ఎలిజబెత్ బ్లాక్‌బన్
Elizabeth Blackburn | |
---|---|
జననం | Elizabeth Helen Blackburn 1948 నవంబరు 26 Hobart, Tasmania, Australia |
నివాసం | US |
పౌరసత్వం | Australian and American |
రంగములు | Molecular biology |
వృత్తిసంస్థలు | |
చదువుకున్న సంస్థలు |
|
పరిశోధనా సలహాదారుడు(లు) | Frederick Sanger[1] |
డాక్టొరల్ విద్యార్థులు | include Carol W. Greider |
ముఖ్యమైన పురస్కారాలు |
|
ఎలిజబెత్ హెలెన్ బ్లాక్‌బన్ " కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ,[2] ఫెలో ఆఫ్ ది ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైంస్, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ ది న్యూ సౌత్ వేల్స్ (1948 నవంబర్ 26 న జన్మించింది). ఆమె ఒక ఆస్ట్రేలియన్- యునైటెడ్ స్టేట్స్ నోబెల్ పురస్కార గ్రహీత. ప్రస్తుతం ఆమె " సాక్ ఇంస్టిట్యూట్ ఫర్ బయొలాజికల్ స్టడీస్ " అధ్యక్షురాలు.[3] గతంలో ఆమె యూనివర్శిటీ ఆఫ్ కలిఫోర్నియా(శాన్ ఫ్రాంసిస్కో) పరిశోధకురాలు. ఆమె టెలోమేర్ అధ్యయనం చేసింది. టెలోమేర్ అంటే క్రోమోజోం చివరన ఉండి క్రోమోజోన్‌ను రక్షించే పదార్థం. ఈ పరిశోధన కొరకు ఆమె 2009 నోబెల్ పురస్కారం అందుకున్నది. ఆమె ఈ పురస్కారం కరోల్ డబల్యూ గ్రీడర్ , జాక్ డబల్యూ స్జోస్తక్‌లతో కలిసి పంచుకున్నది. ఈ పురస్కారం అందుకుని ఆమె తస్మేనియాలో జన్మించిన నోబెల్ పురస్కారగ్రహీతగా గుర్తించబడుతుంది. ఆమె మెడికల్ ఎథిక్స్ కొరకు పనిచేసింది. తరువాత ఆమె వివాదాస్పదంగా జార్జ్ డబల్యూ బుష్ చేత పదవి నుండి తొలగించబడింది. [4]
ఆరంభకాల జీవితం విద్య
[మార్చు]ఎలెజబెత్ హెలెన్ బ్లాక్‌బన్ 1948 నవంబర్ 26న తస్మేనియాలోని హొబర్త్‌లో జన్మించింది. ఆమెకు నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు వారి కుటుంబం టౌన్‌కు తరలివెళ్ళింది. గరల్స్ గ్రామర్ స్కూల్ (బ్రాడ్లాండ్ హౌస్ చర్చి) లో ప్రాధమిక విద్యాభ్యాసం చేసింది. వారి కుటుంబం తిరిగి మెల్బోర్న్‌కు చేరుకుంది. తరువాత ఆమె యూనివర్శిటీ హైస్కూల్ (మెల్బోర్న్) విద్యాభ్యాసం పూర్తిచేసింది. ఫైనల్ స్టేట్‌వైడ్ సంవత్సరాంతర పరీక్షలలో ఆమె అత్యున్నత స్థాయి ర్యాంకు సాధించింది.[5] 1970లో ఆమె బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది. 1972లో (యూనివర్శిటీ ఆఫ్ మెల్బోర్న్) మాస్టర్ డిగ్రీ పూర్తిచేసింది. 1974లో ఆమె యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో పి.హెచ్.డి పూర్తిచేసింది. [6] తరువాత యేల్ యూనివర్శిటీలో మాలిక్యులర్ , బయాలజీ పోస్ట్ డాక్టొరల్ వర్క్ చేసింది.[7]
మాలిక్యూల్ బయాలజీ
[మార్చు]1981 లో బలాక్‌బన్ " యూనివర్శిటీ ఆఫ్ కలిఫోర్నియా (బర్కిలీ) లో అధ్యాపకురాలిగా చేరింది. 1990 లో ఆమె శాంఫ్రాంసిస్కోకు మారింది. అక్కడ ఆమె " యూనివర్శిటీ ఆఫ్ కలిఫోర్నియా(శాంఫ్రాంసిస్కో) డిపార్ట్ మెంటాఫ్ మైక్రో బయాలజీ , ఇమ్యూనాలజీలలో పనిచేసింది. 1993-1999 వరకు ఆమె అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ చైర్ వుమన్‌గా ఉంది.
బయోఎథిక్స్
[మార్చు]2002లో బ్లాక్ బన్ " ప్రెసిడెంట్ కౌంసిల్ ఆన్ బయోఎథిక్స్ " సభ్యురాలుగా చేర్చుకొనబడింది. ఆమె బుష్ అడ్మినిస్ట్రేషన్‌కు వ్యతిరేకంగా హ్యూమన్ ఎంబ్రియోనిక్ సెల్ రీసెర్చ్ కొరకు పనిచేసింది. తరువాత ఆమె కౌంసిల్‌ను వైట్ హైస్ డైరెక్టివ్ 2004 ఫిబ్రవరి 27న రద్దు చేసింది. [8]
పురస్కారాలు , గౌరవాలు
[మార్చు]- కల్నల్ ఎలి లిల్లీ రీసెర్చ్ అవార్డు (1988) మైక్రోబయాలజీ అండ్ ఇమ్యునాలజీ
- యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (1990)
- గౌరవ డాక్టరేట్ (1991) యేల్ విశ్వవిద్యాలయం నుండి సైన్స్ కొరకు
- హార్వే సొసైటీ లెక్చరర్ (1990) న్యూ యార్క్ లో హర్వే సొసైటీ
- ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఫెలో (1991)
- 1992 లో రాయల్ సొసైటీ (ఎఫ్.ఆర్.ఎస్.) ఆఫ్ 1992 ఫెలో
- మైక్రోబయాలజీ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఫెలో (1993)
- ఆస్ట్రేలియాలో బహుమతి (1998)
- గెయిర్డ్నర్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అవార్డు (1998)
- హార్వే బహుమతి (1999)
- కీయో మెడికల్ సైన్స్ ప్రైజ్ (1999)
- కాలిఫోర్నియా సైంటిస్ట్ 1999
- కాలిఫోర్నియా హాల్ ఆఫ్ ఫేమ్ (2011)
- అమెరికన్ అసోసియేషన్ - జి.హెచ్.ఎ. క్లోవెస్ మెమోరియల్ అవార్డు (2000) క్యాన్సర్ రీసెర్చ్
- అమెరికన్ క్యాన్సర్ సొసైటీ మెడల్ ఆఫ్ ఆనర్ (2000)
- సైన్స్ డెవెలెప్మెంట్ ఫర్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫెలో (2000)
- అచీవ్మెంట్ యొక్క గోల్డెన్ ప్లేట్ అవార్డు (2008)
- ఎ.ఎ.సి.ఆర్- పెజ్కొల్లర్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ అవార్డు (2001)
- జనరల్ మోటార్స్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ అల్ఫ్రెడ్ పి. స్లోన్ అవార్డు (2001)
- ఇ.బి. విల్సన్ అవార్డు (2001) సెల్ బయాలజీ అమెరికన్ సొసైటీ
- రాబర్ట్ జె., క్లైర్ పాసరొ ఫౌండేషన్ మెడికల్ రీసెర్చ్ అవార్డు (2003)
- డాక్టర్ ఎ.హెచ్. హీనెకెన్ ప్రిజ్ (2004)
- ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ అవార్డ్స్ (ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్స్ (2005)
- ఆల్బర్ట్ లస్కర్ అవార్డు (2006) (కరోల్ డబ్ల్యూ Greider, జాక్ స్జోస్తక్ తో అవార్డు పంచుకున్నారు). ప్రాథమిక మెడికల్ పరిశోధన కోసం
- జెనెటిక్స్ బహుమతి (2006) పీటర్ గ్రూబర్ ఫౌండేషన్ నుండి
- గౌరవ డాక్టరేట్ (2006) హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి సైన్స్ కొరకు
- విలే ఫౌండేషన్ (కరోల్ డబ్ల్యూ గ్రెయిడెర్ తో పంచుకున్నారు) నుండి బయోమెడికల్ సైన్సెస్ లో విలీ బహుమతి (2006)
- ఆస్త్రేలియన్ అకాడమి ఆఫ్ సైన్స్ ఆఫ్ ఫెలో (2007)
- ఆస్త్రేలియన్ అకాడమి ఆఫ్ సైన్స్ (2007) ఫెలో
- యు.సి.ఎస్.ఎఫ్. మహిళా ఫ్యాకల్టీ అసోసియేషన్ అవార్డు గ్రహీత
- గౌరవ డాక్టరేట్ (2007) ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్
- లూయిసా స్థూల హోర్విత్జ్ కొలంబియా విశ్వవిద్యాలయం బహుమతి (2007) (కరోల్ డబ్ల్యూ గ్రీడర్, జోసెఫ్ జి. గాల్ తో పంచుకున్నారు)
- లోరియల్-యునెస్కోలో సైన్స్ ఫర్ ఉమెన్ అవార్డ్స్ (2008)
- పాల్ ఎర్లిచ్ లడ్విగ్ డర్మ్‌స్టీడ్తర్ బహుమతి (2009) (తో పంచుకున్నారు కరోల్ డబ్ల్యూ గ్రెయిడెర్)
- పెర్ల్ మీస్టర్ గ్రీన్ గార్డ్ బహుమతి (2008)
- ది నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ.
- కపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా.
- రాయల్ సొసైటీ అఫ్ న్యూ సౌత్ వేల్స్ (ఎఫ్.ఆర్.ఎస్.ఎన్.) ఫెల్లో (2010)
- కెమిస్ట్స్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడల్ ఎ.ఐ.సి. గోల్డ్ మెడల్ (2012)
- రాయల్ పతకం రాయల్ సొసైటీ (2015)
- క్యాన్సర్ రీసెర్చ్ అమెరికా అసోసియేషన్ అధ్యక్షుడు 2010 సంవత్సరానికి
- 1998 సంవత్సరంలో సెల్ బయాలజీ అమెరికన్ సొసైటీ అధ్యక్షుడు
- సైన్సెస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫారిన్ అసోసియేట్ (1993)
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ యొక్క సభ్యుడు (2000)
- జెనెటిక్స్ సొసైటీ ఆఫ్ అమెరికా సభ్యురాలు (2000-2002)
మూలాలు
[మార్చు]- ↑ "Nobel Prize in Physiology or Medicine 2009". Nobel Foundation. Retrieved 2009-10-05.
- ↑ 2.0 2.1 "Fellows of the Royal Society". London: Royal Society. Archived from the original on 2015-03-16.
- ↑ "Nobel laureate Elizabeth Blackburn named Salk Institute President". Retrieved 2016-01-24.
- ↑ Brady, Catherine (2007). Elizabeth Blackburn and the Story of Telomeres. Cambridge, Massachusetts: The MIT Press. ISBN 978-0-262-02622-2.
- ↑ Brady 2007, pp. 1–13
- ↑ Blackburn, E. H. (1974). Sequence studies on bacteriophage ØX174 DNA by transcription (PhD thesis). University of Cambridge. Archived from the original on 2016-03-05. Retrieved 2016-03-22.
- ↑ "Elizabeth Blackburn Profile at UCSF". Retrieved 25 November 2013.
- ↑ Blackburn, E.; Rowley, J. (2004). "Reason as Our Guide". PLoS Biology. 2 (4): e116. doi:10.1371/journal.pbio.0020116. PMC 359389. PMID 15024408.
{{cite journal}}
: CS1 maint: unflagged free DOI (link)
ఈ వ్యాసాన్ని ఏ వర్గం లోకీ చేర్చలేదు. దీన్ని సముచిత వర్గం లోకి చేర్చండి. (ఆగస్టు 2018) |