చిలుకూరి రామచంద్రారెడ్డి
చిలుకూరి రామచంద్రారెడ్డి | |
---|---|
చిన్ననీటి పారుదశాల శాఖ మాజీమంత్రి | |
In office 1991–1992 | |
నియోజకవర్గం | ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం |
మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మాజీమంత్రి | |
In office 1992–1994 | |
నియోజకవర్గం | ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం |
మాజీ శాసనసభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |
Assumed office 1978, 1985, 1989, 2004 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఖోదాడ్, తలమడుగు మండలం, ఆదిలాబాదు జిల్లా, తెలంగాణ | 1944 ఏప్రిల్ 4
మరణం | 2023 జూలై 20 హైదరాబాదు | (వయసు 79)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | లక్ష్మీదేవి |
సంతానం | జ్యోత్ బాయి అశోకరెడ్డి న్ |
చిలుకూరి రామచంద్రారెడ్డి (1944, ఏప్రిల్ 4 - 2023, జూలై 20), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1978, 1985, 1989, 2004లలో నాలుగుసార్లు గెలిచి ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశాడు.[1][2]
జననం, విద్య
[మార్చు]రామచంద్రారెడ్డి 1944, ఏప్రిల్ 4న తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లా, తలమడుగు మండలంలోని ఖోదాడ్‌లో జన్మించాడు.[3] బీఎస్సీ అగ్రికల్చర్ పట్టా పొందాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]రామచంద్రారెడ్డికి లక్ష్మీదేవితో వివాహం జరిగింది. వారికి సంతానం లేదు.
రాజకీయ జీవితం
[మార్చు]ఆదిలాబాద్, జైనథ్, బేల, తలమడుగు, తాంసి ప్రాంతాలతో కలిసివున్న ఆదిలాబాద్ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, ఫారెస్టు కార్పొరేషన్ డెవలప్ మెంట్ సెనేట్ మెంబర్ గా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1991 నుంచి 92 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో చిన్ననీటి పారుదశాల శాఖామంత్రిగా, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మంత్రివర్గంలోమార్కెటింగ్, గిడ్డంగుల శాఖామంత్రిగా పనిచేశాడు.[4] 2009లో ఓడిపోయిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. 2023లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన రామచంద్రారెడ్డి, తన అక్క కుమారుడు సంజీవ్ రెడ్డిని తన రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు.
అసెంబ్లీ ఎన్నికలలో పోటీ
[మార్చు]ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నకల్లో ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎనమిదిసార్లు పోటీచేసి, నాలుగుసార్లు (రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా) గెలుపొందాడు.
సంవత్సరం | గెలుపొందిన సభ్యుడు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|
1978 | చిలుకూరి రామచంద్రారెడ్డి | స్వతంత్ర | 28,905 | చిలుకూరి వామన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 20,313 |
1983 | చిలుకూరి వామన్ రెడ్డి | స్వతంత్ర | 26,871 | చిలుకూరి రామచంద్రారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 26,362 |
1985 | చిలుకూరి రామచంద్రారెడ్డి | స్వతంత్ర | 36,170 | ఆర్. లక్ష్మణ్ రావు | తెలుగుదేశం పార్టీ | 29,785 |
1989 | చిలుకూరి రామచంద్రారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 48,868 | కె. చంద్రకాంత్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | 38,416 |
1999 | పి. భూమన్న | తెలుగుదేశం పార్టీ | 65,054 | చిలుకూరి రామచంద్రారెడ్డి | స్వతంత్ర | 29,828 |
2004 | చిలుకూరి రామచంద్రారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 74,675 | జోగు రామన్న | తెలుగుదేశం పార్టీ | 54,838 |
2009 | జోగు రామన్న | తెలుగుదేశం పార్టీ | 62,235 | చిలుకూరి రామచంద్రారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 36,655 |
2012 (ఉప ఎన్నిక) | జోగు రామన్న | తెలంగాణ రాష్ట్ర సమితి | చిలుకూరి రామచంద్రారెడ్డి |
మరణం
[మార్చు]అనారోగ్యంలో అస్వస్థతకు గురైన రామచంద్రారెడ్డి మెరుగైన చికిత్సకోసం హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023, జూలై 20న గుండెపోటు మరణించాడు.[5] రామచంద్రారెడ్డి మరణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించించి, రామచంద్రారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Telugu, ntv (2023-07-20). "C Ramachandra Reddy: మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కన్నుమూత.. రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు". NTV Telugu. Archived from the original on 2023-07-20. Retrieved 2023-07-20.
- ↑ "Chilkuri Ramchandra Reddy: రాజకీయ సవ్యసాచి.. ప్రజాసేవలో మేటి". EENADU. Retrieved 2024-04-12.
- ↑ Velugu, V6 (2023-07-21). "మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి కన్నుమూత". V6 Velugu. Archived from the original on 2023-07-21. Retrieved 2023-07-21.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Chilkuri Ramchandra Reddy: రాజకీయ సవ్యసాచి.. ప్రజాసేవలో మేటి". EENADU. Archived from the original on 2023-07-21. Retrieved 2023-07-21.
- ↑ telugu, NT News (2023-07-20). "Ramachandra Reddy | మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి మృతి, సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-07-21. Retrieved 2023-07-21.
- ↑ Telugu, Tnews (2023-07-20). "చిలుకూరి రామచంద్రా రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం". T News Telugu. Archived from the original on 2023-07-20. Retrieved 2023-07-20.
- 1944 జననాలు
- 2023 మరణాలు
- ఆదిలాబాదు జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- ఆదిలాబాదు జిల్లా రాజకీయ నాయకులు
- ఆదిలాబాదు జిల్లా వ్యక్తులు
- ఆదిలాబాదు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1978)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1985)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1989)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2004)