వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు
1, 2, 3 |
వికీపీడియా నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలపై చర్చకు ఉద్దేశించినది ఈ నోటీసు బోర్డు. ముఖ్యంగా ఇది నిర్వాహకులకు ఉద్దేశించినదే ఐనా, సభ్యులందరూ ఇక్కడ చర్చలో పాల్గొనేందుకు ఆహ్వానితులే!
ముఖ్యమైన అంశాలు
- నిర్వాహకులు చేయవలసినవి.
- వికీపీడియా:నిర్వాహకులు గమనిస్తూ ఉండవలసిన పేజీలు
- తొలగించవలసిన వ్యాసాలు: 21; ఉపవర్గాలు: 7
- వర్గం:All Wikipedia files with the same name on Wikimedia Commons, వర్గం:All Wikipedia files with a different name on Wikimedia Commons పరిశీలించి కామన్స్ లో ఫైల్ సరిగా వుంటే, స్థానికంగా తొలగింపు, అవసరమైతే స్థానికంగా లింకు మార్పులు, ( ఫైళ్ల నిర్వహణకు సూచనలు )
- గమనిస్తూవుండవలసిన (వీక్షణాజాబితాలో చేర్చుకోవటంద్వారా) లింకులు
- మొదటి పేజీ, మొదటి పేజీ నిర్వహణ స్థితి (రచ్చబండలో కనబడేటట్లు ఇమడ్చడమైనది)
- రచ్చబండ, దాని విభాగాలు
- వికీపీడియా:సహాయ కేంద్రం
- వర్గం:సహాయం_కోసం_ఎదురు_చూస్తున్న_సభ్యులు_లేక_పేజీలు (రచ్చబండలో కనబడేటట్లు ఇమడ్చడమైనది)
- వికీపీడియా:వర్గాల_చర్చలు
- వికీపీడియా:తొలగింపు కొరకు ఫైళ్లు
- వికీపీడియా:Possibly_unfree_files
Global ban proposal for Musée Annam
Apologies for writing in English. Please help translate to your language There is an on-going discussion about a proposal that Musée Annam be globally banned from editing all Wikimedia projects. You are invited to participate at Requests for comment/Global ban for Musée Annam on Meta-Wiki. కృతజ్ఞతలు! NguoiDungKhongDinhDanh (చర్చ) 14:22, 27 డిసెంబరు 2021 (UTC)
శ్రేణి నిరోధం ముగిసింది, దుశ్చర్యలు మళ్ళీ మొదలు
ఫిబ్రవరి 3/4 తేదీల్లో 2409:4070: .. పై శ్రేణి నిరోధం ముగిసింది. అప్పటి నుండి ఆ ఐపీల నుండి దుశ్చర్యలు మళ్ళీ మొదలయ్యాయి. తోటి నిర్వాహకులు పరిశీలనలో ఉంచుకోవాలని విజ్ఞప్తి. __చదువరి (చర్చ • రచనలు) 10:18, 7 ఫిబ్రవరి 2022 (UTC)
- తెలియజేసినందుకు ధన్యవాదాలు చదువరి గారూ, గమనిస్తూ ఉంటాను. - రవిచంద్ర (చర్చ) 10:36, 7 ఫిబ్రవరి 2022 (UTC)
- నేనుకూడా చూస్తాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:58, 7 ఫిబ్రవరి 2022 (UTC)
- చదువరి గారూ మళ్ళీ నిరోధం విధించే ఆలోచన మంచిదేమో. రోజూ ఏదో దుశ్చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మనం ఎంతకాలం మార్పులు తిప్పికొడుతూ కూర్చుంటాం. ఆ సమయమేదో మంచి పనులకు వాడవచ్చు. - రవిచంద్ర (చర్చ) 17:02, 10 ఫిబ్రవరి 2022 (UTC)
- ఆ వరంగల్లు కంప్యూటరు ఇంజనీరింగు దుశ్చర్య చేసే అజ్ఞాతకు ఇదొక వ్యసనం. అప్పుడప్పుడూ వస్తూంటాడు, ఎప్పుడు రాసినా అదే రాస్తూంటాడు. అతడికి ఆ కీర్తి దాహం తీరనిది. :) బహుశా ఒక ఐపీని నిరోధిస్తే సరిపోవచ్చేమో, లేదా నిరోధం అవసరం లేదేమో కూడా చూడాలి.
- పోతే.., 2409:4070 అనే శ్రేణి నుండి వచ్చే దుర్వ్యవహారి ఫిబ్రవరి 3 న అబయతికి వచ్చాడు. ఆ తరువాత అతడు చేసిన పనులను ఇక్కడ చూడవచ్చు. ఇది మాత్రం శ్రేణి నిరోధం చెయ్యాల్సిందే ఒక ఐపీని నిరోధిస్తే పనవదు. __ చదువరి (చర్చ • రచనలు) 00:06, 11 ఫిబ్రవరి 2022 (UTC)
- అవునండీ, ఒకవేళ వాళ్ళు రాసేది నిజమే అయితే కంప్యూటర్ కి సంబంధించి వరంగల్లు కాలేజీ వాళ్ళు ఎవరో ఆ విధంగా చేస్తున్నారు. అమాయకత్వం అనాలో, కావలనే చేస్తున్నారో తెలియదు. నేను పట్టు వదలకుండా ఆ మార్పులు తిప్పికొడుతూనే ఉన్నాను. :-) ఇక నిరోధం గురించి నేను చెప్పింది 2409:4090 విషయమే. కాకపోతే విచిత్రంగా వాళ్ళు చేసే మార్పుల్లో ఏవో కొన్ని మార్పులు మాత్రం కొద్దిగా పనికొచ్చేవి ఉన్నాయి. (ఉదాహరణకు దళపతి సినిమా వ్యాసంలో అది మహాభారతంలో కొన్ని పాత్రల ఆధారంగా రూపొందించిన సాంఘిక చిత్రం అన్నారు. అది ఉండదగ్గ వాక్యమే). అందుకనే నేను గుడ్డిగా ఆ సిరీస్ నుంచి వచ్చిన అన్ని మార్పులు తిరగ్గొట్టక్కుండా వాళ్ళు ఏ మాత్రం పనికొచ్చే మార్పు చేసినా దాన్ని వదిలేస్తున్నాను. లేదా కొద్దిగా మెరుగు పరుస్తున్నాను. మళ్ళీ తెవికీ నిర్వాహకులు ఒట్టి దురహంకారులు అనే మాట మన మీద రాకూడదు కదా!.- రవిచంద్ర (చర్చ) 05:58, 11 ఫిబ్రవరి 2022 (UTC)
వీరపాండ్య కట్టబ్రహ్మన వ్యాసంలో రహ్మానుద్దీన్ గారు ఏకపక్షంగా తొలగించిన తొలగింపు మూస
అసలు ఈ వీరపాండ్య కట్టబ్రహ్మన వ్యాసానికి తొలగింపు మూస పెట్టటానికి కారణాలు.
- ఈ వ్యాసం 2022 జనవరి 3న సృష్టించి , 1,762 బైట్లుతో విస్తరించబడింది.రెండులైన్లుతో వ్యాసం ఉంది.కనీసం మొలక స్థాయి అయినా దాటించలేదు.
- సరేపోనీ నిర్మాణంలో ఉందనే మూస కూడా వ్యాసానికి తొడగలేదు.
- సరే అదీ పోనీ దీనికి తగిన విషయసంగ్రహం అందుబాటులో లేక విస్తరించలేకపోయారనుకోవటానికి, ఆంగ్ల వికీపీడియాలో సుమారు 8,000 బైట్లుకు మించి ఈ వ్యాసం ఉంది.అన్ని బైట్లకు విస్తరించలేకపోయిననూ మొలక స్థాయిదాటించటానికి అవకాశం ఉంది.కానీ ఆ పని జరుగలేదు.
- సరే అదీపోనీ ఇది చరిత్ర కల వ్యాసం.బ్రిటీష్‌వారిపై విరోచితంగా పోరాడి, ఉరిశిక్షకు అమలుజరిపేటప్పుడు “మరెందరో విప్లవవీరులు మాతృభూమి దాస్యశృంఖలాలు చేధిస్తారని” ఉద్వేగప్రసంగం చేసి, ఉరి త్రాటిని ముద్దాడి దాన్ని మెడకు తగిలించుకుని మరణం పొంది, స్వాతంత్య్ర సిద్ధికి సింబాలిక్‌గా నిలిచిన వీరుడు.అలాంటి వ్యాసాన్ని రెండు లైన్లుతో ఉండటం భావ్యమా? వ్యాసం లేకపోతే ఆసక్తి ఉన్న ఇంకొకరు వ్యాసం సృష్టించి అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంది.
- సరే అన్నిటికి రాజీ పడదాం.రాసిన రెండు లైన్లుకు ఒక్క మూలం ఇవ్వలేదు.
- అలాగే ఒక్క వర్గం ఇవ్వలేదు.వర్గం లేదు అని ఎందుకంటానంటే, ఈ వ్యాసం నాకంటపడి తొలగింపు మూస పెట్టటానికి అదే కారణం.గత నాలుగు రోజుల నుండి ప్రత్వేక పేజీలు పరిశీలిస్తూ అందులో వర్గీకరించని పేజీలు లలో గమనించినందున తొలగింపుకు సరైన కారణాలు ఉన్నవనే దృష్టితో యాదృచ్చింకంగా తొలగింపు మూస చేర్చాను తప్ప వేరే ఉద్ధేశం ఏమీలేదు. ఈ వ్యాసమే కాదు, ఇలాంటిదే మరొక వ్యాసం విశ్వనాథనాయని స్థానాపతి అనే వ్యాసం కూడా ఉంది. ఒకసారి పరిశీలించగలరు.
- సరే అదీ కూడా పోనీ ఏదో నేను తొందరపడో, దురుద్దేశంతో తొలగింపు మూస పెట్టాననుకోండి.ఎటువంటి చర్చ జరపకుండా ఏకపక్షంగా తొలగింపు మూస తొలగించిన రహ్మానుద్దీన్ గారు సాధారణ వాడుకరి కాదు. నిర్వాహకుడు అనే కిరీటంతో సముదాయం సత్కరించిన వ్యక్తి.అలా నన్నుకూడా సత్కరించందనుకోండి.అయితే ఇందులో తేడా ఉందనుకోండి. నాకు తెలిసినంతవరకు తొందరపడి తొలగింపు మూస ఎవ్వరూ తీస్తారంటే అంతగా తెలియని కొత్త వాడుకరులు, అజ్ఞాత వాడుకరులు తొలగిస్తారు. విజ్ఞత కలిగిన నిర్వాహకులు తొలగించకుండా చర్చలో పాల్గొంటారు.
చివరగా దీనిమీద నిర్వాహకులు సరైన అభిప్రాయంతో స్పందించగలరు.నా వైపు లోపాలు ఉంటే ఇక ముందు అలా జరగకుండా నేను జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది.నా చర్య సరైనదే అని భావిస్తే వికీపీడియా అభివృద్దికి దోహదపడిందని అనుకుంటాను.--యర్రా రామారావు (చర్చ) 15:39, 1 మార్చి 2022 (UTC)
- నేను గమనించినవివి:
- యర్రా రామారావు గారు తొలగింపు మూసను పెట్టినపుడు వ్యాసం పరిమాణం 1762 బైట్లతో మొలకగా ఉంది.
- ఆ మూసలో తొలగింపు ప్రతిపాదనకు కారణమేంటో రాయలేదు. తొలగింపు చర్చ పేజీని సృష్టించలేదు. కారణాన్ని దాని చర్చ పేజీ లోనూ రాయలేదు. అందుచేతనే వాడుకరి చర్చ పేజీలో పెట్టిన మూసలో కూడా తొలగింపు ప్రతిపాదనకు కారణం లేదు.
- నా అభిప్రాయం: ప్రతిపాదనకు కారణం మొలక అయినట్లైతే (ఇక్కడ రాసిన వ్యాఖ్యలో కారణం అదేనని రామారావు గారు రాసారు) వికీ నియమానుసారం తొలగింపు ప్రతిపాదన సబబే. వ్యాసాన్ని సృష్టించిన నెల రోజుల లోపు విస్తరించకపోతే దాన్ని తొలగించవచ్చు అని ఆ విధానం చెబుతోంది. ఈ వ్యాసం సృష్టించి నెల రోజులు దాటిపోయింది కాబట్టి, దీన్ని తొలగించవచ్చు. ఆ విధానం ప్రకారం చర్చ అవసరం లేదు కూడా. అయితే, కారణం రాయకపోతే వాడుకరికి ఎందుకో తెలియదు కాబట్టి రామారావు గారు అది రాసి ఉండాల్సింది.
- వాడుకరి పేజీలో జరిగిన చర్చలో రహ్మానుద్దీన్ గారు "మీరు కొత్తవారినే కాక అందరినీ కరుస్తున్నారుగా!" అని రాసారు. రామారావు గారు దానికి ప్రతి వ్యాఖ్య రాసారు.
- నాకీ వ్యాఖ్య కటువుగా అనిపించింది. "కొత్తవారినే కాక" అనే మాట సమర్థనీయం కాదు. రామారావు గారు కొత్తవారిని కరుస్తున్నారు అని నిర్ణయించారు. అది సబబుగా లేదు. ఇరువైపులా సభ్యులు స్వీకరించే పద్ధతిని బట్టి ఇలాంటి వ్యాఖ్యలు చెల్లుతాయి. అవతలి వ్యక్తి వాటికి అభ్యంతరాలు చెప్పినపుడు రాసినవారు వెనక్కి తీసుకుంటే ఏ గొడవా ఉండదు. కానీ రామారావు గారు ఆ మాటకు అభ్యంతర చెప్పినపుడు రహ్మానుద్దీన్ గారు వెనక్కి తీసుకోలేదు, వివరణ కూడా ఏమీ ఇవ్వలేదు.
- ఈ ప్రతిపాదన తరువాత రహ్మనుద్దీన్ గారు ప్రతిపాదన మూసను తీసేసి, వ్యాసాన్ని విస్తరించి 2 కెబి దాటించారు. సాంకేతికంగా ఇపుడది మొలక కాదు.
- విస్తరించాక మూసను తొలగించడం నియమ విరుద్ధమేమీ కాదు. (వాడుకరి చర్చ పేజీలో పెట్టిన మూసలో కూడా విస్తరించకుండా మూసను తొలగించవద్దనే ఉంది.)
- చివరిగా, ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. మొలకల విషయంలో రహ్మనుద్దీన్ గారు గతంలో చాలా కటువుగా వ్యవహరించేవారు. అసలు మొలక పేజీని సృష్టించే వీలే లేకుండా గతంలో ఒక వడపోత సృష్టించి అడ్డుకట్ట వేసారు (ఆ తరువాత వచ్చిన అభ్యంతరాల వల్ల దాన్ని తీసేసారు). కాబట్టి ఈ అంశంలో అసలు విషయంపై వారిద్దరికీ భిన్నాభిప్రాయం లేదనీ నేను పైన చెప్పిన - 1) తొలగింపు ప్రతిపాదనకు కారణం చెప్పక పోవడం, 2) కరుస్తున్నారనే వ్యాఖ్య - ఈ రెంటి వల్లనే వచ్చిందనీ నేను భావిస్తున్నాను. అనుభవజ్ఞులు, నిర్వాహకులూ అయిన ఈ ఇద్దరూ ఈ వ్యవహారాన్ని సామరస్యంగా ముగిస్తారని భావిస్తున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 07:39, 4 మార్చి 2022 (UTC)
- వీరపాండ్య కట్టబ్రహ్మన వ్యాసంలో నేను తొలగింపు మూస వికీ సమయం ప్రకారం 11:53, 1 మార్చి 2022 పెట్టాను.తొలగింపు మూస పెట్టాను. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వీరపాండ్య కట్టబ్రహ్మన పేజీలో రాద్దామనే ఉద్దేశంతో మూసలోనే తొలగింపుకు కారణం రాయనిమాట వాస్తవం.అయితే రహ్మానుద్దీన్ గారు 12:10, 1 మార్చి 2022 కు దానిలో మూసను తోలగించారు.ఈ రెండు చర్యల మధ్య కేవలం 17 నిమిషాలు మాత్రమే.నేను కారణం రాయటానికి సమయం ఇవ్వలేదని గ్రహించాలి. 12:12, 1 మార్చి 2022 బయటి వ్యాసాలకు లింకులు కలిపి +187 బైట్లుకు విస్తరించి 1949 బైట్లుకు పెంచారు.15:40, 1 మార్చి 2022సమయంలో నేను ఈ విషయంపై నిర్వాహకుల నోటీసు బోర్డులో చర్చ ప్రవేశ పెట్టాను.నేను చర్చలో ఆ వ్యాసంలోని అభ్యంతరాలు రాసిన తరువాత 15:59, 1 మార్చి 2022, 15:59, 1 మార్చి 2022 సవరణలు ద్వారా ఆ వ్యాసంలో రెండు వర్గాలు చేర్చి 2,084 బైట్లుచేర్చి మొలక స్థాయిని దాటించారు.16:00, 1 మార్చి 2022 ఈ సవరణలో నిర్వహణ మూసలు పెట్టారు. ఈ సవరణలు అన్నీ నేను 15:40, 1 మార్చి 2022 నిర్వాహకుల నోటీసు బోర్డు చర్చలో 15:59, 1 మార్చి 2022 సూచించిన తరువాత 19 నిమిషాలకు సవరించి మొలక స్థాయి దాటించారు.ఇదేపనులు మూస తొలగింపుకు ముందు చేసి, నిర్వాహకుడు హోదాలో మూస తొలగించి ఉన్నట్లయితే నిర్వాహకుల నోటీసు బోర్డులో చర్చకు రావలసిన అవసరంలేదు.ఇందులో నా తప్పు, తొందరపాటు చర్యలు ఉన్నవనిఅనిపిస్తే నిర్వాహక నోటీసు బోర్డుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:47, 10 మార్చి 2022 (UTC)
శ్రేణి నిరోధం ఎలా చేయాలి
అజ్ఞాతవాడుకరులు ప్రతిరోజూ తెలుగు వికీపీడియాలో ఎక్కువ అనుచిత మార్పులు చేయుచూ, ఒక ఆన్లైను ఆటగా ఉపయోగించుకుంటున్నారు.అజ్ఞాతవాడుకరులు చేసేవి అన్నీ బుద్దిపూర్వకంగా కావాలనే చేస్తున్నారు.అనుచిత మార్పులు చేయటం, వాళ్లే మరలా రివర్స్ చేయటం, వాళ్ల పేర్లు రాసుకోవటం, (BOYA MACHANURU VEERESH అనే అతను తనపేరును కొక్కరచేడు వ్యాసంలో పదేపదే రాసుకోవటం చరిత్రలో గమనించండి) వ్యాసంలోని విషయసంగ్రహం తుడిపివేయటం, వ్యాసానికి సంబంధంలేని విషయాలు రాయటం ఇలా ఎన్నో విధాలుగా ఉన్నాయి.వికీలో పరిశీలించేవాళ్లు తక్కువ మంది ఉన్న ఈ పరిస్థితిలో శ్రేణి నిరోధం విధించటంకన్నా ఉత్తమమైన మార్గంలేదు.అజ్ఞాతవాడుకరులు చేసే మంచి ఒక శాతం కూడా ఉండదు.99 శాతం చెడు ఉంటుంది.అజ్ఞాతవాడుకరులు సవరణలపై చదువరి గారు శ్రేణి నిరోధం విధించటం నేను సమర్థిస్తున్నాను. చదువరి గారే కాకుండా దీనిమీద నిర్వహకులు ఎవ్వరు గమనించితే వారు శ్రేణి నిరోధం విధించాలి.నావరకు నాకు శ్రేణి నిరోధం విధించటం తెలియదు.అందువలన శ్రేణి నిరోధం విధించటంపై పూర్తి వివరణ తెలియపర్చవలసిందిగా చదువరి గారు లేదా ఇెతర నిర్వాహకులు ఎవరైనా తెలియపర్చగలరు.--యర్రా రామారావు (చర్చ) 07:35, 19 మార్చి 2022 (UTC)
- భూతం ముత్యాలు అనే రచయిత తన పేరుతో రెండు ఖాతాలను సృష్టించుకొని తన పేజీతోపాటు తెలుగు రచయితల పేజీల్లో, వర్గాలలో తన వ్యక్తిగత సమాచారాన్ని చేర్చారు. ఆయా మార్పులను తిప్పికొట్టి ఆ ఖాతాలను నిరోధించగా... అనేకమార్లు ఐపి అడ్రసులతో ఆయా పేజీలలో వ్యక్తిగత సమాచారాన్ని చేర్చుతున్నారు. ఇలాగే చేసుకుంటూ పోతే ఎన్నని ఐపీలను నిరోధిస్తాం?. ఇలాంటి సందర్భంలో శ్రేణి నిరోధం అవసరమని నా అభిప్రాయం.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 08:10, 19 మార్చి 2022 (UTC)
- @యర్రా రామారావు,@Pranayraj1985 గార్లకు, శ్రేణి నిరోధాల వలన కొత్తగా చేరేవారికి సమస్య ఏర్పడుతుంది. ఇది గతసంవత్సర గణాంకాలలో కొత్తగా ఖాతా తెరిచేవారు తగ్గటం స్పష్టంగా కనబడింది.(2020-2021 కాలంలో New registered users పటంలో చివరి అర్ధ సంవత్సరంభాగం చూడండి) అందుకని అత్యవసరమైతే తప్ప చేయకూడదు. త్వరలో వికీపీడియా లో అనామక వ్యక్తుల రచనల గుర్తింపు కూడా మారబోతున్నది. నిర్వాహక నోటీసుబోర్డులో తెలిపారు కాబట్టి, ఇతర నిర్వాహకులు కూడా అప్రమత్తమై దుశ్చర్యలను ఎదుర్కొనటంలో సహాయ పడతారు. కాస్త ఓపిక పట్టండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 00:49, 25 మార్చి 2022 (UTC)
- @Arjunaraoc గారూ, శ్రేణి నిరోధాల వలన ఏర్పడే సమస్యలు చెబుతున్నారు. శ్రేణి నిరోధం విధించాలని ఉత్సాహమేమీ లేదండి. తప్పనిసరి పరిస్థితిలోనే విధించాన్నేను. సరే, దాన్ని విధించడం మానేద్దాం.. ప్రత్యామ్నాయమేంటి? -చెప్పలేదు మీరు. "ఇతర నిర్వాహకులు కూడా అప్రమత్తమై దుశ్చర్యలను ఎదుర్కొనటంలో సహాయ పడతా"రని మాత్రం చెబుతున్నారు. ఇతర నిర్వాహకుల సంగతి సరే.., మీరు సహాయపడతారా? సహాయపడ్డారా?
- నిరుడు అజ్ఞాతలు ఇక్కడ చురుగ్గా పనిచేస్తున్న వాడుకరులపై వరసబెట్టి నెలల తరబడి వ్యక్తిగత దాడులు చేస్తూండగా మీరు ఏమీ మాట్టాడలేదు. చర్చలో కనీసమాత్రపు జోక్యం కూడా చేసుకోలేదు. ఇతర నిర్వాహకులం అనేక విధాలుగా ఆ దాడులను ఎదుర్కొనే ప్రయత్నాలు చేసాం, రచ్చబండ లోనూ, ఈ బోర్డులోనూ చర్చించాం. అప్పుడు గానీ, ఆ తరువాత గానీ.. దుశ్చర్యలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో మీరు జోక్యమే చేసుకోలేదు -వికీలో చురుగ్గా పనులు చేస్తూ కూడా. ఒక సలహా ఇవ్వలేదు, ఒక అభిప్రాయం చెప్పలేదు. కానీ, ఇప్పుడు మీరు సలహా ఇస్తున్న నిర్వాహకులిద్దరూ ఆ చర్చల్లో తమ అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా చెప్పినవారే. నిర్ణయం తీసుకోవడంలో చురుకైన పాత్ర పోషించినవారే. అజ్ఞాతల దాడికి గురైనవారు కూడా!
- ఇక్కడ చర్చల్లో పాల్గొనలేదు సరే.., ఆ సమస్య గురించి స్టీవార్డులకు నివేదించుదామనైనా అనుకున్నారా? అదీ లేదు. పోనీ, అక్కడ నేను ఇచ్చిన ఫిర్యాదుకు వాళ్ళిచ్చిన సమాధానాలను చదివారా? అవి చదివాక, వాళ్ళేమీ చెయ్యరని తేలిపోయాక కూడా, ఆ అజ్ఞాతలపై చర్యలు తీసుకునేందుకు మన దగ్గర ఇతర వికల్పాలంటూ ఏమైనా ఉన్నాయో లేదో పరిశీలించారా? ఇక్కడ చర్చించారా? లేదు.
- పోనీ, తొలుత మూడు నెలల నిరోధం విధించినా అవే ఐపీ అడ్రసులు మళ్ళీ దాడులు చేసినప్పుడు ఏమైనా మాట్టాడారా? లేదు.
- మళ్ళీ, పొడిగించిన మూడు నెలల నిరోధం ముగిసాక తిరిగి దుశ్చర్యలు మొదలుపెట్టినపుడు ఏమైనా మాట్టాడారా? ఈ పేజీలోనే పైన జరిగిన చర్చలో మీ సూచనలు ఏమైనా చేసారా? లేదు.
- ఇతర వాడుకరులు విధించిన నిరోధాన్ని ఎత్తివెయ్యడమో మార్చడమో చేసే ముందు దాని గురించి చర్చించాలన్న కనీస మాత్రపు సంప్రదాయాన్నీ, మర్యాదనూ పాటించారా? లేదు.
- ఐనప్పటికీ, మీరు సూచించే ప్రత్యామ్నాయ చర్యల కోసం ఎదురుచూస్తున్నాను. శ్రేణి నిరోధం విధించాల్సిందే అని నేను అనడం లేదు. దాన్ని మించిన ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే చెప్పండి. సంతోషంగా దాన్నే పాటిద్దాం. ఇతర నిర్వాహకులు దుశ్చర్యలను ఎదుర్కొనటంలో సహాయ పడతారని మాత్రం చెప్పకండి, ఆ పని మీరు చెయ్యలేదు. __ చదువరి (చర్చ • రచనలు) 03:33, 25 మార్చి 2022 (UTC)
- అర్జునరావు గారూ మీ సమాధానం నాకు సంతృప్తికకరంగా లేదు.అడిగినదానిని దాటవేసి ఏదేదో చెప్పారు.ఏ నిరోధం అయినా తప్పని పరిస్థితులలో విధించాలనేది కామన్ రూలు. ఇది అందరికి తెలిసిన విషయమే.అర్జునరావు గార్కి శ్రేణి నిరోధం గురించి తెలిసుంటే చెప్పి, ఆ తరువాత వారికి తోచిన సూచనలు ఇస్తే బాగుండేది.శ్రేణి నిరోధం గురించి మిగతా నిర్వాహకులుకు తెలియకూడదనే భావనతో ఉన్నట్లు తెలుస్తుంది. తెలియని విషయం తెలుసుకోవటం తప్పుకాదుకదా! ఇప్పటికైనా తెలిసిన వారు ఎవరైనా వివరించగలరు. పర్వేక్షణ కొరత అంతంత మాత్రం ఉన్న ఈ పరిస్థితులలో అజ్ఞాత వాడుకరుల సవరణలు పరంపర ఇలానే సాగితే వ్యాసాల నాణ్యత క్షీణించపోవటం ఖాయం అని నేను భావిస్తున్నాను.చదువరి గారి పైన వివరించిన అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:54, 25 మార్చి 2022 (UTC)
- @యర్రా రామారావు,@Pranayraj1985 గార్లకు, శ్రేణి నిరోధాల వలన కొత్తగా చేరేవారికి సమస్య ఏర్పడుతుంది. ఇది గతసంవత్సర గణాంకాలలో కొత్తగా ఖాతా తెరిచేవారు తగ్గటం స్పష్టంగా కనబడింది.(2020-2021 కాలంలో New registered users పటంలో చివరి అర్ధ సంవత్సరంభాగం చూడండి) అందుకని అత్యవసరమైతే తప్ప చేయకూడదు. త్వరలో వికీపీడియా లో అనామక వ్యక్తుల రచనల గుర్తింపు కూడా మారబోతున్నది. నిర్వాహక నోటీసుబోర్డులో తెలిపారు కాబట్టి, ఇతర నిర్వాహకులు కూడా అప్రమత్తమై దుశ్చర్యలను ఎదుర్కొనటంలో సహాయ పడతారు. కాస్త ఓపిక పట్టండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 00:49, 25 మార్చి 2022 (UTC)
ఐఐఐటి వారి వ్యాసాలను ప్రచురించే పద్ధతి
ఐఐఐటీ వారు కొన్నేళ్ళుగా చేస్తున్న కృషి ఫలితాన్ని తెవికీ లోకి చేర్చే పని మొదలుపెట్టారు. మనందరం సంతోషించాల్సిన సమయమిది. ఈ పని సరిగ్గా జరిగితే తెవికీకి పెద్ద మేలు జరుగుతుంది. కానీ, సరిగ్గా జరక్కపోతే గతంలో గూగుల్ యంత్రికానువాదాల ప్రహసనం లాంటిది పునరావృతం కావచ్చు. అంచేత సముదాయం ముందే జాగ్రత్తపడి ఐఐఐటీ వారి ప్రతినిధితో కలిసి సమన్వయం చేసుకుంటూ ఈ వ్యాసాల ప్రచురణ సవ్యంగా జరిగేలా చూడాలి. నిర్వాహకులంతా ఈ విషయంలో తమతమ సూచనలిస్తూ ఒక చక్కటి పద్ధతిని రూపొందించాలి. ఈ విషయమై నేను రచ్చబండలో ఒక పద్ధతిని సూచించాను. అందుకనుగుణంగా ఒక చెక్‌లిస్టును తయారుచేసాను. వీటిని పరిశీలించి అవసరమైన మార్పుచేర్పులేమైనా చేసి, ఒక ఆచరణాత్మకమైన పద్ధతిని తయారుచెయ్యవలసినదిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 10:28, 5 ఏప్రిల్ 2022 (UTC)
వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో పెండింగు పని
వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో కొన్ని చర్చలు నిర్ణయం కోసం వేచి ఉన్నాయి. ఆయా చర్చల్లో పాల్గొనని నిర్వాహకులు వాటిపై నిర్ణయాలను ప్రకటించి, తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 08:57, 11 ఏప్రిల్ 2022 (UTC)
- వికీ నియమానుసారం తొలగింపు చర్చలలో పాల్గొనని నిర్వాహకులే ఫలితం ప్రకటించాలి. కానీ ప్రతీ చర్చలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పాల్గొంటున్నారు. ఎన్ని నెలలైనా ఏ ఇతర నిర్వాహకులూ ఫలితం ప్రకటించకపోవడం వల్ల ఆ చర్చలలో పాల్గొన్నవారే ఫలితం ప్రకటించవలసి వస్తుంది. @రవిచంద్ర: వంటి క్రియాశీలక నిర్వహకులు ఒక్కసారి ఆ పేజీలు పరిశీలించి తగు ఫలితం ప్రకటించగలరు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:38, 2 జూన్ 2022 (UTC)
వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో పెండింగు పెండింగు పని
వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో కొన్ని చర్చలు నిర్ణయం కోసం వేచి ఉన్నాయి. ఆయా చర్చల్లో పాల్గొనని నిర్వాహకులు వాటిపై నిర్ణయాలను ప్రకటించి, తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. చదువరి (చర్చ • రచనలు) 02:44, 1 జూలై 2022 (UTC)
పదేపదే దుశ్చర్యలు - శ్రేణి నిరోధాలా మరేదైనా చర్యా?
నిరోధం గడువు ముగియగానే దుశ్చర్యలు చెయ్యడం మొదలౌతోంది. మరీ ముఖ్యంగా కొన్ని ప్రత్యేకించిన ఐపీ అడ్రసుల నుంచి ఇది ఎక్కువగా జరుగుతోంది. 2409:4070: తో మొదలయ్యే ఐపీ అడ్రసుల నుండి వస్తున్న వాడుకరి చేసిన పనులను పరిశీలించండి. నేను గమనించినవివి:
- నిరుడు నిర్వాహకులపై ఒక వాడుకరి, కొందరు అజ్ఞాతలు దాడి చేసిన సందర్భంలో పై ఐపీ అడ్రసులు ఇతోధికంగా దాడిలో పాల్గొన్నాయి.
- ఒక ఐపీ అడ్రసును నిరోధిస్తే అదే శ్రేణి లోని మరొక ఐపీ అడ్రసు నుండి దాడి చేసారు. దాన్ని నిరోధిస్తే అదే శ్రేణి లోని మరొక దాన్నుండి.. ఇలా ఈ శ్రేణి నుండే దాడులు చేస్తూ పోయారు.
- చివరికి శ్రేణి నిరోధం విధిస్తే ఆగింది. కానీ ఆ నిరోధం ముగియగానే మళ్ళీ మొదలయ్యాయి. మళ్ళీ శ్రేణి నిరోధం విధించాల్సి వచ్చింది.
- అలా జరుగుతూండగా, ఒక శ్రేణి నిరోధం ఫిబ్రవరి 2 న ముగిసింది. ఆ వెంటనే మళ్ళీ దాడులు మొదలయ్యాయి. అయితే ఈ సారి కొన్నాళ్ళ పాటు శ్రేణి నిరోధం విధించకుండా ఓర్పు వహించాం. ఇక్కడ చర్చ కూడా చేసాం. తప్పనిసరై ఫిబ్రవరి 18 న 3 నెలల పాటు శ్రేణి నిరోధం విధించాం.
- ఆ 3 నెలల పాటు ఈ శ్రేణి నుండి ఏ ఇబ్బందీ రాలేదు. మే 18 న ఆ నిరోధం ముగియగానే మళ్ళీ దుశ్చర్యలు మొదలయ్యాయి. ఆ తరువాత అనేక దుశ్చర్యలను తిప్పికొట్టాం, అనేక వివిక్త ఐపీలపై నిరోధం విధించాం గానీ, శ్రేణి నిరోధం మాత్రం ఈసారి ఇప్పటి దాకా విధించలేదు. దీనికి ప్రధాన కారణం, అర్జున గారు శ్రేణి నిరోధం విధించడం సరైన పని కాదని వారించారు. ఆ చర్చను ఇక్కడ చూడవచ్చు. ఆయన చూపిన కారణం సహేతుకమైనదే. శ్రేణి నిరోధం వలన మంచివాళ్ళకు కూడా కలిగే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, నిజమే. కానీ నిర్వాహకులందరూ చురుగ్గా లేరే.. మరెలా? శ్రేణి నిరోధానికి ప్రత్యామ్నాయ చర్య - నిర్వాహకులపై వత్తిడీ పెట్టని చర్య - ఏమైనా ఉందా? ఉంటే ఏంటది? కింది విషయాలను చూడండి:
- మే 18 నుండి నేటి (జూలై 10) వరకు పై శ్రేణి లోని ఐపీలను 5 సార్లు నిరోధించగా, వాటిలో 4 యర్రా రామారావు గారు, ఒకటి ప్రణయ్ గారు చేసారు.
- 2022 లో ఇప్పటివరకూ చేసిన మొత్తం నిరోధాలు, ఎత్తివేతలు 69 పైబడి ఉండగా, వాటిపై పనిచేసిన నిర్వాహకులు ఆరుగురు.
- నిరోధం విధించేముందు గానీ, లేదా అసలు నిరోధం విధించకుండానో గానీ ఆయా దుశ్చర్యలను తిరగ్గొట్టిన చర్యల్లో కూడా సింహభాగం ఈ ఆరుగురు నిర్వాహకులే తీసుకుని ఉంటారని అనుకోవచ్చు.
- మరి, దుశ్చర్యలు ఇలా సాగుతూ ఉంటే, నిర్వాహకులు కొంతమంది మాత్రమే చురుగ్గా ఉంటూంటే, ఏం చెయ్యాలి? మనకున్న వికల్పాలేంటి? మీమీ ఆలోచనలు చెప్పండి. __చదువరి (చర్చ • రచనలు) 13:58, 10 జూలై 2022 (UTC)
Files requiring renaming
Hello!
Sorry for writing in English. Can any admin please handle the files in వర్గం:Wikipedia files requiring renaming? Jonteemil (చర్చ) 15:26, 10 జూలై 2022 (UTC)
మండవ సాయి కుమార్ పేజీ విషయంలో
90 అనే పేజీని వ్యక్తిగత ప్రచారం చేసుకుంటూ పదే పదే సృష్టించడం జరుగుతోంది. గతంలో 2 సార్లు తొలగించిన ఈ పేజీని మూడోసారి మళ్ళీ రెండ్రోజుల కిందట సృష్టించారు. వాడుకరి:MandavasaiKumar, వాడుకరి:Kumarooooo అనే ఇద్దరు వాడుకరులు ఈ పేజీని సృష్టించి, సమాచారం చేర్చారు. వాడుకరి:రవిచంద్ర ఈ పేజీలో తొలగింపు మూస పెట్టగా, ఏ చర్చా లేకుండా దాన్ని తీసేసారు. రవిచంద్ర గారు దాని చర్చ పేజీలో తొలగింపు హేతువు రాయగా దాన్ని చెరిపేసారు. కొంత చర్చ జరిగాక నేను "మండవ సాయి కుమార్" పేజీని తొలగించాను. (పొరపాటున రాసినదాన్ని కొట్టేసాను.) రవిచంద్ర గారు ఆ పేజీని తొలగించారు. ఆ రోజే ఈ రెండు వాడుకరి ఖాతాలను పరిశీలించమని స్టీవార్డులను కోరాను.
గత రాత్రి Kumarooooo మళ్ళీ ఈ పేజీని - 4 వ సారి - సృష్టించారు. నేను దాన్ని తొలగించి ఆ వాడుకరిని 1 రోజు పాక్షిక నిరోధంలో పెట్టాను. ఈలోగా స్టీవార్డులు, ఆ రెండు ఖాతాలూ ఒక్కరివే అని రిపోర్టు ఇచ్చారు. ఇక చర్య తీసుకోవడం మన వంతు. నేను కింది చర్యలను ప్రతిపాదిస్తున్నాను -
- ఈ రెండు ఖాతాలను శాశ్వతంగా నిరోధించాలి.
- "మండవ సాయి కుమార్" పేజీని ఆ పేరుతో గానీ మరో పేరుతో గానీ, విషయ ప్రాముఖ్యతను నిరూపించకుండా, సరైన మూలాలు లేకుండా సృష్టిస్తే, మూడు రోజులలో లోపాలను సవరించకపోతే ఆ పేజీని తొలగించాలి. ఆ వాడుకరిపై తగు చర్య తీసుకోవాలి.
పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 01:37, 29 అక్టోబరు 2022 (UTC)
- పై చర్యలను తీసుకోవటానికి నేను అంగీకరిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 03:42, 29 అక్టోబరు 2022 (UTC)
- మనం చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు, సమాధానం ఇవ్వలేదు కాబట్టి చర్యలు తీసుకోవడం సరైనదే. ఖాతాలను నిరోధించాలి. ఆ వ్యాసాలను సృష్టించకుండా అడ్డుకోవాలి. - రవిచంద్ర (చర్చ) 09:46, 29 అక్టోబరు 2022 (UTC)
మేకా మన్మథ రావు అనుచిత మార్పులు
వాడుకరి:Meka manmadha rao అనే వాడుకరి అనేక వ్యాసాలలో అనుచిత మార్పులు చేస్తున్నారు. మొదట్లో చూడ్డానికి జెన్యూన్ మార్పులు అనిపించినా తీరా చూస్తే అన్నీ తప్పుడు మార్పులే. పైగా వాటికి మూలాలు కూడా లేవు. నేను రెండు మూడు రోజుల క్రిందట హెచ్చరించి మార్పులు ఆపమని చెప్పినా ఆ మార్పులు ఆగలేదు. అందుకని ఆ సభ్యునిపై నిరోధం విధించే విషయమై నిర్వాహకుల అభిప్రాయాన్ని కోరుతున్నాను. ఒక వారం రోజులు నిరోధం విధించడం సబబేనా? మీ అభిప్రాయాలు తెలుపగలరు. - రవిచంద్ర (చర్చ) 16:39, 13 నవంబరు 2022 (UTC)
- ఈ ఖాతాను ఒక వారం రోజుల పాటు నిరోధించాను. ఎందుకంటే ఈ రెండు రోజుల వ్యవధిలో కూడా వ్యాసాలలో తప్పుడు మార్పులు చేసారు. - రవిచంద్ర (చర్చ) 05:43, 15 నవంబరు 2022 (UTC)
- ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవచ్చు యర్రా రామారావు (చర్చ) 06:04, 15 నవంబరు 2022 (UTC)
ఐఐఐటీ హైదరాబాద్ వారి 10 లక్షల+ వ్యాసాలు, ఎంతమేరకు పనికివస్తాయో తెలుసుకునేందుకు ప్రయత్నం
తోటి నిర్వాహకులకు నమస్కారం,
ఐఐఐటీ హైదరాబాద్ వారి ఇండిక్ వికీ ప్రాజెక్టులో భాగంగా మొత్తానికి ఒక పదిలక్షల పైచిలుకు వ్యాసాలను తాము తమ వెబ్సైట్లో ప్రచురించామని, అవి పనికివస్తే తెలుగు వికీపీడియన్లు తీసుకోవచ్చనీ, ప్రస్తుతానికి నమూనా వ్యాసాలు చేర్చే పక్రియ వాయిదా వేసుకొన్నామనీ, ప్రస్తుతానికి ఏవో పరిశోధనలు జరుగుతున్నాయనీ, కార్యాచరణ తర్వాత ప్రకటిస్తామనీ చెప్పారు. స్థూలంగా చెప్పాలంటే, వారు ఒకచోట తెలుగు వికీపీడియాకు పనికివస్తాయని తాము భావిస్తున్న వ్యాసాలను పదిలక్షల పైచిలుకు పెట్టారు. ఇవి వివిధ స్థాయుల్లో ఉన్నాయనీ, వీటిపై ఏవో పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. మనం కావాలంటే వాడుకోవచ్చట.
వీరి ప్రాజెక్టు ప్రారంభమై ఒక రెండేళ్ళో, మూడేళ్ళో అవుతోంది. వీరు మనకు సవ్యమైన నివేదికలు, వివరాలు అందించట్లేదు. మనం ఇచ్చిన చెక్ లిస్టు మీద కూడా ఏం చేశామో ఇప్పటికీ చెప్పట్లేదు. అయినప్పటికీ, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి, వీరి పది లక్షల వ్యాసాల నుంచి శాంపిల్ పద్ధతిలో పరిశీలన చేసి, ఏమైనా పనికివస్తే వినియోగించుకోవడమూ, లేదంటే ఒక నివేదిక రాసుకోవడమూ చేయడం మంచిదని నా అభిప్రాయం. ఈ సంగతి ఇప్పటికే నేను వారి చర్చా పేజీలోనూ, రచ్చబండలోనూ పెట్టాను. దయచేసి మీమీ అభిప్రాయాలను, మీరు ఈ విషయంలో పనిచేయడంలో ఆసక్తి ఉందా లేదా అన్నదీ నమూనా_వ్యాసాలపై_పురోగతి_లేమి_-_తదనంతర_చర్చ_ఫలితాలపై_నిర్ణయాలు అన్న దగ్గరే చెప్పగలరు. ఇది అందరి దృష్టికీ తీసుకురావడానికి ఇక్కడ ప్రకటించాను. కానీ దయచేసి మీ అభిప్రాయాలను ఒక యూనిఫార్మిటీ కోసం అక్కడకు వెళ్ళి తెలియజేయమని మనవి. పవన్ సంతోష్ (చర్చ) 15:35, 20 నవంబరు 2022 (UTC)
- ఐఐఐటి ప్రాజెక్టు వారి వ్యసాలను నేనుకొన్ని పరిశీలించి నా అభిప్రాయలను అక్కడ పెట్టాను. పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 08:38, 22 నవంబరు 2022 (UTC)
మూలాల్లో లోపాలు, సవరణ
వ్యాసాల్లో మనం చేరుస్తున్న మూలాల్లో అనేక రకాలైన లోపాలు దొర్లుతున్నాయి. వీటిలో కొన్ని, మూలాలను చేర్చినపుడే వస్తాయి, కొన్ని తదనంతర కాలంలో కూడా తలెత్తవచ్చు (లింకులు డెడ్ అవడం వంటివి). CS1 మూసలు వాడి చేర్చిన మూలాల్లో లోపాలను ఆ మూసలే కనిపెట్టి, లోపం రకాన్ని బట్టి ఆ పేజీలను వివిధ వర్గాల్లోకి చేరుస్తాయి. ఈ వర్గాలన్నీ వర్గం:CS1 errors అనే మాతృవర్గం కింద ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ఉంటే వికీ నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
ఈ లోపాల్లో చాలా లోపాలు చిన్నపాటి సవరణలు చేస్తే సరైపోతాయి. ఉదాహరణకు తేదీ ఆకృతిలో లోపం, ఒకే పేరు ఇవ్వాల్సిన పరామితులకు ఒకటి కంటే ఎక్కువ విలువలు ఇవ్వడం (firstname, first, last, author, editor, వంటి పరామితులు), URL ఇవ్వకుండా access-date ఇవ్వడం, కాలం చెల్లిన పరామితులను వాడడం వంటివి. ఈ లోపాలను సవరించడం కోసం వికీపీడియా:వికీప్రాజెక్టు/మూలాల్లో లోపాల సవరణ అనే ప్రాజెక్టును మొదలుపెట్టాను. ఈ విషయంలో ఆసక్తి ఉన్నవారు ఈ ప్రాజెక్టులో చేరిగానీ, చేరకుండా గానీ కృషి చెయ్యవచ్చు. ఈ లోపాలను సరిచెయ్యడానికి వాడుకరులందరూ కృషి చెయ్యవచ్చు.. అయితే నిర్వాహకులు కొంత ఎక్కువ బాధ్యత తీసుకుంటే అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుందని నా అభిప్రాయం. సవరణల్లో కృషి చెయ్యడమే కాకుండా, అసలు ఈ లోపాలు రాకుండా నివారించేందుకు ఏం చెయ్యాలో కూడా నిర్వాహకులు ఆలోచించాలి. కాబట్టి అందరి దృష్టికి తెస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 07:01, 10 జనవరి 2023 (UTC)
వైవెయెస్ రెడ్డి గారి వ్యవహారం
@YVSREDDY గారు మళ్ళీ రెండు సార్లు తోటి వాడుకరులపై దూషణలకు పాల్పడడంతో ఒకరోజు నిరోధం విధించాను. ఆ తరువాత ఎవరో కొత్తగా YVSRWIKI అనే ఖాతాను సృష్టించారు. గతంలో కూడా REDDY GARI VYASALU, రెడ్డి గారి వ్యాసాలు అనే రెండు ఖాతాలను కూడా ఎవరో సృష్టించారు. అప్పుడు జరిగిన చర్చలో ఆయనను పింగు చేసాం కాబట్టి, ఆయనకు ఆ చర్చ గురించి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ ఆయన అక్కడ స్పందించలేదు. సాధారణంగా చర్చల్లో తోటి వాడుకరుల అభిప్రాయల పట్ల ఆయన స్పందించరు. అది చాలాసార్లు గమనించాం. ఇప్పుడు కూడా స్పందించక పోవచ్చు. ఎవరైనా వాడుకరి వికీలో అదనంగా ఖాతాలను సృష్టిస్తే, ఆ సంగతి బహిరంగంగా ప్రకటించాలి. మరీ ముఖ్యంగా పదేపదే నిరోధాలకు గురయ్యేవారు తప్పనిసరిగా చెయ్యాలి. లేదంటే వాళ్ళు దురుద్దేశం తోనే అలా చేసారని భావించాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ఖాతాలు ఆయనవే అయితే ఆ ఖాతాలతో నిరవధికంగా నిరోధించడంతో పాటు ఆయన్ను కూడా నిరోధించాలని నా అభిప్రాయం. __చదువరి (చర్చ • రచనలు) 08:33, 11 ఫిబ్రవరి 2023 (UTC)
- చదువరి గారు మీరు మీ టీం కలిసి తెలుగు వికీపీడియాలో మీకు నచ్చిన వారు చేసిన గోరంత పనిని కొండతగాను, మీకు నచ్చని వారు చేసిన కొండంత పనిని గోరంత గాను లేదా కొండలను లోయలుగాను, లోయలను కొండలగాను చూపించగలరు. ప్రస్తుతం మీకు గల టీంతో తెలుగు వికీపీడియాలో వాడుకరులే లేకుండా చేయగల సామర్థ్యం వుంది. పైన మీరు చూపిన ఖాతాలు నావే. YVSREDDY (చర్చ) 03:11, 12 ఫిబ్రవరి 2023 (UTC)
- @YVSREDDY గారూ, ఆ ఖాతాలు మీవేనని ఒప్పుకున్నారు కాబట్టి, వాటిని నిరోధించాల్సిన అవసరం లేదు. పోతే మీరు కింది పనులు కూడా చెయ్యవలసినది:
- మీరు ఇంకా ఏమైనా ఖాతాలను సృష్టించి ఉంటే వాటిని కూడా ఇక్కడ తెలపండి. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే సాక్ పప్పెట్లు అనేదాన్ని వికీపీడియా తీవ్రంగా పరిగణిస్తుంది.
- పై ఖాతాల వాడుకరి పేజీల్లో ఈ ఖాతా నాదే అని రాయండి లేదా మీ వాడుకరి పేజీలో ఆ ఖాతాలు నావే అని రాయండి. రెండు చోట్లా రాయవచ్చు కూడా.
- ఇకపోతే మీరు చేసిన ఇతర ఆరోపణల గురించి.. నేను దానిపై చర్చించను. ఒక్కటి మాత్రం చెప్పగలను - మీపై చర్యలు తీసుకోవడానికి ముందు ఇతర వాడుకరులు మీకు అనేక అవకాశాలను ఇచ్చారు, నేను కూడా ఇచ్చాను. మీరు, నలుగురైదుగురు నిర్వాహకుల పేర్ల మొదటి అక్షరాలను కలిపి ఒక యాక్రోనిం పెట్టి పిలిచారు. మిమ్మల్ని నిరవధికంగా నిరోధించదగ్గ దుష్ప్రవర్తన అది. అయినా మీపై చర్య తీసుకోలేదు. ఎందుకో తెలుసా.. ఆ విషయమై చర్య తీసుకోరాదని మరెవరో చెప్పినందునే. మీరు అన్నీ మర్చిపోతారు. ఇలా విక్టిం కార్డు వాడతారు. సముదాయ సభ్యులకు మీ గురించి తెలవాలనే ఈ సంగతి రాసాను.
- ఇప్పుడు కూడా చూడండి.. వేరేపేర్లతో ఖాతాలను సృష్టించి, వాటి గురించి వెల్లడించకుండా పొరపాటు చేసారు. ఇది మీరు కావాలని చేసిన తప్పు అని నేను భావించడం లేదు, తెలీక చేసిన పొరపాటనే భావిస్తున్నాను. కానీ పొరపాటు పొరపాటే కదా! నాది పొరపాటైంది అని ఒక్ఖముక్క చెప్పారా? లేదు, పైగా అవతలి వాళ్ళు ఒక టీం అనీ, పక్షపాతంతో వ్యవహరిస్తున్నాననీ నిరాధారంగా ఆరోపిస్తున్నారు. ఇది కూడా వ్యక్తిగత హననమే. నిన్నటి నిరోధం వలన బాధ కలిగి ఆ బాధలో మాట్లాడుతున్నారని భావిస్తూ పట్టించుకోవడం లేదు.
- మీలాగే ఇతరులూ సద్బుద్ధితోనే ఉన్నారనే భావన ఇంకా మీలో కలగ లేదు. కనీసం ఇక ముందైనా మీరు మారతారని ఆశిస్తున్నాను. నమస్కారం. __ చదువరి (చర్చ • రచనలు) 05:17, 12 ఫిబ్రవరి 2023 (UTC)
- @Chaduvari గారూ..., @YVSREDDY తెవికీలోని వివిధ వ్యాసాల చర్చాపేజీలలో నిర్వాహకులను నిందిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగిస్తే ఆయనపై శాశ్వత చర్యలు తీసుకోవడం అనివార్యం అనిపిస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:46, 12 ఫిబ్రవరి 2023 (UTC)
- వైవిఎస్ గారి ధోరణిలో ఏ మాత్రం ఇసుమంతా కూడా మార్పులేదు.కేవలం నిర్వాహకులు మీద అసభ్యపదజాలంతో నిందారోపణలు చేయటం మాత్రమే అతని ద్వేయం లాగా ఉంది.పై చర్చలలో "చదువరి గారు మీరు మీ టీం కలిసి తెలుగు వికీపీడియాలో మీకు నచ్చిన వారు చేసిన గోరంత పనిని కొండతగాను, మీకు నచ్చని వారు చేసిన కొండంత పనిని గోరంత గాను లేదా కొండలను లోయలుగాను, లోయలను కొండలగాను చూపించగలరు. ప్రస్తుతం మీకు గల టీంతో తెలుగు వికీపీడియాలో వాడుకరులే లేకుండా చేయగల సామర్థ్యం వుంది." అతను రాసిన ఈ వాక్యం ద్వారా అతని దోరణిని అర్ధం చేసుకోవచ్చు.
- ఇంకా అతను నిరంతరం కావాలని చేసే, చేసిన లోపాలు
- వేరేపేర్లతో ఖాతాలను సృష్టించి, నిర్వాహకులు గమనించి అడిగేదాకా వాటి గురించి వెల్లడించకుండా ఉండటం.
- చర్చలలో నిర్వాహకులు, లేదా వాడుకరులు రాసినదానికి స్పందించకుండా బేఖాతరు చేయటం.నిజాయితీ చర్చ, పిప్పలి చర్చ దానికి ఉదాహరణలుగా ఈపేజీలలో చర్చను పరిశీలించవచ్చును
- అతను సృష్టించిన వ్యాసాలలో వికీనియమాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా లేని (మూలాలు లేని వ్యాసాలు, మొలక వ్యాసాలు, అక్షరభేదాలతో రెండు ఉన్న వ్యాసాలు) తొలగించిన సందర్బంలో నిర్వహకులపై నిందలు వేయటం, వారికి అసభ్యపదాలతో పేర్లు పెట్టటం.
- ఇంకా చాలా ఉన్నవి.ఇలాంటి పరిస్థితులలో శాశ్వత నిరోధం తప్పదనిపిస్తుంది. యర్రా రామారావు (చర్చ) 05:26, 13 ఫిబ్రవరి 2023 (UTC)
- @Chaduvari గారూ..., @YVSREDDY తెవికీలోని వివిధ వ్యాసాల చర్చాపేజీలలో నిర్వాహకులను నిందిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగిస్తే ఆయనపై శాశ్వత చర్యలు తీసుకోవడం అనివార్యం అనిపిస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:46, 12 ఫిబ్రవరి 2023 (UTC)
- @YVSREDDY గారూ, ఆ ఖాతాలు మీవేనని ఒప్పుకున్నారు కాబట్టి, వాటిని నిరోధించాల్సిన అవసరం లేదు. పోతే మీరు కింది పనులు కూడా చెయ్యవలసినది:
- చదువరి గారు మీరు మీ టీం కలిసి తెలుగు వికీపీడియాలో మీకు నచ్చిన వారు చేసిన గోరంత పనిని కొండతగాను, మీకు నచ్చని వారు చేసిన కొండంత పనిని గోరంత గాను లేదా కొండలను లోయలుగాను, లోయలను కొండలగాను చూపించగలరు. ప్రస్తుతం మీకు గల టీంతో తెలుగు వికీపీడియాలో వాడుకరులే లేకుండా చేయగల సామర్థ్యం వుంది. పైన మీరు చూపిన ఖాతాలు నావే. YVSREDDY (చర్చ) 03:11, 12 ఫిబ్రవరి 2023 (UTC)
- వైజాసత్య వంటి ఉత్తమమైన అధికారులు, కొందరు నిర్వాహకులు చేస్తున్న పనులు చూడలేక అధికార పదవి నుంచి తప్పుకున్నారు. మామూలు వాడుకరులను తప్పించటం మీకో లెక్కా. YVSREDDY (చర్చ) 05:50, 13 ఫిబ్రవరి 2023 (UTC)
- @YVSREDDY గారూ మీరు మామూలు వాడుకరి ఎలా అవుతారు సార్.. 2012/2013 నుండి ఇప్పటి వరకూ మీరు సృష్టించిన మొలకల విషయమై కనీసం పది మంది మీకు చెప్పారు, వాదోపవాదాలు జరిగినై. ఇతరులు మీ చర్చ పేజీలో రాసిన వాటిని తీసేసారు. వ్యాసాల చర్చల్లో రాసిన వాటిని తీసేసారు. ఏడెనిమిది సార్లకు పైగా వివిధ వాడుకరుల మీద మీరు వ్యక్తిగత నిందలు చేసారు. నలుగురు వాడుకరులను కలిపి యాక్రోనిమ్ పెట్టి హేళన చేసారు. అబద్ధాలు రాసారు. ఇన్ని చేసిన మీరే తిరిగి "మామూలు వాడుకరులను తప్పించటం మీకో లెక్కా" అంటూ ఇతరులను ఎత్తిపొడవగలుగుతున్నారంటే అమేయమైన మీ నేర్పు గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. మీరు మామూలు వాడుకరి ఎలా అవుతారు సార్? __ చదువరి (చర్చ • రచనలు) 06:15, 13 ఫిబ్రవరి 2023 (UTC)
నిర్వాహకత్వ, అధికారి బాధ్యతల నుండి వైదొలగుతున్నాను
గత రెణ్ణెల్లుగా నేను వికీలో చురుగ్గా లేను. మరి కొన్నాళ్ళ పాటు ఇక్కడ పనిచేసే అవకాశం లేదు. ఈ కారణంగా నాకున్న నిర్వాహకుడు, అధికారి అనే రెండు బాధ్యతలను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నాను. అంచేత ఈ రెండు బాధ్యతల నుండి తప్పించమని స్టీవార్డులను అభ్యర్థించాను. ఒక రోజులో వాళ్ళు తమ పని చేస్తారు.
బాధ్యతలను నిర్వహించలేని పరిస్థితిలో ఉన్న నిర్వాహకుల పట్ల వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ మార్గదర్శకం ఉంది మనకు. ఆ విధానం ప్రకారం కొన్నాళ్ళ తరవాతైనా ఈ నిర్ణయం తీసుకోవాలి. కానీ మరి కొన్నాళ్ళ పాటు ఇక్కడ పని చేసే వీలు నాకు ఉండదని ఎలాగూ తెలుసు కాబట్టి అప్పటి వరకు ఆగదలచుకోలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.
తోటి నిర్వాహకులు, అధికారులూ.. అందరికీ నమస్కారాలు. ఉంటాను. __చదువరి (చర్చ • రచనలు) 13:31, 2 జూన్ 2023 (UTC)
- చదువరి గారూ, వికీపీడియా పట్ల మీ నిబద్ధత ఏమిటో నాకు తెలుసు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటారు. మీరు తొందరగా వ్యక్తిగతమైన బిజీ పనులను ముగించుకుని మరలా తొందరలో తిరిగి వస్తారని ఆశిస్తూ - రవిచంద్ర (చర్చ) 18:21, 2 జూన్ 2023 (UTC)
- మీరు గత రెండు మాసాలు నుండి వికీలో ఆక్టివ్ గా లేని లోటు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ నిర్ణయం ఇంకా వికీకి తీరని లోటు అని నా అభిప్రాయం.సాధ్యమైనంత త్వరలో శలవు నుండి మరలా మీరు వికీలో మీ సేవలు కొనసాగించాలని కోరుతూ, గతంలో మీరు వికీలో ఎవరూ ఊహించని స్థాయిలో అభివృధ్ధి చేసినందుకు, అవసరమైనవారికి తగిన సలహాలూ సూచనలూ అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యర్రా రామారావు (చర్చ) 02:07, 3 జూన్ 2023 (UTC)
- @Chaduvari గారూ, రామారావు గారు చెప్పినట్టు మీరు లేని వికీ నిర్వహణ కొంచెం కష్టమైనదే. మీకు కుదిరినపుడల్లా ఒక వాడుకరిగానైనా వికీలో మీ సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:00, 3 జూన్ 2023 (UTC)
- మీరు గత రెండు మాసాలు నుండి వికీలో ఆక్టివ్ గా లేని లోటు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ నిర్ణయం ఇంకా వికీకి తీరని లోటు అని నా అభిప్రాయం.సాధ్యమైనంత త్వరలో శలవు నుండి మరలా మీరు వికీలో మీ సేవలు కొనసాగించాలని కోరుతూ, గతంలో మీరు వికీలో ఎవరూ ఊహించని స్థాయిలో అభివృధ్ధి చేసినందుకు, అవసరమైనవారికి తగిన సలహాలూ సూచనలూ అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యర్రా రామారావు (చర్చ) 02:07, 3 జూన్ 2023 (UTC)