Jump to content

సీమ సాహితి

వికీపీడియా నుండి

సీమ సాహితి సాహిత్య సామాజిక మాసపత్రిక నంద్యాల నుండి వెలువడింది. జనవరి 1996లో తొలి సంచిక వెలువడింది[1]. బి.పాండురంగారెడ్డి, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, తుమ్మల రామకృష్ణ సంపాదకులుగా తొలి సంచికలో పేర్కొన్నారు. రెండవ సంచికలో రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన సంపాదకునిగాను, బి.పాండురంగారెడ్డి వర్కింగ్ ఎడిటర్‌గా, మధురాంతకం రాజారాం, జానమద్ది హనుమచ్ఛాస్త్రి, భూమన్ ఇతర సంపాదక సభ్యులుగా పేర్కొనబడింది.

రాయలసీమ ప్రాంతం నుండి వెలువడే సాహిత్యానికి పూర్వవైభవం తీసుకురావడం ఈ పత్రిక ఆశయాలలో ఒకటి. ఈ పత్రిక బళ్ళారి రాఘవపై, విద్వాన్ విశ్వంపై, శ్రీబాగ్ ఒడంబడికపై ప్రత్యేక సంచికలను వెలువరించింది. ఈ పత్రికలో వ్యాస సాహితి, కవితాసీమ, కథా సాహితి, సమీక్షా సాహితి, లేఖా సాహితి మొదలైన శీర్షికలున్నాయి. ఈ పత్రికలో తమ్మినేని పుల్లయ్య, యస్.జి.డి.చంద్రశేఖర్, వనం దత్తగురుప్రసాదశర్మ, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, తుమ్మల రామకృష్ణ, నాగసూరి వేణుగోపాల్, బి.సూర్యసాగర్, కాకరాల, టి.రాజారాం, పంపన, నిఖిలేశ్వర్, శరత్ బాబు, వి.లలిత, కొడవటిగంటి కుటుంబరావు, జైసీతారాం, అద్దేపల్లి రామమోహనరావు, దినకర్, రాధేయ, బిక్కి కృష్ణ, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, హెచ్చార్కె, శాంతి నారాయణ, ఎస్వీ సత్యనారాయణ, ఎం.ఆర్.గోవిందరెడ్డి, పప్పూరి రామాచార్యులు, నీలం సంజీవరెడ్డి, భూమన్, కె.బాలగోపాల్, జూపల్లి ప్రేమ్‌చంద్, సింగమనేని నారాయణ, గన్నమనేని సాయిబాబా, షమీవుల్లా, సి.కామేశ్వరరావు, షేక్ మహమ్మద్ ముస్తఫా, సర్తాజ్, జె.పి.మునిస్వామి, వేంపల్లి అబ్దుల్‌ఖాదర్, మధురాంతకం రాజారాం, యం.వి.రమణారెడ్డి, నిమ్మగడ్డ వేంకటేశ్వరరావు, ఎస్.పి.శంకరరెడ్డి, కె.యస్.యస్.శేషన్, ద్వా.నా.శాస్త్రి, పోసా శివయ్య, కె.యం.రాయుడు, దాదా హయాత్, ఎస్.గంగప్ప, సాగర్, అవధానం నాగరాజారావు, హెచ్.ఎస్.బ్రహ్మానంద, వి.ఆర్.రాసాని, అమళ్ళదిన్నె గోపీనాథ్, సౌభాగ్య, ఆర్.వసుంధరాదేవి, తక్కోలు మాచిరెడ్డి, దస్తగిరి, పి.ఎల్.శ్రీనివాసరెడ్డి, తంగిరాల వెంకట సుబ్బారావు, నాళేశ్వరం శంకరం, టి.గిరిరాజులు, సమతారావు, పి.రామకృష్ణారెడ్డి, మల్లెల దాసరి నరసింహమూర్తి, మధుర్‌జీ, చలసాని ప్రసాదరావు మొదలైన వారి రచనలు వెలువడ్డాయి. 1998లో ఈపత్రిక ఆగిపోయింది.

విషయ సూచిక

[మార్చు]

ఆగస్టు - అక్టోబరు 1996 సంచికలో ఈ క్రింది అంశాలు ఉన్నాయి.[2]

  • పెనుశోకం ఉప్పెన కాదు - టి.రాజారాం
  • సంపాదకీయం

వ్యాస సాహితి

కవితాసీమ

కథా సాహితి

సమీక్షా సాహితి

లేఖా సాహితి

  • ఇప్పటికి మూడడుగులు - రామకృష్ణారెడ్డి
  • శరత్ లేఖలు - శరత్
  • అనంతలో తెలుగు సాహిత్య సమీక్షా సభలు

మూలాలు

[మార్చు]
  1. కథానిలయంలో పత్రిక వివరాలు[permanent dead link]
  2. బి., పాండురంగారెడ్డి (1996-08-01). "సీమ సాహితి". సీమ సాహితి. 1 (4): 2.