Jump to content

విద్యాపతి

వికీపీడియా నుండి
విద్యావతి

విద్యాపతిగా సుప్రసిద్ధులైన విద్యాపతి ఠాకూర్ మైథిలి భాషా కవులలో అగ్రగణ్యుడు. ఆయన పశ్చిమబెంగాల్ సరిహద్దున గల తూర్పు బీహార్ ప్రాంతంలో నివసించే లక్షలాది ప్రజలు మాట్లాడుకునే మైథిలి భాషలో విద్యాపతి కవిత్వం చెప్పారు. మైథిలి భాషీయులైన కవులు కూడా ఇతర భాషల్లో కవిత్వం చెప్పే రోజుల్లో ఆయన మైథిలి భాషలోనే అసంఖ్యాక భక్తి పదాలు, అనేక గ్రంథాలు రచన చేసి మైథిలి సాహిత్య వైతాళికునిగా నిలిచారు.

వంశ చరిత్ర

[మార్చు]

విద్యాపతి పూర్వీకులు మైథిలి ప్రాంతంలో సుప్రసిద్ధులైన రాజనీతివేత్తలు, పవిత్రగ్రంథకర్తలు. విద్యాపతికి 6 తరాల ముందువాడైన కర్మాదిత్యుడు మొట్టమొదటగా మిథిలా రాజ్యానికి మంత్రిగా చేరారు. ఆపైన కర్మాదిత్యుని కొడుకు దేవాదిత్యుడు, మనవడు వీరేశ్వరుడు, మునిమనవడు చండీశ్వరుడు మైథిలి రాజ్యానికి మహామంత్రులుగా పనిచేశారు. చండీశ్వరుడు మంత్రిగా పనిచేసిన కాలంలో వీరేశ్వరుని మరో కుమారుడు గణేశ్వరుడు సామంతరాజుల మండలికి అధ్యక్షునిగా మహాసామంతాధిపతి పదవిని, రాజాధిరాజ బిరుదాన్ని వహించారు.

విద్యాపతి పూర్వీకులు మరొకపక్క మైథిలి ప్రాంతంలో సుప్రసిద్ధి పొందిన పలు స్మృతి గ్రంథాలను, ధర్మసూత్ర గ్రంథాలను రచించారు. ఆయన పూర్వీకులు వీరేశ్వరుడు సామవేదాధ్యాయులైన ఛాంద్యోగులు నిర్వర్తించాల్సిన కర్మకాండని వివరించే "పద్ధతి" గ్రంథాన్ని, రామదత్తుడు శుక్లయజుశ్శాఖీయులైన వాజసనేయులు నిర్వర్తించే కర్మకాండ వివరణలతో మరొక "పద్ధతి" గ్రంథాన్ని రచించారు. మైథిలి ప్రాంతీయులైన ఛాంద్యోగ, వాజసనేయ శాఖీయుల కర్మకాండల్లో ఈ గ్రంథాలు నేటికీ అమల్లో ఉన్నాయి. గణేశ్వర ఠాకూరు సుగతి సోపానం మొదలుగా గల ఎన్నో స్మృతి గ్రంథాలను రచించారు.

ఆయన పూర్వీకులందరిలోకీ రాజనీతిరంగంలోనూ, ధర్మశాస్త్ర రచనలోనూ మేధస్సులో సుప్రసిద్ధుడు చండీశ్వరుడు(విద్యాపతి ముందుతరం వాడు). ఏడుభాగాలుగా విభజించిన స్మృతిసారమైన రత్నాకరం అనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచించి మైథిలి సమాజంలోని సాంఘిక, రాజకీయ జీవనాలను వందల ఏళ్లపాటు ప్రభావితం చేశారు. ఆ గ్రంథంలోని 7విభాగాల్లోనూ రాజనీతి రత్నాకరం మరింత ప్రభావశీలమైనది. ఒయినబర వంశీకులు మిథిలా పాలకులుగా ఉన్నా ఢిల్లీ సమ్రాట్టుకు తలవంచినందునా, బ్రాహ్మణులు కావడంతో పట్టాభిషేకార్హత స్వతః లేనివారు కావడంతో వారిని పూర్వాచార ప్రభావితులైన మిథిలా ప్రజానీకం తొలుత పాలకులుగా అంగీకరించలేదు. ఈ పరిణామాలన్నీ తుదకు దేశాన్ని పరతంత్రంలోకి నెట్టే పరిస్థితులు కనిపించడంతో, మారిన దేశకాలమాన స్థితిగతులు అవగాహన చేసుకుని చండీశ్వరుడు ప్రాచీన ధర్మశాస్త్రసూత్రాలతో సమన్వయం చేస్తూ రాజనీతి రత్నాకరం గ్రంథాన్ని

ఇతర లింకులు

[మార్చు]