టెన్సింగ్ నార్కే

వికీపీడియా నుండి
(టెన్సింగ్ నార్గే నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
టెన్సింగ్ నార్కే
Hillary-norgay.jpg
ఎడ్మండ్ హిల్లరీ తో టెన్సింగ్ నార్కే
జననం నామ్‌గైల్ వాంగ్డీ
మే 1914
కుంబూ, నేపాల్ రాజ్యం
మరణం 9 మే 1986(1986-05-09) (aged 71)
డార్జిలింగ్, భారత దేశము
జాతీయత నేపాలీ, భారత దేశం
వృత్తి పర్వతారోహకుడు, టూర్ గైడు.
ప్రసిద్ధులు మొట్టమొదట ఎవరెస్టు అధిరోహించిన వ్యక్తి.
జీవిత భాగస్వామి డవ ఫుటి, ఆంగ్ లాహ్ము, డక్కు
పిల్లలు పెమ్‌పెం , నిమా, జామ్లింగ్ మరియు నోర్బు.

టెన్సింగ్ నార్కే (జ.మే 29, 1914 - మే 9, 1986) యొక్క జన్మనామం "నామ్‌గైల్ వాంగ్డీ " నేపాలీ ఇండియన్ కు చెందిన వ్యక్తి. ఆయన ఒక పర్వతారోహకుడు. ఆయన ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులలో ఒకరు. ఆయన సహచరుడు అయిన ఎడ్మండ్ హిల్లరీతో కలసి ఎవరెస్టు శిఖరాన్ని మే 29, 1953లో అధిరోహించి చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు[1].టైమ్‌ మ్యాగజిన్ ప్రచురించిన 20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రాచుర్యం పొందిన 100 మంది ప్రముఖులలో ఒకరిగా పేరు పొందారు.

బాల్యం[మార్చు]

ఆయన బాల్య విశేషాల గురించి పరస్పర విదుద్ధమైన అంశాలున్నాయి. ఆయన కొద్ది సంవత్సరాల క్రిందట తెలిపిన స్వీయ చరిత్ర ఆధారంగా ఆయన తన కుటుంబం "షెర్ఫా" తెగకు చెందినదనీ నేపాల్లో గల ఉత్తర హిమాలయ ప్రాంతంలోని "కుంబూ"లో గల "టెంగ్‌బోఖె" గ్రామానికి చేరుకున్నారనీ తెలిపాడు[2]. "కుంబూ" ప్రాంతం ఎవరెస్టు శిఖరానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని "టిబెటన్లు మరియు షెర్ఫా"లు "ఖోమొలుంగ్మా" అని పిలుస్తారు. ఈ పదానికి టిబెట్ భాషలో "హోలీ మదర్" అని అర్థం. అతడు బౌద్ధమతస్తుడు. ఆ ప్రాంతములో గల "టిబెటన్లు మరియు షెర్ఫా"లు భౌద్ధ మతస్తులే. అతని అసలైన పుట్టిన తేదీ గురించి ఖచ్చితంగా తెలియరాలేదు. ఆయన చెప్పినదానిని బట్టి 'మే' నెల చివరిలో ఉండెడిదని తెలుస్తుంది. ఎవరెస్టు శిఖరం ఎక్కిన తదుపరి ఆయన తన పుట్టినతేదీని మే 29 న జరుపుకొనేవారు. టిబెటన్ కాలెండరు ప్రకారం ఆయన పుట్టిన సంవత్సరం "ఇయర్ ఆఫ్ రాబిట్"గా పిలుస్తారు. ఆయన 1914 లొ జన్మించారు[2]. ఆయన యొక్క బాల్య నామం "నామ్‌గ్యాల్ వాంగ్డి". ఆయన బాల్య నామం ప్రముఖ లామా అయిన "న్గావాంగ్ టెన్సింగ్ నోర్బు" యొక్క సలహా మేరకు మార్చబడింది.⌊⌊⌊M32⌋⌋⌋⌋. "టెన్సింగ్ నార్కే అనగా "మతానికి ధనవంతుడైన మరియు భాగ్య శాలి అయిన అనుచరుడు" . ఆయన తండ్రి "యాక్" మందలు కాసుకొనే వ్యక్తి (పశువుల కాపరి). ఆయన పేరు "లా మిన్‌గ్మా" (మరణం.1949) . టెన్సింగ్ నార్కే తల్లి పేరు "డోక్మో కిన్‌జోమ్". టెన్సిం తన 13 మంది సహోదరులలో 11 వ వాడు.అందులో చాలామంది శైశవ దశలోనే మరణించినవారే[2].

తన కౌమర దశలో రెండు సార్లు ఇంటి నుండి వెళ్ళిపోయాడు. మొదటిసారి కాఠ్మండుకు రెండవసారి డార్జిలింగ్కు పారిపోయాడు. తను భౌద్ద సన్యాసిగా మారుటకు భౌద్ధ సంఘానికి తరలించ బడ్డాడు. కానీ తనకు అది సరియైనది కాదని నిర్ణయించుకుని వెనుతిరిగాడు[3]. తన 19 సంవత్సరాల వయస్సులో డార్జిలింగ్లో గల "షెర్ఫా" సమాజంతో స్థిరపడ్డాడు.

పర్వతారోహణ[మార్చు]

టెన్సింగ్ నార్కే విగ్రహం

1935 లో ఆయన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వర్గానికి నాయకుడుగా నియమింపబడి మొదటిసారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే అవకాశాన్ని పొందాడు. తన 20 సంవత్సరాల వయసులో ఇతర పర్వతారోహకులిద్దరు వైద్య పరీక్షలో విఫలం అయినందున ఈయనకు ఈ అవకాశం వచ్చింది.

నోట్సు[మార్చు]

  1. Conquerors of Everest. Time.com (14 June 1999). Retrieved on 2012-05-21.
  2. 2.0 2.1 2.2 Tenzing Norgay and James Ramsey Ullman, Man of Everest (1955, also published as Tiger of the Snows)
  3. Ortner, Sherry B. (2001). Life and Death on Mt. Everest: Sherpas and Himalayan Mountaineering. Princeton University Press. p. 112. ISBN 0-691-07448-8. 

మూలాలు[మార్చు]

  • Tony Astill, Mount Everest The Reconnaissance 1935 (2005)
  • George Band, Everest Exposed (2005), an account of the 1953 expedition
  • Tashi Tenzing and Judy Tenzing, Tenzing Norgay and Sherpas of Everest (2003)
  • Ed Webster, Snow in the Kingdom (2000)
  • Ed Douglas, Tenzing: Hero of Everest (2003)
  • Jamling Tenzing Norgay, Touching My Father's Soul (2002)

బయటి లంకెలు[మార్చు]