నూతన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నూతన 1978 లో ప్రారంభమైన తెలుగు మాసపత్రిక.

విశేషాలు[మార్చు]

1978లో నూతన విలక్షణ మాసపత్రిక ప్రారంభమైంది. సుమారు ఐదు సంవత్సరాల పాటు వెలువడింది. ఈ పత్రికకు ఎం.రత్నమాల సంపాదకురాలు. ఈ పత్రికకు వర్కింగ్‌ ఎడిటర్‌గా నమ్ము కొంతకాలం పనిచేశాడు. ఈ పత్రికలో కథలు, కవిత్వం, పాటలు ప్రచురించేవారు. ప్రజా సమస్యలమీద వ్యాసాలతోపాటు స్త్రీ విముక్తి పేరుతోమహిళల పేజీ ఉండేది. కొత్తగా రాయడం మొదలుపెట్టిన రచయితలను ఈ పత్రిక చాలా భిన్నమైన పద్ధతిలో ప్రోత్సహించేది. వారి రచనల్లోని లోటుపాట్లను చెప్పి సలహాలిస్తూ రచయిత బాగా అర్థం చేసుకుని తిరిగి పంపితే పత్రికలో ప్రచరించేవారు. ఈనాడు దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేసిన రత్నమాల సంపాదకురాలుగా ఈ పత్రిక ఐదేళ్ళపాటు నడిచి ఆగిపోయింది.

ఈ పత్రికలో కథలు, కవిత్వం, పాటలు ప్రచురించేవారు. ప్రజా సమస్యలమీద వ్యాసాలతోపాటు 'స్తీ విముక్తి' పేరుతో మహిళల పేజీ ఉండేది.[1]

మూలాలు[మార్చు]

  1. "...చైతన్య కరదీపికలు | మానవి | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-09-16.
"https://te.wikipedia.org/w/index.php?title=నూతన&oldid=3033186" నుండి వెలికితీశారు