దేవగిరి యాదవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవగిరి యాదవులు

సుమారు 1187[1]–1317
Coinage of Yadavas of Devagiri, king Bhillama V (1185-1193). Central lotus blossom, two shri signs, elephant, conch, and “[Bhilla]/madeva” in Devanagari above arrow right of దేవగిరి యాదవులు
Coinage of Yadavas of Devagiri, king Bhillama V (1185-1193). Central lotus blossom, two shri signs, elephant, conch, and “[Bhilla]/madeva” in Devanagari above arrow right
Territory of the Yadavas and neighbouring polities, circa 1200-1300 CE.[2]
రాజధానిDevagiri
సామాన్య భాషలుకన్నడ
సంస్కృతం
మరాఠీ
మతం
Hinduism
ప్రభుత్వంరాజరికం
చరిత్ర 
• Earliest rulers
సుమారు 860
• స్థాపన
సుమారు 1187[1]
• పతనం
1317
Preceded by
Succeeded by
Kalachuris of Kalyani
Western Chalukya Empire
ఖల్జీ వంశం
Today part ofIndia

దేవగిరి యాదవులు (సా.శ 1187 - 1317)[3] మధ్యయుగపు భారతదేశ రాజవంశం. ఈ వంశం తమ పరిపాలన అత్యున్నత స్థాయిలో ఉండగా ఉత్తరాన ఉన్న నర్మదా నది నుండి దక్షిణాన ఉన్న తుంగభద్ర నది మధ్య ఉన్న పశ్చిమ దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించారు. వీరు ప్రస్తుతం మహరాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న దౌలతాబాద్ (అప్పట్లో దేవగిరి) ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, మధ్యప్రదేశ్ లోని కొన్ని భాగాలను పరిపాలించారు.

వీరు మొదట్లో పశ్చిమ చాళుక్యుల కింద భూస్వాములుగా ఉన్నారు. సుమారు 12 వ శతాబ్దం మధ్యలో చాళుక్యుల ప్రభ కాస్త మసకబారడంతో ఐదవ భిల్లమ తనకుతానుగా స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. రెండవ సింహనుడి పరిపాలనా కాలంలో వీరి అధికారం పతాక స్థాయికి చేరి 14 వ శతాబ్దం మొదటి దాకా కొనసాగింది. సా.శ 1308 లో ఢిల్లీ సుల్తానులైన ఖల్జీ వంశం రాకతో వీరి పాలన అంతరించింది.

గమనికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. A. S. Altekar 1960, p. 524.
  2. Schwartzberg, Joseph E. (1978). A Historical atlas of South Asia. Chicago: University of Chicago Press. p. 147, map XIV.3 (c). ISBN 0226742210.
  3. T. V. Mahalingam 1957, p. 137.