పంప పురస్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంప ప్రశస్తి
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌర
విభాగం సాహిత్యం
వ్యవస్థాపిత 1987
మొదటి బహూకరణ 1987
క్రితం బహూకరణ 2014
మొత్తం బహూకరణలు 28
బహూకరించేవారు కర్ణాటక ప్రభుత్వం
నగదు బహుమతి 1 లక్ష (1987 – 2007)
3 లక్షలు (2008 – ప్రస్తుతం వరకు)
వివరణ కర్ణాటక యొక్క
అత్యున్నత సాహిత్య పురస్కారం
మొదటి గ్రహీత(లు) కువెంపు
క్రితం గ్రహీత(లు) హంప నాగరాజయ్య

పంప పురస్కారం (లేదా పంప ప్రశస్తి) అనేది కర్ణాటక యొక్క సాహిత్య పురస్కారం. దీనిని 1987లో కర్ణాటక రాష్ట్రప్రభుత్వం కన్నడ, సాంస్కృతిక శాఖ ప్రారంభించింది. ఇది ఈ రాష్ట్రం ప్రదానం చేసే అత్యున్నత సాహిత్య పురస్కారం.[1] దీనిని ప్రతి సంవత్సరం కన్నడ భాషలో వ్రాయబడిన ఉత్తమ సాహిత్య గ్రంథానికి లేదా కన్నడ సాహిత్యంలో జీవితకాల కృషి చేసిన కన్నడిగుడికి ప్రదానం చేస్తారు.

పురస్కారం

[మార్చు]

ఈ పురస్కారం కన్నడ భాషలో మొట్టమొదటి కవి పంప పేరుమీద ప్రదానం చేయబడుతుంది. [2] ఈ పురస్కారం క్రింద 1 లక్ష నగదు, ఒక శాలువా, ప్రశంసా పత్రం, జ్ఞాపిక ఇచ్చేవారు.[3] కానీ 2008 నుండి నగదు పురస్కారాన్ని 3 లక్షలకు పెంచారు.[4] 1996కు ముందు ఈ అవార్డు కన్నడ రచయిత వ్రాసిన ఒక ఉత్తమ పుస్తకానికి ఇచ్చేవారు. తరువాత ఈ పురస్కారం కన్నడ రచయితలకు వారి జీవితకాల సాహితీ సేవను గుర్తించి ఇస్తున్నారు. ఈ పురస్కారం మొదటిసారి కువెంపు వ్రాసిన శ్రీ రామాయణ దర్శనంకు లభించింది.

ఉత్సవం

[మార్చు]

ప్రతి యేటా ఆదికవి పంప జన్మస్థలం ఉత్తర కన్నడ జిల్లా బనవాసి పట్టణంలో కన్నడ భాష, సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిర్వహించే "కదంబోత్సవ"లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.[5]

పురస్కార గ్రహీతల జాబితా

[మార్చు]
కువెంపు
కె.ఎస్.నరసింహస్వామి
ఎస్.ఎల్.భైరప్ప
చంద్రశేఖర కంబార
సంవత్సరం రచయిత రచన/కృషి మూలం
1987 కువెంపు శ్రీ రామాయణ దర్శనం
1988 టి.ఎన్. శ్రీకంఠయ్య భారతీయ కవిత్వ మీమాంసె
1989 కె.శివరామ కారంత్ మై మనగళ సుళియల్లి
1990 ఎస్.ఎస్.భూసనూర మఠ శూన్య సంపాదనెయ పరామర్శె
1991 పి.టి.నరసింహాచార్ శ్రీహరి చరిత
1992 ఎ.ఎన్. మూర్తి రావు దేవరు
1993 గోపాలకృష్ణ అడిగ సువర్ణ పుత్తల్లి
1994 సేడియాపు కృష్ణభట్ట విచార ప్రపంచ
1995 కె.ఎస్.నరసింహస్వామి దుండు మల్లిగె
1996 ఎం.ఎం.కల్బుర్గి సమగ్ర సాహిత్యం
1997 జి.ఎస్.శివరుద్రప్ప సమగ్ర సాహిత్యం
1998 జవరే గౌడ సమగ్ర సాహిత్యం
1999 చెన్నవీర కణవి సమగ్ర సాహిత్యం
2000 ఎల్.బసవరాజు సమగ్ర సాహిత్యం
2001 పూర్ణచంద్ర తేజశ్వి సమగ్ర సాహిత్యం
2002 ఎం.చిదానందమూర్తి సమగ్ర సాహిత్యం
2003 చంద్రశేఖర కంబార సమగ్ర సాహిత్యం
2004 హెచ్.ఎల్. నాగేగౌడ సమగ్ర సాహిత్యం
2005 ఎస్.ఎల్.భైరప్ప సమగ్ర సాహిత్యం
2006 జి.ఎస్.అమర్ [6] సమగ్ర సాహిత్యం
2007 యశ్వంత్ వి. చిత్తాల [7]
2008 టి.వి.వెంకటాచల శాస్త్రి [4]
2009 చంద్రశేఖర పాటిల్ [8]
2010 గోవింద్‌రే హెచ్.నాయక్ [9]
2011 బరగూరు రామచంద్రప్ప సమగ్ర సాహిత్యం
2012 డి.ఎన్.శంకరభట్ సమగ్ర సాహిత్యం
2013 కయ్యార కిన్హణ్ణ రై సమగ్ర సాహిత్యం
2014 జి.వెంకటసుబ్బయ్య కన్నడ నిఘంటువు
2015 బి.ఎ.సనది సమగ్ర సాహిత్యం [10]
2016 హంప నాగరాజయ్య సమగ్ర సాహిత్యం [11]

మూలాలు

[మార్చు]
  1. "Kadambotsava from Monday". The Hindu. 2004-02-01. Archived from the original on 2012-11-07. Retrieved 2016-12-01.
  2. "Archive News - The Hindu". Hinduonnet.com. Retrieved 2016-12-01.[permanent dead link]
  3. "Karnataka / Bangalore News : Dept. announces all awards at once". The Hindu. 2005-06-27. Archived from the original on 2012-11-04. Retrieved 2016-12-01.
  4. 4.0 4.1 "Archive News". The Hindu. Archived from the original on 2012-11-04. Retrieved 2016-12-01.
  5. "India News, Latest Sports, Bollywood, World, Business & Politics News - Times of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2012-10-17. Retrieved 2016-12-01.
  6. "Archive News". The Hindu. Archived from the original on 2007-12-21. Retrieved 2016-12-01.
  7. "Archive News". The Hindu. Archived from the original on 2012-11-04. Retrieved 2016-12-01.
  8. "Finally, Pampa award for Champa". The Hindu. 14 September 2011. Retrieved 28 April 2017.
  9. "G.H. Nayak refuses to accept award at Dasara celebrations". The Hindu. 24 September 2013. Retrieved 28 April 2017.
  10. "Sanadi chosen for Pampa Award". Bengaluru. The Hindu. 27 February 2016. Retrieved 2 November 2016.
  11. "Hampa Nagarajaiah bags prestigious Pampa award". The Times of India. 12 January 2017. Retrieved 27 April 2017.

బయటి లింకులు

[మార్చు]