దూసి ధర్మారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దూసి ధర్మారావు తెలుగు కవి, సాహితీకారుడు, రచయిత, గీత రచయిత, సంఘ సేవకుడు . ఇన్‌కం టాక్స్ కన్వీనర్ గా ఉన్న అతను శ్రీకాకుళం నాగరికత, శ్రీకాకుళం ప్రముఖులు, పర్యావరణము, విద్య ప్రాధాన్యం తదితరాల మేళవింపుతో ఎన్నో పాటలు సుమారు 200 పైగా వ్రాసాడు. అతనను అర్థ శతాబ్దానికి పైగా ఉత్తర కోస్తా సాంస్కృతిక చరిత్రలో అలుపు లేని కృషి చేసాడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అతను తెలుగు అధ్యాపకునిగా పనిచేసాడు. అతను శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలానికి చెందిన దూసి గ్రామానికి చెందినవాడు. అతని తాతగారు "దూసి జగన్నాథం" "తూర్పు భాగవతం"ను రూపొందించాడు. అది తన స్వంత హక్కులతో ఒక గ్రామీణ కళారూపంగా మారింది. తన ప్రత్యక్ష ప్రదర్శనలు, దాని విభిన్న, సంధానిత దరువుల బాహ్య స్పందనలు అతనిని సంగీత వ్యక్తీకరణకు ఒక నైపుణ్యాన్ని పొందేందుకు ప్రేరేపించింది. ఇది ధర్మారావును హార్మోనియం చేర్చుకొనేందుకు దోహదపడింది. ఇది అతనిని థియేటర్లోకి ప్రవేశించడానికి దోహదపడింది. అతను కళ చాలా థియేటర్ ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలకు సంగీతాన్ని అందించింది. అతను దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలలో ఆమోదం పొందిన పాటల రచయిత.

అతను కోస్తాంధ్రలో 18కి పైగా వివిధ సాంస్కృతిక కోణాలలో రచనలను చేసాడు. అతను జూనియర్ కళాశాలలో అధ్యాపకునిగా పదవీవిరమణ చేసాడు. కళింగాధ్ర చరిత్ర, రస తరంగిణి, నా చూపులో ఐరోపా యాత్ర తదితర పుస్తకాలు రచించాడు. శ్రీకాకుళంలో సంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా పాల్గొనేవాడు. ఢిల్లీలోజరిగిన ఉగాది వేడుకల్లో పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. [2]

ఇన్‌కం టాక్స్ జిల్లా కన్వీనరుగా, కవిగా, రచయితగా, సాహిత్యవేత్తగా జిల్లా వాసులకు ధర్మారావు సుపరిచితుడు. శ్రీకాకుళంలో నాగావళి నది కొత్త బ్రిడ్జి నుండి జాతీయ రహదారి వరకు ప్రముఖుల విగ్రహాల ఏర్పాటులో అతను కృషి ఉంది. అతను రచనల్లో "వెన్నెలతో మాట్లాడితే" కవిత సంకలనం విశేష ప్రాచుర్యం పొందింది. వందేమాతరం గేయరచన, స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు, నేనే శ్రీకాకుళం గేయరచన, తెలుగు జాతి వనన, రచనలు చేసారు. సౌరభం రసతరంగిణి పేరిట సాహిత్య వ్యాస సంపుటాలు ప్రచురించారు.[3] మానుకొండ చలపతిరావు అనువాద వ్యాసాలను రాసేవారు. 2017 మార్చి 20 న అతను రచించిన "కళింగ సామ్రాజ్య చోడంగులు" పుస్తకాన్ని ఆవిష్కరించాడు. సంప్రదాయ గురుకుల నాట్యాలయం ఏర్పాటుకు కృషిచేసాడు. రాజ్యలక్ష్మి ఫౌండేషన్ లో పదేళ్ళపాటు విశేష సేవలంచించాడు.

అస్తమయం[మార్చు]

ఏప్రిల్ 30 2017 న రాత్రి విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ సమీపంలో ఒక ప్రైవేటు స్కూలు బస్సు అదుపు తప్పి బీచ్ కి వచ్చిన పర్యాటకులపైకి దూసుకు వచ్చింది. ఈ సంఘటనలో అతను మృతి చెందాడు.[4]

మూలాలు[మార్చు]

  1. "Indefatigable talent". correspondent. The Hindu. 20 October 2016. Retrieved 1 May 2017.
  2. ఆంధ్రజ్యోతి దినపత్రిక, 1 మే, 2017, 2 వ పుట "బీచ్ లోకి దూసుకు వెళ్ళిన బస్సు"
  3. "Dharma Rao's book a bridge between past and present". SPECIAL CORRESPONDENT. the hindu. 23 September 2014. Retrieved 1 May 2017.
  4. "పర్యాటకులపైకి వచ్చిన స్కూలుబస్సు". Archived from the original on 2017-05-04. Retrieved 2017-05-01.

ఇతర లింకులు[మార్చు]