కృష్ణా డెల్టా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[ఆధారం చూపాలి]

కృష్ణా డెల్టా అనునది కృష్ణా నది వలన కృష్ణా, మరియు గుంటూరు జిల్లాలలో ఏర్పడిన సారవంతము అయిన నల్లరేగడి నేలలతో కూడిన ప్రాంతము.ఈప్రాంతము ఆంధ్రప్రదేశ్ లోని ఆర్థికముగా, రాజకీయముగా, మరియు సామాజికముగా ఉన్నతిన గల ప్రదేశము.ఇందులో అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి.అందులో విజయవాడ, పెనుగంచిప్రోలు, శ్రీకాకుళం, తెనాలి, మంగళగిరి, చేబ్రోలు, భట్టిప్రోలు, కాకాని, కొండపల్లి, బాపట్ల వంటివి ముఖ్యమైనవి.ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. వరి, పసుపు, చెరకు, అరటి, కూరగాయకు ప్రధానమైన పంటలు.ఇందలి తెనాలి పట్టణము ఆంధ్రా ప్యారిస్ గా, కృష్ణా డెల్టా రాజధానిగా పిలువబడుతున్నది.ఇంకా గుంటూరు, విజయవాడ, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, గుడివాడ, మచిలీపట్నము వంటి ప్రధాన పట్టణాలు/నగరాలు ఉన్నాయి.ఇందలి కొండపల్లి బొమ్మలు ప్రపంచప్రఖ్యాతి గాంచాయి.మచిలీపట్నము, నిజాంపట్నములు ప్రధాన రేవులు.ఇక్కడ ప్రధాన మతము హిందూమతము.ప్రధాన భాష తెలుగు.తెలుగులో స్వచ్ఛమైన రూపం ఇక్కడ కనపడితుంది. అలాగే ఈ ప్రాంతములోని భట్టిప్రోలునందు లభించిన ఒక పురాతన లిపి తెలుగు ప్రస్తుత లిపికి మాతృకగా మరియు దక్షిణభారత మరియు ఆగ్నేయాసియాలోని భాషలకు మాతృకగా భావించబదుతోంది.