యడ్ల గోపాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యడ్ల గోపాలరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాటక రంగ కళాకారుడు. అతను 2020 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. అతను గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్రీయము వంటి నాటకాలలో పాత్రలు ధరించి గుర్తింపు పొందాడు. అతను 5600 ప్రదర్శలనలనిచ్చాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

అతను శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడకు చెందినవాడు. అతని తండ్రి రామమూర్తి కూడా నాటక రంగ కళాకారుడు. 12 ఏళ్ల నుంచే నాటక రంగం పట్ల ఆకర్షితులయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన అతను యడ్ల సత్యం నాయుడు ప్రోత్సాహంతో కళారంగంలో అడుగు పెట్టాడు. 1964లో తన 14వ యేట "దేశంకోసం" అనే సాంఘిక నటకంలో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించాడు. సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుడి పాత్రను పోషించి అందరి మెప్పు పొందాడు. 55 ఏళ్లుగా నాటక రంగానికి ఆయన సేవలు అందిస్తున్నాడు. అతను తొలుత సాంఘిక నాటకాల్లో నటించాడు. దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చాడు. ఎన్నో పురస్కారాలను అందుకున్నాడు. రవీంద్రభారతి లాంటి వేదికలపై సన్మానాలు పొందడంతోపాటు, అక్కినేని నాగేశ్వరరావు, తనికెళ్ల భరణి లాంటి నటుల చేతుల మీదుగా సత్కారాలు అందుకున్నాడు. పౌరాణిక నటులతో కలిసి సత్య హరిశ్చంద్ర నాటకాన్ని సినిమాగా తీశారు. ఇప్పటి వరకూ 5 వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చాడు[2]. అతను నంది పురస్కారాలను కూడా అందుకున్నాడు[1].

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Two from Andhra Pradesh among Padma Shri awardees". The New Indian Express. Retrieved 2020-01-26.
  2. "మన కళాకారులకు 'పద్మ శ్రీ'.. యడ్ల గోపాలరావు, దళవాయి చలపతి రావు వివరాలివే." Samayam Telugu. 2020-01-26. Retrieved 2020-01-26.