భావశ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాండ్రంగి రామారావు
జననంజనవరి 26, 1935
శ్రీకాకుళం జిల్లా
మరణం3 డిసెంబరు 2021
సంతవురిటిలోని స్వగృహం
నివాస ప్రాంతంసంతవురిటి (గ్రామం), పొందూరు, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ - 532 168
ఇతర పేర్లుభావశ్రీ
ప్రసిద్ధిరచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత
తండ్రిసూర్యనారాయణ (మానవతావాది, సామాజిక సేవకులు)
తల్లిఅమ్మన్నమ్మ (గృహిణి)

భావశ్రీ (వాండ్రంగి రామారావు) (26 జనవరి 1935 - 3 డిసెంబరు 2021)[1] తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, ఆకాశవాణి ప్రసంగికుడు.

జీవిత విశేషాలు[మార్చు]

భావశ్రీ 1935, జనవరి 26న శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు. ఈయన స్వగ్రామం గంగువారిసిగడాం మండలంలోని సంతవురిటి గ్రామం. ఈయన తండ్రి సూర్యనారాయణ సమాజ సేవకుడు. తల్లి అమ్మన్నమ్మ, గృహిణి.

తెలుగు భాషలో ప్రత్యేక బి.ఎ డిగ్రీతో ఉత్తీర్ణుడైన భావశ్రీ తెలుగు, సంస్కృతంతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలో కూడా ప్రవేశం ఉంది. వాండ్రంగి రామారావు 3 డిసెంబరు 2021న తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్వగ్రామం జి.సిగడాం మండలం సంతవురిటిలో స్వగృహంలో మృతి చెందారు.[2]

రచయితగా[మార్చు]

"తెలుగుజాతి నాది" "తెలుగు సంస్కృతి నాది" "నాకు అనేక భాషలు వచ్చినప్పటికీ నేను తెలుగు కవినే" అని చెప్పేవారు భావశ్రీ. ఈ మాటలు ఆయనకు మాతృభాషపై ఉన్న అచంచల అభిమానానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఆయన జీవితం అంతా సాహిత్యంతో ముడిపడి ఉంది. అనేక విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈయన రచలలపై పరిశోధనలు చేస్తున్నారు. ఈయన "ఆంధ్రప్రదేశ్‌ సాహితీ సాంస్కృతిక శాఖ"కు అధ్యక్షునిగా పని చేశారు.. ఈయన ఈ శాఖ సభ్యునిగా రెండుసార్లు, అధికార భాషా సంఘం సభ్యునిగా మూడు సర్లు ఉన్నారు. ఈ నాటికి కూడా ఆయన సాహిత్యసెవలు కొనసాగిస్తూనే ఉన్నారు.

ప్రత్యేకతలు[మార్చు]

  • ఆయన సాహిత్య రంగంలో 120 కంటే ఎక్కువ భావనలు పద్య, గద్య, నాటక, సమీక్ష, గజల్, కవితలను వ్రాసారు.
  • "డి.డి-1"లో ప్రసారమైన "పద్యాలతోరణం"లో భాషానైపుణ్యం వుపయోగించిన మొదటి వ్యక్తి.
  • నాగార్జున విశ్వవిద్యాలయం ఈయన వ్రాసిన ఆరు పుస్తకాలకు ఎం.ఫిల్ యిచ్చింది.
  • ఈయన పాలకొండలో జరిగిన ఘంటశాల యొక్క 90 వ జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు[3]

సూచికలు[మార్చు]

  1. "సుకవి 'భావశ్రీ' ఇకలేరు". EENADU. Archived from the original on 2021-12-04. Retrieved 2021-12-04.
  2. "'భావశ్రీ ' ఇకలేరు". andhrajyothy. Retrieved 2021-12-04.
  3. he has participated in the 9th birthday celebrations of Ghantasala, Palakonda.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=భావశ్రీ&oldid=3709258" నుండి వెలికితీశారు