె ఇతర గౌరవాలు:

 • రాష్ట్రీయ లోక్ భాష సమ్మాన్ - గాంధి హిందుస్థానీ సాహిత్య సభ - 2003[3][4][6][7][13]
 • ఫెలోషిప్ - అఖిల భారతీయ ఆధునిక అధ్యాయం ఇన్స్టిట్యూట్, సిమ్లా - 2001[3][4][13]
 • గోల్డ్ మెడల్ - ఢిల్లీ విశ్వవిద్యాలయం - 1970[3][4][13]

అన్విత 2013లో, పద్మశ్రీ పురస్కారం కూడా అందుకుంది.[2][6]

మూలాలు[మార్చు]

 1. "Lsi" (PDF). Lsi. 2013. Retrieved 27 October 2014. Cite web requires |website= (help)
 2. 2.0 2.1 "Padma 2013". Press Information Bureau, Government of India. 25 January 2013. Retrieved 10 October 2014. Cite web requires |website= (help)
 3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 "JNU CV" (PDF). JNU CV. 2014. Retrieved 27 October 2014. Cite web requires |website= (help)
 4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 "Andamanese CV" (PDF). Andamanese. 2014. Retrieved 27 October 2014. Cite web requires |website= (help)
 5. "JNU Profile". JNU. 2014. Retrieved 27 October 2014. Cite web requires |website= (help)
 6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 "Faculty Profile". JNU. 2014. Retrieved 27 October 2014. Cite web requires |website= (help)
 7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 7.7 7.8 7.9 "Hans Rausing Endangered Languages Project". Hans Rausing Endangered Languages Project. 2011. Retrieved 27 October 2014. Cite web requires |website= (help)
 8. 8.0 8.1 "Andamanese Intro". Andamanese. 2014. Retrieved 27 October 2014. Cite web requires |website= (help)
 9. "Vanishing Voices of the Great Andamanese". SOAS, University of London. 2014. Retrieved 27 October 2014. Cite web requires |website= (help)
 10. "Terra Lingua". Terra Lingua. 2014. Retrieved 27 October 2014. Cite web requires |website= (help)
 11. "ELDP". HRELP. 2014. Retrieved 27 October 2014. Cite web requires |website= (help)
 12. "JNU Research". JNU Research. 2014. Retrieved 27 October 2014. Cite web requires |website= (help)
 13. 13.0 13.1 13.2 13.3 13.4 "JNU awards". JNU. 2014. Retrieved 27 October 2014. Cite web requires |website= (help)

బయటి లంకెలు[మార్చు]