షిరీన్ ఇబాదీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షిరీన్ ఇబాదీ
Shirin-Ebadi-Amsterdam-2011-Photo-by-Persian-Dutch-Network.jpg
2011లో షిరీన్ ఇబాదీ
జననం (1947-06-21) 1947 జూన్ 21 (వయస్సు 74)[1]
హమదాన్, ఇరాన్
జాతీయతఇరాన్
విద్యాసంస్థయూనివర్సిటీ ఆఫ్ టెహ్రాన్
వృత్తి
 • న్యాయవాది
 • న్యాయాధిపతి
సుపరిచితుడుడిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్
పురస్కారాలుథొరోల్ఫ్ రాఫ్టో మెమోరియల్ ప్రైజ్ (2001)
నోబెల్ శాంతి పురస్కారం (2003)
జెపిఎం ఇంటర్ఫెయిత్ అవార్డ్ (2004)
లీజియన్ ఆఫ్ ఆనర్ (2006)
సంతకం
Shirin Ebadi Signature.svg

షిరీన్ ఇబాదీ ఇరాన్ దేశస్థురాలు. ఈమె వృత్తిపరంగా న్యాయవాది. న్యాయాధిపతిగా, మానవహక్కుల కార్యకర్తగా, ఇరాన్ దేశంలో డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ స్థాపించిన వ్యక్తిగా ఈమె ప్రసిద్ధురాలు. 2003 అక్టోబరు 10 లో ఈమెకు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించారు. ఈమె ప్రజాతంత్ర వ్యవస్థ, మానవ హక్కులు, మరీ ముఖ్యంగా స్త్రీ-బాలల-కాందశీకుల హక్కుల గురించి చేసిన పనికి గాను ఈ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం పొందిన మొదటి ఇరాన్ వ్యక్తిగా కూడా ఈమెకు గుర్తింపు ఉంది.

2009లో అప్పటి ఇరాన్ ప్రభుత్వం ఇబాదీ నోబెల్ బహుమతిని జప్తు చేసుకున్నట్టు ఆరోపణ వచ్చింది, అయితే ఇరాన్ ప్రభుత్వం ఈ ఆరోపణను అంగీకరించలేదు.[2] ఈ ఆరోపణ నిజమైతే ఒక ప్రభుత్వం ద్వారా నోబెల్ బహుమతి లాక్కోవటమనేది ఇదే తొలిసారి.[3]

ఈమె టెహ్రాన్ లో నివాసముండేది కానీ జూన్ 2009 నుండి ఈమె అజ్ఞాతంగా యూకేలో ఉంటుంది. ప్రస్తుతమున్న ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేకంగా ఇనదిస్తున్న ప్రజలపై అణిచివేత ధోరణి కొనసాగించడమే ఇందుకు కారణం.[4] 2004లో ఫోర్బ్స్ ఈమెను ప్రపంచంలోనే అతిశక్తివంతులైన 100 మహిళలలో" ఒకరిగా గుర్తించింది.[5] "అన్ని కాలాలలో శక్తివంతులైన 100 మహిళల" జాబితాలో కూడా ఈమె పేరు చేర్చబడింది.[6]

జీవితం తొలిరోజులు, న్యాయాధిపతిగా జీవితం[మార్చు]

ఇబాదీ జననం హమదాన్ లో అయింది. ఈమె తండ్రి మొహమ్మద్ అలీ ఇబాదీ ఆ నగరపు ముఖ్య నోటరీ అధికారి, వాణిజ్య న్యాయశాస్త్రంలో ప్రొఫెసర్. 1948లో వీరి కుటుంబం టెహ్రాన్ కు మారింది.

1965లో యూనివర్సిటీ ఆఫ్ టెహ్రాన్ లోని న్యాయశాస్త్ర విభాగంలో చేరి 1969లో చదువు పూర్తి చేసుకుని న్యాయాధిపతి అయ్యే పరీక్షలలో పాసయింది. ఆరు నెలల ఇంటర్న్‌షిప్ తరువాత మార్చ్ 1969 నాటికి అధికారికంగా న్యాయాధిపతి అయింది.

ఆమె యూనివర్సిటీ ఆఫ్ టెహ్రాన్ నుండి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీ చదువును కొనసాగించారు. 1971లో ఈ డిగ్రీ పొందారు. 1975లో టెహ్రాన్ సిటీ కోర్టుకి తొలి మహిళా ప్రెసిడెంట్ అయ్యారు. అంతే కాక ఇరాన్ లోనే తొలి మహిళా జడ్జి కూడా అయ్యారు.[7]

1979లో జరిగిన ఇరానియన్ రివల్యూషన్ తరువాత ఛాందసవాద మతాధిపతులు ఇస్లాం ప్రకారం మహిళలు జడ్జి కాలేరని చెప్పగా ఆమె అదే కచేరీలో సెక్రెటరీ స్థాయి ఉద్యోగిగా బదిలీ అయింది. ఈ పరిస్థితికి పర్యవసానంగా ఈమెతో సహా మహిళా జడ్జిలందరూ నిరసన వ్యక్తపరచగా "న్యాయశాస్త్ర నిపుణులు" అనే పదవిని సృష్టించి అది మహిళా జడ్జిలకు వ్యవహరించారు. పరిస్థితులు మారక్పోయే సరికి ఆమె స్వచ్ఛంద రాజీనామా కోసం అభ్యర్థించారు.

ఆమె పంపిన రాజీనామా అభ్యర్థనలను తిప్పి పంపుతూ ఉండటంతో, ఆమె వద్ద లాయర్ పర్మిట్ ఉన్నప్పటికీ, 1993 వరకు ఆమె న్యాయవాదిగా కర్తవ్యం చేపట్టలేకపోయారు. ఈ వ్యవధిలో ఆమె ఎన్నో పుస్తకాలు, ఇరాన్ పత్రికలలో వ్యాసాలు వ్రాసారు.

పురస్కారాలు, గుర్తింపులు[మార్చు]

 • హ్యూమన్ రైట్స్ వాచ్ వారి నుండి జ్ఞాపిక, 1996
 • హ్యూమన్ రైట్స్ వాచ్ వద్ద అధికారిక స్పెక్టేటర్, 1996
 • రాఫ్టో ప్రైజ్, నార్వే మానవ హక్కుల పురస్కారం, 2001
 • అక్టోబర్ 2003 లో నోబెల్ శాంతి పురస్కారం
 • 21 శతాబ్దపు 21 మహిళా నాయకులు అవార్డు, 2004
 • ఇంటర్నేషనల్ డెమొక్రసీ అవార్డ్, 2004
 • జేమ్స్ పార్క్స్ మోర్టన్ ఇంటర్ఫెయిత్ అవార్డ్, 2004
 • లాయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, 2004
 • డాక్టర్ ఆఫ్ లాఁస్, విలియంస్ కాలేజ్, 2004[8]
 • డాక్టర్ ఆఫ్ లాఁస్, బ్రౌన్ యూనివర్సిటీ, 2004
 • డాక్టర్ ఆఫ్ లాఁస్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, 2004
 • గౌరవ డాక్టరేట్, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, కాలేజ్ పార్క్, 2004
 • గౌరవ డాక్టరేట్, యూనివర్సిటీ ఆఫ్ టొరొంటో, 2004
 • గౌరవ డాక్టరేట్, సైమన్ ఫ్రేజర్ యూనివర్సిటీ, 2004
 • గౌరవ డాక్టరేట్, యూనివర్సిటీ ఆఫ్ అకురెయిరీ, 2004
 • గౌరవ డాక్టరేట్, ఆస్ట్రేలియన్ కాథలిక్ యూనివర్సిటీ, 2005
 • గౌరవ డాక్టరేట్, యూనివర్సిటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో, 2005
 • గౌరవ డాక్టరేట్, కొంకొర్డియా యూనివర్సిటీ, 2005
 • గౌరవ డాక్టరేట్, యోర్క్ యూనివర్సిటీ, 2005
 • గౌరవ డాక్టరేట్, జీన్ మౌలిన్ యూనివర్సిటీ లియాన్, 2005
 • యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారి సిటిజెన్ పీస్ బిల్డింగ్ అవార్డ్, 2005
 • అకాడెమీ ఆఫ్ అచీవ్‌మెంట్ వారి ది గోల్డెన్ ప్లేట్ అవార్డ్, 2005
 • లీజియన్ ఆఫ్ ఆనర్ అవార్డ్, 2006
 • గౌరవ డాక్టరేట్, చికాగో లొయోలా యూనివర్సిటీ, 2007
 • గౌరవ డాక్టరేట్, ది న్యూ స్కూల్ యూనివర్సిటీ, 2007
 • ఎ డిఫరెంట్ వ్యూ వారి ప్రపంచ ప్రజాతంత్రాల్లో ఉన్న చాంపియన్ లలో ఒకరు[9]
 • గ్లోబల్ డిఫెన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవార్డు ఇంటర్నేషనల్ సెర్విస్ హ్యూమన్ రైట్స్ అవార్డ్, 2009
 • గౌరవ డాక్టర్ ఆఫ్ లాఁస్, మార్క్వెట్ యూనివర్సిటీ, 2009[10]
 • గౌరవ డాక్టర్ ఆఫ్ లా, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, 2011[11]
 • గౌరవ డాక్టరేట్, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ యూనివర్సిటీ ఆఫ్ లండన్, 2012
 • గౌరవ డాక్టర్ ఆఫ్ లాఁస్, లా సొసైటీ ఆఫ్ అప్పర్ కెనడా, 2012[12]
 • వుల్ఫ్‌గ్యాంగ్ ఫ్రీడ్‌మాన్ మెమోరియల్ అవార్డ్, కొలబియా జర్నల్ ఆఫ్ ట్రాన్స్‌నేషనల్ లా, 2013

ప్రచురణ అయిన పుస్తకాలు[మార్చు]

 • ఇరాన్ అవేకెనింగ్ : వన్ ఉమన్స్ జర్నీ టు రిక్లెయిమ్ హర్ లైఫ్ అండ్ కంట్రీ (ఇరాన్ మేలుకొలుపు : తన దేశాన్ని, జీవితాన్ని తిరిగి పొందేందుకు ఒక స్త్రీ జరిపిన పోరాటయాత్ర) (2007) ISBN 978-0-676-97802-5
 • రెఫ్యుజీ రైట్స్ ఇన్ ఇరాన్ (ఇరాన్ లో కాందశీకుల హక్కులు) (2008) ISBN 978-0-86356-678-3
 • ది గోల్డెన్ కేజ్ : త్రీ బ్రదర్స్, త్రీ చాయిసెస్, వన్ డెస్టినీ (బంగారు పంజరం : ముగ్గురు అన్నదమ్ములు, మూడు మార్గాలు, ఒక లక్ష్యం) (2011) ISBN 978-0-9798456-4-2

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. డేనియల్ పి. ఓ'నియెల్ (2007). ఫాతిమాస్ స్వోర్డ్: ఎవ్రీడే ఫిమేల్ రెసిస్టెన్స్ ఇన్ పోస్ట్ రివల్యూషనరీ ఇరాన్. ప్రోక్వెస్ట్. pp. 55–61. ISBN 978-0-549-40947-2. Retrieved 15 జనవరి 2012.
 2. రాయిటర్స్ (27 నవంబర్ 2009). "ఇరాన్ డినైస్ ఇట్ కాన్ఫిస్కేటెడ్ ఇబాదీస్ నోబెల్ మెడల్". ది న్యూ యార్క్ టైంస్. Retrieved 27 నవంబర్ 2009. Check date values in: |accessdate= and |date= (help)[permanent dead link]
 3. నార్వే సేస్ ఇరాన్ కాన్ఫిస్కేటెడ్ ఇబాదీస్ నోబెల్ 27 నవంబర్
 4. "షిరీన్ ఇబాదీ: ది ఆక్టివిస్ట్ ఇన్ ఎగ్జైల్" న్యూస్ వీక్ 30 మార్చ్ 2010
 5. "ఫోర్బ్స్ డాట్ కామ్: ఫోర్బ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ వుమన్ ఇన్ ది వల్డ్ 2004". Archived from the original on 2012-07-30. Retrieved 2012-07-30.
 6. బ్రిటానికా ఎడ్యుకేషనల్ పబ్లిషింగ్ (1 అక్టోబర్ 2009). ది 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ విమెన్ ఆఫ్ ఆల్ టైమ్. ది రోజెన్ పబ్లిషింగ్ గ్రూప్. pp. 330–331. ISBN 978-1-61530-058-7. Retrieved 15 జనవరి 2012. Check date values in: |date= (help)
 7. "ప్రొఫైల్ : షిరీన్ ఇబాదీ". ఆర్టికల్. బీబీసీ న్యూస్. 27 November 2009.
 8. ఆనరరీ డిగ్రీ 2004 Archived 2008-12-03 at the Wayback Machine, 5 మే 2008న ఆఖరు సారి చూడబడింది
 9. ఎ డిఫరెన్శియల్ వ్యూ, ఇష్యూ 19, జనవరి 2008.
 10. "యూనివర్సిటీ ఆనర్స్: షిరిన్ ఇబాదీ". మార్క్వెట్ యూనివర్సిటీ. Archived from the original on 2009-11-03. Retrieved 10 జనవరి 2010.
 11. http://www.cambridgenetwork.co.uk/news/article/default.aspx?objid=83533
 12. http://www.lsuc.on.ca/WorkArea/DownloadAsset.aspx?id=2147487963

మరింత చదవడానికి[మార్చు]

 • Kim, U.; Aasen, H. S.; Ebadi, S. (2003). Democracy, human rights, and Islam in modern Iran: Psychological, social and cultural perspectives. Bergen: Fagbokforlaget. ISBN 978-82-7674-922-9. Unknown parameter |lastauthoramp= ignored (help)

బయటి లంకెలు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
ప్రెస్ ఇంటర్వ్యూలు
వీడియోలు
ఫోటోలు