హెచ్చార్కె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హెచ్చార్కె అసలు పేరు కొడిదెల హనుమంతరెడ్డి. ఇతను కవి, కథకుడూ, విమర్శకుడూ, పాత్రికేయుడూ.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. కర్నూలు జిల్లా, గడివేముల మండలం, గని అనే గ్రామంలో 1951, అక్టోబర్ 10న కొడిదెల సుబ్బమ్మ, సంజీవరెడ్డి దంపతులకు జన్మించాడు[1]. తలముడిపి గ్రామంలో ఉన్నత పాఠశాల విద్య పూర్తిగావించాడు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్టణంలో ఎం.ఎ. చదివాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు నక్సలైటు ఉద్యమం వైపు ఆకర్షితుడై పన్నెండేళ్లు ఆ ఉద్యమజీవితం గడిపాడు. రెండు సంవత్సరాలు కారాగారవాసం చేశాడు. విమోచన పత్రికకు సంపాదకత్వం నెరిపాడు. విప్లవ రచయితల సంఘంలో క్రియాశీల పాత్రను నిర్వహించాడు. తర్వాత పదహారేళ్లపాటు వర్కింగ్ జర్నలిస్టుగా ఉదయం, ఈనాడు తదితర పత్రికలలో పనిచేశాడు. ఉదయం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి మొదలైన పత్రికలలో రాజకీయ, ఆర్థిక, సాహిత్య వ్యాసాలను పావని, దినకర్, కె.సంజీవ్ అనే పేర్లతో వ్రాశాడు. ఆంధ్రజ్యోతి, సాక్షి, వార్త, సృజన,నూతన, సీమ సాహితి మొదలైన పత్రికలలో కథలు కవితలు ప్రకటించాడు.

రచనలు

[మార్చు]

కవితా సంపుటాలు

[మార్చు]
  1. గుండె దండోరా
  2. రస్తా
  3. లావా
  4. అబద్ధం
  5. ఒక్కొక్కరాత్రి
  6. నకులుని ఆత్మకథ
  7. చిన్నచిన్న ఘటనలు
  8. వానలో కొబ్బరిచెట్టు
  9. రగిలే వీలుండని
  10. గొడ్డలి భుజం
  11. సంకేత స్థలం
  12. ఆకుపచ్చ వెన్నెల

వ్యాస సంపుటాలు

[మార్చు]
  1. సంబరం
  2. కొంచెం శ్రీశ్రీ కొంచెం అజంతా ... సాహిత్య వ్యాసాలు

కథలు[2]

[మార్చు]

పుస్తకం: కనిపించని చెయ్యి

  1. బువ్వజీతగాడు
  2. విధి..?
  3. కొలిమి
  4. దొండ పండ్లు
  5. తిక్క బాపనయ్య
  6. దప్పిగొన్న రైలు

మూలాలు

[మార్చు]
  1. హెచ్చార్కె (2011-09-01). వానలో కొబ్బరిచెట్టు (PDF). హైదరాబాద్: పాలపిట్ట బుక్స్. p. 1. Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 17 March 2015.
  2. "రచయిత: హెచ్చార్కె". కథానిలయం. కథానిలయం. Retrieved 17 March 2015.