అమళ్ళదిన్నె గోపీనాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమళ్ళదిన్నె గోపీనాథ్
అమళ్ళదిన్నె గోపీనాథ్
జననం1932
మరణం2007 ఆగస్టు 16(2007-08-16) (వయసు 74–75)
వృత్తిగ్రంథపాలకుడు
పురస్కారాలుచక్రపాణి అవార్డు

అమళ్లదిన్నె గోపీనాథ్ రాయలసీమ ప్రాంతానికి చెందిన జానపద కళాకారుడు, రచయిత, నటుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు అనంతపురం జిల్లా, బత్తలపల్లె మండలం అప్పరాశ్చెరువు గ్రామంలో 1932వ సంవత్సరంలో జన్మించాడు.[1] బి.ఎ. చదివాడు. గ్రంథాలయశాఖలో శిక్షణ పొంది పౌరగ్రంథాలయ శాఖలో పనిచేసి గ్రేడ్-1 లైబ్రరీయన్‌గా 1990లో పదవీ విరమణ చేశాడు.

1944లో ఎరుకలసాని వేషంతో కళారంగ ప్రవేశం చేశాడు. ఆనాటి నుండి కళారంగానికి అంకితమయ్యాడు. జానపద కళలో ఎక్కువ కృషి చేశాడు. రాయలసీమలోని ప్రతిపల్లెలో ప్రతిధ్వనించే పాట కాదరయ్య పాటను జనబాహుళ్యం లోనికి తెచ్చింది ఇతడే. అనేక జానపద, పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో విభిన్నమైన పాత్రలు ధరించి నటుడిగా పేరు గడించాడు. హాస్య రసపోషణలో ఇతడు పలువురి మెప్పుపొందాడు. ఇతడు మంచి వక్త. ఆకాశవాణి కడప, అనంతపురం కేంద్రాల నుండి శతాధిక ప్రసంగాలు చేశాడు. అవధానాలలో అప్రస్తుత ప్రసంగానికి అమళ్లదిన్నె గోపీనాథ్ పెట్టింది పేరు. ఇతడు అనేక సభలు, సదస్సులు, ప్రదర్శనలు, అవధానాలలో పాల్గొన్నాడు. ఇతడు వివిధ అంశాలపై పదికి పైగా పుస్తకాలను రచించాడు. అనంతపురం లోని లలితకళాపరిషత్తుకు కార్యదర్శిగా సేవలనందించాడు.

సన్మానాలు, సత్కారాలు[మార్చు]

బిరుదులు[మార్చు]

  • వినోద రత్నాకర
  • హాస్యభారతి
  • సభావాచస్పతి మొ||

మరణం[మార్చు]

కళారంగానికి ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంత కృషి చేసిన ఇతడు 2007, ఆగస్టు 16న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. దాసరి, నల్లన్న (2008-01-01). నాటక విజ్ఞాన సర్వస్వము (1 ed.). హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. pp. 295–296.

ఇది కూడా చదవండి[మార్చు]

అమళ్లదిన్నె గోపీనాథ్ ద్వారా ప్రాచుర్యం పొందిన కాదరయ్య పాట ఇక్కడ చదవండి.