Jump to content

నారాయణపూర్ ఆనకట్ట

వికీపీడియా నుండి

నారాయణపూర్ ఆనకట్ట అనునది కృష్ణా నది మీద నిర్మించబడిన ఒక ఆనకట్ట. ఇది భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని యాద్‌గిర్ జిల్లా నారాయణపూర్ వద్ద ఉంది. దీనిని బసవ సాగర్ అని కూడా అంటారు. దీని పూర్తి సామర్థ్యం 37.6 టిఎంసిలు (1.075 కిమీ³) కాగా, ప్రస్తుత నిల్వ 30.5 టిఎంసిలు (0.85 కిమీ³). పూర్తి రిజర్వాయర్ స్థాయి 492.25 మీ MSL, కనీస డౌన్ డ్రా స్థాయి 481.6 మీ MSL. ఇది నీటిపారుదల కోసం మాత్రమే ఉద్దేశించబడిన ప్రాజెక్ట్, కానీ దిగువ విద్యుత్ ఉత్పాదనకు, తాగునీటిని పరిగణలోకి తీసుకొని నిర్వహిస్తారు. ఈ ఆనకట్ట 29 మీటర్ల ఎత్తుతో, 10 కిలోమీటర్ల పైగా పొడవుతో ఉంటుంది, నీటిని విడుదల చేసేందుకు 30 గేట్లు ఉన్నాయి. ఇది పూర్తికావడానికి 50.48 కోట్ల రూపాయల ఖర్చయింది.

ఇది 1982 లో పూర్తయినప్పుడు గుల్బర్గా జిల్లాలో జేవర్గి తాలూకా లో, యాద్‌గిర్ జిల్లాలో సహపూర్, షోరాపూర్ తాలూకాలలో, రాయచూరు జిల్లాలో లింగ్‌సుగుర్ దేవదుర్గ తాలుకాలలో 4.21 లక్షల హెక్టార్ల సేద్యానికి నీరు అందించింది.

సూచనలు

[మార్చు]