ప్రకాశం బ్యారేజి
ప్రకాశం బ్యారేజి | |
---|---|
అధికార నామం | ప్రకాశం బ్యారేజి |
దేశం | భారత దేశము |
ప్రదేశం | విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ |
స్థితి | Operational |
నిర్మాణం ప్రారంభం | 1954 |
ప్రారంభ తేదీ | 1957 |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | Barrage |
నిర్మించిన జలవనరు | కృష్ణా నది |
పొడవు | 1,223.5 మీ. (4,014 అ.) |
ప్రకాశం బ్యారేజి, విజయవాడ వద్ద, కృష్ణా నది పై నిర్మించిన బ్యారేజి. దీని పొడవు 1,223.5 మీటర్లు (4,014 అడుగులు). 1954 ఫిబ్రవరి 13 న మొదలైన బారేజి నిర్మాణం దాదాపు నాలుగేళ్ళలో పూర్తయింది. 1957 డిసెంబర్ 24 న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. బారేజి నిర్మాణానికి రూ. 2.78 కోట్లు ఖర్చయింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాలకు ఈ బారేజి నుండి సాగునీరు లభిస్తుంది.
చరిత్ర
[మార్చు]పాత ఆనకట్ట
[మార్చు]1832-1833 లలో ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. డొక్కల కరువు, నందన కరువు, గుంటూరు కరువు, పెద్ద కరువు గా పేరుపొందిన ఈ కరువు వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎక్కడ చూసినా శవాలగుట్టలే కనిపించేవి. దాదాపు 40% ప్రజలు ఈ కరువుకు బలయ్యారు. బ్రిటిషు ప్రభుత్వం పన్నుల రూపేణా రూ.2.27 కోట్లు నష్టపోయింది. ఇంత తీవ్ర కరువులోనూ కృష్ణానది ఎండిపోలేదు. అయినా ఆ నీటిని వాడుకునే మార్గం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో కృష్ణ నీటిని సాగుకు వాడుకునే ఉద్దేశంతో నదిపై బెజవాడ (విజయవాడ) వద్ద ఆనకట్టను ప్రతిపాదించారు.
ప్రతిపాదన కార్యరూపానికి రావడానికి మరో ఇరవై ఏళ్ళు పట్టింది. బెజవాడ వద్ద ఎడమ గట్టునగల ఇంద్రకీలాద్రి, కుడి గట్టున ఉన్న సీతానగరం మధ్య ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఆనకట్ట నిర్మాణం 1853లో మొదలై, 1854లో పూర్తయింది. 1132 మీ. పొడవు, 4 మీటర్ల ఎత్తుతో అనకట్ట పైగుండా వరదనీరు ప్రవహించేలా నిర్మించబడింది. రూ.1.49 కోట్లు ఖర్చయింది. 10 ప్రధాన కాలువల ద్వారా సాగునీటి సరఫరా చేయడం మొదలుపెట్టారు. కాలువల నిర్మాణాన్ని కాటన్ శిష్యుడైన మేజర్ చార్లెస్ ఓర్ పర్యవేక్షించాడు.[1] వంద సంవత్సరాలపాటు ఆనకట్ట ప్రజలకు వరప్రసాదమైంది.
1952లో వచ్చిన వరదలకు ఈ పాత బ్యారేజీ కొట్టుకొని పోవడంతో మరో ఆనకట్ట ఆవశ్యకత ఏర్పడింది.
కొత్త ఆనకట్ట
[మార్చు]పాత ఆనకట్ట కొట్టుకొని పోయిన వెంటనే కొత్త బారేజి నిర్మాణం మొదలయింది. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. పాత ఆనకట్టకు కొద్ది మీటర్ల ఎగువన బారేజిని నిర్మించారు. ఇసుక పునాదులపై నిర్మించిన ఈ బారేజి నీటి నియంత్రణకే కాక, 24 అడుగుల వెడల్పుతో రోడ్డు, రోడ్డుకు రెండు వైపులా 5 అడుగుల వెడల్పుతో నడకదారి కలిగిఉంది. ఈ రోడ్డు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి 16లో ఉంది. బారేజీకి తూర్పు, పడమరల్లోని కృష్ణా డెల్టా ప్రాంతంలోని 13.08 లక్షల ఎకరాలకు ఈ బారేజి నుండి సాగునీరు లభిస్తుంది.
మహబూబ్‌నగర్ జిల్లా జూరాల వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించి కృష్ణా జిల్లా నాగాయలంక, కోడూరు వద్ద రెండు పాయలుగా బంగాళాఖాతంలో కలిసే కృష్ణానదిపై చిట్టచివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్. 1954 ఫిబ్రవరి 13 న మొదలైన బారేజి నిర్మాణం దాదాపు నాలుగేళ్ళలో పూర్తయింది. 1957 డిసెంబర్ 24 న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. బారేజి నిర్మాణానికి రూ. 2.78 కోట్లు ఖర్చయింది.
ఆయకట్టు వివరాలు
[మార్చు]బచావత్ ట్రిబ్యునల్, కృష్ణా డెల్టాకు 181.2 టి.ఎం.సి.ల నీటిని కేటాయించింది. బారేజి కింద సాగునీరు లభించే ఆయకట్టు వివరాలు
ఎడమ గట్టు - (కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు) | ||
సంఖ్య | కాలువ పేరు | ఆయకట్టు, ఎకరాలలో |
---|---|---|
1. | ఏలూరు కాలువ | 1,15,000 (55,000 పశ్చిమ గోదావరి) |
2 | రైవస్ & దిగువ పుల్లేరు కాలువ | 1,75,000 |
3 | పోలరాజు కాలువ | 44,400 |
4 | బంటుమిల్లి కాలువ | 64,600 |
5 | కాంప్‌బెల్ కాలువ | 49,000 |
6 | బందరు కాలువ | 1,07,837 |
7 | ఆర్.ఆర్.పాలెం | 32,389 |
8 | ఎగువ పుల్లేరు కాలువ | 10,992 |
9 | కృష్ణా ఎడమగట్టు కాలువ | 1,36,280 |
మొత్తం | 7,35,498 |
కుడిగట్టు (గుంటూరు, ప్రకాశం జిల్లాలు) | ||
సంఖ్య | కాలువ పేరు | ఆయకట్టు, ఎకరాలలో |
---|---|---|
1 | కె.డబ్ల్యు.ప్రధాన కాలువ | 22,172 |
2 | కుడిగట్టు కాలువ | 1,55,344 |
3 | తూర్పు కాలువ | 53,992 |
4 | పశ్చిమ కాలువ | 27,588 |
5 | నిజాంపట్నం కాలువ | 22,124 |
6 | హైలెవెల్ కాలువ | 26,414 |
7 | కొమ్మమూరు కాలువ | 2,63,717 (75,500 ప్రకాశం) |
మొత్తం | 5,71,351 |
ఎత్తిపోతలు | ||
సంఖ్య | కాలువ పేరు | ఆయకట్టు, ఎకరాలలో |
---|---|---|
1 | కృష్ణా జిల్లా వైపు | 11,500 |
2 | గుంటూరు వైపు | 4,500 |
మొత్తం | 16,000 |
చిత్ర మాలిక
[మార్చు]-
శ్రీకృష్ణవేణి విగ్రహము. ప్రకాశం బారేజి. విజయవాడ
-
ప్రకాశం బారేజి సీతానగరం నుండి
-
ప్రకాశం బారేజి రాత్రి విద్యుత్ దీపాలతో
-
ప్రకాశం బారేజి వద్ద కృష్ణా నది, విజయ వాడ
-
ప్రకాశం బారేజ్ పై రహదారి/ విజయవాడ
-
జలాశయం సూర్యాస్తమయమప్పుడు
ఇవీ చూడండి
[మార్చు]- కనకదుర్గ వారధి (కృష్ణానదిపై భారీ వాహనాల రాకపోకలకు వాడుకలోనున్న వంతెన)
మూలాలు
[మార్చు]- ↑ Wright, Arnold (2004). Southern India: Its History, People, Commerce, and Industrial Resources. ISBN 9788120613447.