రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి | |
|---|---|
![]() యోగివేమన విశ్వవిద్యాలయ వెబ్‌సైటు లో రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి చిత్రము | |
| జననం | 1948 అక్టోబర్ 16 1948 అక్టోబరు 16 చిత్తూరు జిల్లా కుంట్రపాకం |
| వృత్తి | రచయిత |
| జాతీయత | భారతీయుడు |
| కాల వ్యవధి | 20వ శతాబ్దం |
| విషయం | తెలుగు సాహిత్యము???? |
| దాంపత్యభాగస్వామి | లక్ష్మీకాంతమ్మ |
| పిల్లలు | శ్రీవిద్య, ఆనందకుమార్ |
| Website | |
| rachapalem | |
రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి రచయిత, విమర్శకులు. 2014 సంవవత్సరానికి వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది[1].
నేపధ్యం
[మార్చు]తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం అతను స్వగ్రామం. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి 1948, అక్టోబరు 16న చిత్తూరుజిల్లా తిరుపతి మండలం కుంట్రపాకం గ్రామంలో జన్మించారు. తల్లి మంగమ్మ, తండ్రి రామిరెడ్డి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ, పీహెచ్‌డీలతోపాటు వయోజన విద్యలో డిప్లొమా చేశారు. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి తమిళంలో సర్టిఫికెట్ కోర్సు చేశారు. 37 సంవత్సరాలు బోధనానుభవం (శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురములో 31సంవత్సరాలు, వైవీయూలో ఆరు సంవత్సరాలు) గల ఆచార్య రాచపాలెం లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి రీడర్‌గా, ప్రొఫెసర్‌గా, శాఖ అధ్యక్షులుగా పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా వ్యవహారించారు. ఈయన నేతృత్వంలో 25మంది పీహెచ్‌డీలు, 20 మంది ఎంఫిల్ చేశారు. బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం నుంచి రాయలసీమ కల్పనా సాహిత్యం, స్థానిక పదకోశం, పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 2012 అక్టోబరు నుంచి వైఎస్సార్ జిల్లాలోని కవులు, రచయితలపై ‘నెలనెల మన జిల్లా సాహిత్యం’ పేరిట సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నారు. వేమన, సీపీ బ్రౌన్‌పై విమర్శనా వ్యాసాలు వెలువరించారు. సీమ సాహితి మాసపత్రికకు ప్రధాన సంపాదకునిగా ఉన్నారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయము, ఆంధ్ర విశ్వవిద్యాలయం, మైసూరు విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, గుల్బర్గా విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉంది. అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా, గుర్రం జాషువా జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా వ్యవహారించారు. అరసం రాష్ట్ర అధ్యక్షునిగా, జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షునిగా వ్యవహారిస్తున్నారు. రాష్ట్ర అధికారభాషా సంఘం సభ్యునిగా సేవలు అందించారు. నేషనల్ బుక్ ట్రస్టు తెలుగు సలహా మండలి, సాహిత్య అకాడమి (న్యూఢిల్లీ) సభ్యునిగా పనిచేశారు. రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డికి మన నవలలు- మన కథానికలు అనే పుస్తకానికి ఉత్తమ విమర్శకుడిగా 2014 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. రాయలసీమ సాహిత్యోద్యమాల చరిత్ర, దళిత కథలు, ఆధునికాంధ్ర కవిత్వం, గురజాడ కథానికలు తదితర రచనలను అతను వెలువరించారు.
ఇతను 2008 నుంచి 2016 వరకు కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో పనిచేశారు.[2] తాను రాసిన విమర్శనాత్మక పుస్తకానికి అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. అందులో నవలలు, కథానికలపై 24 వ్యాసాలున్నాయని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా సాహిత్యంలో ఉన్న అతను 19 పుస్తకాలు ప్రచురించారు. ఇప్పుడు అవార్డు వచ్చిన మన నవలలు- మన కథలు పుస్తకాన్ని 2010లో రాశారు. 11 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. తెలుగులో సాహితీ విమర్శ సరిగా ఎదగలేదన్న విమర్శలకు ఈ అవార్డే సమాధానమని అతను చెప్పారు. ఇతని దీర్ఘకావ్యం "పొలి"ని పి.రమేష్ నారాయణ The Harvest పేరుతో ఆంగ్లంలోనికి అనువదించారు.
రచనలు
[మార్చు]- శిల్పప్రభావతి - ప్రభావతీప్రద్యుమ్నము కావ్యం పై విమర్శ (పి.హెచ్.డి.సిద్ధాంతగ్రంథము)
- కథాంశం
- చర్చ
- కొన్ని కావ్యాలు - కొందరు కవులు
- దరి/దాపు
- దీపధారి గురజాడ
- మన నవలలు-మన కథానికలు
- Literary theory of classical telugu poets
- Nannayya and his influence on later telugu poets
- Principals of Literary research
- జాతీయోద్యమ కథలు (సంకలనం - సంపాదకుడు)
- ప్రతిఫలనం
- రెండు ప్రపంచాలు (కవితా సంపుటి)
- సాహిత్య పరిశోధన సూత్రాలు (హెచ్.ఎస్.బ్రహ్మానందతో కలిసి)
- వేమన
- విమర్శ -2009
- పొలి (దీర్ఘకవిత)
- తెలుగు కవిత్వం - నన్నయ ఒరవడి
- గురజాడ - తెలుగు కథానిక
- గురజాడ - మన విమర్శకులు
- మహర్షి దేవేంద్రనాథ టాగూర్ (మోనోగ్రాఫ్ అనువాదం)
- దేవుడే బాలుడైతే (నవలిక అనువాదం)
- ప్రాచీనాంధ్రకవుల సాహిత్యాభిప్రాయాలు - అభిరుచులు
పురస్కారాలు
[మార్చు]- ఉత్తమ వ్రాతప్రతి పురస్కారం (ప్రాచీన తెలుగు కవులు సాహిత్యాభిప్రాయాలు) : తెలుగు విశ్వవిద్యాలయం (1986)
- తిక్కవరపు రామిరెడ్డి ధర్మానికి పురస్కారం: తెలుగు విశ్వవిద్యాలయం (1999)
- తాపీ ధర్మారావు సాహితీ పురస్కారం: విశాలాంధ్ర విజ్ఞాన సమితి (2002)
- తుమ్మల వెంకటరామయ్య స్మారక పురస్కారం: విశాలాంధ్ర విజ్ఞాన సమితి (2004)
- ప్రతిభా పురస్కారం: తెలుగు విశ్వవిద్యాలయం (2007)
- నూతలపాటిగంగాధరం స్మారక పురస్కారం (పొలి) :నూతలపాటి స్మారక సంఘం (2007)
- ఉత్తమ విమర్శగ్రంథ పురస్కారం (చర్చ) : తెలుగు విశ్వవిద్యాలయం (2008)
- ఉగాది పురస్కారం:ఆం. ప్ర. రాష్ట్రప్రభుత్వం (2011)
- గురజాడ పురస్కారం:ఆం. ప్ర. రాష్ట్ర ప్రభుత్వం (2012)
- సాహిత్య అకాడమీ పురస్కారం (మనం నవలలు-మన కథానికలు) :కేంద్రసాహిత్య అకాడమీ :కొత్తఢిల్లీ (2014)
- తెలుగు భాషా పురస్కారం:ఆం. ప్ర.రాష్ట్ర ప్రభుత్వం (2016)
- కొండేపూడి స్మారక పురస్కారం:అరసం. గుంటూరు శాఖ
- పురిపండా అప్పలస్వామి స్మారక పురస్కారం:అరసం, విశాఖ జిల్లా
- గురజాడ ఫౌండేషన్ పురస్కారం:గురజాడ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. (2017)
- గుర్రం జాషువ పురస్కారం: ఆం. ప్ర. రాష్ట్ర ప్రభుత్వం (2017)
- జానమద్ది సాహిత్య పురస్కారం:జానమద్ది సాహిత్య పీఠం (2020)
- వైయస్సార్ జీవన సాఫల్య పురస్కారం (లైఫ్ టైం అచీవ్ మెంట్) :ఆం. ప్ర. రాష్ట్ర ప్రభుత్వం (2021)
మూలాలు
[మార్చు]- ↑ https://www.youtube.com/watch?v=IWWeHMA9hDQ
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-20. Retrieved 2014-12-20.
