Jump to content

బసవ పురస్కారం

వికీపీడియా నుండి
బసవ పురస్కారం
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌర
విభాగం సాధారణ
వ్యవస్థాపిత 2001
క్రితం బహూకరణ 2013
బహూకరించేవారు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం
నగదు బహుమతి 10 లక్షలు
వివరణ సంఘసంస్కరణ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా.
మొదటి గ్రహీత(లు) సరస్వతీ గోరా
క్రితం గ్రహీత(లు) యు.ఆర్.అనంతమూర్తి

బసవ పురస్కారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంచేత ప్రదానం చేయబడుతున్నది. ఈ పురస్కారాన్ని సంఘంలో మార్పులు తీసుకువస్తున్న, సంఘ సంస్కరణల విషయంలో పాటుపడుతున్న, మతసామరస్యానికి కృషి చేస్తున్న వ్యక్తులకు ప్రకటిస్తున్నారు.

అవార్డ్

[మార్చు]

ఈ జాతీయస్థాయి పురస్కారం క్రింద పదిలక్షల రూపాయల నగదు, జ్ఞాపిక, సన్మానపత్రం ఇస్తారు. బసవశ్రీ అనే బిరుదును ప్రసాదిస్తారు.

గ్రహీతలు

[మార్చు]
సంవత్సరం గ్రహీత పేరు ఛాయాచిత్రం వివరాలు మూలం
2000 సరస్వతీ గోరా సంఘసంస్కర్త [1]
2001 హెచ్.నరసింహయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, భౌతికశాస్త్రవేత్త [2]
2002 పుట్టరాజ్ గవాయ్ సంఘ సేవకుడు, సంగీత కళాకారుడు
2003 ఎస్.జి.సుశీలమ్మ సంఘసేవిక, సుమంగళి సేవాశ్రమం అధ్యక్షురాలు
2005 ఎల్.బసవరాజు ఆచార్యుడు, రచయిత [3]
2006 ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ శాస్త్రజ్ఞుడు, మాజీ భారత రాష్ట్రపతి [4]
2007 శివకుమార స్వామీజీ సిద్ధగంగ మఠాధిపతి, సిద్ధగంగ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు [5]
2008 విజయ మహంతప్ప స్వామి చిత్తరగి విజయ మహంతేశ్వర మఠం పీఠాధిపతి [6]
2010 జవరే గౌడ రచయిత, విద్యావేత్త [6]
2011 మేధా పాట్కర్ క్రియాశీల కార్యకర్త; పురస్కారాన్ని తిరస్కరించింది. [7]
2013 యు.ఆర్.అనంతమూర్తి రచయిత, క్రియాశీల కార్యకర్త [8]

మేధా పాట్కర్‌కు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని 2010లో ప్రకటించారు. కర్ణాటక ప్రభుత్వం గనుల కుంభకోణంపై చర్యలు తీసుకోలేక పోవడం, లోకాయుక్త వివాదాన్ని పరిష్కరించకపోవడం వంటి వాటికి నిరసనగా ఈ పురస్కారాన్ని ఆమె తిరస్కరించింది.

మూలాలు

[మార్చు]
  1. "Saraswathi Gora selected for Basava Puraskar". The Hindu.com. Hindu. Archived from the original on 30 నవంబరు 2004. Retrieved 2 November 2008.
  2. "Basava Award presentation tomorrow". The Hindu.com. Hindu. Retrieved 2 November 2008.[permanent dead link]
  3. "Basava Puraskar 2005 given away to Basavaraju". The Hindu.com. Chennai, India: Hindu. 1 May 2006. Archived from the original on 27 September 2008. Retrieved 2 November 2008.
  4. "Basava Award for Kalam". The Hindu.com. Chennai, India: Hindu. 25 August 2007. Archived from the original on 5 డిసెంబరు 2007. Retrieved 2 November 2008.
  5. "Basava Puraskar for Siddaganga swami". The Hindu.com. Chennai, India: Hindu. 1 October 2008. Archived from the original on 4 October 2008. Retrieved 2 November 2008.
  6. 6.0 6.1 "Basava Puraskar Award". The Hindu. 22 July 2012. Retrieved 29 April 2017.
  7. "Medha Patkar declines Basava Award". The Hindu. 9 February 2012. Retrieved 29 April 2017.
  8. "Award for Ananthamurthy". The Hindu. 7 January 2014. Retrieved 29 April 2017.