డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం
స్వరూపం
| డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం | |
|---|---|
![]() | |
| Country | భారతదేశం |
| Location | విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
| Coordinates | 16°35′48″N 80°32′27″E / 16.5968°N 80.5408°E |
| Status | చేతనం |
| Commission date | యూనిట్ 1: నవంబర్ 1, 1979 యూనిట్ 2: అక్టోబర్ 10, 1980 యూనిట్ 3: అక్టోబర్ 5, 1980 యూనిట్ 4: ఆగస్టు 23, 1990 యూనిట్ 5: మార్చి 31, 1994 యూనిట్ 6: ఫిబ్రవరి 24, 1995 యూనిట్ 7: ఏప్రిల్ 6, 2009 |
| Operator | ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ లిమిటెడ్ (ఏపీజెన్కో) |
| Power generation | |
| Nameplate capacity |
|
| External links | |
| Commons | Related media on Commons |
విజయవాడ సమీపంలో కొండపల్లిలో ఉన్న డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రంలో బొగ్గును వినియోగించి విద్యుదుత్పత్తి చేస్తారు. ఇది ఏపీజెన్కో అధీనంలో ఉన్న తాప విద్యుత్ కేంద్రాలలో ఇది ఒకటి.
విద్యుదుత్పత్తి
[మార్చు]డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ గా అందరికీ తెలుసు. ఇది నాలుగు దశలలో రూ.193 కోట్లు, రూ. 511 కోట్ల వ్యయంతో మొదటి రెండు యూనిట్లతో అభివృద్ధి చేయబడింది. మూడవ దశలో రూ.840 కోట్లతో రెండు యూనిట్లను ప్రారంభించారు. 500 మెగావాట్ల ఏడవ యూనిట్ 2009లో మొదలయింది. 94-95, 95-96, 96-97,97-98, 2001-02 సంవత్సరాలలో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ కు గానూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విద్యుదుత్పత్తి కేంద్రానికి ఎన్నో సంస్థల నుండి బహుమతులు, గుర్తింపులూ అందాయి.[1]
స్థాపించిన నాటి సామర్థ్య వివరాలు
[మార్చు]| దశ | యూనిట్ సంఖ్య | సామర్థ్యం (మెగావాట్ లో) | మొదలైన తేదీ | స్థితి |
|---|---|---|---|---|
| మొదటి దశ | 1 | 210 | 01-11-1979 | చేతనం |
| మొదటి దశ | 2 | 210 | 10-10-1980 | చేతనం |
| రెండో దశ | 3 | 210 | 05-10-1980 | చేతనం |
| రెండో దశ | 4 | 210 | 23-08-1990 | చేతనం |
| మూడో దశ | 5 | 210 | 31-03-1994 | చేతనం |
| మూడో దశ | 6 | 210 | 24-02-1995 | చేతనం |
| నాలుగో దశ | 7 | 500 | 06-04-2009 | చేతనం |
మూలాలు
[మార్చు]- ↑ "ఏపీజెన్కో జాలస్థలిలో ఎన్టీటీపీఎస్ గురించి". the original నుండి 2012-03-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-02-01.
