జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం
జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 19°43′59″N 78°42′39″E / 19.73306°N 78.71083°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | ఆదిలాబాద్ |
ప్రదేశం: | జైనథ్ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | లక్ష్మీనారాయణస్వామి |
జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాదు జిల్లా, జైనథ్ గ్రామంలో ఉన్న అతి ప్రాచీన జైన ఆలయం.[1] తర్వాత దీన్ని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంగా మార్చారు. ఈ ఆలయం హైదరాబాదు నుండి కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్ మీదుగా 315 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడాదిలో ఒకసారి సూర్య కిరణాలు స్వామివారి మూల విగ్రహాన్ని తాకడం ఇక్కడి విశేషం.[2]
ఆలయ చరిత్ర
[మార్చు]ప్రకృతి సిద్ధంగా లభించే నల్లరాతితో నిర్మితమైన అతి పురాతనమైన ఆలయం ఇది. ఆలయ ప్రాంగణంలో ఉన్న శిలాశాసనాలను బట్టి, ఆలయ గోడలపై చెక్కిన దాదాపు 20 శ్లోకాలను బట్టి, ఈ ప్రాంతం సా.శ 4 నుండి 9వ శతాబ్దం నాటివరకు పల్లవ సామ్రాజ్యంలో ఉన్నదని, వారిచే ఈ ఆలయం కట్టబడిందని తెలుస్తుంది. దాదాపు 500 ఏళ్ళపాటు దక్షిణ భారతదేశమును పాలించిన పల్లవుల కళానైపుణ్యం గొప్పదేకాకుండా హస్తకళలలో, శిల్పకళలలోను వారు సిద్ధహస్తులు. ఈ ఆలయం జైన్ సంప్రదాయంతో ఉండడంవల్ల ఈ ఊరికి జైనథ్ అని పేరు వచ్చిందని కూడా చెప్పచ్చు.
ఆలయ విశిష్టత
[మార్చు]ప్రతి ఏటా ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగష్టు నెలలో, దసరా తరువాత వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి నాడు ఉదయ కిరణాలు లక్ష్మీనారాయణుని పాదాలు తాకుతాయి.[3]
ఉత్సవాలు
[మార్చు]ప్రతి ఏట కార్తీక మాసంలో శుద్ధ అష్టమి నుండి బహుళ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతాయి. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, జాతరలు జరుగుతాయి.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ టూరిజం. "Jainath Temple". Archived from the original on 14 మార్చి 2018. Retrieved 3 March 2018.
- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ ఎడ్యూకేషన్ న్యూస్ (18 August 2015). "తెలంగాణ పర్యాటక రంగం-విశేషాలు". Retrieved 3 March 2018.
- ↑ తెలుగు వన్, పుణ్యక్షేత్రాలు. "జైనథ్ ఆలయం జైనథ్, అదిలాబాద్ జిల్లా, తెలంగాణా స్టేట్". www.teluguone.com. మణినాథ్ కోపల్లె. Retrieved 3 March 2018.