రొద్దం నరసింహ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రొద్దం నరసింహా (జననం: 20 జూలై 1933) ఒక భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త మరియు ఫ్లూయిడ్ డైనమిక్స్‌లో నిపుణుడు. ఇతడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సి)లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (ఎన్.ఎ.ఎల్.)[1]కు డైరెక్టర్‌గా, బెంగుళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ కేంద్రం(జె.ఎస్.సి.ఎ.ఎస్.ఆర్)లోని ఇంజనీరింగ్ మెకానిక్స్ యూనిట్‌కు ఛైర్మన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఇతడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గౌరవ ఆచార్యునిగా మరియు ప్రాట్ & విట్నీ (Pratt & Whitney) పీఠాధిపతిగా ఉన్నాడు. భారత ప్రభుత్వం ఇతడిని 2013లో దేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తో సత్కరించింది.[2]

విద్య మరియు వృత్తి[మార్చు]

ప్రొఫెసర్ రొద్దం నరసింహ ఎఫ్.ఆర్.ఎస్

ఇతడు తన ఇంజనీరింగ్ పట్టాను 1953లో మైసూరు విశ్వవిద్యాలయానికి చెందిన విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి పొందాడు. తరువాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరు నుండి 1955 మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ పట్టాను పొందాడు.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చదివే సమయంలో అక్కడ సతీష్ ధావన్ తో కలిసి పనిచేశాడు. ఇతడు అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్‌టెక్) నుండి 1961లో పి.హెచ్.డి డిగ్రీ పొందాడు.[3](పి.హెచ్.డి. సిద్ధాంతం).

ఇతఫు 1962లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సి)లో చేరాడు.ఇతడు అక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాంగంలో 1999 వరకు వివిధ హోదాలలో పనిచేశాడు. 1982లో ఇతడు సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ సైన్సస్ (ప్రస్తుతంసెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ అండ్ ఓషియానిక్ సైన్సస్) స్థాపించి 1989 వరకు దానికి అధిపతిగా ఉన్నాడు.[4] ఇతడు 1984 నుండి 1993వరకు నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (ఎన్.ఎ.ఎల్.)కు డైరెక్టర్‌గా ఉన్నాడు. పలు సంవత్సరాలు కాల్‌టెక్ కు సందర్శకాచార్యుడిగా సేవలందించాడు. ఇతడు 1989-1990 మధ్యకాలంలో ఇంగ్లాండులోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ఆచార్యుడిగా పనిచేశాడు. ఇంకా ఇతడు అనేక విదేశీ విద్యాలయాలలో సందర్శకాచార్యుడిగా పనిచేశాడు.

ఇతని పరిశోధనలు ముఖ్యంగా ఏరోస్పేస్ ఫ్లూయిడ్ డైనమిక్స్ మరియు వాతావరణ సంబంధమైన సమస్యలకు చెంది ఉన్నాయి.[5] ఇతడు భారతదేశంలో ఏరోస్పేస్ టెక్నాలజీ అభివృద్దికి సాంకేతిక మరియు విధాన నిర్ణయాలలో కీలక భాగస్వామ్యం వహించాడు. 1977-79లలో ఇతడు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు చీఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా ఉన్నాడు. అదే సంస్థకు పలు సంవత్సరాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా సేవ చేశాడు.

పురస్కారాలు[మార్చు]

ఇతడు తన పరిశోధనలకు అనేక సత్కారాలను, గౌరవాలను అందుకున్నాడు. వాటిలో కొన్ని:

ఇంకా ఇతడు 15 గ్రంథాలను, 200 పరిశోధనా పత్రాలను రచించాడు.

బాహ్య లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.nal.res.in/pages/pastdirectors.htm
  2. "పద్మ పురస్కారాలు". pib. 29 January 2013. Retrieved 29 January 2013.
  3. http://www.galcit.caltech.edu/about/history#1941
  4. http://caos.iisc.ernet.in/jai_about_caos.html
  5. http://www.jncasr.ac.in/roddam/index.php?menu_id=35&user_id=12&page_id=817
  6. http://www.nature.com/news/2008/081217/pdf/456860a.pdf
  7. http://www8.nationalacademies.org/onpinews/newsitem.aspx?
  8. పద్మ పురస్కారాలు. Ministry of Home Affairs, Government of India: (2015). URL accessed on July 21, 2015.