Jump to content

ఆలిస్ మన్రో

వికీపీడియా నుండి
ఆలిస్ మన్రో
Alice Munro
పుట్టిన తేదీ, స్థలంఆలిస్ ఆన్ లైడ్లా Photo by: Sheila Munro
(1931-07-10) 1931 జూలై 10 (వయసు 93)
ఒంటారియో, కెనడా
వృత్తిరచయిత
భాషఆంగ్లం
జాతీయతకెనడియన్
పౌరసత్వంకెనడా
పూర్వవిద్యార్థిThe University of Western Ontario[1]
రచనా రంగంచిన్నకథలు
ప్రభావంWilliam Maxwell, Eudora Welty, Jane Austen, Charlotte Brontë, Emily Brontë, Stendhal, Leo Tolstoy, Fyodor Dostoevsky, John Updike,[2] Ivan Turgenev, Anton Chekhov, Katherine Mansfield, James Joyce, Thomas Mann, Franz Kafka, Marcel Proust, Iris Murdoch
పురస్కారాలుGovernor General's Award (1968, 1978, 1986)
Giller Prize (1998, 2004)
Man Booker International Prize (2009)
Nobel Prize in Literature (2013)
జీవిత భాగస్వామిJames Munro (1951–1972)
Gerald Fremlin (1976–2013, his death)
సంతానం3

ఆలిన్ మన్రో ప్రపంచ స్థాయి కథా రచయిత్రి. కెనడాలో జన్మించిన ఈమె కథలలో సాధారణ కెనడా పౌరుని జీవన విధానం ప్రతిబింబిస్తుంది. ఈమె వ్రాసిన కథలే ఈమెకు నోబెల్ పురస్కారాన్ని సంపాదించి పెట్టాయి.

బాల్యం-విద్యాభ్యాసం

[మార్చు]

ఆలిస్ మన్రో కెనడాలో జూలై 10 1931లో జన్మించారు. ఆమె కెనడియన్ చిన్నకథల రచయిత్రి, నోబుల్ బహుమతి గ్రహీత. ముంరో కథారచనలో విప్లబాత్మకమైన నిర్మాణశైలిని కలిగి ఉంది. కథను సమయానుకూలంగా మునుకూ వెనుకకూ నడుపుతూ వివరించడం ఆమె ప్రత్యేకత[3] ముంరోస్ ఊహలు అధికంగా స్థానిక హురాన్ కౌంటీ (దక్షిణ అంటారియా) నేపథ్యంలో సాగుతుంటాయి.[4] ఆమె కథలు మనవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి సహకరిస్తాయి. ఆమె రచనలు సరళంగా ఉంటాయి.[5] సమకాలీన అద్భుతమైన కల్పితకథా సృష్టిలో ముంరో నిపుణురాలని భావిస్తున్నారు.[6]

ఆరంభకాల జీవితం

[మార్చు]

ముంరో తల్లి అన్న్ లైడ్లా (విన్నింగ్‌హాం (అంటారియో) తండి రాబర్ట్ ఎరిక్ లైడ్లా నక్క, మింక్‌లను పెంచుకునే వ్యవసాయదారుడు.[7] తరువాత ఆయన టర్కీలను వ్యవసాయం కూడా చేసాడు.[8] ఆమె తల్లి అన్న్ లైడ్లా (నీ చమ్నే) పాఠశాలలో ఉపాధ్యాయినిగా ఉంది. ముంరో టీనేజర్‌గా ఉన్నప్పుడే రచనావ్యాసంగం ఆరంభించింది. ఆమె రెండు సంవత్సరాల స్కాలర్ షిప్ తీసుకుంటూ విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యయనం చేసేసమయంలో " డైమెంషన్స్ ఆఫ్ ఎ షాడో " పుస్తకం రచించింది.[9][10] ఈ సమయంలో ఆమె వెయిట్రెస్, టుబాకో పికర్, గ్రంథాలయ గుమస్తాగా పనిచేసింది. 1951లో ఆమె విశ్వవిద్యాలయ విద్యను పూర్తిచేసింది.ఆమె 1949-1951 లో ఆంగ్లం ప్రధానంగా ఉన్నత విద్యను పూర్తిచేసింది.తరువాత ఆమె జేంస్ ముంరోను వివాహం చేసుకుంది. తరువాత జేంస్‌కు డిపార్ట్ మెంటల్ స్టోర్స్‌ పని లభించిన కారణంగా దంపతులు డూండర్వే (వెస్ట్ వాంకోవర్)కు తరలి వెళ్ళింది. 1963లో దంపతులు విక్టోరియా (బ్రిటిష్ కొలంబియా) కు తరలి వెళ్ళారు. అక్కడ వారు ప్రారంభించిన " ముంరో బుక్స్ " ఇప్పటికీ ఉనికిలో ఉంది.

కథా వస్తువు

[మార్చు]

తాను పుట్టి పెరిగిన కెనడా లోని గ్రామీణ మహిళల జీవన విధానమే ఈమె కథలకు నేపథ్యం. మానవ సంబంధాలు, సంతోషం, కోపం, దుఃఖం, నిరాశ, మానసిక వ్యధ ఇలాంటివే ఈమె కథలలో ముఖ్య వస్తువులు.

ప్రచురణలు

[మార్చు]

ఈమె తన మొదటి కథల సంకలనాన్ని 1968 లో ప్రచురించారు. ఆ తర్వాత ఇటువంటివి సుమారు 15 వరకు ప్రచురించ బడ్డాయి. ఈమె రచనలు అట్లాంటిక్ మంత్లీ, ది పారిస్ రివ్యూ, వంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి.

అవార్డులు

[మార్చు]

ముంరో రచనలు పలువురి ప్రశంసలను అందుకున్నాయి. ఆమె చేసిన సాహిత్యసేవకు ఆమె 2013 లో సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్నది.[11] ఆమె జీవితసాధనగా 2009 లో " మాన్ బుకర్ ఇంటర్నేషనల్ " అవార్డ్‌ను అందుకున్నది. ఉహాత్మక రచనల కొరకు ఆమె మూడు మార్లు కెనడా ప్రభుత్వం నుండి " గవర్నల్ జనరల్ అవార్డ్ " అందుకున్నది. అంతేకాక రైటర్స్ ట్రస్ట్ ఆఫ్ కెనడా అవార్డును, 1996 లో మరియన్ అవార్డ్, 2004 లో" రన్‌వే " పుస్తకరచన కొరకు రోగార్స్ " రైటర్స్ ట్రస్ట్ ఫిక్షన్ ప్రైజ్ " అవార్డును అందుకున్నది.[11][12][13][14]

అనువాదాలు

[మార్చు]

ఈమె రచనలు అనేక భాషలలోనికి అనువదించబడ్డాయి. ఆకోవలో ఈమె వ్రాసిన కథ బాయ్స్ అండ్ గాళ్స్ అనే కథను తెలుగులోకి జి. లక్ష్మి గారు అనువదించారు. ఈ తెలుగు కథను....... సాకం నాగరాజ, వాకా ప్రసాద్ లు సంకలనం చేసి ప్రచురించిన ప్రపంచ కథా సాహిత్యం అనే పుస్తకంలో మొదటికథగా ప్రచురించారు.

రచనావ్యాసంగానికి విరమణ

[మార్చు]

ఈమె ఈ మధ్యనే తన రచనా వ్యాసంగాన్ని విరమించుకున్నట్లు ప్రకటించారు.

మూలాలు

[మార్చు]
  1. Preface. Dance of the Happy Shades. Alice Munro. First Vintage contemporaries Edition, August 1998. ISBN 0-679-78151-X Vintage Books, A Division of Random House, Inc. New York.
  2. A Conversation with Alice Munro. Bookbrowse. Retrieved on: 2 June 2009.
  3. Alice Munro Wins Nobel Prize in Literature, by Julie Bosmans, The New York Times, 10 October 2013
  4. Marchand, P. (29 August 2009). "Open Book: Philip Marchand on Too Much Happiness, by Alice Munro". The National Post. Archived from the original on 25 ఆగస్టు 2011. Retrieved 5 September 2009.
  5. Meyer, M. "Alice Munro". Meyer Literature. Archived from the original on 12 డిసెంబరు 2007. Retrieved 14 మే 2016.
  6. Merkin, Daphne (24 October 2004). "Northern Exposures". New York Times Magazine. Retrieved 25 February 2008.
  7. Jeanne McCulloch, Mona Simpson "Alice Munro, The Art of Fiction No. 137", The Paris Review No. 131, Summer 1994
  8. Gaunce, Julia, Suzette Mayr, Don LePan, Marjorie Mather, and Bryanne Miller, eds. "Alice Munro." The Broadview Anthology of Short Fiction. 2nd ed. Buffalo, NY: Broadview Press, 2012.
  9. Jason Winders (10 October 2013). "Alice Munro, LLD'76, wins 2013 Nobel Prize in Literature". Western News. The University of Western Ontario.
  10. "Canada's Alice Munro, 'master' of short stories, wins Nobel Prize in literature". CNN. 10 October 2013. Retrieved 11 October 2013.
  11. 11.0 11.1 "The Nobel Prize in Literature 2013 – Press Release" (PDF). 10 October 2013. Archived from the original (PDF) on 12 అక్టోబరు 2013. Retrieved 10 October 2013.
  12. Bosman, Julie (10 October 2013). "Alice Munro Wins Nobel Prize in Literature". New York Times. Retrieved 10 October 2013.
  13. "Alice Munro wins Man Booker International prize". The Guardian. 27 May 2009.
  14. "Past Writers' Trust Engel/Findley Award Winners". Retrieved 7 April 2014.

వెలుపలి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:Alice Munro మూస:Giller Prize మూస:Marian Engel Award మూస:Nobel Prize in Literature మూస:2013 Nobel Prize winners