కరణం మల్లేశ్వరి

వికీపీడియా నుండి
(కరణం మల్లీశ్వరి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కరణం మల్లేశ్వరి
కరణం మల్లేశ్వరి
జననం
కరణం మల్లేశ్వరి

(1975-06-01) 1975 జూన్ 1 (వయసు 49)/ 1975, జూన్ 1
వృత్తిక్రీడాకారిణి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
 India ఒలింపిక్ వెయిట్ లిప్టింగ్
Medal record
మహిళ వెయిట్‌ లిఫ్టింగ్‌
ప్రాతినిధ్యం వహించిన దేశము  భారతదేశం
ఒలంపిక్స్ గేమ్స్
కాంస్యం 2000 సిడ్నీ – 69 కేజీలు
ఏషియన్ గేమ్స్
రజతం 1998 బ్యాంకాక్ – 63 కేజీలు

కరణం మల్లేశ్వరి భారతీయ క్రీడాకారిణి. శ్రీకాకుళానికి చెందిన వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి. ఆమె 2000 సిడ్నీ ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యింది. 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలంపిక్స్ లో ఈమె వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారతదేశం తరపున కాంస్య పతకం సాధించింది.

బీబీసీ శతవసంతాల ఏడాది సందర్భంగా 2022 మార్చి మాసంలో కరణం మల్లీశ్వరికి ‘బీబీసీ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ (జీవన సాఫల్యం)’ అవార్డు ప్రకటించారు.[1]

బాల్యం

[మార్చు]

ఈమె 1975 జూన్ 1 న జన్మించింది. చిత్తూరు జిల్లాకు చెందిన తవణంపల్లి గ్రామములో పుట్టిన మల్లీశ్వరి తండ్రి ఉద్యోగరీత్యా ఆమదాలవలసకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు.

విద్య, ఉద్యోగం

[మార్చు]

ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ)గా కరణం మల్లీశ్వరి నియమిస్తూ 22 జూన్ 2021న ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ సంచాలకులు అజ్మిల్‌ హఖ్‌.[2] ఆమె ప్రస్తుతం హరియాణాలోని భారత ఆహార గిడ్డంగుల శాఖ(ఎఫ్.సి.ఐ) లో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.

క్రీడా జీవితం

[మార్చు]

మల్లీశ్వరి అక్క నరసమ్మకు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలంశెట్టి అప్పన్న శిక్షణ ఇచ్చేవారు. అక్క విజయాలను చూచిన మల్లీశ్వరి కూడా ఈ రంగం పై ఆసక్తి పెంచుకున్నారు. చివరకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. చైనా దేశం లోని గ్యాంగ్ ఝూలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 54 కిలోల విభాగంలో దేశానికి మూడు స్వర్ణపతకాలు తెచ్చారు. ఆ తరువాత టర్కీ రాజధాని ఇస్తాంహుల్ లో జరిగిన పోటీల్లో తన ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువుకావడంతో ఆ టైటిల్ ను మల్లీశ్వరికి ప్రధానము చేసారు. 1995 చైనాలో జరిగిన పోటీల్లో వరుసగా 105,110, 113, కిలోల బరువులు ఎత్తి చైనా వెయిట్ లిఫ్టర్ - లాంగ్ యాపింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొటారు.

సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించింది. ఆ విధంగా ఒలింపిక్ ఆటలలో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది, మూడవ భారతీయ వ్యక్తి. (అంతకుముందు పతకాలు సాధించిన భారతీయులు - 1952 హెల్సింకీలో bantamweightwrestler ఖషబా జాదవ్, 1996 అట్లాంటాలో టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్)

వివాహం, సంతానం

[మార్చు]

మల్లీశ్వరి 1997లో హరియాణాకు చెందిన వెయిట్‌ లిఫ్టర్‌ రాజేష్‌ త్యాగిని వివాహం చేసుకుంది.

పతకాలు, పురస్కారాలు

[మార్చు]
  • 2000 - ఒలింపిక్ క్రీడలు - కాంస్య పతకం - 69 కిలోగ్రాముల విభాగంలో
  • 1994 - ఇస్తాంబుల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు - బంగారు పతకం
  • 1995 - పూసాన్, కొరియా - ఆసియా ఛాంపియన్‌షిప్ పోటీలు
  • 1995 - ఘుంగ్‌జౌ, చైనా - 54 కిలోల విభాగంలో మూడు బంగారు పతకాలు
  • భారత ప్రభుత్వం అర్జున అవార్డు
  • 1995 - రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బహుమతి
  • 1999- పద్మశ్రీ పురస్కారం

ఒక సందర్భంలో ఆమె ఇలా అంది -

భారత దేశానికి పతకాలు ఎందుకు రావని అడుగుతుంటారు. అది ఎయిర్-కండిషన్డ్ గదులలో కూర్చుని మాట్లాడినంత సులభం కాదు. ఆ ప్రయత్నంలో ఉన్న శ్రమ, వేదన మాకు తెలుస్తాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • అచింత షూలి - 2022 కామన్‌వెల్త్ పోటీల్లో పురుషుల వెయిట్ లిఫ్టింగులో స్వర్ణపతక విజేత

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "మల్లీశ్వరికి 'బీబీసీ లైఫ్‌ టైమ్‌' అవార్డు". andhrajyothy. 2022-03-29. Archived from the original on 2022-03-28. Retrieved 2022-03-28.
  2. Andhrajyothy (23 June 2021). "మన మల్లికి అరుదైన గౌరవం". andhrajyothy. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.