సుఖ్‌దేవ్ థాపర్

వికీపీడియా నుండి
(సుఖ్‌దేవ్ థాపర్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సుఖ్‌దేవ్ థాపర్‌
భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ విగ్రహాలు
జననం1907, మే 15
మరణం1931, మార్చి 23
లాహోర్, పంజాబ్(పాకిస్థాన్)
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్
ఉద్యమంభారత స్వాతంత్ర్య ఉద్యమం

సుఖ్‌దేవ్ థాపర్‌, (1907 మే 15- 1931 మార్చి 23,) భారతస్వాతంత్ర్య సమర, ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్, రాజ్‌గురుల సహచరునిగా ప్రసిధ్ధి. 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వంపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్‌పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి "జె.పి. సాండర్స్" ను హతమార్చినందుకు 1931 మార్చి 23 న ఉరితీయబడ్డాడు.

ఈ ముగ్గురు విప్లవకారులు భగత్ సింగ్,రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లను 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో సాయంకాలం గం. 7.33 ని.లకు సమయానికి ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరిశిక్ష అమలు జరపడం జరిగేది కాదు. వారి మృత దేహాలను రహస్యంగా, జైలు వెనుక గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళి సట్లెజ్ నది తీరాన హుస్సేన్‌వాలా అనే ఊరిలో దహనం చేసేవారు. మృత దేహాలను చూసిన ప్రజలలో అలజడిని ఎదుర్కోకుండా ఇలా చేశారు.

సుఖదేవ్ హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థలో ముఖ్యమైన నాయకుడు. లాహోర్ నేషనల్ కాలేజిలో భారత పురాతన ఔన్నత్యాన్ని అధ్యయనం చేయడానికి, ప్రపంచ విప్లవ పరిణామాలు పరిశీలించడానికి ఒక అధ్యయన కేంద్రాన్ని (స్టడీ సర్కిల్) ప్రాంభించాడు. తన సహచరులైన భగత్ సింగ్, రామచంద్ర, భగవతీ చరణ్ వోహ్రా లతో కలిసి లాహోరులో "నవ జవాన్ భారత సభ" ప్రారంభించాడు. దేశ స్వాంతంత్ర్యానికి యువతను ఉత్తేజితులను చేయడం, ప్రజలలో హేతువాదాన్ని పెంపొందించడం, మతవైషమ్యాలను నిరోధించడం, అంటరానితనాన్ని అరికట్టడం ఆ సంస్థ ఆశయాలు.

రామప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర ఆజాద్‌ల ప్రభావం సుఖదేవ్‌పై బలంగా ఉంది. ఖైదీలపట్ల చూపుతున్న అమానుష విధానాలకు వ్యతిరేకంగా 1929లో జరిగిన నిరాహార దీక్షలో సుఖదేవ్ పాల్గొన్నాడు. సుఖదేవ్‌ను ఉరి తీయడానికి ముందు అతను మహాత్మా గాంధీకి ఒక లేఖ వ్రాశాడు. విప్లవ మార్గంలో ఉద్యమిస్తున్న వారిపట్ల మహాత్మా గాంధీ అనుసరిస్తున్న ప్రతికూల ధోరణిని ఈ లేఖలో సుఖదేవ్ విమర్శించాడు. సుఖదేవ్‌కు మరణ శిక్ష వేయడానికి ఆధారమైన ప్రధాన సాక్ష్యం హంసరాజ్ వోహ్రా ఇచ్చాడు. అయితే సుఖదేవ్ స్వయంగా నేరాన్ని అంగీకరించాడని వోహ్రా చెప్పాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]