గంగువారి సిగడాం

వికీపీడియా నుండి
(గంగువారిసిగడాం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఇది మండలానికి సంబంధించిన వ్యాసం. ఇదే పేరున్న గ్రామ సమాచారం కొరకు గంగువారిసిగడాం (గ్రామం) చూడండి.


గంగువారిసిగడాం
—  మండలం  —
శ్రీకాకుళం పటములో గంగువారిసిగడాం మండలం స్థానం
శ్రీకాకుళం పటములో గంగువారిసిగడాం మండలం స్థానం
గంగువారిసిగడాం is located in Andhra Pradesh
గంగువారిసిగడాం
గంగువారిసిగడాం
ఆంధ్రప్రదేశ్ పటంలో గంగువారిసిగడాం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రం గంగువారిసిగడాం
గ్రామాలు 42
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 57,543
 - పురుషులు 29,111
 - స్త్రీలు 28,432
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.41%
 - పురుషులు 59.53%
 - స్త్రీలు 35.03%
పిన్‌కోడ్ {{{pincode}}}

గంగువారి సిగడాం లేదా జి.సిగడాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము.[1] ఇది విజయనగరం జిల్లా సరిహద్దులలో ఉంది. చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గంలోను, బొబ్బిలి పార్లమెంటరీ నియోజకవర్గంలోను ఉంది. రాజాం పట్టణానికి ఇది 8 కి.మీ. దూరంలో ఉంది.

పంటల తక్కువ దిగుబడి, అనావృష్టి పరిస్థితుల వల్ల ఈ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతాలలో ఒకటి అనవచ్చును. పనికోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం ఇక్కడ సాధారణం. గంగువారి సిగడాం మండలంలో సిగడాం, బారువా అనేవి రెండు రైల్వే స్టేషన్లు హౌరా-చెన్నై మార్గంలో ఉన్నాయి. . గ్రామంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. దానిని 20 పడకల అసుపత్రిగా పెంచారు. ఒక పోస్టాఫీసు ఉంది. ఇక్కడ ముఖ్యమైన వృత్తులు వ్యవసాయం, బట్టలకు రంగులు అద్దడం.

దేవాలయం[మార్చు]

ఈ గ్రామంలో ప్రసిద్ధమైన శ్రీరంగనాథస్వామి దేవాలయం ఉంది. 1992లో దేవాలయ పునరుద్ధరణ జరిగి నిత్యపూజాదికాలు జరుగుతున్నవి. హి మ్య్ నమె ఇస్ పునీత్

ప్రముఖులు[మార్చు]

  • రెడ్లం శ్రీరాములు (1931 - 1977) ప్రముఖ వ్యాపారవేత్త. ఇతడు శ్రీకాకుళం జిల్లా గంగువారి సిగడాం నుండి వ్యాపారరీత్యా శ్రీకాకుళం పట్టణానికి వచ్చి స్థిరపడ్డాడు. ఇతని తల్లిదండ్రులు రెడ్లం సత్యనారాయణ మరియు వెంకాయమ్మ. శ్రీరాములు కృష్ణార్జున డైయింగ్ వర్క్స్ అనే సంస్థను స్థాపించి నూలుకు రంగులు (Fabric dyeing) వేసి విక్రయించేవాడు. దీని ద్వారా ఎందరికో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాడు. ఎందరికో చదువు చెప్పించి, ఉద్యోగాలిప్పించి ఆర్థికంగా సహాయం చేశాడు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11