మే-బ్రిట్ మోసర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మే-బ్రిట్ మోసర్
2014 లో మే-బ్రిట్ మోసర్ .
(Photographer: Henrik Fjørtoft / NTNU Communication Division)
జననం (1963-01-04) 1963 జనవరి 4 (వయసు 61)
ఫాస్‌నావగ్, నార్వే
నివాసంట్రోండేయిం, నార్వే
జాతీయతనార్వేయులు
రంగములున్యూరో సైన్స్
వృత్తిసంస్థలునార్వే శాస్త్ర సాంకేతిక
ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుఓస్లో విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిగ్రిడ్ సెల్స్, న్యూరాన్స్
ముఖ్యమైన పురస్కారాలుNobel Prize in Physiology or Medicine (2014)

మే-బ్రిట్ మోసర్ (జననం 1963 జనవరి 4) నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, న్యూరో సైంటిస్టు, నార్వే శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్ ఫర్ న్యూరల్ కాంప్యుటేషన్ విభాగంలో విభాగాధిపతిగా యున్నారు. మనిషి మెదడు ఎలా దిశానిర్దేశం చేసుకుంటుందన్న అంశాన్ని వివరించిన ఆమె బ్రిటిష్-అమెరికన్ శాస్త్రవేత్త జాన్ ఓ కీఫ్ (74), ఆమె భర్త అయిన ఎడ్వర్డ్ మోసర్ (52, తో పాటుగా 2014 ఏడాది వైద్యరంగ నోబెల్‌ను సంయుక్తంగా గెలుచుకున్నారు. అలాగే వైద్యరంగంలో నోబెల్‌ను గెలుచుకున్న 11వ మహిళగా మే-బ్రిట్ మోసర్ నిలిచారు.

జీవిత విశేషాలు[మార్చు]

మే-బ్రిట్ మోసర్ 1963లో నార్వేలో జన్మించారు. ఆమె ప్రస్తుతం ట్రాన్డెయింలోని సెంటర్ ఫర్ న్యూరల్ కంప్యూటేషన్ లో పనిచేస్తున్నారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఓస్లోలో సైకాలజీ విద్యను అభ్యసించి, 1995లో న్యూరోఫిజియాలజీలో పి.హెచ్.డీ పట్టాను స్వీకరించారు. ఆమె 1996లో ట్రాన్డెయింలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేరక ముందు, యూనివర్సిటీ అఫ్ ఎడింబర్గ్ లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా, లండన్ యూనివర్సిటీ కాలేజీలో ప్రత్యేక పరిశోధకురాలుగా ఉన్నారు. మే-బ్రిట్ మోసర్, 2000లో న్యూరోసైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా నియామకం పొందారు. ఆమె తన భర్త ఎడ్వర్డ్ మోసర్ తో కలసి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ ను పూర్తిచేశారు. వారిద్దరూ అటుతర్వాత, యూనివర్సిటీ ఆఫ్ ఎడింబర్గ్ లో జాన్ ఓ కీఫ్ తో కలిసి పరిశోధనలు ప్రారంభించారు. వారిరువురూ 1996లో ట్రాన్డెయిం లోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేరారు. వారు మెదడులోని కణాల అమరిక (పొజిషనింగ్ వ్యవస్థ) ను కనుగొన్నందుకు గాను వారు ఈ బహుమతిని అందుకున్నారు. వీరు మెదడులోని పొజిషనింగ్ వ్యవస్థను, ఉన్నత కాగ్నిటివ్ ఫంక్షన్, సెల్యూలర్ బేసిస్ వంటి అంశాలను కనుగొన్నారు.[1]

పరిశోధనలు[మార్చు]

2005లో, మే-బ్రిట్, ఎడ్వర్డ్ మోసర్ లు మెదడు పొజిషనింగ్ వ్యవస్థకు చెందిన మరో కీలక భాగాన్ని కనుగొన్నారు. వీరిద్దరూ మరో రకం కణాలను గుర్తించి, వాటిని గ్రిడ్ కణాలుగా పిలిచారు, ఈ కణాలు వస్తువుల యొక్క సరైన స్థానం, దారిని చూపడంలో తోడ్పడుతాయి. వారు తమ పరిశోధనల ద్వారా, వస్తువుల స్థానాలు, గమ్యసాధనలో ప్లేస్, గ్రిడ్ కణాలు ఎలా పనిచేస్తాయి అనే అంశాన్ని మరింత స్పష్టం చేశారు.

పరిసరాల్లో వస్తువుల స్థానాలు, మెదడు పనితీరు, మాపింగ్ వ్యవస్థకు సంబంధించిన అంశాల పై జాన్ ఓ కీఫ్, మే మోసర్, ఎడ్వర్డ్ మోసర్ లు తమ పరిశోధనల ద్వారా ఎన్నో శతాబ్దాలుగా తత్వవేత్తలు, శాస్త్రవేత్తలకు అంతుపట్టని ఎన్నో చిక్కుముడులను విప్పారు.

యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకుడైన జాన్ ఓ కీఫ్ తొలిసారిగా 1971లో మెదడు జీపీఎస్ వ్యవస్థకు సంబంధించిన నాడీకణాలను ఎలుక మెదడులో కనుగొన్నారు. మెదడులోని హిప్పోక్యాంపస్ భాగంలో ఈ ప్రత్యేక స్థాన నాడీకణాలు (ప్లేస్ సెల్స్) క్రియాశీలం కావడం వల్ల ఎలుక ల్యాబ్‌లో తన స్థానాన్ని కచ్చితంగా అంచనా వేసుకుంటోందని, దీనివల్ల ఆ గది చిత్రపటం ఎలుక మెదడులో ఆవిష్కృతం అవుతోందని ఆయన గుర్తించారు. తర్వాత మూడు దశాబ్దాలకు 2005లో నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన మే-బ్రిట్, ఎడ్వర్డ్ మోసర్ దంపతులు ఈ మెదడు జీపీఎస్‌లో మరో కీలక నాడీకణ వ్యవస్థను కనుగొన్నారు. పరిసరాల చిత్రపటాన్ని ఆవిష్కరించిన తర్వాత స్థానాన్ని అంచనా వేయడం, దారి తెలుసుకోవడం అనే అంశాల మధ్య సమన్వయానికి కీలకమైన సమన్వయ నాడీకణాలు (గ్రిడ్ సెల్స్) ను వీరు గుర్తించారు. ఈ రెండు రకాల కణాల వ్యవస్థ మనిషి మెదడులోనూ ఇలాగే ఉందని ఇటీవ లి పరిశోధనల్లో నిరూపించారు.[2]

కొన్ని ప్రచురణలు[మార్చు]

  • Brun, V.H., Otnæss, M.K., Molden, S., Steffenach, H.-A., Witter, M.P., Moser, M.-B., Moser, E.I. (2002). Place cells and place representation maintained by direct entorhinal-hippocampal circuitry. Science, 296, 2089-2284.
  • Fyhn, M., Molden, S., Witter, M.P., Moser, E.I. and Moser, M.-B. (2004). Spatial representation in the entorhinal cortex.Science, 305, 1258-1264 Archived 2012-02-17 at the Wayback Machine.
  • Leutgeb, S., Leutgeb, J.K., Treves, A., Moser, M.-B. and Moser, E.I. (2004). Distinct ensemble codes in hippocampal areas CA3 and CA1. Science, 305, 1295-1298.
  • Leutgeb, S., Leutgeb, J.K., Barnes, C.A., Moser, E.I., McNaughton, B.L., and Moser, M.-B (2005). Independent codes for spatial and episodic memory in the hippocampus. Science, 309, 619-623 Archived 2012-02-17 at the Wayback Machine.
  • Hafting, T., Fyhn, M., Molden, S., Moser, M.-B., and Moser, E.I. (2005). Microstructure of a spatial map in the entorhinal cortex.Nature, 436, 801-806.
  • Sargolini, F., Fyhn, M., Hafting, T., McNaughton, B.L., Witter, M.P., Moser, M.-B., and Moser, E.I. (2006). Conjunctive representation of position, direction and velocity in entorhinal cortex. Science, 312, 754-758.
  • Leutgeb, J.K., Leutgeb, S., Moser, M.-B., and Moser, E.I. (2007). Pattern separation in dentate gyrus and CA3 of the hippocampus. Science, 315, 961-966.
  • Fyhn, M., Hafting, T., Treves, A., Moser, M.-B. and Moser, E.I. (2007). Hippocampal remapping and grid realignment in entorhinal cortex. Nature, 446, 190-194.
  • Hafting, T., Fyhn, M., Bonnevie, T., Moser, M.-B. and Moser, E.I. (2008). Hippocampus-independent phase precession in entorhinal grid cells. Nature 453, 1248-1252.
  • Kjelstrup, K.B., Solstad, T., Brun, V.H., Hafting, T., Leutgeb, S., Witter, M.P., Moser, E.I. and Moser, M.-B. (2008). Finite scales of spatial representation in the hippocampus. Science 321, 140-143.
  • Solstad, T., Boccara, C.N., Kropff, E., Moser, M.-B. and Moser, E.I. (2008). Representation of geometric borders in the entorhinal cortex. Science, 322, 1865-1868.
  • Moser, E.I., Moser, M-B. (2011). Crystals of the brain. EMBO Mol. Med. 3, 1-4.
  • Moser, E.I., Moser, M-B. (2011). Seeing into the future. Nature, 469, 303-4
  • Jezek, K., Henriksen, EJ., Treves, A., Moser, E.I. and Moser, M-B. (2011). Theta-paced flickering between place-cell maps in the hippocampus. Nature, 478, 246-249.
  • Giocomo, LM., Moser, E.I., Moser, M-B. (2011) Grid cells use HCN1 channels for spatial scaling. Cell, 147, 1159-1170.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]