పృథ్వీరాజ్ రాసో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పృథ్వీరాజ్ రాసో అనేది పృథ్వీరాజ్ చౌహాన్ (పరిపాలనా కాలం సా.శ 1177 - 1192) జీవితం గురించి వ్రజ భాషలో రాసిన కావ్యం. పుస్తకంలో ఉన్న వివరాలను బట్టి, దీనిని అతని ఆస్థాన కవి అయిన చంద్ బరదాయీ రాసినట్లు భావిస్తున్నారు.

ప్రస్తుత లభించిన ప్రతి 16వ శతాబ్దానికి చెందినది అయినా కొంతమంది పండితులు మాత్రం దీని మూల ప్రతి 13వ శతాబ్దానికి చెందినది అని భావిస్తున్నారు. 19వ శతాబ్దం వచ్చేసరికి రాజపుత్ర పరిపాలకుల ప్రోద్బలంతో అసలు పాఠ్యానికి అనేక ప్రక్షిప్తాలు, చేర్పులు చేశారు. ఈ గ్రంథం నాలుగు పరిష్కారాలుగా లభ్యం అవుతుంది. ఇందులో చారిత్రక వాస్తవాలు, కల్పిత పురాణాలు కలగలిసిపోయి ఉన్నాయి. అందుకని దీనిని సరైన చారిత్రక ఆధారంగా పరిగణించడం లేదు.

మూలాలు[మార్చు]