శొంఠి వెంకట రామమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శొంఠి వెంకటరామమూర్తి
జననం(1888-08-01)1888 ఆగస్టు 1 -->
మరణం1964 జనవరి 1(1964-01-01) (వయసు 75)
జాతీయతభారతీయుడు
విద్యఎం.ఎ., పి.హెచ్.డి.,
వృత్తికలెక్టర్, సేలం
క్రియాశీల సంవత్సరాలు1935 - 1952
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గణిత శాస్త్రవేత్త

శొంఠి వెంకట రామమూర్తి (ఆగస్టు 1 1888 - జనవరి 1 1964) బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రసిద్ధ గణితశాస్త్రవేత్త, ఐ.సి.ఎస్. పరిపాలనాధ్యక్షుడుగా పనిచేసినవాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

వెంకటరామమూర్తి ఆనకట్టల నిర్మాణ నిపుణులు. ఆయన విశాఖపట్టణంలో ఆగస్టు 1 1888 న వెంకటరమణయ్య, రాజేశ్వరమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఉన్నత పాఠశాల విద్య, ఉన్నత విద్యను విశాఖపట్టణంలో చదివారు. ఆయన ఎ.వి.ఎన్.కాలేజీలో విద్యనభ్యసించారు.[2] మద్రాసు విశ్వవిద్యాలయంలో బి.ఎ. (ఆనర్స్) చదివారు.తరువాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రం అభ్యసించారు. గణితంలో పి.హెచ్.డి చేసారు. కానీ ఉద్యోగ రీత్యా అనేక మార్పులు జరిగాయి. ఐ.సి.ఎస్ పరీక్ష రాసి ద్వితీయ శ్రేణిలో పాసై తన 24 వ యేట సేలం జిల్లాకు సబ్ కలెక్టరుగా బాధ్యతలు చేపట్టారు.22-6-1935 నుండి 8-11-1937 వరకు సేలం జిల్లాకు కలెక్టరుగా చేసారు.[3] ఆంధ్రప్రదేశ్ లో ఒంగోలు జిల్లాతో పాటు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసు జిల్లాలలోనే ఎక్కువకాలం కలెక్టరుగా పనిచేసారు. రాజాజీ మంత్రి వర్గంలో ప్రకాశం పంతులు ఉన్న సమయంలో ఆయన రెవెన్యూ బోర్డు డైరక్టరుగా ఉన్నారు.[4] ఆయన మద్రాసు ప్రెసిడెన్సిలో గవర్నరుకు సలహాదారుగా కూడా పనిచేసారు.[5]

ఆయన ఛీఫ్ సెక్రటరీ ఆఫ్ మద్రాసు ప్రెసిడెన్సీ గాయున్నప్పుదు 1940లో గోదావరి నది మీద పోలవరం వద్ద శ్రీరామపాద సాగర్ ప్రాజెక్టును రూపకల్పన చేసారే కానీ రాజకీయ కారణాలతో వెనుతిరిగింది.[6][7] 1947 లో బొంబాయి ఏక్టింగ్ గవర్నరుగా, ఉదయపూర్ సంస్థాన్ దివానుగా ఉన్నారు. "మేధమెటికల్ మోనిజం" సిద్ధాంత కర్తగా గణిత శాస్త్ర ప్రపంచంలో ప్రసిద్ధులుగా మిగిలిపోయారు.

ఆయన 1952 లో భారతదేశ మొదటి సాధారణ ఎన్నికలలో రాజమండ్రి లోక్‌సభ ఎన్నికలకు పోటీచేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గూర్చి తెరమీదకు తెచ్చాడు.[8]

ఆయన జనవరి 1 1964 న మరణించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "RURAL PROBLEMS IN MADRAS -intorduction by s.v.ramamurty" (PDF). S. Y. KRisHNASWAMI, O.B.E., I.e.s.[permanent dead link]
  2. "Notable alumni". Archived from the original on 2015-06-15. Retrieved 2015-06-27.
  3. "COLLECTORS OF SALEM DISTRICT". Archived from the original on 2016-03-05. Retrieved 2015-06-27.
  4. 4.0 4.1 ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ ed.). శ్రీవాసవ్య. 2011.
  5. "inauguration of kuppuswami sastry reasearch inistitute". Archived from the original on 2014-08-03. Retrieved 2015-06-27.
  6. Polavaram caught in a name game
  7. Godavari: Still a sleeping beauty
  8. "Polavaram project". Kesiraju Sitaramaiah,. ది హిందూ. 2014-07-15.{{cite news}}: CS1 maint: extra punctuation (link)

ఇతర లింకులు

[మార్చు]