కుంభం యాదవ రెడ్డి (1938-08-11) ఆగష్టు 11, 1938 (వయస్సు 82) వీరవల్లి, యాదాద్రి జిల్లా, తెలంగాణ
కలం పేరు
నిఖిలేశ్వర్
వృత్తి
ఆర్మీ లో సివీలియన్ స్కూల్ మాస్టర్, ఎయిర్ ఫోర్స్ లో క్లర్క్ (1960-64); సబ్-ఎడిటర్, 'గోల్కొండ పత్రిక' (1964-66); ఉపాధ్యాయులు, కేశవ్ మెమోరియల్ హైస్కూల్ (1966-96)
జాతీయత
భారతీయులు
విద్య
బి.ఎ., బి.ఇ.డి., హిందీ భూషన్
పూర్వవిద్యార్థి
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
సాహిత్య ఉద్యమం
దిగంబర కవిత్వం
పురస్కారాలు
ఎక్స-రే అవార్డ్ (1984), యేటుకూరి బాల రామ మూర్తి సాహిత్య అవార్డ్ (2003), ఆవంత్స సోనసుందర్ సాహిత్య అవార్డ్ (2008), తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారం (2011), శ్రీశ్రీ సెంటినరీ సాహిత్య అవార్డ్ (2010), ఫ్రీ వెర్స్ ఫ్రంట్ అవార్డ్ (2011)
జీవిత భాగస్వామి
యామిని
సంతానం
4
అసలు పేరు కుంభం యాదవరెడ్డి. కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల రచనలను చేశారు. 1956 నుండి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుండి తన కలం పేరుని నిఖిలేశ్వర్ గా మార్చుకొని, దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచం లో విరజిల్లారు. [1]
1969 లో 'పోయెట్' (POET)(ఇంగ్లీష్ పోయెట్రీ మంత్లీ - మద్రాస్) అనే ప్రత్యేక సంచికకు గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించి దిగంబర కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు.
1980 నుండి 1982 వరకు తెలుగు సాహిత్య మాస పత్రిక ప్రజా సాహితి కి సంపాదకులుగా వ్యవహరించారు.
1991 లో రంజని, ఎజి ఆఫీసు వారు ప్రచురించిన సంపుటి కి సంపాదకులు గా వ్యవహరించి, విశ్వకవిత భాగము లో తెలుగు భారతీయ కవిత పేరున వివిధ భారతీయ భాషలలో ఉన్న కవితలను తెలుగు లోకి తర్జుమా చేశారు.
హిందీ మరియు ఆంగ్లం లో వ్రాసిన వివిధ కవితలు టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్తాన్ టైమ్స్, ఇండియన్ ఎక్సప్రెస్, డెక్కన్ క్రానికల్, ది ఇల్లస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, ధర్మయుగ్ సారిక, స్వతంత్ర వార్త, లోక్‌మఠ్ సమాచార్ మొదలగు పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
తెలుగు, హిందీ మరియు ఆంగ్లం లో నిఖిలేశ్వర్ వ్రాసిన కవితలు ఆల్ ఇండియా రేడియో, ఈ-టివి మొదలగు మాధ్యమాలలో ప్రసారమయ్యాయి.