తాళ్లాయపాలెం
స్వరూపం
తాళ్లాయపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°30′N 80°30′E / 16.5°N 80.5°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | తుళ్ళూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
తాళ్లాయపాలెం గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీశైవక్షేత్రం
[మార్చు]- ఈ గ్రామంలో 2011 నవంబరు 10 గురువారం నాడు పవిత్ర కృష్ణా నదీ తీరంలో భూలోక కైలాసంగా భాసిల్లుచున్న శ్రీ శైవ క్షేత్రంలో నెలకొల్పిన భరతమాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసం మహోత్సవాల్ని పురస్కరించుకొని ఈ శ్రీశైవక్షేత్రంలో వివిధ కార్యక్రమాలూ నిర్వహించెదరు.[1]
- ఈ గ్రామంలో శివుడు, కోటిలింగేశ్వరస్వామిగా కొలువుదీరియున్నాడు. ప్రశాంతమైన వాతావరణం, అహ్లాదకరమైన పరిసరాలమధ్య ఉన్న ఈ ఆలయం, కృష్ణానదీ తెరం లో ఉంది. ఒకే లోగిలిలో అనేక ఆలయాల సమాహారంగా ప్రకటితమవుచున్న ఈ క్షేత్ర దర్శనం, సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు.
- ఈ క్షేత్రంలో, 2015, మే నెల-28వ తేదీనుండి 30వ తేదీ వరకు, ద్వాదశ వార్షికోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించెదరు.
- ఈ క్షేత్రంలో 2017, ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారం, మహాశివరాత్రినాడు, అర్ధరాత్రి శ్రీ దక్షిణామూర్తి, శ్రీ అమృతలింగేశ్వరస్వామివారల ఆలయాలలో విగ్రహ, శిఖర ప్రతిష్ఠలు నిర్వహించెదరు.
మూలాలు
[మార్చు]- ↑ [ఈనాడు-గుంటూరు,నవంబరు 11, 2011, పేజీ-16. ]