జైనథ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జైనథ్
—  మండలం  —
అదిలాబాదు జిల్లా పటములో జైనథ్ మండలం యొక్క స్థానము
అదిలాబాదు జిల్లా పటములో జైనథ్ మండలం యొక్క స్థానము
జైనథ్ is located in Telangana
జైనథ్
తెలంగాణ పటములో జైనథ్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 19°44′00″N 78°39′00″E / 19.7333°N 78.6500°E / 19.7333; 78.6500
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రము జైనథ్
గ్రామాలు 46
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,904
 - పురుషులు 23,797
 - స్త్రీలు 24,107
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.56%
 - పురుషులు 64.89%
 - స్త్రీలు 36.49%
పిన్ కోడ్ 504309

జైనథ్ (Jainad or Jainath), తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 504 309.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ గ్రామంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని జైనబసతుడు నిర్మించాని, ఆయన పేరుమీదుగానే గ్రామానికి జైనథ్ అనే పేరు వచ్చిందని స్థలపురాణం.[1] 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రచరిత్రలో ఈ గ్రామం పేరు జేనదుగా వ్రాశారు.[2]

చరిత్ర[మార్చు]

1830ల్లో కాశీయాత్ర చేస్తూ ఈ గ్రామాన్ని సందర్శించిన తొలి తెలుగు యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పట్లో ఈ గ్రామస్థితిగతులు అభివర్ణించారు.

ఆలయాలు[మార్చు]

 • శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం ఈ గ్రామంలో అలరారుతోంది. జైనబసతుడు ప్ర్రార్ధన చేసుకోవదానికి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తారు. పల్లవ రాజులకాలంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చారిత్రిక ఐతిహ్యం. నాగరశైలిలో నిర్మితమైన ఈ ఆలయం దేవతల ఆవాస స్థలిగా విరాజిల్లుతోంది.[1]

వ్యవసాయం, పంటలు[మార్చు]

జైనథ్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 20786 హెక్టార్లు మరియు రబీలో 753 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[3]

జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 47,904 - పురుషులు 23,797 - స్త్రీలు 24,107

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. హాథీఘాట్
 2. గూడ
 3. రంపూర్‌తరాఫ్
 4. కోర్తా
 5. కెదార్‌పూర్
 6. అకోలి
 7. గిమ్మ (ఖుర్ద్)
 8. సిర్సొన్న
 9. భోరజ్
 10. ఫౌజ్‌పూర్
 11. పూసాయి
 12. పిప్పర్‌వాడ
 13. మౌదగడ
 14. కామాయి
 15. దొల్లార
 16. పెండల్‌వాడ
 17. లేకర్‌వాడి
 18. సావాపూర్
 19. హాషంపూర్
 20. తరద (బుజుర్గ్)
 21. నిజాంపూర్
 22. నీరాల
 23. బాలాపూర్
 24. అకుర్ల
 25. సంగ్వి (కె)
 26. దీపాయిగూడ
 27. కౌతా
 28. బహదూర్‌పూర్
 29. కుర
 30. కరంజి
 31. ఖప్రి
 32. ఉమ్రి
 33. బెల్‌గావ్
 34. బల్లోరి
 35. మకోద
 36. జైనథ్
 37. ముక్తాపూర్
 38. అదా
 39. కంతా
 40. పర్ది (బుజుర్గ్)
 41. పర్ది (ఖుర్ద్)
 42. పిప్పల్‌గావ్
 43. లక్ష్మీపూర్ (ఉలిగన్)
 44. జామిని
 45. కంపా (మెదిగుద)
 46. మంగుర్ల

గణాంక వివరాలు[మార్చు]

మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01

 1. 1.0 1.1 "మన ఆదిలాబాదు". న్యూస్‌టుడే. ఈనాడు (ఆదిలాబాద్ జిల్లా). ఆగస్ట్ 31, 2013.  Check date values in: |date= (help)
 2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014. 
 3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 101


"https://te.wikipedia.org/w/index.php?title=జైనథ్&oldid=2129681" నుండి వెలికితీశారు