తారారాణి శ్రీవాస్తవ
తారారాణి శ్రీవాస్తవ | |
---|---|
జననం | బీహార్, భారతదేశం |
జాతీయత | భారతీయులు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో సభ్యులు. |
జీవిత భాగస్వామి | ఫూలేందు బాబు |
తారారాణి శ్రీవాస్తవ భారత స్వాతంత్ర్యసమరయోధురాలు. ఆమె మహాత్మా గాంధీ నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమంలో భాగస్వామి. [1][2] ఆమె తన భర్త ఫూలేందు బాబుతో పాటు బీహార్ లోని సరద్ జిల్లాలో నివసించేది. [3] 1942 లో ఆమె తన భర్తతో కలసి బీహార్ లోని "సివాన్" లో పోలీసు స్టేషను వైపు ఉద్యమాన్ని నడిపించింది. పోలీసుల కాల్పులలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఆమె ఏదేమైనా ఆమె మార్చ్ ను కొనసాగించింది. తిరిగి వచ్చిన తరువాత తన భర్త మరణించినట్లు గుర్తించింది. ఆమె భారత స్వాతంత్ర్యం తరువాత ఐదు సంవత్సరాల వరకు కూడా ఉద్యమాలలో భాగంగా ఉంది.
వ్యక్తిగత జీవితం, స్వాతంత్ర్య పోరాటం
[మార్చు]ఆమె బీహార్ లోని పాట్నా నగరానికి సమీపంలోని శరణ్ లో జన్మించింది. [2] తక్కువ వయస్సులోనే ఆమె ఫూలేందు బాబును వివాహమాడింది. [3] లింగ అసమానతలకు దారి తీసే ప్రజా ప్రతిపాదనల కోసం ఆమె బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి తన గ్రామం, చుట్టుపక్కల గ్రామాల మహిళలను చైతన్యపరచింది.[4] 1942 ఆగస్టు 12 న మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఆమె తన భర్తతో పాటు శివాన్ పోలీసు స్టేషను ఎదుట భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి మార్చ్ ను నిర్వహించింది. ఇది "ఒక పెద్ద ధిక్కరణ" గా కనిపించే చర్య.[4][5] ఈ చర్యకు పోలీసులు అడ్డుకొని ఆందోళనకారులపై లాఠీఛార్జి జరిపారు. ఆందోళన కారుల ఉద్యమాన్ని అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో ఆమె భర్త గాయపడ్డాడు. ఆమె తన చీరను చింపి దానితో అతని గాయాలకు కట్టుకట్టింది. ఏదేమైనా ఆమె తన పోరాటాన్ని కొనసాగించి పోలీసు స్టేషను ఎదుట జెండాను ఎగరవేసేందుకు ప్రయత్నించింది. తిరిగి వచ్చేటప్పుడు తన భర్త మరణించినట్లు తెలుసుకుంది. [5] 1942 ఆగస్టు 15న దేశానికి త్యాగం చేసిన తన భర్త గౌరవార్థం ఛాప్రా లో ప్రార్థనా సమావేశం జరిగింది. ఆమె 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు తన స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించింది.[1][5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Thakur, Bharti (2006). Women in Gandhi's Mass Movements. Deep & Deep Publications. ISBN 9788176298186.
- ↑ 2.0 2.1 Devi, Bula (14 August 2012). "Unsung heroines of Independence". The Hindu. Retrieved 23 July 2017.
- ↑ 3.0 3.1 "Tara Rani Srivastava". General Knowledge. JagranJosh: 10–12. 6 July 2017 – via Google Books.
- ↑ 4.0 4.1 Shukla, Vivekananda (1989). Rebellion of 1942: Quit India movement. H.K. Publishers & Distributors. pp. 63–64.
- ↑ 5.0 5.1 5.2 "Independence Day 2016: 10 unsung heroes from India's history". The Free Press Journal. Indian National Press. 13 August 2016. Retrieved 23 July 2017.